.@ncbn గారూ… మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
చంద్రబాబుగారూ మీ హయాంలో ఇళ్ల పట్టాలూ ఇవ్వక, ఇళ్లూ కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కాని మేము వారి సొంతింటి కలను నిజం చేసేలా “పేదలందరికీ ఇళ్లు’’ కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. ఇందులో కొనుగోలుకే రూ.11,871 కోట్లు ఖర్చుచేశాం. మా ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే రూ.1.5లక్షల కోట్లపైమాటే. ఇంటిపట్టావిలువే ఒక్కోచోట రూ. 2.5 లక్షల నుంచి రూ.10లక్షలు - రూ.15లక్షల వరకూ ఉంది. ఇళ్లపట్టాలకోసం, ఇళ్లకోసం ధర్నాలు, ఆందోళనలు మా ఐదేళ్లకాలంలో కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మరి చంద్రబాబుగారూ…, మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా? మీరు చేయకపోగా, మేం చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారు.
మా హయాంలో మేం 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి, మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్‌లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశాం. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించాం. చంద్రబాబుగారూ మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపేశారు? ఇది పేదల ఆశలను వమ్ము చేయడం కాదంటారా?
మా హయాంలో లబ్ధిదారులకు సిమెంటు, స్టీలు, వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపు 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించాం. ఈ రూపంలో ప్రతి లబ్ధిదారునికి రూ.40వేలు మేలు జరగడమే కాకుండా, దీంతోపాటు 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందించి మరో రూ.15వేలు సహాయం చేశాం. మరో రూ.35వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, ఆ వడ్డీ డబ్బును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డాం. ఈ రకంగా ప్రతి ఇంటికీ కేంద్రం ఇచ్చే రూ.1.8లక్షలు కాక, మొత్తంగా రూ.2.7లక్షల లబ్ధి చేకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కొరకు మరో రూ.1లక్ష కూడా ఖర్చు చేసుకుంటూ పోయాం. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు చంద్రబాబుగారూ?
చంద్రబాబుగారూ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా…, కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరకు, మురికికూపాలుగా ఉండకూడదని, నీరు, కరెంటు, డ్రైనేజీ, ఇంకుడుగుంతలు, రోడ్లు తదితర సదుపాయాలకోసం దాదాపుగా రూ.3,555 కోట్లు మా హయాంలో ఖర్చుచేశాం. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా మొత్తంగా మేం చేసిన ఖర్చు దాదాపుగా రూ.35,300 కోట్లు. ఈ 16-17 నెలల కాలంలో మీరెంత ఖర్చుచేశారు?
మా హయాంలో “పేదలకు ఇళ్లు’’ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని మీరు చేయని పన్నాగంలేదు. మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారు. అమరావతిలో 50వేల పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇస్తే, సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టుల్లో వాదించి స్టేలు తేవడమే కాకుండా, అధికారంలోకి రాగానే కర్కశంగా వ్యవహరించి ఇచ్చిన ఆ పట్టాలను రద్దుచేసి విజయవాడ, గుంటూరు నగరాల్లోని పేదలకు తీరని ద్రోహం చేశారు. మరి మీరు చేసింది ద్రోహం కాదా? పేద కుటుంబాలమీద మీరు కక్ష తీర్చుకోవడం లేదా? ఇది చాలదు అన్నట్టు, ఇక మిగిలిన పట్టాల్లో ఎక్కడైతే ఇంకా ఇళ్లు మీరు బాధ్యతగా శాంక్షన్ చేయించి, కట్టించాల్సింది పోయి, అక్కడ ఇంకా ఇళ్లు కట్టలేదు కాబట్టి, వాటిని, రిజిస్టర్ అయిన ఆ పట్టాలను, మీకు హక్కులేకపోయినా వెనక్కి తీసుకుని, మీ స్కాముల కొరకు, ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కులు కడతాం అంటూ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటుగా లేదా, చంద్రబాబుగారూ..!
ఈ 16-17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తే సున్నా. మీరు అధికారంలోకి వస్తే మాకు మించి ఇస్తామన్నారు. కాని, ఇప్పటివరకూ ఒక్క ఎకరం గుర్తించలేదు, ఒక్క ఎకరం కొనలేదు. ఏ ఒక్కరికీ పట్టాకూడా ఇవ్వలేదు. ఎవ్వరికీ ఇల్లుకూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇచ్చినవాటిని లాక్కునే దిక్కుమాలిన పనులు చేస్తున్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను లాక్కుంటున్నారు. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలకొరకు అవసరమైతే దీనిపై న్యాయపోరాటాలు చేస్తాం, వారికి అండగా నిలబడతాం. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్‌కు కూడా పిలుపునిస్తున్నా.
1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?
2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.
3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?
4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?
5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?
6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?
7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?
8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.
9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.
Journalist Kommineni Srinivasa Rao Life Story!
విలువలు, విశ్వసనీయత, నిజాయితీకి మారుపేరు జర్నలిస్ట్ కొమ్మినేని.
అమెరికా అధ్యక్షుడు బ్లింగ్ క్లింటన్ ను కొమ్మినేని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పది అని ఈనాడు సంస్థ చెప్పారు.
రెడ్ బుక్ @naralokesh వేధింపులలో భాగంగా 50 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు గారు అరెస్ట్...
కొమ్మినేనిని విజయవాడకు తరలిస్తున్న పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా @ncbn గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.
సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి.
రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి.
April 2025 fiscal performance indicates further distress
The CAG uploaded the Monthly Key Indicators for April 2025 and these figures bring to light a very disturbing picture regarding the State finances.
On 1st May, the Government made a press release suggesting that the net GST collections of the State Government for the month of April 2025 had been the highest since the introduction of GST at Rs. 3,354 crores. Technically net GST will be subsequent to all adjustments.
The figures released by the CAG for the month of the April 2025, convey the real picture. The State GST revenues for the first month of this financial year demonstrated contraction to the tune of 24.20%, in April 2025 when compared with April 2024.
As soon as the CAG figures have become public, the Government mischievously makes one more press release suggesting that even in May month, the GST revenues were at record high. In this press release they make a mention that, in April, 2025, the Central Government deducted Rs. 796 crores on account of adjustment of advance apportionment from IGST, so GST revenues have come down.
Advance apportionment of IGST is accounted for under Minor Head 110 and is part of SGST under Major Head 0006 of Government accounts. This is a regular process and net GST revenues would be arrived at, after accounting for all these adjustments. This was the case even in the previous years. The May 1st press release says that net GST collections are Rs. 3,354 crores for April 2025. Now, they say that Rs. 796 crore is adjusted. One can clearly understand that this is nothing but a cover up after truth about the GST revenues is brought to light by the CAG.
Further, quite contrary to what the TDP Government had suggested, the figures released by the CAG indicate that the trend of economic sluggishness is more pronounced during the first month of this financial year, with the tax revenues registering a decline of 12.21% and non-tax revenues registering a fall of 22.01% over April 2024. If the State’s own revenues are taken into consideration, the fall over the previous year is 12.76%.
This indeed presents a very gloomy picture.
రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైయస్సార్సీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, పెదనెమలిపురి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారు. తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైయస్సార్సీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో లక్ష్మీనారాయణ ఈ తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ డీఎస్పీ దుర్మార్గంపై వీడియో వాంగ్మూలం ఇచ్చాడు. బాధ్యులైన వ్యక్తుల పేర్లతో లేఖ కూడా రాశాడు. ఇప్పుడు చావుబతుకుల మధ్య గుంటూరు ఆస్పత్రిలో ఉన్నాడు. లక్ష్మీనారాయణ కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనారాయణకు, ఆయన కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటుంది. @ncbn గారు ఈ ఘటనకు బాధ్యులైన డీఎస్పీ సహా మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
. @ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered?
In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government availed in five full years. This is despite the fact that during this one-year period, your Government had nothing to show for, with respect to development or welfare.
Figures released by CAG & MOSPI reveal shocking facts about the inefficient fiscal mismanagement by your Government-
1. Fiscal Deficit to GSDP rose from 4.08% → 5.12%
2. Revenue Deficit to GSDP jumped from 2.65% → 3.61%
3. Debt-to-GSDP now stands at a staggering 35.64%, despite the absence of any adverse circumstances such as the pandemic outbreak.
4. Only 23.49% of borrowings were used for capital expenditure in 2024-25, while under our governance, it was 33.25%.
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని సూచిస్తోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్ లో దాచిపెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేయకపోతే అతన్ని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? @ncbn గారూ.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంతమాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగేంతవరకూ ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం.
I am privileged to inaugurate the Raja Reddy Eye Hospital with the cooperation of LVPEI in Pulivendula today, featuring state-of-the-art facilities. This moment brings back memories of my father, who was a renowned doctor from the same hospital.
Warm greetings to Telangana's former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life.
Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .
వైయస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్ నివాళులు.
నివాళులు అర్పించిన వైయస్ విజయమ్మ, వైయస్ భారతి
వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, కడప జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పలువురు నేతలు..
#YSRVardanthi #JoharYSR
In just 50 days, this government has failed on all fronts. Law and order has collapsed, causing public fear. They couldn't even present a full budget, relying on a vote-on-account for 7 months, exposing their inability to fulfill promises. Chandrababu Naidu's government, fearing questions, creates chaos to divert attention, using violence to suppress opposition.
In the current assembly, there are only two sides: the ruling party and the opposition. Our party should be recognized as the opposition, but the government fears this. Recognizing us means giving us the right to speak in the assembly, which they want to avoid. Despite 50 days in power, Chandrababu Naidu governs in fear. His attempts to murder democracy reminds us of Shishupala’s sins, indicating that his day of reckoning is near.
I along with our party's MLAs, MLCs, and leaders am heading to Delhi on the 24th to protest and highlight the State's misrule, political murders, and violence. We will advocate for President's rule in Andhra Pradesh and continue our fight along with like minded parties.
@TimesNow@IndiaToday@ndtv@News18India@the_hindu@IndianExpress@timesofindia@thewire_in@ThePrintIndia@thenewsminute@DeccanChronicle
నా అవ్వాతాతలందరూ…
నా అక్కచెల్లెమ్మలందరూ…
నా అన్నదమ్ములందరూ…
నా రైతన్నలందరూ…
నా యువతీయువకులందరూ…
నా ఎస్సీ…
నా ఎస్టీ…
నా బీసీ…
నా మైనారిటీలందరూ…
అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!