మేము ఎంత బాధపడినా కూడా #HighCourtOrdes ఉంటే తప్ప మాకు న్యాయం చేయలేము అన్నారు .
2 సంవత్సరాలుగా మేము పడే కష్టంతో మేము మరియు మా తల్లదండ్రులు కూడా మానసికంగా చనిపోతున్నాము సార్ కావున మాయందు దయతలచి కోర్టు ఉత్తర్వులను త్వరగా అమలుపరిచి మా జీవితాలలో వెలుగును ప్రసాదించండి సార్ 🙏😭 .
గౌరవనీయులు @TelanganaCMO@KTRTRS@trsharish@RaoKavitha @SabithaindraTRS గత 2 సంవత్సరాల నుండి మేము ఎన్నో కష్టాలు పడి హైకోర్టు నుండి ఉత్తర్వులు పొందాము కావున మాయందు దయతలచి త్వరగా అమలుపరిచే విధంగా @TSEduDept మరియు @TSPSCofficial వారిని అదేశించగలరని ప్రార్థిస్తున్నాము 🙏 .
గౌరవనీయులు @TelanganaCMO@KTRTRS@trsharish@RaoKavitha @SabithaindraTRS గత 2 సంవత్సరాల నుండి మేము ఎన్నో కష్టాలు పడి హైకోర్టు నుండి ఉత్తర్వులు పొందాము కావున మాయందు దయతలచి త్వరగా అమలుపరిచే విధంగా @TSEduDept మరియు @TSPSCofficial వారిని అదేశించగలరని ప్రార్థిస్తున్నాము 🙏 .
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అన్ని శాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలన్నారు.
రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది.
ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్ట్ రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం: సీఎం
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
➧ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్ చర్చించింద. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.
➧ హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
➧ తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లే-అవుట్లలో, లాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలనే అంశంపై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టి సారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది.
➧ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు 50శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించింది
➧ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంకు చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది.
➧ అన్నిరకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక నియామక కేలెండర్’ (Annual Recruitment Calendar) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.
➧ ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది.
➧ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఆయా జిల్లాల్లో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.