Just came across this vedio on Insta..
Em brand tagi edit chesado kani
4 kgf lu , 4 bahubali lu chusina feel vachindhi 🥵🥵🥵
“2028 lo andharu antaru telanagna oopiri pelchuko KCR ochindu ani” 🔥🔥🔥
#KCR#BRS#BRSParty#Telanagana
శరీరానికి చిన్న గాయమైతేనే
నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..
చిన్న రక్తపు బొట్టు కారితేనే
కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..
అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..
చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..
కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
రోజంతా అలసటతో నీరసమైపోతాం..
కానీ
అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.
ఒకటవ నెలలో వికారంతో
రెండవ నెలలో వాంతులతో
మూడవ నెలలో మైకముతో
నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
ఐదవ నెలలో తల నొప్పితో
ఆరవ నెలలో కడుపు నొప్పితో
ఏడవ నెలలో నడుము నొప్పితో
ఎనిమిదవ నెలలో కంగారుతో
తొమ్మిదవ నెలలో భయంతో
పదవ నెలలో మరోజన్మతో
మనకు జన్మనిస్తుంది.
బరువైనా ఓర్పుతో భరిస్తూ
కత్తి గాట్లకు భీతిల్లకుండా
రక్తపు ధారలకు చలించకుండా
భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.
మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.
అటువంటి అమ్మకు మన జన్మంతా
ఊడిగం చేసినా ఆమె రుణం తీర్చుకోలేము.
అమ్మను ప్రేమిద్దాం!
ఆమె కంట నీరు పెట్టకుండా చూసుకుందాం!
త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే..
సాధారణంగా అందరూ చరిత్ర సృష్టిస్తారు..
కానీ మీరు ఏకంగా జియోగ్రఫీ నే సృష్టించారు..
ధైర్యవంతుడికి, సాహసవంతుడికి చాలా తేడా ఉంటుంది..
ధైర్యవంతుడు ఉన్నపళంగా ఏదైనా ప్రమాదం వాటిల్లితే దాన్ని అప్పటికప్పుడు ఎదుర్కొంటాడు..
కానీ సాహసవంతుడు, తన దారి / పోరాటం పొడవునా ప్రమాదం పొంచి వుంది అని తెలిసి, ఆ ప్రయాణం / పోరాటం విజయవంతమౌతుందో లేదో తెలియకుండా, తనని ఎంత మందికి కాలు పట్టి కిందికి లాగుతుంటారో తెలిసి, తాను ఎన్ని అవమానాలు, నిర్బంధాలు, నియంతృత్వాలు ఎదుర్కోవాల్సి వొస్తుందో తెలిసి, తాను సర్వం కోల్పోవాల్సి వొస్తుందని, అవసరం అయితే ప్రాణాలు కూడా లెక్కచెయ్యకుండా ముందుకెళ్లాల్సి వొస్తుందని తెలిసి కూడా ఆ దారి ఎంచుకొని, విజయ తీరాలకు చేరే ధైర్యవంతుడే, సాహస వంతుడు...
తెలంగాణ గడ్డ మీద పుట్టిన మలిదశ ఉద్యమ కెరటం..
తెలంగాణ కోసం అవసరం అయితే గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని పలికిన ధీరోదాత్తుడు..
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పిడికిలి బిగించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి, గల్లీ పోరాటంతో ఢిల్లీ మెడలు వంచిన అపర చాణక్యుడు..
పధ్నాలుగేళ్లు సుదీర్ఘ పోరాటాన్ని నడిపి, ఎన్నో ఢక్కా మొక్కీలు తిని, పదవులను తృణప్రాయంగా త్యజించి, నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అసలు సిసలు సాహసవంతుడు..
పదేళ్ల పాలనతో బంగారు తెలంగాణకు పునాదులు వేసిన దార్శనికుడు..
దేశంలో ప్రతి రాష్ట్రానికి పరిపాలన అంటే ఏంటో తెలుసుకునేలా తెలంగాణను ఒక కేసు స్టడీ లా మార్చిన అసలు సిసలు అడ్మినిస్ట్రేటర్...
గౌరవనీయ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..❤️❤️🙏🙏😍
మీ ఓటమి తాత్కాలికం..
మీ పునరాగమనం కొన్ని అడుగుల దూరం..
మీరు మొదలెట్టిన బంగారు తెలంగాణ యాగ సమాప్తం ఇక కేవలం లాంఛనం.. ✊✊🔥🔥
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ..🙏🙏
జై కేసీఆర్..❤️✊🔥
జై తెలంగాణ..✊🔥🔥
#HappyBirthdayKCRSir
#HappyBirthdayKCR
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన.
కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం.
కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం.
యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం.
మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.
ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు.
నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.
ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం...
మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#KCR