ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan@VangaveetiOffl
Pawan Kalyan Creative Works wishes everyone a blessed and joyous Deepavali.
May the divine light of diyas take away darkness, illuminate every heart, and fill our lives with peace, prosperity, and new beginnings. May the blessings of Goddess Lakshmi bring abundance, wisdom, and happiness into every home.
#HappyDiwali
#FestivalOfLights
Heartfelt birthday wishes to the renowned filmmaker, master writer, and distinctive storyteller, Sri Trivikram Srinivas Garu. Through his exceptional writing and captivating storytelling, he continues to entertain and inspire audiences. Wishing him many more memorable films and remarkable milestones in the years ahead.
#HappyBirthdayTrivikram
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
100% STRIKE RATE, ONCE AGAIN 🎯
General Elections 100% Victory
Local Body Elections 100% Victory
Naam Yaad Hai Na @PawanKalyan 🫡
Congratulations to all the Winners 🙏
#JanaSenaStrikesAgain
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు..
కూటమి ఘన విజయం..
జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయం, ముఖ్యంగా జనసేన పార్టీ అద్భుత విజయంతో జనసేన పార్టీ తెలంగాణ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. విజయ నినాదాలు చేస్తూ, సీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గెలుపుకు దోహదపడ్డాయని, కూటమి పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి విజయాలు సాధించబోతున్నామని వెల్లడించారు. గెలుపులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి పాత్ర చాలా ఉన్నదని చెప్పారు.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత విస్తరణకు దోహదపడుతుందని అన్నారు.
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, పార్టీ సిద్ధాంతాలపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసమే ఈ విజయానికి ప్రధాన బలమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ కన్వీనర్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, ఎం. దామోదర్ రెడ్డి, మచ్చ సుధాకర్, ప్రజీత్ గౌడ్, మేడ రామకృష్ణ, నరేష్, మాధవరెడ్డి, ఎడమ రాజేష్, నందగిరి సతీష్, గోకుల రవీందర్ రెడ్డి, నిహారిక నాయుడు, లిఖిత, తనూజ రెడ్డి, జై సింహ పడాల, సుదర్శన్ రెడ్డి, మేడ మురళి కృష్ణ, అనిల్ కుమార్, వేముల మహేష్, జెంజి పోగుల ప్రవీణ్, అజయ్, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నరు.
#APLocalBodyElections
#MurusuCyclone#AndhraPradesh
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం..!
•రాత్రి నుంచి రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రం
•దాదాపు 15 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు
•రానున్న రెండు, మూడు రోజులు అత్యంత కీలకం
•పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి
•గ్రామాల్లో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
•వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలి
•గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి
•మురసు తుపాను సహాయక చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
మురసు తుపాను తీరాన్ని దాటే ప్రక్రియ మరికొన్ని గంటలపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని, గుంటూరు వంటి ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడం తుపాను తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సేవలు అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
బలహీనంగా ఉన్న చెరువు కట్టలు, కాలువ గట్లను గుర్తించి, వాటిని తక్షణం పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులకు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. మురసు తుపాను నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. వర్షాలు తగ్గే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో అర్నబ్ తుపాను సమయంలో అనుసరించిన విధంగానే - ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని తరలించి, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర పనులకు వినియోగించాలని నిర్దేశించారు. గ్రామాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉందని, పెద్ద ఎత్తున వర్షపు నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మళ్లింపు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థకు అడ్డంకులు ఏర్పడకుండా చూడాలని స్పష్ట చేశారు. నీటిని తొలగించిన ప్రాంతాల్లో దుర్వాసన, దోమల వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు
తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటి నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా పైప్లైన్లు దెబ్బతింటే తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్, క్లోరినేషన్, అవసరమైన చోట సూపర్ క్లోరినేషన్ చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు.
దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ.. నష్టం అంచనాలు
వర్షపు నీటి ప్రవాహాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను తక్షణం పునరుద్ధరించి, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పంట నష్టం, ఆస్తి నష్టం సంభవించిన ప్రాంతాల్లో తక్షణమే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
అవసరమైతే కమిషనరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మురసు తుపాను సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు.
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభినందనలు, ఆశీస్సులు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీ ప్రోత్సాహం, ఆశీస్సులు.. నాకు స్పూర్తినిస్తాయి. 🙏