Student Activist in University of Hyderabad🧑🎓 Fighting for BC Rights & Social Justice | Upholding Constitutional Values | Mudiraj Social Justice Advocate
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల ఆరాధ్య దైవం ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి నేడు. కానీ , తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు @BRSparty@INCTelangana@BJP4Telangana ముదిరాజులను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగా, ఓట్లు వే��ే యంత్రాలుగానే చూస్తున్నాయి. కనీసం పండుగ సాయన్న జయంతి రోజు నివాళి కూడా అర్పించే ప్రయత్నం చెయ్యడం @KTRBRS @revanth_anumula @bandisanjay_bjp @PawanKalyan లేదు. ఇదేనా మీరు చెప్తున్న సామాజిక న్యాయం.
హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి
మత్స్యకారుల హక్కుల సాధన కోసం జూలై 18న మత్స్య శాఖ ముట్టడి
హైదరాబాద్, జూలై 7: తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రమాద బీమా పరిహారం చెల్లింపు, బీమా విధానంలో మార్పులు తీసుకురావాలనే డిమాండ్లతో ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ ఆధ్వర్యంలో 2026 జూలై 18 (శనివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మత్స్య భవన్, 4వ అంతస్తు, శాంతి నగర్, రోడ్ నెం.4, మసాబ్ ట్యాంక్ వద్ద “హలో ముదిరాజ్ – ఛలో మత్స్య శాఖ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
వారు మాట్లాడుతూ, 2019 నుండి 2025 వరకు తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,475 మంది మత్స్యకారులు ప్రమాదాల్లో మరణించగా, అందులో కేవలం 804 మంది కుటుంబాలకు మాత్రమే ప్రమాద బీమా పరిహారం అందిందని, మిగిలిన 671 కుటుంబాలు ఇప్పటికీ న్యాయమైన పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మిగిలిన కుటుంబాలకు పరిహారం చెల్��ించాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రూప్ ప్రమాద బీమా విధానాన్ని రైతు బీమా తరహాలో వ్యక్తిగత ప్రమాద బీమాగా మార్చాలని, ప్రతి అర్హ మత్స్యకారుడికి బీమా రక్షణ కల్పించాలని కోరారు.
ప్రస్తుతం ప్రతి సంవత్సరం బీమా పునరుద్ధరణలో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ప్రమాద బీమా పథకాన్ని ఆటోమేటిక్ రిన్యువల్ విధానంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన నిర్వాహకులు, తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారులు, ముదిరాజ్ సంఘాల నాయకులు, యువత, మహిళలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్లు
* 2019–2025 మధ్య మరణించిన మత్స్యకారులలో ఇంకా పరిహారం అందని 671 కుటుంబాలకు వెంటనే ప్రమాద బీమా పరిహారం చెల్లించాలి.
* మత్స్యకారుల ప్రమాద బీమాను గ్రూప్ బీమా కాకుండా రైతు బీమా తరహాలో వ్యక్తిగత బీమాగా మార్చాలి.
* ప్రమాద బీమా పథకాన్ని ఆటోమేటిక్ రిన్యువల్ విధానంలో అమలు చేయాలి.
కార్యక్రమం వివరాలు:
* తేదీ: 18-07-2026 (శనివారం)
* సమయం: ఉదయం 11:00 గంటలకు
* వేదిక: మత్స్య భవన్, 4వ అంతస్తు, శాంతి నగర్, రోడ్ నెం.4, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్.
* ఆధ్వర్యం: ముదిరాజ్ చైతన్య వేదిక – తెలంగాణ
* సంప్రదించవలసిన నంబర్: 9963240519
@BRSparty
@INCTelangana
@BJP4Telangana
@TelanganaCMO
@KTRBRS
@BRSHarish
@revanth_anumula
@RSPraveenSwaero
@RaoKavitha
@TeenmarMallanna
@JSPTelangana
@JSFisheries
@FisheriesGoI
Mudiraj Chaitanya Vedika to Lay Siege to Fisheries Department Over Alleged Misuse of Fishermen Welfare Funds
Hyderabad, July 8, 2026:
Mudiraj Chaitanya Vedika – Telangana has announced a protest, “Hello Mudiraj – Chalo Fisheries Department Muttadi,” demanding accountability and transparency in the utilization of funds allocated for the welfare and development of traditional fishermen.
The organization alleged that despite the allocation of huge public funds over the past decade, the socio-economic condition of traditional fishermen in Telangana has seen little improvement.
According to the organization:
The Central Government allocated ₹223 crore between 2014 and 2025 for the welfare and development of fishermen.
Around ₹1,000 crore was reportedly sanctioned under the Integrated Fisheries Development (IFD) Scheme during 2017–18.
The Telangana Government reportedly spent nearly ₹700 crore between 2016 and 2026 for fish seed distribution across the State.
The organization questioned the utilization of these funds and asked:
Where did these hundreds of crores go?
How much of these funds actually reached the fishermen?
Who is responsible for the alleged misuse of public money?
Mudiraj Chaitanya Vedika demanded an independent inquiry into the implementation of fisheries welfare schemes, fish seed distribution, tender processes, and the role of contractors and officials. The organization alleged that corruption and irregularities have deprived traditional fishermen of the benefits intended for them.
As a mark of protest against the alleged corruption and misuse of government funds, the organization has called upon fishermen, Mudiraj community members, youth, women, and social organizations across Telangana to participate in a peaceful siege (Muttadi) of the Fisheries Department.
Protest Details
Programme: Hello Mudiraj – Chalo Fisheries Department Muttadi
Date: Saturday, 18 July 2026
Time: 11:00 AM
Venue:
Matsya Bhavan, 4th Floor,
Shanti Nagar, Road No. 4,
Masab Tank, Hyderabad.
The organization urged all traditional fishermen and members of the Mudiraj community to join the protest in large numbers to demand transparency, justice, and accountability in fisheries welfare schemes.
Issued by:
Mudiraj Chaitanya Vedika – Telangana
Contact: 9963240519
#HelloMudiraj
#ChaloFisheriesDepartment
#Muttadi2026
#JusticeForFishermen
#SaveTraditionalFishermen
#StopFisheriesCorruption
#WhereDidTheMoneyGo
#PublicMoneyPublicAccountability
#ShivaMudiraj
@PMOIndia@MSJEGOI@Min_FAHD
@JSFisheries
@JSFisheries
@INCTelangana@TelanganaCMO@BJP4Telangana@BRSparty@RaoKavitha@revanth_anumula@JSPTelangana
ముదిరాజ్ జాతి ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయాన్ని కోసం సరికొత్త ఉద్యమానికి శ్రీకారం. రండి కలిసి కొట్లాడుదాం. మన హక్కులను కాపాడుకుందాం.
ముదిరాజ్ చైతన్య వేదిక – 5 ప్రధాన లక్ష���యాలు
1. విద్యా సాధికారత
2. ఉపాధి & ఆర్థిక అభివృద్ధి
3. మత్స్యకారుల హక్కుల పరిరక్షణ
4. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం & సాంస్కృతిక విప్లవం
5. రాజకీయ సాధికారత & ఐక్యత
#MudirajVoice
#Mudiraj
#ShivaMudiraj
#Telangana
@BRSparty @BJP4Telangana @INCTelangana @TJagruthi @CJP_2029 @TeenmarMallanna @VisharadanDr
Hon’ble Shri @RahulGandhi Ji, Hon’ble Shri @kharge Ji, Shri @kcvenugopalmp Ji, Hon’ble Smt. @priyankagandhi Ji, Hon’ble Shri @revanth_anumula ji , the @INCIndia, and the @INCOBCDept of Congress, @maheshgoudbomma ji, @_YogendraYadav Ji.
The Mudiraj community, the largest BC community in Telangana with a population of over 26 lakh, continues to live in severe backwardness. According to the SEEEPC Caste Survey 2024 conducted by the Telangana Government, Mudirajs stand at 94th position in the Composite Backwardness Index (CBI), despite being the largest BC community in the state.
The survey exposes alarming realities, 90% school dropout rate, 70–80% child marriages among girls, only 1–2% representation in government jobs, and nearly 35% of families lacking electricity and toilets. These figures clearly reveal the deep social, educational, economic, and political inequalities faced by the community.
A community that stands 1st in population should not remain last in development. We request immediate action for BC-A classification, proper political representation, quality education, employment opportunities, basic infrastructure, and allocation of special funds for the Mudiraj Development Corporation.
The SEEEPC Survey findings must become the basis for policy reforms and social justice in Telangana. We hope the Congress leadership and OBC Department will stand with the Mudiraj community and ensure justice, dignity, and equal opportunities.
#Mudiraj #BC #Telangana #SocialJustice #SEEEPC #OBC #RahulGandhi #Congress #ShivaMudiraj
ముదిరాజులు ఇంత పేదరికంలో బ్రతుకుతున్నారా?
భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత సాంఘిక మరియు విద్యా వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి మొదటిసారిగా 1953లో కాలేకర్ కమిషన్, తర్వాత 1980లో మండల్ కమిషన్ నిర్వహించబడ్డాయి. కానీ ఈ సర్వేలు సమగ్రమైనవి కావు, కేవలం కొన్ని పరిమాణాత్మక అంశాలకే పరిమితమయ్యాయి. 2024లో తెలంగాణ రాష్ట్ర ప���రభుత్వం నిర్వహించిన SEEEPC సర్వే ఈ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి.
ఈ సర్వే 75 రంగాలలో, 42 పారామీటర్ల ఆధారంగా, ప్రాంతం, విద్య, వ���త్తి, ఆస్తులు, జీవన ప్రమాణాలు, రాజకీయ ప్రాతినిధ్యం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలను విస్తృతంగా అధ్యయనం చేసింది. ఈ సర్వే ఆధారంగా రూపొందించిన Composite Backwardness Index (CBI) ప్రతి కులానికి అది ఎంత వెనుకబడి ఉందో కొలిచే సమగ్ర సూచిక. (అయితే ఇందులో కొన్ని లోపాలు, బలమైన అభ్యంతరాలున్నాయి. )
ఈ నేపథ్యంలో ముదిరాజ్ సమాజ స్థితి గురించి SEEEPC సర్వే వెల్లడించిన గణాంకాలు అత్యంత ఆందోళనకరంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ వ్యాసం, ఆ అంశాలను లోతుగా పరిశీలిస్తుంది.
తెలంగాణలో ముదిరాజ్ సమాజం జనాభా 26 లక్షల 36 వేల 641. రాష్ట్రంలోని BC కులాల్లో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం. అయినప్పటికీ, SEEEPC సర్వే ఆధారంగా రూపొందించిన Composite Backwardness Index (CBI) లో ముదిరాజులు 94వ స్థానంలో ఉన్నారు.
ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులకు, రాజకీయ ప్రసంగాలకు మధ్య ఘోరమైన వైరుధ్యాన్ని, అగాధాలను చూపుతున్నాయి. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న సమాజం, అభివృద్ధిలో అట్టడుగున ఉంది. గత 75 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాల వైఫల్యాలకు అద్దంపట్టే వాస్తవాలు.
SEEEPC సర్వే ప్రకారం తెలంగాణలో ముదిరాజ్ సమాజంలో పాఠశాల విద్య అర్ధంతరంగా మానేసే రేటు 90 శాతం. అంటే, ప్రతి వంద మంది పిల్లలలో 90 మంది పాఠశాల విద్య పూర్తి చేయకుండానే వదిలేస్తున్నారు. ఇది భారతదేశ జాతీయ స్కూల్ డ్రాపౌట్ రేటు (14.5%) కంటే ఆరు రెట్లు అధికం. ఆర్టికల్ 21-A (86వ సవరణ, 2002) 6 ���ుండి 14 సంవత్సరాల వయసున్న ప్రతి పిల్లవాడికి ఉచిత మరియు నిర్బంధ విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా పేర్కొంటుంది. Right to Education Act, 2009 ఈ హక్కును మరింత బలోపేతం చేసింది. కానీ ముదిరాజ్ సమాజంలో 90% డ్రాపౌట్ రేటు ఈ రాజ్యాంగ హక్కు కేవలం కాగితంపై మాత్రమే ఉందని రుజువు చేస్తోంది.
పాఠశాల వదిలిన పిల్లలు అత్యధికంగా బాలకార్మికులుగా మారుతున్నారు. ముదిరాజ్ సమాజంలో ప్రతి ��క్ష మందిలో 85,000 నుండి 90,000 మంది బాలకార్మికులుగా జీవిస్తున్నారు. వివిధ కంపెనీలు, కర్మాగారాలు, ఉన్నత వర్గాల ఇళ్లలో పాలేర్లుగా, రోజువారీ కూలీలుగా వెట్టి చాకిరీ చేస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న సమాజంగా SEEEPC సర్వే ముదిరాజ్ కులాన్ని గుర్తించింది. ముదిరాజ్ సమాజంలో ప్రతి వంద అమ్మాయిలలో 70 నుండి 80 మందికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, గత 10 ఏళ్లలో తెలంగాణ తలసర��� ఆదాయం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెట్టింపు స్థాయిలో పెరిగిందని, తెలంగాణలో 2025-26లో 4.18 లక్షలకు చేరుకుందని రాజకీయ పార్టీలు గర్వంగా చెప్పుకుంటున్నాయి. కానీ వాస్తవంగా చూస్తే , ముదిరాజ్ కులంలో ప్రతి వంద కుటుంబాలలో కనీసం 80 కుటుంబాలు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కూడా సంపాదించడం లేదు. అంటే నెలకు సగటున 8,333 రూపాయలు, హైదరాబాద్ వంటి నగరంలో ఒక పూటకు తిండి కూడా కష్టమే.
ముదిరాజ్ కుటుంబం(కులం)లో ��వరైనా అనారోగ్యంతో బాధపడినా, ఆడబిడ్డ పెళ్లి చేయాల్సి వచ్చినా , భూమి అమ్మి అయినా వైద్యం చేయించాలి, లేదా అప్పుల పాలు అయ్యి కూతురు పెళ్లి చేయాలి. ఇది 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం కూడా ముదిరాజ్ కుటుంబాల వాస్తవ స్థితి.
SEEEPC సర్వే 2024 ఈ నిర్ఘాంతపోయే నిజాలు వెల్లడించిన తర్వాత కూడా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం (తెలంగాణ) గానీ, ప్రతిపక్షాలు BRS, BJP, DSP, TRS, TRP, BSP, TDP, జనసేన లాంటి పార్టీలు ముదిరాజ్ సమాజ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకటించలేదు. ఇది కేవలం రాజకీయ నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది రాజ్యాంగ బాధ్యతను విస్మరించడం.
వ్యాసకర్త:
డాక్టర్ వై. శివ ముదిరాజ్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ
ఫోన్ నెంబర్: 9963240519
#ShivaMudiraj
#mudirajrights
#mudirajvoice
#OBC
#castecensustelangana
@BRSparty @KTRBRS @TelanganaCMO @RaoKavitha @BJP4Telangana @INCTelangana @revanth_anumula@INCIndia @TJagruthi @hema_samala @RSPraveenSwaero @VisharadanDr @TeenmarMallanna @MothaRohit
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి��� కుల గణన సర్వేపై సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి గారి ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న డాక్టర్ వై. శివ ముదిరాజ్ గారు మాట్లాడుతూ, గత 75 సంవత్సరాలుగా తెలంగాణలో బీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు మరియు రాజకీయ రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతోందని తెలిపారు. బహుజన వర్గాలను కేవలం ఓటు బ్యాంక్‌లుగా మాత్రమే చూసిన పరిస్థితులను ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన సర్వే ద్వారా బీసీల నిజమైన జనాభా వివరాలు వెలుగులోకి రావడంతో, రాష్ట్రంలో ఉన్న సామాజిక అసమానతలు మరియు వాస్తవ పరిస్థితులు స్పష్టమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేకంగా అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సమాజానికి జరిగిన అన్యాయాలను ప్రస్తావిస్తూ, వారికి తగిన న్యాయం మరియు అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఈ సమావేశంలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బీసీ, బహుజన వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#CasteCensusTelangana
#BCJustice
#BahujanRights
#SocialJustice
#TelanganaBCs
#MudirajRights
#ShivaMudiraj
#MudirajVoice
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@KTRBRS
@RaoKavitha
@TeenmarMallanna
@VisharadanDr
@hema_samala
@MothaRohit
@TelanganaCMO
ప్రెస్ నో��్
ముదిరాజ్ చైతన్య వేదిక – ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ, ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని ముదిరాజ్ చైతన్య వేదిక తీవ్రంగా విమర్శించింది. ముదిరాజ్ వర్గ హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం “హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ యువత, నాయకులు, బీసీ మరియు బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
📅 తేదీ: ఏప్రిల్ 10
⏰ సమయం: ఉదయం 11 గంటలకు
📍 స్థలం: గాంధీ భవన్, హైదరాబాద్
ప్రధాన డిమాండ్లు:
• కోకాపేట్ భూమిపై ఉన్న ట్రస్ట్‌ను రద్దు చేసి ముదిరాజ్ జాతికి అంకితం చేయాలి
• మత్స్యశాఖ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి
• సంబంధిత ప్రజాప్రతినిధులపై ఉన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఈ కార్యక్రమంలో ఇతర బీసీ, బహుజన సంఘాలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని, ముదిరాజ్ హక్కుల కోసం ఇది కీలక పోరాటమని వేదిక పేర్కొంది.
– ముదిరాజ్ చైతన్య వేదిక
#MudirajVoice
#justiceForMudiraj
#OBCReservation
#ShivaMudiraj
#osmania_university
#Telangana
#mudhiraj
@TelanganaCMO
@revanth_anumula
@BRSparty
@INCTelangana
@BJP4Telangana
@KTRBRS
@RaoKavitha
@VisharadanDr
@hema_samala
@MothaRohit
@Manikya06
ప్రెస్ నోట్
మక్తల్ / మహబూబ్ నగర్
ముదిరాజ్ చైతన్య వేదిక
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ, ముదిరాజ్ సామాజిక వర్గానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని ముదిరాజ్ చైతన్య వేదిక తీవ్రంగా విమర్శించింది. ముదిరాజ్ వర్గ హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం “హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్ ముట్టడి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్ నోట్ ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విడుదల చేయబడింది. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ యువత, నాయకులు, బీసీ మరియు బహుజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
📅 తేదీ: ఏప్రిల్ 10
⏰ సమయం: ఉదయం 11 గంటలకు
📍 స్థలం: గాంధీ భవన్, హైదరాబాద్
ప్రధాన డిమ���ండ్లు:
• కోకాపేట్ భూమిపై ఉన్న ట్రస్ట్‌ను రద్దు చేసి ముదిరాజ్ జాతికి అంకితం చేయాలి
• మత్స్యశాఖ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి
• సంబంధిత ప్రజాప్రతినిధులపై ఉన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఈ కార్యక్రమంలో ఇతర బీసీ, బహుజన సంఘాలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని, ముదిరాజ్ హ��్కుల సాధనలో ఇది కీలక పోరాటమని వేదిక పేర్కొంది.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జ్యోతిరావు పూలే బీసీ సంఘం అధ్యక్షుడు శ్రవణ్ గారు, అలాగే నరేష్ ముదిరాజ్, బాలు ముదిరాజ్, సంజయ్ ముదిరాజ్, అనిల్ ముదిరాజ్, రవి ముదిరాజ్ తదితర బీసీ నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
#Makthal
#MudirajVoice
#ShivaMudiraj
@TelanganaCMO
@INCTelangana
@BJP4Telangana
@BRSparty
@RaoKavitha
@KTRBRS
@revanth_anumula
@hema_samala
@MothaRohit
@VisharadanDr
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తవుతున్నా ముదిరాజ్ సమాజానికి న్యాయం లేదు.
📢 “హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్”
🗓 ఏప���రిల్ 10 | ⏰ ఉదయం 11 గంటలకు
ప్రధాన డిమాండ్లు:
• ముదిరాజులను BC-D నుంచి BC-Aలోకి మార్చాలి
• కోకాపేట్ భూమిని జాతికి కేటాయించాలి
• మత్స్యశాఖ నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి
✊ బీసీ, బహుజన, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలి
#MudirajVoice #ShivaMudiraj #OBC #SocialJustice
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@TelanganaCMO
@revanth_anumula
@INCOBCDept
@ObcMahasabha_
ముదిరాజుల రాజకీయ వాటా ఎక్కడ?
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది.
కానీ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సమాజానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికీ దక్కలేదు.
లోక్‌సభ వాస��తవాలు (1952–2024):
1952 నుండి 2024 వరకు 18 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
జనాభా నిష్పత్తి ప్రకారం ముదిరాజ్ కులానికి 84 లోక్‌సభ సీట్లు రావాలి.
కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కేవలం 2 మంది ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు.
అసెంబ్లీ వాస్తవాలు (ఉమ్మడి ఏపీ + తెలంగాణ):
ఇప్పటి వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 1,743 మంది MLAలు ఎన్నికయ్యారు.
జనాభా ఆధారంగా ముదిరాజులకు రావాల్సిన MLA స్థానాలు 286.
కానీ వాస్తవంగా ఎన్నిక��న వారు కేవలం 29 మంది మాత్రమే.
ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎవరు దీనికి బాధ్యత వహించాలి?
#Telangana
#RepresentationMatters
#75YearsOfIndependence
#ShivaMudiraj
#MudirajVoice
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@RaoKavitha
@DrJaihind
@TeenmarMallanna
@RaoKavitha
@KTRBRS
బిసీ కమిషన్ నియామకాల్లో ముదిరాజులకు తీవ్రమైన అన్యాయం?
తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర��గం నుండి ఇప్పటి వరకు ఒక్కరు కూడా బిసి కార్పొరేషన్ కు చైర్మన్ లు గాని, సభ్యులు కాని కాకపోవడం అత్యంత దురదృష్టకరం. మనం ఒక్క సారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే, 1950 జనవరి 26 వ తేదీన భారత రాజ్యాంగం ఈ దేశంలో అమల్లోకి రావడం జరిగింది. అయితే, దేశంలో అత్యధిక జనాభా కలిగిన బిసిల సాంఘిక, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి వంటి అంశాలను అధ్యయనం చేసేందుకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఒక కమిషన్ నియమించుకునే వెసులుబాటును రాజ్యాంగం కల్పించింది. ఇందులో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటి బిసి కమిషన్ కాక కాలేల్కర్ కమిషన్ 1953-55 ఏర్పాటు , ఆ తర్వాత 1979-80 మధ్య కాలంలో మండల్ కమిషన్ వంటివి బీసీల కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డాయి.
ఇక రా��్ట్ర స్థాయిలో చూసినట్లయితే , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1968 సంవత్సరంలో మొట్టమొదటి బీసీ కమిషన్ ప్రసాద్ మనోహర్ కమిషన్ బీసీల వర్గీకరణ ( బీసీ-ఏ, బి, సి, డి) ను చేసింది. ఆ తరవాత 1970 సంవత్సరంలో అనంత రామన్ కమిషన్, ప్రసాద్ మనోహర్ కమిషన్ చేసిన బీసీ వర్గీకరణను ఆమోదించి, బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత 1982 సంవత్సరంలో మురళీధర్ రావు కమిషన్ ఏర్పాటు చేసి, అనంతరామన్ కమిటీ నివేదికలోని 25 శాతం రిజర్వేషన్లను, 44 శాతం పెంచడం జరిగింది. అయితే, బిసి వర్గాలకు రిజర్వేషన్లు పెంచడం గిట్టని అగ్రకుల మేధావి వర్గం పెద్ద ఎ��్తున రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలను తెరపైకి తెచ్చారు. ఫలితంగా న్యాయ స్థానాలను సంప్రదించడం వల్ల ఈ 44 శాతం రిజర్వేషన్లను కొట్టి వేయడం జరిగింది. అయితే , 1992 సంవత్సరంలో ఇంద్ర సహాని వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు విద్యలో కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఫలితంగా 1993 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్ ను శాశ్వత కమిషన్ గా ఏర��పాటు చెయ్యడం జరిగింది. ఇందులో ఒక చైర్మన్ , ముగ్గురు సభ్యులు, ఒక ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు. 1993 నుండి 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఈ బిసి కమిషన్ పని చేసింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 సంవత్సరంలో తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1993లో రూపొందిన Backward Classes Commission Act ఆధారంగా పని చేస్తుంది. B. S Ramulu 2016లో తెలంగాణ తొలి BC కమిషన్ చైర్మన్‌గా న��యమితులయ్యారు. ఆ తర్వాత డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావుగారు BC కమిషన్ చైర్మన్‌గా 2021–2024 మధ్య పనిచేశారు. ఈయన తర్వాత జి. నిరంజన్ గారు 2024 సెప్టెంబర్‌లో BC కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బీసీ వర్గాల సామాజిక, విద్యా మరియు ఆర్థిక పరిస్థితులను పరిశీలించడం. కొత్త కులాలను BC జాబితాలో చేర్చాలా ? లేదా ? అనే అంశాన్ని పరిశీలించడం. ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల శాతంపై ప్రభుత్వం కి సూచనలు ఇవ్వడం. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడం. వివిధ కుల సంఘాలు ఇచ్��ే వినతులపై Public Hearings నిర్వహించడం, ప్రజల అభిప్రాయాలు, డేటా సేకరించడం వంటివి బీసీ కమిషన్లు ఉన్న అధికారాలు మరియు పరిమితులు. అయితే తెలంగాణలో అటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలనలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులం నుండి ఇప్పటి వరకు బీసీ కమిషన్ చైర్మన్ గా కానీ, కనీసం బీసీ కమిషన్ సభ్యులుగా కూడా ఎన్నిక కాకపోవడం దేనికి సంకేతం? బీసీల జనాభాలో ముదిరాజులు 45 లక్షలున్నట్లు సమగ్ర కుటుంబ సర్వే నివేదిక చెపుతోంది. కానీ ముదిరాజులకు మాత్రం సామాజిక బాధ్యతగా రావాల్సిన బీసీ కమిషన్ చైర్మన్ లలో మాత్రం ప్రాతినిధ్యం “సున్న “. బీసీల కోసం ఏర్పాటు చేసే, బీసీ కమిషన్ లో ముదిరాజులకు హక్కు లే��పోవడం ఇదేమి ప్రజాస్వామ్యం? (అయితే 2008-09 మధ్యకాలంలో నెల్లీ లక్ష్మీ నారాయణ గారు బిసి కమిషన్ సభ్యులుగా ఉన్నట్లు చెప్తారు, కానీ బిసి కమిషన్ దగ్గర స్పష్టమైన సమాచారం లేదు) తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ముదిరాజులకు అన్ని రంగాలలో అన్యాయం. ఇంతలా అన్యాయం జరుగుతుంటే రాజకీయ పార్టీలు కానీ, బిసి, బహుజన, కుల సంఘాలు నోరు మెదపడం లేదు? ఎన్నికలు రాగానే ముదిరాజు�� ఓట్లను రాజకీయ పార్టీలకు అమ్ముకునే దళారీ ముదిరాజ్ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడారు? ఇంతటి దారుణమైన రాజకీయ అన్యాయాలపై పోరాటం చేయడానికి కొత్త తరం నాయకత్వం ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.
Dr. Y. Shiva Mudiraj
University of Hyderabad
📍 Hyderabad, Telangana
📞 Phone: 9963240519
#JusticeForMudiraj
#BCJustice
#OBCRepresentation
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@RaoKavitha
@TelanganaCMO
@KTRBRS
@MothaRohit
@Manikya06
తెలంగాణ రాష్ట్రంలో చేపల పంపిణీ, సబ్సిడీలు, రుణాల పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, వాటి అసలు లబ్ధి సామాన్య మత్స్యకారులకు అందడం లేదు. ప్రభుత్వ అధికారులు, దళారులు కలిసి పథకాల అమలులో అక్రమాలు, తప్పుడు లెక్కలు, టెండర్లలో అవినీతి చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణ���ు ఉన్నాయి. ప్రమాద బీమా పథకంలో కూడా అర్హులైన మత్స్యకారులకు ప్రయోజనం అందకుండా అనవసర ఆంక్షలు విధిస్తున్నారు. ఫలితంగా సామాన్య మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయి, అప్పుల పాలై తమ జీవితాల���ు నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
@TelanganaCMO కానీ @revanth_anumula @INCTelangana @TelanganaCS అధికారులు కానీ కనీసం స్పందించడం లేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని విచారణ కమిటీలను ఏర్పాటు చేసి అవినీతి అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నాం అని, సినిమా స్థాయిలో డైలాగ్స్ కొట్టిన నాయకులు ఎక్కడ పండుకున్నారు. @Ponnam_INC @KondaSurekha @seethakkaMLA @INC_Ponguleti ?
లేదంటే దళారులతో కలిసి మీరు కుడా ఏమైనా వాటాలు తీసుకున్నారా? ఎక్కడ��ంది @BJP4Telangana ? ఎక్కడున్నారు @bandisanjay_bjp @kishanreddybjp @N_RamchanderRao ? మీరు తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం @PMOIndia @MSJEGOI @FisheriesGoI @PIB_MoFAHD తెలంగాణలో ఉన్న మత్స్య కారుల సంక్షేమం, అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించిన సామాన్య మత్స్యకారులకు న్యాయం జరగడం లేదు? కనీసం ప్రతిపక్ష పార్టీలైన @BRSparty @KTRBRS @RaoKavitha @VisharadanDr @TeenmarMallanna లాంటి వారైనా సామాన్య మత్స్యకారులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం✊✊✊
తెలంగాణలో నీలి విప్లవం: వృద్ధి వెనుక అవినీతి నీడ ?
తెలంగాణ చేపల ఉత్పత్తిలో అద్భుత వృద్ధి సాధించింది. 2016-17లో 1.93 లక్షల టన్నులు (రూ.2,111 కోట్లు) నుండి 2023-24లో 4.39 లక్షల టన్నులు (రూ.6,514 కోట్లు)కు చేరుకుంది. దేశంలో 3వ అతిపెద్ద అంతర్గత జల విస్తీర్ణం (5.73 లక్షల హెక్టార్లు) ఈ ��ిజయానికి బలమైన ఆధారం. చేపపిల్లల ఉచిత పంపిణీ పథకం (2017-18 నుండి) ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. కానీ సుమారు 27 లక్షల మత్స్యకారులలో కేవలం 3-4 లక్షల మందికే అధికారిక సభ్యత్వం ఉంది. మిగిలిన లక్షలాది మంది బీమా, సబ్సిడీలు, రుణాలకు అనర్హుల��గా మిగిలిపోతున్నారు. సభ్యత్వ ఫీజు రూ.10-100 అయినా దళారులు రూ.10,000 నుండి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. చేపపిల్లల పంపిణీలో నాసిరకం పిల్లలు వదిలి తప్పుడు బిల్లులతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది. PMMSY బీమా ఉన్నా, RTI డేటా ప్రకారం మరణాలకు క్లెయిమ్‌లు తక్కువే సెటిల్ అవుతున్నాయి. అవినీతిని అరికట్టి, సభ్యత్వాలు ఉచితంగా, బీమా సరళీకరణ, గుర్తింపు కార్డులతో నిజమైన సంక్షేమం అందాలి.
#TelanganaBlueRevolution
#FishermenWelfare
#AquacultureTelangana
#TelanganaFishermen
#FightCorruption
#ShivaMudiraj
#MudirajVoice
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@FisheriesGoI
@ICAR_CMFRI
@FisherySurveyOI
@PIB_MoFAHD
@revanth_anumula
@TelanganaCMO
@RaoKavitha
@hema_samala
@INCOBCDept
@MSJEGOI
@RSPraveenSwaero
@KTRBRS
@JSPTelangana
@aiobcsa
@VisharadanDr
తెలంగాణలో నీలి విప్లవం: వృద్ధి వెనుక అవినీతి నీడ
తెలంగాణ రాష్ట్రం చేపల పెంపకంలో అసాధారణ వృద్ధిని సాధించింది. 2016-17లో 1.93 లక్షల టన్నులు, రూ.2,111 కోట్ల విలువతో ఉండగా, 2023-24లో 4.39 లక్షల టన్నులకు చేరుకుంది – రూ.6,514 కోట్ల విలువ. ఇది దాదాపు 69% పెరుగుదలను సూచిస్తుంది (తెలంగాణ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ డేటా ప్రకారం). రాష్ట్రంలో 5.73 లక్షల హెక్టార్ల నీటి విస్తీర్ణం దేశంలో మూడవ అతిపెద్దది. చేపపిల్లల పంపిణీ పథకం (2017-18 నుండి) ఈ విజయానికి కీలకం – ఉచితంగా లక్షల కోట్ల పిల్లలు విడుదల చేసి ఉత్పత్తిని పెంచారు.
అయితే ఈ “నీలి విప్లవం” వెనుక మత్స్యకారుల దుస్థితి ఆందోళనకరం. రాష్ట్రంలో సుమారు 27.14 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని అధికారిక డేటా చెబుతోంది. కానీ అధికారిక ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీల సభ్యత్వాలు కేవలం 3-4 లక్షల మాత్రమే. మిగిలిన లక్షలాది మంది సంక్షేమ పథకాలు – ప్రమాద బీమా, సబ్సిడీలు, రుణాలు – అందుకోలేకపోతున్నారు.
సభ్యత్వ ఫీజు రూ.10-100 మాత్రమే అయినా, దళారులు, కొందరు రాజకీయ నాయకులు, అధికారులు రూ.10,000 నుండి లక్ష రూపాయల వరకు వసూలు చ���స్తున్నారని ఆరోపణలు. చేపపిల్లల పంపిణీలో అవినీతి ప్రబలం – 8-22 సెం.మీ పిల్లలు వదలాల్సి ఉండగా, 3-5 సెం.మీ నాసిరకం పిల్లలు వదిలి తప్పుడు బిల్లులు తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల పిల్లలు వదలకుండానే నిధులు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో షీప్, ఫిష్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్‌లలో అవినీతి ఆరోపణలు వచ్చాయి – విజిలెన్స్ దర్యాప్తు ఆదేశాలు వచ్చాయి.
కేంద్ర PMMSY కింద బీమా (రూ.5 లక్షలు మరణం/పూర్తి అంగవైకల్యం కోసం) ఉన్నా, RTI డేటా ప్రకారం మరణాల సంఖ్య ఎక్కువగా ఉండగా క్లెయిమ్‌లు తక్కువే సెటిల్ అవుతున్నాయి. FIR, పోస్టుమార్టం వంటి పత్రాల సమస్యలతో నిరక్షరాస్యులైన పేదలు ఇబ్బంది పడుతున్నారు.
పరిష్కారాలు అత్యవసరం: సభ్యత్వాలు ఉచితంగా, బీమా సరళీకరణ (రైతు బీమా తరహా), పూచీ లేని రుణాలు, ప్రతి మత్స్యకారునికి గుర్తింపు కార్డు. అవినీతిని అరికట్టి నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరాలి. నీటిపై జీవనం సాగించే మత్స్యకారులకు నిజమైన సంక్షేమం అందాలి – అప్పుడే నీలి విప్లవం నిజమైన అర్థంలో విజయవంతమవుతుంది.
#TelanganaFishermen
#BlueRevolution
#FishermenWelfare #AquacultureTelangana
#FightAgainstCorruption
#Shivamudiraj
#OBC
#Mudiraj
@BJP4Telangana
@BRSparty
@INCTelangana
@TelanganaCMO
@revanth_anumula
@FisheriesGoI
@PIB_MoFAHD
@JSFisheries
@RaoKavitha
@KTRBRS
@hema_samala
@RSPraveenSwaero
@VisharadanDr
@MSJEGOI
@INCOBCDept
@ObcMahasabha_
@aiobcsa
@Ponnam_INC
@TelanganaCS
@Bmaheshgoud6666
@Manikya06
@MothaRohit
@ashapriya09
@VenkatManda1
దేశంలో ఉన్నత విద్యకు ప్రతీకలుగా భావించే సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్ర యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, IITలు, IIMలు వంటి ప్రతిష్టాత్మక వి���్యాసంస్థల్లో కుల వివక్ష ఇంకా కొనసాగుతుండటం ఒక తీవ్రమైన సామాజిక అన్యాయం. University of Hyderabad, Jawaharlal Nehru University, IIT Delhi, AIIMS New Delhi వంటి దేశ అత్యున్నత సంస్థల్లో కూడా దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులు మరియు అధ్యాపకులు కులం పేరుతో వివక్ష, అవమానాలు, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్న సంఘటనలు బయటకు వస్తున్నాయి.
విద్యార్థులను వారి ప్రతిభ ఆధారంగా కాకుండా వారి సామాజిక నేపథ్యం ఆధారంగా తక్కువ చేసి చూడటం, గైడ్లు సహకరించకపోవడం, ఫెయిల్ చేయడం, మానసికంగా ఒత్తిడి చేయడం వంటి ఘటనలు అనేక ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఇదే పరిస్థితి బహుజన వర్గాలకు చెందిన అధ్యాపకుల విషయంలో కూడా కనిపిస్తోంది. వారికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, పదోన్నతుల�� నిలిపివేయడం, నిర్ణయ ప్రక్రియల నుండి దూరం పెట్టడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.
#CasteDiscrimination
#CasteInCampus
#DalitLivesMatter
#BahujanLivesMatter
#EndCasteDiscrimination
#ShivaMudiraj
@MSJEGOI
@ugc_india
@BRSparty
@BJP4Telangana
@INCTelangana
@TeenmarMallanna
@RSPraveenSwaero
@RaoKavitha
@VisharadanDr
@aiobcsa
@ObcMahasabha_
@ObcArmyInd
@BJP4OBCMorcha
@BCYParty4People
@hema_samala
@KTRBRS
75 ఏళ్ల స్వతంత్ర భారతం: ముదిరాజులకు రాజకీయ న్యాయం ఎక్కడ? | Article 14, 15, 19 – నిజాలు
- Dr. Shiva Mudiraj
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది.
కానీ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సమాజానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికీ దక్కలేదు.
లోక్‌సభ వాస్తవాలు (1952–2024):
1952 నుండి 2024 వరకు 18 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
జనాభా న��ష్పత్తి ప్రకారం ముదిరాజ్ కులానికి 84 లోక్‌సభ సీట్లు రావాలి.
కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కేవలం 2 మంది ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు.
అసెంబ్లీ వాస్తవాలు (ఉమ్మడి ఏపీ + తెలంగాణ):
ఇప్పటి వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 1,743 మంది MLAలు ఎన్నికయ్యారు.
జనాభా ఆధారంగా ముదిరాజులకు రావాల్సిన MLA స్థానాలు 286.
కానీ వాస్తవంగా ఎన్నికైన వారు కేవలం 29 మంది మాత్రమే.
భారత రాజ్యాంగం – ప్రశ్నలుగా మారిన హక్కులు:
▪️ ఆర్టికల్ 14 (సమానత్వం): ముదిరాజులకు రాజకీయ సమానత్వం ఉందా?
▪️ ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం): విద్య, ఉద్యోగాల్లో వివక్ష లేదా?
▪️ ఆర్టికల్ 19 (స్వేచ్ఛ):
విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అన్యాయాలపై మాట్లాడే ��్వేచ్ఛ నిజంగా ఉందా?
ఈ వీడియో డేటాతో, చరిత్రతో, రాజ్యాంగంతో మాట్లాడుతుంది.
ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు – న్యాయానికి అనుకూలం.
👉 ఈ నిజాలను ప్రజల వరకు తీసుకెళ్లడం మన బాధ్యత.
👉 చూడండి, షేర్ చేయండి, ప్రశ్నించండి.
#Mudiraj
#ముదిరాజ్
#PoliticalInjustice
#SocialJustice
#Article14
#Article15
#Article19
#TelanganaPolitics
#BCRights
#RepresentationMatters
#75YearsOfIndependence
#ShivaMudiraj
#MudirajVoice
@RaoKavitha
@KavithakkaUpdts
@BJP4Telangana
@TeenmarMallanna
@BRSparty
@INCOBCDept
@ObcMahasabha_
@Manikya06
@hema_samala
@INCTelangana
@KTRBRS
@revanth_anumula
@Krishank_BRS
@VoiceOfBahujans
@VisharadanDr
@RSPraveenSwaero
@ashapriya09
@bandisanjay_bjp
@MahasabhaRpm
@_YogendraYadav
@ts_aiobcsa
@sravandasoju
@Dr_Nalamasa1212
@VSrinivasGoud
@Ponnam_INC
@MSJEGOI
@Eatala_Rajender
@ShivaHcu
@MothaRohit
@VenkatManda1
@Maheshbabu_inc
@YadavTalasani
75 ఏళ్ల స్వతంత్ర భారతం: ముదిరాజులకు రాజకీయ న్యాయం ఎక్కడ? | Article 14, 15, 19 – నిజాలు
- Dr. Shiva Mudiraj
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది.
కానీ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సమాజానికి రాజ్యాం��బద్ధంగా రావాల్సిన రాజకీయ ప్రాతినిధ్యం ఇప్పటికీ దక్కలేదు.
లోక్‌సభ వాస్తవాలు (1952–2024):
1952 నుండి 2024 వరకు 18 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
జనాభా నిష్పత్తి ప్రకారం ముదిరాజ్ కులానికి 84 లోక్‌సభ సీట్లు రావాలి.
కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కేవలం 2 మంది ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు.
అసెంబ్లీ వాస్తవాలు (ఉమ్మడి ఏపీ + తెలంగాణ):
ఇప్పటి వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
మొత్తం 1,743 మంది MLAలు ఎన్నికయ్యారు.
జనాభా ఆధారంగా ముదిరాజులకు రావాల్సిన MLA స్థానాలు 286.
కానీ వాస్తవంగా ఎన్నికైన వారు కేవలం 29 మంది మాత్రమే.
భారత రాజ్యాంగం – ప్రశ్నలుగా మారిన హక్కులు:
▪️ ఆర్టికల్ 14 (సమానత్వం): ముదిరాజులకు రాజకీయ సమానత్వం ఉందా?
▪️ ఆర్టికల్ 15 (వివక్ష నిషేధం): విద్య, ఉద్యోగాల్లో వివక్ష లేదా?
▪️ ఆర్టికల్ 19 (స్వేచ్ఛ):
విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అన్యాయాలపై మాట్లాడే స్వేచ్ఛ నిజంగా ఉందా?
ఈ వీడియో డేటాతో, చరిత్రతో, రాజ్యాంగంతో మాట్లాడుతుంది.
ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు – న్యాయానికి అనుకూలం.
👉 ఈ నిజాలను ప్రజల వరకు తీసుకెళ్లడం మన బాధ్యత.
👉 చూడండి, షేర్ చేయండి, ప్రశ్నించండి.
#Mudiraj
#ముదిరాజ్
#PoliticalInjustice
#SocialJustice
#Article14
#Article15
#Article19
#TelanganaPolitics
#BCRights
#RepresentationMatters
#75YearsOfIndependence
#ShivaMudiraj
#MudirajVoice
@RaoKavitha
@KavithakkaUpdts
@BJP4Telangana
@TeenmarMallanna
@BRSparty
@INCOBCDept
@ObcMahasabha_
@Manikya06
@hema_samala
@INCTelangana
@KTRBRS
@revanth_anumula
@Krishank_BRS
@VoiceOfBahujans
@VisharadanDr
@RSPraveenSwaero
@ashapriya09
@bandisanjay_bjp
@MahasabhaRpm
@_YogendraYadav
@ts_aiobcsa
@sravandasoju
@Dr_Nalamasa1212
@VSrinivasGoud
@Ponnam_INC
@MSJEGOI
@Eatala_Rajender
@ShivaHcu
@MothaRohit
@VenkatManda1
@Maheshbabu_inc
@YadavTalasani