చలో ఇందిరా పార్క్ – హైదరాబాద్!
ఎస్సీ, ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ అమలు కోసం 08-08-2026 ఉదయం 10:30 గంటలకు ధర్నా చౌక్, ఇందిరా పార్క్‌లో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా.
హక్కుల సాధన కోసం మీ గొంతు వినిపించండి.
📍 ఇందిరా పార్క్, హైదరాబాద్
#BCYParty#RamachandraYadav
*పత్రికా ప్రకటన*
*మెడికల్ అడ్మిషన్లలో బీసీలకు ద్రోహం.. జీవో 102ను తక్షణమే రద్దు చేయాలి!*
- చంద్రబాబు ప్రభుత్వం బీసీ విద్యార్థులను దొంగదెబ్బ తీస్తోంది
- పాత జీవో 151 ప్రకారమే అడ్మిషన్లు జరపాలి.. లేకుంటే పోరాటం తప్పదు
- ప్రభుత్వానికి బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కళాశాలల అడ్మిషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన జీవో నంబర్ 102ను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ అభ్యర్థులకు, ముఖ్యంగా బీసీ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చేలా కుట్ర పన్నిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
గతంలో 2019లో మాన్యువల్ అడ్మిషన్ల నుంచి ఆన్లైన్ విధానానికి మారినప్పుడు ఆప్షన్లు ఎంచుకునే ప్రక్రియలో రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం జరుగుతోందని కొందరు హైకోర్టును ఆశ్రయించారని రామచంద్రయాదవ్ గుర్తుచేశారు. అప్పట్లో హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు, ఇద్దరు సీనియర్ విద్యావేత్తలు, ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయవాదులతో కూడిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించారని తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2020లో ప్రభుత్వం జీవో నంబర్ 151ను తీసుకువచ్చిందని వివరించారు. గత ఆరేళ్లుగా ఈ జీవో 151 ప్రకారమే అడ్మిషన్లు జరుగుతున్నాయని, దీనివల్ల ఓసీ అభ్యర్థులకు గానీ, రిజర్వేషన్ అభ్యర్థులకు గానీ ఎలాంటి నష్టం జరగకుండా ప్రక్రియ సాఫీగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న విధానాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రపూరితంగా జీవో 102ను తీసుకువచ్చి బీసీ అభ్యర్థులను దొంగదెబ్బ తీయాలని చూస్తోందని రామచంద్రయాదవ్ విమర్శించారు. 2018లో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జీవో 550ని రద్దు చేసి బీసీ విద్యార్థులకు నష్టం చేయాలని చూస్తే, బీసీలంతా ఏకమై పోరాడి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తుచేశారు.
ఇప్పుడు మళ్లీ అదే తరహాలో జీవో 102 ద్వారా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తక్షణమే జీవో 102ను రద్దు చేసి, పాత విధానమైన జీవో 151 ప్రకారమే మెడికల్, డెంటల్ అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రిజర్వేషన్ అభ్యర్థులకు నష్టం చేసేలా ముందుకు వెళితే, బీసీ మరియు రిజర్వేషన్ విద్యార్థులతో కలిసి బీసీవై పార్టీ పక్షాన తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని బోడె రామచంద్రయాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
#RamaChandraYadav #bcyparty #BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #bcy #rcy
@BCYParty4People@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@SakshiNews@Way2NewsTelugu@qubetvnews@AndhraPrabhaApp@htTweets@ndtvindia
హంతకుడిని ఓదార్చేందుకు సమయం ఉన్న @ysjagan గారికి, ప్రాణాలు కోల్పోయిన నిరుపేద గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని పరామర్శించాలనే కనీస జ్ఞానం లేదా?
'ఓదార్పు యాత్ర' పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు హంతకులను ఓదారుస్తున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డ దానయ్య కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి.. "లక్ష రూపాయలు ఇస్తాం, మా ఇంట్లో పనికి పెట్టుకుంటాం" అని అహంకారంతో బాధితులను అవమానిస్తున్నారు.
18 ఏళ్ల వయసున్న మాజీ మంత్రి కొడుకు రోడ్డు మీదకొచ్చి పేదవాడి ప్రాణాలు తీస్తే... తప్పులేదని వెనకేసుకొస్తూ, జగన్ అండ్ కో నేరుగా ఇలాంటి ప్రమాదాలను ప్రోత్సహిస్తున్నారు.
గతంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ "మాకు రాముడు కాదు, రావణుడే కావాలి" అని వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పారు. దానికి తగ్గట్టే నేడు జగన్ ఆలోచనా విధానం ఉంది.
ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు చేసేవాళ్లను నేరుగా ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి... ఏపీలో 'రావణ రాజ్యం' తీసుకురావాలని కోరుకుంటున్నాడు.
రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి... ఇలాంటి రావణ రాజ్యాన్ని కోరుకునే జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా?
#RamaChandraYadav #bcyparty #BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #bcy #rcy #YSJagan #YSJaganMohanReddy #YSRCongressParty #SeediriAppalaRaju
@BCYParty4People@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@SakshiNews@Way2NewsTelugu@qubetvnews@AndhraPrabhaApp@htTweets@ndtvindia
*పత్రికాప్రకటన*
*20 లక్షల ఉద్యోగాలు తరువాత... 40 ఏళ్ల క్రితం మీ తాత ఇచ్చిన జివోని, హామీని నిలబెట్టుకో లోకేష్*
- నలభై ఏళ్లుగా శ్రీశైలం నిర్వాసితులకు అన్యాయమేనా?
- చంద్రబాబూ చిత్తశుద్ధి ఏమైంది?
- నాడు హామీలు... నేడు ఉత్తుత్తి ప్రకటనలా?
- వారం రోజుల్లో న్యాయం చేయకపోతే ఉద్యమం తీవ్రతరం
- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్
*(నందికొట్కూరు, జూలై 10)*
నలభై ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చిన శ్రీశైలం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ప్రభుత్వాల వైఫల్యమేనని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ విమర్శించారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీశైలం ముంపు గ్రామాల బాధితులకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై ఏళ్లుగా నిర్వాసితులు పడుతున్న ఆవేదనను వివరించారు.
*నలభై ఏళ్లుగా నిరీక్షణే*
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1981లో నలభై ఒక్క గ్రామాల ప్రజలు లక్షా పదివేల ఎకరాల భూమిని త్యాగం చేశారని రామచంద్రయాదవ్ గుర్తు చేశారు. లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులకు నలభై ఏళ్లు దాటుతున్నా ప్రభుత్వాలు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇచ్చిన జీవో నెంబర్ 98 ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
*నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా...*
ఎన్టీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇలా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా నిర్వాసితుల రాత మారలేదని రామచంద్రయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ఆయన నిలదీశారు. నిర్వాసితుల పట్ల, రైతుల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీనిని బట్టే అర్థమవుతోందన్నారు.
*నాడు హామీలు... నేడు ప్రకటనలు*
ఎన్నికల ముందు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు హామీలు గుప్పించారని రామచంద్రయాదవ్ విమర్శించారు. పాదయాత్ర సమయంలో లోకేష్, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేవలం ఉత్తుత్తి ప్రకటనలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్న నాయకులు, నలభై ఏళ్ల క్రితం తమ పార్టీ ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు.
*ఉద్యమం తీవ్రతరం చేస్తాం*
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని రామచంద్రయాదవ్ డిమాండ్ చేశారు. బాధితుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. వారం, పది రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. నిర్వాసితుల పోరాటానికి బిసివై పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. తాత ఇచ్చిన జీవోను నిలబెట్టాల్సిన బాధ్యత లోకేష్ పై ఉందని, తప్పుడు హామీలు మాని తక్షణమే బాధితుల డిమాండ్లను నెరవేర్చాలని రామచంద్రయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
#BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #bcy #rcy
@BCYParty4People@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@ANDHRAJYOTI@SakshiNews@Way2NewsTelugu@qubetvnews
In an era where public concerns are often overshadowed by powerful interests, it is reassuring to see an officer who remains steadfast in his commitment to duty, public welfare, and the rule of law.
Sri Shankhabrata Bagchi Garu, your environmental consciousness and sensitivity towards the concerns being raised over the destructive Hyperscale Data Center project have earned the respect of countless citizens, especially the youth of Visakhapatnam who are striving to protect our waterbodies and ecological heritage.
Vizag’s waterbodies are not real estate. They are sacred inheritance.
History will remember those who stood for sustainable development and environmental justice when it mattered most. Proud to acknowledge a true guardian of Vizag and its natural heritage.
— Bode Ramachandra Yadav (RCY), National Founder President, Bharatha Chaitanya Yuvajana Party (BCYP)
@vizagcitypolice
#SaveVizagLakes #NoDataCenterAtMudasarlova #ShankhabrataBagchi #VisakhapatnamPolice #EnvironmentFirst #VizagYouth #BCYPFights
#BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #bcy #RCY
@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@ANDHRAJYOTI@SakshiNews@Way2NewsTelugu@qubetvnews@BCYParty4People
BREAKING: ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ!
వైజాగ్ వార్డుల విభజనపై హైకోర్టు తక్షణ స్టే విధించింది. బీసీవై పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక నిర్ణయం. ఇది రామచంద్ర యాదవ్ గారి నాయకత్వానికి దక్కిన విజయం.
#APGovernment#VizagGVMC#BCYParty#RamachandraYadav#APNews
ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై #BCYParty పోరాటం!
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ప్రైవేట్ సంస్థలో 25% సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాబోయే 2 రోజుల్లో వినతి పత్రం సమర్పిస్తాం.
#RCYBCY
ప్రైవేట్ విద్యా సంస్థలతో నారా లోకేష్ కుమ్మక్కు.. వేల కోట్ల దోపిడీ!
ఏపీలో విద్యా ప్రమాణాలు పెంచుతా నని చెప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. కార్పొరేట్ సంస్థల దోపిడీలో భాగస్వామ్యం కోసమే ఆ శాఖను తీసుకున్నారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు!
#NaraLokesh#BCYParty#RCY
విద్య - వ్యాపారమా? హక్కా?! 🔥
జర్మనీ, నార్వే, అర్జెంటినా లాంటి దేశాల్లో ఉచిత విద్య అందుతుంటే.. మన దగ్గర ఎందుకు వేల కోట్ల దోపిడీ జరుగుతోంది?
విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై BCY పార్టీ అడుగుతున్న పదునైన ప్రశ్నలు!
#EducationReform#RightToEducation#TeluguPolitics#BCY#RCY
నటనకు నిలువుటద్దం.. కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడు, యంగ్ టైగర్ @tarak9999 గారికి జన్మదిన శుభాకాంక్షలు. 👑
బీసీవై పార్టీ తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మీ విజయం మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం!
#HappyBirthdayNTR#NTRBirthday#BCY
#అనంతపురం లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నడుస్తున్న 'శ్రీ చైతన్య' పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ DEO ప్రసాద్ బాబు గారికి వినతిపత్రం ఇచ్చిన BCY పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ BC సురేష్ యాదవ్ బృందం..
@rcytheleader@sri_schools@naralokesh#BCYParty
గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి..
విషయం: పెట్రోల్ పై VAT తగ్గింపు - మధ్య తరగతి వర్గాలకు ఉపశమనం గురించి..!
చంద్రబాబు గారు.. మీకు తెలుసా..!?
నెలకు 30 వేలు జీతం ఉన్న ఒక సామాన్య ఫీల్డ్ వర్కర్.. పెట్రోల్ కోసం కర్ణాటక రాష్ట్రంలో నెలకు రూ. 3000/-.., తమిళనాడులో నెలకు 3000/-.., పుదుచ్చేరిలో నెలకు రూ. 1800/-.., తెలంగాణలో నెలకు రూ. 3200/-.., ఖర్చు చేస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నెలకు రూ. 3700/- వరకు ఖర్చు చేస్తున్నారు.. అటువంటి మధ్య తరగతి సామాన్య వర్గాలు మన రాష్ట్రంలో 80 లక్షల మంది వరకు ఉండగా.. వారి నుండి నెలకు రూ. 500 నుండి 750 కోట్లు అదనంగా మీరు దోచుకుంటున్నది నిజమా కాదా..!? పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ. 3 నుండి 10 వరకు అదనంగా ఉంది.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్/ డీజిల్ పై అత్యధికంగా 35% VAT వసూలు చేస్తున్నారు.. ఇది మీరు, జగన్ ఇద్దరూ కలిసి చేస్తున్న నిలువు దోపిడీ..!
అన్ని రంగాలపై ప్రభావం - పేదలపై ప్రేమ చాటుకోండి..!
ఇది విపత్కర సమయం.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంది. మన దేశంలో ఇప్పటికే గడిచిన రెండు నెలల్లో నిత్యావసరాలు భారీగా పెరిగాయి.. ఈ తరుణంలో ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగితే ఆ ప్రభావం కేవలం పెట్రోల్, డీజిల్ రూపంలోనే కాకుండా నిత్యావసరాలు, వ్యవసాయం, ఆక్వా రంగాలపై కూడా పడుతుంది. అందుకే మీరు స్పందించాల్సిన సమయం ఇది. పేద వర్గాలపై మీ ప్రేమ, ఆప్యాయత చాటుకోవాల్సిన సమయం ఇది..!
కేంద్రం తగ్గించింది - మీరూ తగ్గించండి..!
అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే VAT ఎక్కువ (35% + 1% Road Cess) అందుకే అన్ని రాష్ట్రాల కంటే మన దగ్గరే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ.. కానీ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం కూడా దిగి వచ్చి వారి వాటా పన్నుల్లో 10% వదులుకుంది.. అందుకే ఎప్పుడో పెరగాల్సిన పెట్రోల్ ధరలు కాస్త ఆలస్యమయ్యాయి.. కేంద్రం చేయాల్సింది కేంద్రం చేసింది.. కంపెనిలు చేయాల్సినవి కంపెనిలు చేశాయి.. ఇప్పుడు మీ వంతు వచ్చింది. విపరీతంగా పెట్రోల్ ధరలు పెరిగి మధ్య తరగతి వాళ్లకు భారం అయిన ఈ తరుణంలో మీ ప్రభుత్వ ఉదారత చాటుకోండి.. దేశంలో అన్నిటి కంటే ఎక్కువ ఉన్న VAT ను 10% తగ్గించుకుని పెట్రోల్ ధరలు కనీసం రూ. 105 లోపు ఉండేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను..!
ఈ విషయంలో వైసీపీ, కూటమి ఇద్దరూ దొంగలే.. ఒకరినొకరు బాదుడే బాదుడు అనుకుంటూ ఇద్దరూ పేద, మధ్యతరగతి వర్గాలకు బాదేస్తున్న తీరు మీ రెండు పార్టీల చెత్త పాలనకు నిదర్శనం..! కానీ ఈ విపత్తు సమయంలో VAT తగ్గించి, ప్రజలను ఆదుకోవాలని బీసీవై పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను..!
#BCYuvajanaParty #BharathaChaitanyaYuvajanaParty #RamaChandraYadav #bcyparty #bcy #RCY @BCYParty4People@ncbn@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@ANDHRAJYOTI@SakshiNews@Way2NewsTelugu@qubetvnews
బీసివై పార్టీ అధినేత శ్రీ @rcytheleader గారి ఆశయాలకు ఆకర్షితులై, గూడెంకొత్తవీధి మండలం బొడ్డమానుపాకలు గ్రామ గిరిజనులు భారీగా BCY పార్టీలో చేరారు.
గిరిజన సమస్యలపై, భూమి పట్టాలు, PM జన్ మన్ బిల్లుల విడుదలకై జిల్లా ఇంచార్జ్ కిల్లో రాజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
#BCYParty#RCY