నల్లగొండలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలక్ట్రిక్ వస్తువుల పట్ల, పాతనిర్మాణ ఇంటి గోడల పట్ల మ్యాన్ హోల్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నట్టు అయితే వెంటనే 100 కి ఫోన్ చేయగలరు.
గౌరవ నల్లగొండ ఎస్పీ రెమ రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు,రాష్ట్ర మహిళా భద్రతా విభాగంవారి సౌజన్యంతో.ఈరోజు సాయంత్రం దండం పల్లి గ్రామంలో AHTU బృందం,పోలీసు కళా బృందంతో కలిసి బాల్యవివాహాల నిర్మూలన, బాలల రక్షణ, బాల కార్మిక వ్యవస్థ ,మానవ అక్రమ రవాణా,వంటి అంశాలపై అవగాహన కల్పించారు..
ప్రజలకు ఇబ్బందులు కలిగించే "మల్టీ టోన్డ్ హారన్" పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. వీటిపై నిత్యం పోలీసులు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు వివిధ ప్రాంతాల్లో జరిమానా విధిస్తూ హెచ్చరిస్తున్న పోలీసు సిబ్బంది.