కొండారెడ్డిపల్లి..
సామాన్యుడి నుంచి సీఎంగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన శక్తివంతమైన నేల..
నా కొండారెడ్డిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ శుభవేళ..
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా, అన్ని విధాలా ఆశీస్సులు అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ...
జన్మనిచ్చిన గడ్డపై... దసరా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం.
#Dussehra #kondareddypalli
TRAP CASE - CIU
AO-1: Batuka Srinivasulu, Mandal Surveyor
AO-2: B Sudershan Reddy, Tahsildar of Abdullapurmet Mandal, Rangareddy Dist were caught by ACB, CIU when AOs demanded and accepted bribe amount of Rs. 20,00,000/-.
(Full details are in Press Note)
పురుగుల మందు తాగి చావలేదా??..అని రైతుని అంటున్న ఈ గజ్వేల్ ఎమ్మార్వోని సస్పెండ్ చేశారు . ఇలాంటి ఇడియట్ ను కేవలం సస్పెన్షన్ తో సరిపెట్టొద్దు .. అక్రమాస్తుల చిట్టా బయటకు తీయండి .రైతు అంటే అంత చులకన భావన ఎందుకు ??
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
వారణాసి - ఒక కొత్త ప్రపంచం
#Varanasi గతంలో #SSRajamouli తెరకెక్కించిన సినిమాలన్నింటినీ మించే స్థాయి, వైభవంతో రాబోతోంది. ఇది సాధారణ సినిమా కాదు. టైమ్-ట్రావెల్ అడ్వెంచర్. కథలోని పాత్రలు ఒక ఖండం నుంచి మరో ఖండానికి మాత్రమే కాదు… చరిత్రలోని ఎన్నో కాలాల్లోకి ప్రయాణించబోతున్నారు. అందులో రామాయణ కాలం కూడా ఉంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో ఒక కొత్త భాషను కూడా సృష్టిస్తున్నారు.
“వారణాసి” కోసం ఒక భాషా నిపుణుడిని ప్రత్యేకంగా నియమించారు. చరిత్రలోని ఒక టైమ్-ట్రావెల్ ప్రయాణంలో పాత్రలు ఈ కొత్త భాషను ఎదుర్కొంటాయి.
ఆ సీక్వెన్స్‌లో పాత్రలు ఒక గుహలోకి ప్రవేశిస్తాయి. ఆ గుహ గోడలపై ఒక ప్రాచీన లిపిలో రాతలు ఉంటాయి. వాటిలో దాగి ఉన్న రహస్యాలను అర్థం చేసుకోవాలంటే… ముందుగా ఆ లిపిని, ఆ భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది.
ఒక కొత్త భాషను సృష్టించడం అంటే కొన్ని కొత్త పదాలు రాసేయడం కాదు. దానికి ప్రత్యేకమైన లిఖిత లిపి, వ్యాకరణం, వాక్య నిర్మాణం, పూర్తి నియమ నిబంధనలు కావాలి. ఇంతటి ప్రపంచాన్ని సృష్టించడం చిన్న విషయం కాదు. ఇదివరకు #Baahubali కోసం కిలికి భాషను సృష్టించిన జక్కన్న ఇప్పుడు మరోసారి అంతకుమించిన ప్రభావం ఉండే కొత్త భాషను వారణాసి కోసం సృష్టిస్తున్నారు.
తెరపై ఆ ఎపిక్ అనుభవం ఎలా ఉంటుందో చూసి తీరాల్సిందే!!
#MaheshBabu
#Prithviraj
#PriyankaChopra
ఓదెల, 2026 అక్టోబర్-06:
---------------------------------------
భూ-భారతి రీ-సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి భూమి హద్దులను ఖచ్చితంగా నిర్ధారించి, సమగ్ర భూ రికార్డులను రూపొందించనున్నట్లు *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు. రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా రైతులు, ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* తెలంగాణ ప్రాంతంలో చివరిసారిగా 1937లో భూ సర్వే జరిగిందని తెలిపారు. అనేక సంవత్సరాల అనంతరం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో సమగ్ర రీ-సర్వే నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
భూముల హద్దులు, రికార్డులలో మార్పులతో సమస్యలు
గతంలో ఒక సర్వే నంబర్లోని భూమి ఒకే వ్యక్తి వద్ద ఉండేదని, కాలక్రమేణా కొనుగోళ్లు, అమ్మకాలు, వారసత్వ బదలాయింపులు తదితర కారణాలతో భూములు అనేక చేతులు మారాయని తెలిపారు.
పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మార్పులు జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించిన ఖచ్చితమైన మ్యాప్ అందుబాటులో లేకపోవడం వల్ల భూముల విస్తీర్ణంలో తేడాలు, హద్దులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చేయడమే సమగ్ర రీ-సర్వే ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఖచ్చితమైన హద్దులను నిర్ధారిస్తామని చెప్పారు.
*పెద్దపల్లి జిల్లాలో తొలి దశలో 70 గ్రామాల్లో రీ-సర్వే*
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 190 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, మొదటి దశలో 70 గ్రామాలను రీ-సర్వే కోసం ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ గ్రామాల్లో ఇందుర్తి కూడా ఒకటని పేర్కొన్నారు.
రీ-సర్వేలో భాగంగా ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, అనంతరం ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులు, వ్యవసాయ భూములను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేస్తామని తెలిపారు. ఆధునిక సర్వే పరికరాల సహాయంతో భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించి సమగ్ర భూ రికార్డులను రూపొందిస్తామని వెల్లడించారు.
సర్వే అనంతరం 21 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
రీ-సర్వే పూర్తయిన అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రజల పరిశీలనకు ప్రకటిస్తామని తెలిపారు. భూ వివరాలపై ప్రజలకు 21 రోజుల గడువు ఇస్తామని, ఈ సమయంలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది భూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి భూధార్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో భూములకు సంబంధించిన వివరాలు సులభంగా గుర్తించేందుకు, భూ హక్కులకు భద్రత కల్పించేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
*పైలెట్ ప్రాజెక్టులో 99 శాతం సమస్యల పరిష్కారం*
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వే ద్వారా సుమారు 99 శాతం భూ సమస్యలను పరిష్కరించగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు. భూముల విస్తీర్ణం, హద్దులు, ఇతర భూ సంబంధిత సమస్యలకు రీ-సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ-భారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే అనేక భూ సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రీ-సర్వే ద్వారా రూపొందించే ఖచ్చితమైన భూ రికార్డులు భూ-భారతి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
*రోజుకు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే*
రీ-సర్వేలో భాగంగా రోజుకు సుమారు 40 నుంచి 50 ఎకరాల వరకు సర్వే నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. ఏ భూములను, ఏ సమయంలో సర్వే చేయనున్నారనే సమాచారాన్ని ముందుగానే సంబంధిత రైతులకు తెలియజేస్తామని చెప్పారు.
సంబంధిత రైతులు నిర్దేశిత సమయంలో తమ భూముల వద్ద అందుబాటులో ఉండి సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.
భూములకు సంబంధించిన పత్రాలు, వివరాలతో రైతులు అందుబాటులో ఉండటం వల్ల సర్వే ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుందని తెలిపారు.
రీ-సర్వే ద్వారా రూపొందించే భూ వివరాలు రాబోయే
60 నుంచి 70 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా పకడ్బందీగా రూపొందించనున్నట్లు తెలిపారు. ఆధార్ తరహాలో భూమికి ప్రత్యేక గుర్తింపుగా భూధార్ కార్డుల జారీకి ఈ రీ-సర్వే కీలకమని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేలా ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
రీ-సర్వే సమయంలో అధికారులు, సర్వే సిబ్బందికి రైతులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని, భూ వివరాలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత ప్రక్రియలో వాటిని తెలియజేయాలని సూచించారు.
"#Varanasi స్టంట్స్ అయితే మామూలుగా ఉండవు… చాలా క్రేజీగా, ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయి. మీరు ‘RRR’, ‘బాహుబలి’లో చూసిన యాక్షన్‌లా మాత్రం అస్సలు ఉండవు. ఇది పూర్తిగా కొత్త తరహా యాక్షన్. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చునేలా చేస్తుంది."
– #SSKarthikeya
**పెద్దపల్లి, 2026 సెప్టెంబర్ 29:**
----------------------------------------------
**సెప్టెంబర్ 30లోగా డిజిటల్ పంటల సర్వే పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష**
**ప్రతి రైతు సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి**
**డిజిటల్ పంటల సర్వే లేక ఏ ఒక్క రైతు కూడా సన్న రకం ధాన్యం బోనస్ కోల్పోకూడదు**
**రైతులతో సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వేను పూర్తి చేయాలి**
**డిజిటల్ పంటల సర్వేపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్**
----------------------------------------------
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో డిజిటల్ పంటల సర్వేను వేగవంతం చేసి, సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని మండలాల డిజిటల్ పంటల సర్వేపై సంబంధిత అధికారులతో మండల
వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులతో సమీక్షా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న డిజిటల్ పంటల సర్వే పురోగతి, రైతుల సాగు వివరాల ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిజిటల్ పంటల సర్వేను నిర్వహించాలని సూచించారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంట వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సెప్టెంబర్ 30లోగా పూర్తిచేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ పొందేందుకు డిజిటల్ పంటల సర్వే వివరాలు కీలకమని తెలిపారు. డిజిటల్ పంటల సర్వే పూర్తికాకపోవడం వల్ల సన్న రకం ధాన్యం సాగు చేస్తున్న ఏ ఒక్క రైతు కూడా బోనస్ కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రైతుకు సంబంధించిన పంట వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏఈఓలు, వ్యవసాయ అధికారులు రైతులతో సమన్వయం చేసుకుంటూ డిజిటల్ పంటల సర్వేను నిర్వహించాలని ఆదేశించారు. రైతుల నుంచి అవసరమైన వివరాలను సేకరించి, సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మండలాల వారీగా సర్వే పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా జాప్యం ఉంటే వెంటనే గుర్తించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎంపిక చేయబడిన వాలంటీర్లను పర్యవేక్షిస్తూ,ప్రభుత్వ నిర్దేశిత గడువులోగా డిజిటల్ పంటల సర్వేను పూర్తిచేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారులు,వ్యవసాయ విస్తరణ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
TRAP CASE - KARIMNAGAR RANGE
Daroju Padma, CDPO (Child Development Project Officer), Metpally, Jagtial District was caught by ACB, Karimnagar unit while AO demanding and accepting a bribe amount of Rs. 63,000/-.
(Full details are in Press Note)
లంచాలు కూడా ఈఎంఐల రూపంలో తీసుకుంటున్న మేడమ్ గారు
జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున 3 నెలలకు రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మ గారు
డీఎస్పీ భీమ్‌రెడ్డి రూ.300 కోట్ల అక్రమాస్తులు - అసలు బినామీ ఎవరు ?
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి పేరిట వెలుగుచూసిన వందల కోట్ల ఆస్తులు కేవలం ఐస్‌బర్గ్ కొన మాత్రమే! జుబ్లీహిల్స్, పుప్పాలగూడల్లో ఏసీబీ గుర్తించిన 8 మంది బినామీల వేటతో అసలు నెట్వర్క్ గుట్టు రట్టవుతోంది.
లగ్జరీ విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, సాండ్ మైనింగ్ కాంట్రాక్టులు కేవలం డీఎస్పీ జీతంతో సాధ్యం కావు. లంచాలతోనూ సాధ్యం కావు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక కీలక రాజకీయ నాయకుడు, ఓ పోలీస్ ఉన్నతాధికారి నల్లధనాన్ని భీమ్‌రెడ్డి ద్వారా రూటింగ్ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈడీ ,ఇన్కంట్యూక్స్ ఎంట్రీతో తెరవెనుక ఉన్న ఆ బినామీ యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
భీమ్‌రెడ్డి నోరు విప్పితే తెలంగాణ ఖాకీ, రాజకీయ వర్గాల్లో భారీ ప్రకంపనలు తప్పకపోవచ్చు.
#DSPBheemReddy #ACB