“Very soon, your home could receive electricity directly from space, without transmission lines.”
Andhra Pradesh CM N. Chandrababu Naidu says he has asked Skyroot to explore satellite-based power transmission and even the possibility of delivering sunlight to specific areas at night.
#ChandrababuNaidu
క్షమించండి 🙏🏻
పవన్ కళ్యాణ్ గారి విడాకుల విషయం గురించి కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారిని, ఆయనను అభిమానించే మహిళలను కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం చూసి కోపంతో 11.11.2026 రాత్రి నేను ఒక స్పేస్ పెట్టాను.
ఆ స్పేస్‌లోకి నన్ను ఫాలో అయ్యే కొంతమంది స్పీకర్లుగా వచ్చి YS షర్మిల గారి గురించి, YS భారతి గారి గురించి అసభ్యంగా, తప్పుగా మాట్లాడారు. ఆ సమయంలో వారిని మ్యూట్ చేయకపోవడం నా తప్పే. తెలిసి చేసినా, తెలియక చేసినా ఆడవాళ్లను తిట్టడం తప్పు. అందుకే నాకు సోదరీమణుల్లాంటి షర్మిల గారికి, భారతి గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
అలాగే, ఆ స్పేస్‌లో హీరోల ఇంట్లోని ఆడవాళ్ల గురించి నేను మాట్లాడిన మాటలకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. నా మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. ఇలాంటి తప్పులు నా నుంచి మళ్లీ ఎప్పటికీ జరగవని హామీ ఇస్తున్నాను.
నేను సొంతంగా పెట్టుకున్న స్పేస్‌కు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆ స్పేస్‌లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ.. కార్యకర్తలు కానీ ఎవరూ లేరు...
నా వల్ల ఇబ్బంది పడిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, అలాగే కూటమి పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.
నా మీద నమోదైన కేసు వల్ల మా కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు.. calls చేసి మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.. దయ చేసి మా ఫ్యామిలీని involve చేయకండి & నా వల్ల జరిగిన తప్పుకు అందరూ నన్ను క్షమించండి.
మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 🙏🏻