*పెద్దపల్లి, ఆగస్టు-1:*
-------------------------------------------
✴️*ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయా��ి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
✴️*వీబీజీ–రామ్జీ పథకం ద్వారా ఆగస్టు నెలలోనే పనులు పూర్తి చేయాలి*
✴️*వర్షాల నేపథ్యంలో తాగునీటి కలుషితాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి*
✴️*మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీటి సరఫరా నిరంతరం ఉండేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి*
✴️*వీబీజీ–రామ్జీ పథకం, తాగునీటి భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
---------------------------------------------
✴️జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు,చేతి పంపులు , బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే లక్ష్యంతో వీబీజీ–రామ్జీ (VBG RAM G) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే వర్షాల నేపథ్యంలో ప్రజలకు కలుషిత రహిత తాగునీరు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు.
✴️శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీబీజీ–రామ్జీ పథకం అమలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులకు పలు సూచనలు చేశారు.
✴️ఈ సందర్భం��ా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వీబీజీ–రామ్జీ పథకం కింద అవసరమైన అన్ని పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేస���, ఆగస్టు నెలలోనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీఓలు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
✴️ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తాగునీటి వనరులు కలుషితం కాకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి పైప్లైన్లను క్రమం తప్పకుండా పరి���ీలించి, అవసరమైన చోట్ల శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. క్లోరినేషన్ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిరంతరం నిర్వహించి ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు.
✴️అన్ని ఓవర్హెడ్ నీటి ట్యాంకులను నిర్దిష్ట వ్యవధిలో శుభ్రపరచాలని, నీటి నిల్వ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంలో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
✴️గ్రామపంచాయతీలు, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈ.ఈ.మిషన్ భగీరథ ఇంట్రా గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి, డి.ఈ.లు. ఏ.లు.తదితరులు,పాల్గొన్నారు.
@careinsuranceIN I have provided the requisite information on 21.06.2025 ,there is no update on the issue,how many more days it will take to reimburse the claim.
@careinsuranceIN My claim reimbursement got rejected stating that it will get cure at home,for the policy no.87131089
It is very regretted to share this
@careinsuranceIN How many days will it take you to evaluate, is this, is the way to test the patience of your policy holder..it's already 1 month over and again you are telling its under evaluation..
@careinsuranceIN It's been 2 days no response from your end..when will you going to resolve the issue..why anyone treat as inpatient when there is an option to cure by staying at home.
-------------------------------
పెద్దపల్లి, ఫిబ్రవరి-22:
------------------------------
💦మిషన్ భగీరథ ద్వారా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన త్రాగునీటి వాటర్ ట్యాప్ లను కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సిబ్బంది వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు.
💦శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో త్రాగునీటి వాటర్ ట్యాప్ లను ప్రారంభించారు.
💦*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఒక యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ఏర్పాటు చేసి, మిషన్ భగీరథ బల్క్ నీటి సరఫరాకు అనుసంధానం చేశామని, కలెక్టరేట��� లోని ప్రతి ఫ్లోర్ లో రెండు వాటర్ ట్యాప్ లను ఏర్పాటు చేశామని అన్నారు.
💦యూవి ప్యూరిఫైర్ ప్లాంట్ ద్వారా మిషన్ భగీరథ బల్క్ నీరు శుద్ది చేసి ట్యాప్ లో స్వచ్ఛమైన జలం మనకు వస్తుందని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అన్ని శాఖలు అధికారులు, సిబ్బంది త్రాగు నీటి ట్యాప్ లను వినియోగించుకోవాలని, ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి త్రాగునీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు.
💦ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, ఏ.ఓ.శ్రీనివాస్, అందరూ జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంlది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#water
#purified
#facility
పెద్దపల్లి, ఫిబ్రవరి 06:
--------------------------------
🚰 రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలను జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.
🚰 గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష త్రాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
🚰 మన జిల్లాలో మిషన్ భ��ీరథ గ్రిడ్, ఇంట్రా త్రాగు నీటి సరఫరా లో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ సోర్స్, ఇబ్బందులు తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
🚰 ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై నివేదిక ముందుగానే అందించాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా వేసవి కాలంలో ప్రతి జన ఆవాసానికి పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా జరగాలని, దీనికి అనుబంధంగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందుగానే చెక్ చేసి పెట్టుకోవాలని అన్నారు.
🚰 గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇంట్రాలో లీకేజీ, మరమ్మత్తు వంటి పనులు ఏవైనా ఉంటే వెంటనే చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఏదైనా ఆవాసాలకు గ్రిడ్ వాటర్ అందడం లేదా వంటి వివరాలను మండలాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు.
🚰 నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన��వయం చేసుకుంటూ నీటి వనరుల ప్రాజెక్టు లలో త్రాగు నీరు సరఫరాకు వీలుగా వాటర్ లెవల్స్ మెయింటైన్ చేయాలని, దీనికి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేస్తూ ఉండాలని అన్నారు. త్రాగు నీటి సరఫరా సంబంధించి లీకేజిలు, పంప్ మరమ్మత్తు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
🚰 మిషన్ భగీరథ నిర్వహణకు సంబంధించి ఏవైనా పనులు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రతిపాదించి ఈనెల 12 తారీఖు లోపు అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
🚰 ప్రతి మండలంలో త్రాగునీటి సరఫరా ఏ ఆవాసాలకు ఇబ్బంది అవుతుంది వివరాలు తెలుసుకొని, అక్కడ చేపట్టాల్సిన చర్యల పై నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సరఫరా లీకేజీ లను ఎప్పటికప్పుడు అరి కట్టేలా చర్యలు తీసుకోవాలని, నీటి వృధాను నివారించాలని ��న్నారు.
👉 అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో సుల్తానాబాద్ మున్సిపాలిటీ పై సమీక్షిస్తూ పట్టణంలో పురోగతి లో ఉన్న 3 ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి నీళ్ళు తీసుకునేలా పనులను పూర్తి చేసి ఫిబ్రవరి 28 నాటికి వాటి నుంచి త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
👉 ఈ సమీక్షా సమావేశంలో ఈ ఈ ఇంట్రా గంగాధర శ్రీనివాస్ , ఈ ఈ గ్రిడ్ పూర్ణచందర్ , డి. ఈ లు , ఏ. ఈ .లు ,సంబంధిత అధికారుల��, తదితరులు పాల్గొన్నారు.
This year we at #MissionBhagiratha are dedicated to revisit our last mile drinking water connectivity 💧
Our effort is to ensure that not a single home in rural #Telangana is left untouched by Mission Bhagiratha ✊🏼
Looking forward to another year of serving our state pure & safe drinking water.
Happy New year 2024 🎉🎊
@SmitaSabharwal@seethakkaMLA@TelanganaCMO
Honb’le Minister for PR & RD, RWS Smt Danasari Anasuya Seethakka ma’am has conducted a review meeting with #MissionBhagiratha Secy Smita Sabharwal, Engineer-in-Chief Sri G. Krupakar Reddy and Chief Engineers.
We at #MissionBhagiratha are honored to be part of her team ✊🏼
@seethakkaMLA@SmitaSabharwal
Team #MissionBhagiratha staying ahead of the game by restoring water supply in flood effected Morancha village in no time!
Hon'ble MLA of Jayashankar Bhupalpally Sri.Gandra Venkatramanareddy garu has been closely monitoring water supply situation in the village.
@SmitaSabharwal@EDRBRS
Water💧 is life's matter and matrix, mother and medium.
Cause of peace & at times the cause of war !
We at @mb_telangana take each Sarpanch's feedback seriously with intent to serve better 🙂
#teamworkmakesthedreamwork
Old pics from a decade back, as Collector Karimnagar. ( Gopalraopali, Sircilla )
A reminder of how today, #Telangana has changed!
🙂 Happy to have the opportunity to head #MissionBhaghirath- a lifeline of piped water supply to 1 crore+ homes, today.
#TriumphantTelangana
@Srinivas940@mb_telangana@SmitaSabharwal వాటర్ ట్యాంక్ ని కూల్చివేసిన తరువాత కూడా మిషన్ భగీరథ నీటిని ప్రత్యామ్నాయ పద్ధతి��ో సరఫరా చేయడం జరుగుతుంది. ఇంకనూ ఎటువంటి నీటి సమస్య ఉన్నాను 9100120575 ,ఉప కార్యనిర్వాహక ఇంజనీర్, పెద్దపల్లి గారిని సంప్రదించగలరు.
హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని @mb_telangana కార్యాలయంలో రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటంకంగా నిర్వర్తించాల్సిన మంచినీటి సరఫరా పై మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ENC, CE లు, EE లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.