ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించి పారిపోయిన ప్రభుత్వం కాదు ఇది.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు (సచివాలయ) ఇచ్చిన ప్రభుత్వం మనది.
ఐదేళ్ల కాలంలో కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగలిచ్చి యువతను మోసం చేసిన ప్రభుత్వం కాదు ఇది. నాలుగున్నారేళ్లలో బాబుకంటే ఏడింతలు మెరుగ్గా 2.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగలిచ్చి చిత్తశుద్ధి చాటుకున్న ప్రభుత్వం ఇది.
నిరుద్యోగులకు రూ. 2వేలు భృతి ఇస్తామని ఎన్నికలకు ఆరునెలలు ముందు టీడీపీ కార్యకర్తలకు రూ. 1000 ఇచ్చి వంచించిన ప్రభుత్వం కాదు ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువతను సమాజ సేవలో భాగం చేసిన ప్రభుత్వం ఇది.
విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు ప్రపంచ స్థాయి విద్యను దగ్గర చేశాం. పోటీప్రపంచంలో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తోన్న ప్రభుత్వం ఇదని గర్వంగా చెబుతున్నాం. దీంతో పాటుగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. కరోనా కష్టంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఎల్లో మీడియా మాయలో మోసం చేసే వ్యక్తులను నమ్మవద్దని ప్రజలకు మనవి చేస్తున్నాను.
@BotchaBSN ఇన్ని ఉద్యోగాలు వదిలిన వారు మరో 15000 వేలు ఉద్యోగాలు వదిలి లేరా? సమాజానికి ఎంతో ఉపయోగకరమైన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం భవిష్యత్ తరాలను నాశనం చేయడం వంటిదికాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి