సాటిలైట్ సిటీలోని 8వ డివిజన్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న శ్రీమతి విజయ గారిని ఈరోజు నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థించాం. మా విజ్ఞప్తిని గౌరవించి, కూటమి అభ్యర్థి విజయానికి మద్దతుగా నిలిచేందుకు వారి కుటుంబ సభ్యులందరూ ముందుకు రావడం అభినందనీయం.
వారి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం, తగిన గుర్తింపు కల్పిస్తామని హామీ ఇస్తున్నాను.
We requested Smt. Vijaya, the TDP candidate from Ward 8 in Satellite City, to withdraw her nomination. Respecting our request, her family has come forward to support the alliance candidate. I sincerely appreciate and thank the entire family, and assure them of due recognition and an appropriate place in the future.
#SatelliteCity #Ward8 #TDP #NDAAlliance #AllianceUnity #Rajamahendravaram #AndhraPradesh #సాటిలైట్సిటీ
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సింహాసనం మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుడిని ప్రేమగా కౌగిలించుకున్నట్లు, 96 ఏళ్ల సత్యనారాయణ గారు చూపించిన అభిమానానికి సీఎం చంద్రబాబు గారు కూడా దాసోహం అయ్యారు. కాలం మారిపోతుంది, తరాలు మారుతుంటాయి, కానీ ఇలాంటి అనుబంధాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
పెద్దాయన కల నెరవేర్చిన ప్రజా నాయకుడు..
"సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!" అని నిన్న చంద్రబాబు గారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, సిద్దాంతం వచ్చి సత్యనారాయణ గారిని కలిసి ఆయన కోరిక నెరవేర్చటమే కాదు, కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అండగా నిలుస్తానని చంద్రబాబు గారి హామీ ఇచ్చారు..
#ChandrababuNaidu
#AndhraPradesh
ఎప్పటి నుంచో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు తీర్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని మాట్లాడిన వీడియో వైరల్ అయ్యి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం అని సీఎం రిప్లై కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దాంతం వెళ్లిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం తన బస్సులోకి సత్యనారాయణను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. కాసేపు ఆత్మీయంగా మాట్లాడి కుటుంబ వివరాలు, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్యసాయం అందించాలని సత్యనారాయణ కోరారు. తమ గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలని విన్నవించారు. ఆ సమస్యలపై భరోసా ఇచ్చి సత్యనారాయణకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
#AndhraPradesh
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
జై ఆంధ్రప్రదేశ్!
మహానాడు 2026 ను పురస్కరించుకుని మీరు పంపిన హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. 'స్త్రీ శక్తి' థీమ్ తో ఈ ఏడాది మహానాడును నిర్వహించడంపై మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం సంతోషదాయకం. ప్రజా క్షేత్రంలో మన ఉమ్మడి లక్ష్యాల సాధనలో ఇటువంటి సంఘీభావం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమిగా మనం కలిసి చేస్తున్న ప్రయాణం మరింత సఫలం అవుతుంది. మీకు, జనసేన కుటుంబానికి నా తరపున ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
#Mahanadu2026
#SthreeShakti
@PawanKalyan