#WATCH | Hyderabad | BRS leader Praveen Kumar says, "Jupally Krishna Rao said that he is ready to prove that we took the loans of Rs 8 lakh crores during BRS regime and we said we are ready with the challenges... Our working President KTR came and waited for him... but he did not turn up and ran away... This is not what we expected from Congress ministers, we thought you will come and then debate with us... Do you think that he is a comedian or a minister?... The Congress government has become an address, a destination for all the scams in the state of Telangana..." (02.07)
రేవంత్ రెడ్డి..
నువ్వు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా..
నా భద్రత తగ్గించినా..
నీ చిల్లర రాజకీయాలకు భయపడేది లేదు.
బీఆర్ఎస్.. ఇది పోరాటాల పార్టీ మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే ఉంటాం!
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero 🫡
ప్రశ్నించడానికే పార్టీ అన్న మీరు ప్రశ్నార్థకంగా మారిపోతే..
ప్రశ్నించే గుణాన్ని చూసి ప్రేమించిన ఒకప్పటి మీ వీరాభిమాని
మీరు వదిలేసిన ప్రశ్నను తలెకెత్తుకున్నాడు.
మీరే పూనినట్లు ప్రశ్నిస్తున్నాడు. మీ నుంచి పుట్టింది కాబట్టి మీ ఎమోషన్, మీ టెంపర్మెంట్, మీ ఆవేశం కచ్చితంగా ప్రశ్నలో కనిపిస్తాయ్. మీకు ఇంకా ఎక్కువ కనిపిస్తాయ్. మీలాగే అనిపిస్తాయ్
మీ యాక్షన్ కు పుట్టిన రియాక్షన్ కదా.
ప్రశ్నను అరెస్టు చేస్తే జవాబు దొరకదు మీకు. ఒక్క ప్రశ్నకు వేలు, లక్షల ప్రశ్నించే గొంతులు తోడౌతాయి. ఆ ప్రవాహంలో ప్రశ్నను బంధించిన వాళ్లే మొదట కొట్టుకుపోతారు.
⚡️రావణ్ అనే వ్యక్తి శక్తి కాదది. ప్రశ్న పవర్ !!⚡️
#PrashnaRaavan
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చదువు, ఙ్ఞానం ముందు రేవంత్ రెడ్డి ఏ మూలకీ సరిపోడు
అలాంటి వ్యక్తి గురించి ఎలాంటి బుద్ధి, ఙ్ఞానం లేని రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు గుండు కింద మెదడు లేదు అని మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, తగిన గుణపాఠం చెప్తారు
– కేటీఆర్
జీవో 17 కి వ్యతిరేకంగా డాక్టర్ ఆర్ఎస్పీ చేస్తున్న పోరాటం తెలంగాణ భవిష్యత్తు కోసం. ప్రభుత్వ అల్ప బుద్ధి చర్యలు ఆయన్ని ఆపలేవు. #IStandWithRSP#RestoreRSPSecurity
BC,SC,ST-JAC మొదటి వార్షికోత్సవ పండగ
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
తెలంగాణ రాష్ట్రం లో.. ' BC,SC,ST-JAC ' ఉద్యమ పుట్టుకే...
ఒక సామాజిక విప్లవం, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యం..!
ప్రియమైన తెలంగాణ ప్రజలారా..! బుద్ధుడు, అశోకుడు, సంత్ రవిదాస్, సంత్ కబీర్ దాస్, శివాజీ మహారాజ్, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సాహూ మహారాజ్, డా. అంబేడ్కర్, కాన్షీరాం ల ఆశయ దీపాన్ని, వారి ఆలోచనల రథాన్ని తెలంగాణలో వెలిగించడానికి, ముందుకు నడిపించడానికి జన్మించిందే BC, SC, ST-JAC అని పునరుద్ఘాటిస్తున్నాం.
మన ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ ల, సర్వాయి పాపన్న గౌడ్ ల, పండగ సాయన్నల, కొండా లక్ష్మణ్
బాపూజీ ల, ఆత్మగౌరవ జెండాని వారి రాజ్యాధికార అజెండాని తెలంగాణలో పునర్ నిర్మించడానికే BC, SC, ST-JAC పుట్టిందని మరొక్కమారు సగర్వంగా చాటుతున్నాం. తెలంగాణ పౌరుషం, తెలంగాణ కోపం, తెలంగాణ ప్రేమ, తెలంగాణ కత్తి పదును అన్నీ దారి తప్పాయి. ఎవరు శత్రువో ఎవరు మిత్రులో గుర్తుపట్టని అంధకారంలోకి అమాయక బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ అగ్రకుల మేధావుల తప్పుడు మాటల ఉచ్చులో పడ్డారు. అందుకని మన శత్రువులైన తెలంగాణ అగ్రకుల భూస్వామ్య పెట్టుబడిదారులు మనకు మిత్రులుగా కనిపిస్తున్నారు. అంటే మళ్ళీ ఈసారి కూడా శత్రువు తప్పించుకున్నాడు..! ఆనాటి రైతాంగ సాయుధ పోరాటం నుండి కమ్యూనిస్టు, నక్సలైట్ ఉద్యమం, మొన్నటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు శత్రువర్గం అదృశ్యం అవుతూనే ఉంది. ఈ అగ్రకుల భూస్వామ్య మేధావులు ఆడిన అతిక్రూరమైన ఆటలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపశువులయ్యారు. తద్వారా మన ప్రజలకు “ఫూలే, అంబేడ్కర్, కానీరాం ల సామాజిక- న్యాయ- రాజ్యాధికార “ పయనం, పని విధానంలోకి మన ప్రజలు నడవలేదు. ఇంత పెద్ద అగాధంలోకి మన అణగారిన 90% ప్రజలు నెట్టివేయబడ్డారు. ఈ అగ్రకుల కుట్రలకు బలి అయిపోయిన 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ లను బయటకు తీసి నడిపించడాని కై గత సంవత్సరం.. 2025 మార్చి 31 న BC, SC, ST-JAC ఆవిర్భావం జరిగింది.
నాటి నుండి నేటి వరకు ఒక సంవత్సరం 3 నెలలు గా తెలంగాణ అంతటా "సామాజిక న్యాయం -రాజ్యాధికార చైతన్యం, ప్రజా పోరాటాలు" ఈ మూడింటితో రాష్ట్రమంతటా ఒక సంచలనం, అద్భుతమైన రాజ్యాధికార చైతన్యం, భూమి కోసం యుద్ధం. ఇంకా "మా భూమి రథయాత్ర" చైతన్య జ్వాల అగ్ని.. ఒక్కటేమిటి ఈ మొత్తం గడిచిన సంవత్సరం అంతా భారీ ఉద్యమం నడిచింది. ఇంత పెద్ద విజయాలను స్మరించుకుంటూ, భవిష్యత్తులో సాధించాల్సిన, నిర్మించాల్సిన పోరాటాలను మాట్లాడుకోవడానికి ఈ BC, SC, ST-JAC వార్షిక సదస్సుని నిర్వహిస్తున్నాం తప్పకుండా రండి.
నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అగ్రకులాలు ఏకమై JAC నీ స్థాపించి రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు..! ఇప్పుడు ..అదే తెలంగాణలో మన 90% బీసీ ఎస్సీ ఎస్టీ బలగమంతా JAC గా ఒక్కటై తెలంగాణాలో మన రాజ్యాన్ని స్థాపిద్దాం....!!!
#Telangana
#BCSCSTJAC
#మా_భూమి_రథయాత్ర
#MaaBhoomiRathaYatra
#Telangana_BC_ST_SC_JAC
#𝐃𝐫𝐕𝐢𝐬𝐡𝐚𝐫𝐚𝐝𝐡𝐚𝐧𝐌𝐚𝐡𝐚𝐫𝐚j
Dear @maddurPS_sdpt
Bekkal Politics అనే వాట్సాప్ గ్రూప్ ను పోలీసులు నిలిపివేయమని చెప్పారని మా గ్రామ కారోబార్ గారు నిలిపివేశారు.
అయితే, గ్రూప్ నిలిపివేయడానికి గల కారణాలను పోలీసులు గ్రామ ప్రజలకు అధికారికంగా తెలియజేయలేదు.
మా గ్రామ ప్రజల మధ్య సమాచార మార్పిడికి ముఖ్యమైన WhatsApp గ్రూప్‌ను మూసివేయాల్సిన అవసరం ఏమిటి?
ఈ గ్రూప్ వల్ల law & orderకు ఏదైనా సమస్య ఏర్పడిందా? అలాంటిదైతే దానికి సంబంధించిన కారణాలు ఏమిటి? లేకపోతే ఏ చట్టం లేదా ఏ అధికారిక ఆదేశం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారో దయచేసి ప్రజలకు వివరించండి.
ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరం.
@siddipetcp
BSPలో నిధుల సేకరణ గురించి ఇప్పుడు కొందరు పెద్ద ఆవిష్కరణ చేసినట్టుగా మాట్లాడుతున్నరు.
అసలు వాళ్లకు కాన్షీరామ్ గారి రాజకీయ స్టైల్ మీద కొంచెమన్నా అవగాహన ఉన్నదా?
ఈ కింద ఫోటోలో కనిపిస్తున్నట్టు..
"ఒక నోటు ఇవ్వండి.. ఒక ఓటు ఇవ్వండి" అని బిఎస్పిని బహుజన ఉద్యమాన్ని కాన్షిరాం గారు ప్రారంభించారు.
కాన్షీరామ్ గారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే..
"ఉద్యమం నడవాలంటే డబ్బు కావాలి. ఎన్నికలు పోటీ చేయాలంటే డబ్బు కావాలి. దేశమంతా తిరగాలంటే డబ్బు కావాలి."
అందుకే తనను మీటింగ్‌కు పిలవాలన్నా, పర్యటనకు రావాలన్నా అప్పుడే లక్ష రూపాయలు ఇవ్వాలని, లేకపోతే రానని చెప్పేవారు. పార్టీ నాయకులు కూడా నిధులు సమకూర్చేవారు.
బెహెన్జీని గానీ, కాన్షీరామ్ గారిని గానీ కలవాలంటే పార్టీ ఫండ్‌కు సహకరించాలనే సంస్కృతి BSPలో 40 ఏళ్లుగానే ఉంది.
ఎందుకంటే BSP అనేది కార్పొరేట్ డబ్బులతో పుట్టిన పార్టీ కాదు.
బహుజనుల చెమట చుక్కలతో, వారి చిన్న చిన్న విరాళాలతో నిర్మించిన ఉద్యమం.
ఎందుకు ఈ ఉద్యమాన్ని కార్పొరేట్ డబ్బులతో కాకుండా, బహుజన సమాజం ఇచ్చిన చిన్న చిన్న విరాళాలతో కాన్షీరామ్ గారు ఎందుకు నిర్మించారంటే..
డబ్బు ఇచ్చేవాడే రాజకీయాలను నియంత్రిస్తాడని ఆయనకు తెలుసు.
అందుకే బహెన్జీ కూడా పదే పదే ఒక మాట చెప్తుంటరు.
"నేను కార్పొరేట్ నిధులు తీసుకోను. ఎందుకంటే వాళ్ల డబ్బు తీసుకుంటే వాళ్ల ప్రయోజనాల కోసం పని చేయాల్సి వస్తుంది.
ప్రజల డబ్బుతో రాజకీయాలు చేసినప్పుడే... ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినప్పుడే... ప్రజల కోసమే స్వేచ్ఛగా పనిచేయగలం" అని.
కాంగ్రెస్‌కు కార్పొరేట్లు దోచిపెడితే అది రాజకీయ విరాళం.
BJP వేల కోట్లు మూటగడితే అది దేశభక్తి.
కానీ బహుజనులు తమ ఉద్యమానికి డబ్బు ఇస్తే మాత్రం కులోన్మాదులకు నేరంగా కనిపిస్తోంది.
"మన ఉద్యమాన్ని మనమే పోషించాలి" అనే సిద్ధాంతమే BSPకి పునాది.
అది రహస్యం కాదు.
అది అవినీతి కాదు.
అది BSP రాజకీయ తత్వం.
మీరు చెప్పే మాటలకి ఆచరణకి ఏమైనా సంబంధం ఉంటుందా @revanth_anumula గారు, మీ ప్రభుత్వా విధానాల్లో సామాజిక న్యాయం ఉండదు..? కానీ వంద మంది అంబేద్కర్లు ఎలా పట్టుకొస్తారు.! ఇదేమి ద్వంద వైఖరి, రెడ్డి ధర్మ ముసుగుతో.. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వీర్యం చేస్తున్నావు కదా..!
@TelanganaCMO
ప్రజల తరపున ప్రశ్నలు అడిగితే, అధికారంలో ఉన్న పాలకులు నువ్వు ....
- హిందూ ద్వేషి అంటారు
- దేశ ద్రోహి అంటారు
- అర్బన్ నక్సల్స్ అంటారు
- చైనా ఏజెంట్ అంటారు
- పాకిస్తాన్ ఏజెంట్ అంటారు
మేమే .. నిజమైన భారత మాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ దేశభక్తి వారుసలం !!!
ఉద్యోగాలు లేవు…
అవకాశాలు లేవు…
భవిష్యత్తుపై భరోసా లేదు…
పరీక్షలు లీకులు చేశారు అని ప్రశ్నిస్తే దేశద్రోహుల ముద్ర.
అందుకే యువత వీధుల్లోకి వస్తోంది.
ఇది ఒక పార్టీ సభ కాదు…
ఒక తరం ఆవేదన.
ఇది ఏళ్ల తరబడి మోసపోయిన ఆశల ప్రతిధ్వని.
👉🏽కాక్రోచ్ జనతా పార్టీ ప్రదర్శన
ఈరోజు (14.06.2026) నల్లగొండ జిల్లా కేంద్రం లో....
ధర్మ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కార్యకర్తల సమ్మేళణం లో పాల్గొని ప్రసంగిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ గారు...
ఈరోజు (14.06.2026) నల్లగొండ జిల్లా కేంద్రం లో....
ధర్మ సమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా కార్యకర్తల సమ్మేళణం లో పాల్గొని ప్రసంగిస్తున్న ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ గారు...