నా మీద నమ్మకంతో రానున్న పార్లమెంటు ఎన్నికల సమరంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి నన్ను @BRSparty అభ్యర్థిగా ప్రకటించిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత శ్రీ #KCR గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
నేను మీ నమ్మకాన్ని వమ్ముచేయను.
పేద ప్రజలకిచ్చిన మాట తప్పను.
Thanks a million Sri KCR ji for trusting and declaring me as BRS candidate for NagarKurnool (SC) Parliamentary Constituency for upcoming General Election-2024.
శ్రేయోభిలాషులకు ఒక ప్రార్థన🙏:
నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్ములను బాధ పెట్టి ఉోండవచ్చు. నాకు కూడా బాధగానే ఉంది. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు.
అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, నా మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా!) తీవ్రమైన దాడి చేసినయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు. నన్ను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న నా లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవు.👊
నన్ను దయచేసి నమ్మండి🙏
నేను ఇన్నాళ్లూ నిస్వార్థంగా పీడిత ప్రజలకోసమే పనిచేశాను. చట్ట సభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను.
తెలంగాణ వాదం -బహుజనవాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి శ్రీ కేసీఆర్ మరియు బెహన్జీ మాయావతి గార్లను ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయినప్పటికీ, ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్ గారితోనే కలసి ప్రయాణించాలనుకున్నాను. బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే ధమ్ము-ధైర్యం కాంగ్రేసుకు ముమ్మాటికీ లేదు. అోందుకే నేను ఇటీవలే భారాసలో చేరాను.
ఈ యుద్దంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతాను. దయచేసి మీరు కూడా నాతో రండి. మీకు చేతనైన సాయం చేయండి. మీ విలువైన సమయమివ్వండి. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ‘కారు’ గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి. లేదా మీకు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసయినా చెప్పండి.
నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లే….
నేను నేను కాదు…నేను మీరే…
మనమందరమూ…🙏
ఛలో నాగర్ కర్నూల్✊
జైభీం…జై తెలంగాణ..జై భారత్
#KCROnceAgain
#RSP4NGKL
#SaveTelangana
#SaveConstitution
@KTRBRS@BRSHarish
దిలావర్పూర్ గ్రామానికి చెందిన మేము ఆట ప్రదర్శనతో ఈరోజు మొదటి బహుమతితో మిర్యాలగూడ నియోజకవర్గంలో మొదటి బహుమతి సాధించడం మాకు ఎంతో గర్వకారణం.toady we are so happy 🥳🥳🥳🥳🥳🥳🏸🏸🏸🏸
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ అవుట్డోర్ మెగా టోర్నమెంట్లో దివార్పూర్ గ్రామానికి చెందిన రేవూరి కోటేష్ మరియు రేవూరి వెంకటేశ్వర్లు టీం (first prize)మొదటి బహుమతి గెలుపొందాము..we are very happy to say this wonderfull winnings 🥳🥳🏸🏸🏸🥳🏸🏸
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజన రైతు నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ ను తీవ్రంగా ఖండిస్తున్న. భూ వివాదం (Civil Dispute) లో ఎస్సై జోక్యం చేసుకొని విచారణ పేరుతో స్టేషన్ కు పిలిచి విచక్షణ రహితంగా కొట్టడం చట్టరీత్యా నేరం. ఘటనకు కారణమైన ఎస్సైపై విచారణ జరిపి నేరం ఋజువైతే 302 IPC కింద కేసు నమోదు చేయాలి. ఘటనకు కారకులైన పోలీసులను తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని #BSP డిమాండ్ చేస్తుంది.లాకప్ డెత్ లు లేని తెలంగాణ కోసం #BSP చట్ట ప్రకారం నిరంతరం పోరాడుతుంది.
లాకప్ లలో ఎప్పుడూ పేదోళ్లే ఛస్తరు! ఎందుకో ఎప్పుడైనా ఆలోచించినమా?
@TelanganaCMO@TelanganaDGP
*ఈరోజు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ గారిని పరమార్శించిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు*
తెలంగాణ ఆణిముత్యం, ఏషియన్ గేమ్స్ లో కాంస్యం విజేత, బాక్సర్ నికత్ జరీన్ కు ₹ 2 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతి ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీయం @revanth_anumula గారికి, డిప్యూటి సీయం @BhattiCLP గారికి ధన్యవాదాలు .
మున్ముందు కూడా క్రీడాకారులను మీరు ఇలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా.
Important Request:
అలాగే తెలంగాణ సాంఘీక సంక్షేమ
గురుకులాల విద్యార్థి @AgasaraNandini కూడా ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ లో కాంస్య పతకం సాధించి తెలంగాణ ప్రతిష్టను పెంచింది.
తను కూడా ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో పారిస్ ఒలింపిక్స్ కు ప్రిపేర్ అవుతున్నది.
ఈ అమ్మాయి తండ్రి చిన్న టీ షాపు నడుపుకుంటడు, తల్లి వేరే వాళ్ల ఇళ్లలో domestic help గా పనిచేస్తుంది. ఈ అమ్మాయిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే వాళ్లెవరూ లేరు.
ఈ అమ్మాయికి కూడా నికత్ జరీన్ లాగానే ₹ 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని కోరుతున్నా. ఈ అమ్మాయి తప్పక ఒలింపిక్స్ పతకం సాధిస్తుందన్న నమ్మకం నాకున్నది.
#Equality