🚫💊 అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కదిరిలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి... ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడండి.
#SayNoToDrugs#DrugFreeIndia#SriSathyaSaiPolice
పుట్టపర్తిలో లాడ్జిలపై ఆకస్మిక పోలీసు తనిఖీలు నిర్వహించారు.ప్రతి అతిథి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ యువరాజు సూచించారు.
#SriSathyaSaiPolice#PuttaparthiPolice#PublicSafety#StayAlert
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకల ఏర్పాట్లను పోలీసు అధికారులు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
#SriSathyaSaiPolice#Moharram
🚛 మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్‌పై తణకల్లు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, కదిరి ద్వితీయ శ్రేణి న్యాయస్థానం రూ.10,000 జరిమానా విధించింది.
🚫 మద్యం సేవించి వాహనం నడపడం నేరం. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోండి.
#DrunkAndDrive
🚁 నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా!
పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో పర్యవేక్షణ కొనసాగుతోంది. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే మా లక్ష్యం.
#SriSathyaSaiPolice#NightVisionDrone#DroneSurveillance#PublicSafety
నేరాల నియంత్రణకు డ్రోన్ నిఘా..!
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా, ప్రజల భద్రతే లక్ష్యం.
#SriSathyaSaiDistrictPolice#DroneSurveillance#PublicSafety
సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత కట్టుదిట్టం!హిందూపురం రూరల్ సర్కిల్ పరిధిలో కీలక కూడళ్లు, చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు, సోలార్ కెమెరాలు, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు. ప్రజల భద్రత, నేర నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీఐ జనార్ధన్ తెలిపారు.
#SriSathyaSaiPolice#SmartPolicing
🚫💊 "డ్రగ్స్ వద్దు బ్రో" అవగాహన కార్యక్రమం పుట్టపర్తిలో నిర్వహించిన ఈగల్ బృందం. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. సమాచారం ఉంటే 1972కు తెలియజేయండి.
#DrugsVadduBro#NMBA#SriSathyaSaiPolice#DrugFreeYouth#SayNoToDrugs
పుట్టపర్తిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పుట్టపర్తి పట్టణ సీఐ యువరాజు సూచించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పాటింపు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. #TrafficAwareness#SafeDriving#SriSathyaSaiPolice
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 80 వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ గారు. వికలాంగులు, వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి సమస్యలు తెలుసుకుని తక్షణ చర్యలకు ఆదేశాలు. ప్రతి ఫిర్యాదుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హామీ.
#SriSathyaSaiPolice#PublicGrievance
🧘♂️ పుట్టపర్తిలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ. యోగాంధ్ర-2026 కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, యోగా గురువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనానికి యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 🌿
#YogaDay2026#Yogandhra2026
🚔 శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం!
దేవాలయాలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రత్యేక నిఘా, నైట్ విజన్ డ్రోన్లతో పర్యవేక్షణ, డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు, ప్రజల్లో భద్రతా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
#SriSathyaSaiPolice#VisiblePolicing#PublicSafety
🚔 చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాలు. రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు, సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, ప్రజా భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం.
🚔 శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రివేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం!
🔹 దేవాలయాలు, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ప్రత్యేక నిఘా
🔹 నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ
🔹 డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు
🔹 సైబర్ మోసాలు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు
#SriSathyaSaiPolice#VisiblePolicing
సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం!కోడూరుతోపు జంక్షన్లో PTZ & హై-రిజల్యూషన్ CCTV కెమెరాల ఏర్పాటు. కోడికొండ చెక్‌పోస్ట్‌తో పాటు మరిన్ని కెమెరాలు, LED లైట్ల ఏర్పాటు ద్వారా రియల్‌టైమ్ పర్యవేక్షణ, నేరాల నివారణకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.
#SmartPolicing
మొహరం వేడుకలను శాంతి, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాన, ఐపీఎస్ గారు సూచించారు. తూముచెర్ల, భానుకోట గ్రామాల్లో పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
#Moharram2026#SriSathyaSaiPolice#PeaceAndHarmony
🚔 కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో #OperationDandayan కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు సైబర్ భద్రత, మహిళల రక్షణ, మాదకద్రవ్యాల నివారణపై అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురాన, ఐపీఎస్ గారు అవగాహన కల్పించారు. #CyberSafety#SriSathyaSaiDistrictPolice
🚨 శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల ఘన విజయం!
ధర్మవరం వరుస ఇంటి దొంగతనాల కేసులను ఛేదించి అంతర్రాష్ట్ర గజదొంగతో పాటు 3 మందిని అరెస్ట్ చేశారు. ₹14.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ₹17 లక్షల విలువైన తాకట్టు బంగారం రసీదులు స్వాధీనం. 👮♂️💪
#SriSathyaSaiPolice#CrimeDetection