@BRSparty మీకు ఆదేశాలు ఇచ్చిన మీ అధినేత ఎందుకు రాలేదో చెప్పగలరు. ఓ, మీ అధినేత అసెంబ్లీకి ఒచ్చిన దాక్లాలే లేవు ఇగ ఇక్కడికి ఏమ్ ఒస్తడులే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో దుర్ఘటనలు జరిగాయి కానీ ఎప్పుడూ వాళ్ళను పరామర్శించిన పాపానికి పోని ఆయనకు సడెన్ గా ఇప్పుడు ఎందుకో ఇంత ఓవర్ యాక్టింగ్?
తెలంగాణ బిడ్డ, బహు భాషాకోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాలతో సంస్కరణలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిన దార్శనికుడని గుర్తుచేశారు.
#PVNarsimhaRao
తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనే�� ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిసిన సింగరేణి, ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
♦️సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమం సమున్నతికి పాటుపడుతూ, సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవా��ని ఆకాంక్షించారు. #Singareni #TelanganaRising
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారితో పాటు నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఇతర నేతలు ఉన్నారు. #PVNarasimhaRao
ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెరవెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం తెరవెనుక జరిగిన అనేక ప్రయత్నాలు, అందుకు కృషి చేసిన ఎంతో మంది చరిత్ర, వారితో పాటు జరిగిన పరిణామ క్రమాలన్నింటినీ క్రోడీకరిస్తూ పుస్తకం తీసుకొస్తే భావితరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
✅మాజీ ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి గారు రాసిన వ్యాసాలు, ప్రసంగాల సంకలనం “Nuts, Bolts of War & Peace” పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ #AIPSO రవీంద్రభారతిలో ఏర్ప���టు చేసిన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ అనంతరం సీఎంగారు మాట్లాడారు.
✅ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జనసభ, 2000 లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖర్ రావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన సందర్భం, జేఎసీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఘటనలపైన సమగ్రంగా విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం రావలసిన అవసరం ఉంది.
✅తద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామాలు, తెర ముందు కనిపించనివి చాలా మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిపై యాదవరెడ్డి గారు పుస్తకం రాయాలి.
✅పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు తలెత్తిన గందరగోళ పరిస్థితులు బిల్లు పాసవుతుందా అన్న ఉద్రిక్తమైన వాతావరణంలో జైపాల్ రెడ్డి గారు అత్యంత కీలకపాత్ర పోషించి బిల్లును ఆమోదముద్ర పడేలా చూశారు.
✅జైపాల్ రెడ్డి గారు, యాదవరెడ్డి గారు ఏ సిద్ధా���తాన్ని చెప్పారో అదే సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో పాటించారు. వారు పదవుల కోసం ఏనాడూ ప్రయత్నించలేదు.
✅��ేశంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. శాంతిని కోరుకునే ఇలాంటి వేదికలు ప్రజల్లో దేశం ఎదుర్కొంటున్న పలు విషయాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది.
✅భారతదేశం యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. చైనా 2 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మన భూభాగాన్ని ఆక్రమించిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవలసిన అవసరం ఉంది.
✅మణిపూర్ లో జరుగుతున్న మారణకాండ రెండు గిరిజన జాతుల మధ్య వైరుధ్యం అన్నట్టు ఉంది. కానీ ఆ వైరుధ్యం వెనుక అక్కడి ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆయుధాలను స్వాధీనం చేసుకుని అక్కడ శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది.
✅ఈ కార్యక్రమంలో AISPO ప్రధాన కార్యదర్శి ఒబేదుల్లా కొత్వాల్ గారు, ఎంపీ @DrMalluRavi1 గారు, ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, కాలె యాదయ్య గారు, వరల్డ్ పీస్ కౌన్సిల్ అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా గారితో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. #TelanganaRising
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికీ శుభ��కాంక్షలు తెలియజేశారు. క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళ���కి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి గారు అన్నారు. క్రిస్మస్ వేడుకలను రాష్ట్రమంతా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. #Christmas #TelanganaRising #MerryChristmas
Hon'ble CM Sri.A.Revanth Reddy participates in Darshan at Edupayala Vana Durga Bhavani Temple and Various Development Works at Medak https://t.co/rUPr319ArN
ముఖ్యమంత్రి @revanth_anumula గారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వెంకట దత్త సాయి ల రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. @Pvsindhu1
భారత రాజ్యంగ నిర్మాత dr బి ఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని దీనికి నిరసనగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లె సత్యన��రాయణ గారి ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన ర్యాలీ గా తెలంగాణ చౌక్ వెళ్లి అక్కడనుండి చొప్పదండి నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ మేడిపల్లి సత్యం,సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నియోజక వర్గ ఇన్చార్జి పురుమల్లా శ్రీనివాస్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు గారితో కలిసి ��లెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
*హుస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి ఉత్సాహంగా గడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్*
*విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్*
*జీవితంలో లక్ష్య చేదన లో ఎలా ముందుకు వెళ్ళాలి అని కథలు ,స్టోరీస్ చెప్పి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి*
*పాటలు పాడి ,స్టోరీస్ చెప్పిన విద్యార్థినులను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్*
హుస్నాబాద్ :
హుస్నాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ , కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు. విద్యార్థినులను అందరినీ ఒ��్క దగ్గరకు చేర్చి వారిలో ప్రేరణ కల్పించేలా జీవితంలో లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలని వారికి కథలు చెప్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. స్వయంగా విద్యార్థులతో కలిసి క్యూలైన్ లో నిల్చొని ఆహారం తీసుకున్నారు. వారితో కలిసి కింద కూర్చొని సామూహిక భోజనం చేశారు. వారికి తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు.ప్రజా ప్రభుత్వం దశాబ్ద కాలం తరువాత డ���ట్ చార్జీలు పెంచిందని భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఉదయం అల్పాహారం , ఎగ్స్, అరటిపండ్లు ,సాయంత్రం అందించే స్నాక్స్ చాలా బాగున్నాయని పేర్కొన్నారు. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు గంటలకు పైగా విద్యార్థినులతో గడపడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జీవితంలో గెలవాలంటే ఇప్పటి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు పోవాలని
అప్పుడే విజయం సాధించగలమని వారికి సూచించారు. అందరూ బాగా చదువుకోవాలని తల్లిదండ్రులకు , గ్రామానికి మన రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. చదువుల్లోనే కాదు ఆటల్లోనే ఇన్నోవేషన్ సైన్స్, రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో ప్రతి రంగంలో ముందుకు వెళ్ళల్లని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థినులకు సూచించారు.