ఆన్లైన్లో ఏవైనా బిల్స్ చెల్లింపు, రిచార్జ్‌లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్సైట్లు, యాప్స్ వాడకండి. కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి.
#TelanganaPolice#CyberCrime#FakeWebsites
బెట్టింగ్ మీకు సరదా కావొచ్చు. కానీ మీ కుటుంబానికి అది వ్యధను మిగులుస్తుంది. సరదాగా మొదలయ్యే బెట్టింగ్...కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఈజీమనీ కోసం వెళ్లి జీవితాన్ని కోల్పోవద్దు.
#TelanganaPolice#BettingApps#SayNoToBetting
వరంగల్ పోలీస్ కమిషనరేట్
-ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్
ఐటీ కంపెనీల్లో కార్లు అటాచ్మెంట్ ఇప్పిస్తామని మోసం.. ఇద్దరు అరెస్ట్
మూడు కార్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు వాహన యజమానులను ఐటీ కంపెనీల్లో అటాచ్మెంట్ ఇప్పిస్తామని నమ్మించి కార్లు తీసుకుని, వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేసిన ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మొహమ్మద్ సోహైల్ అనే బాధితుడి మారుతి డిజైర్ కారును నెలకు రూ.35 వేల అద్దె వస్తుందని నమ్మించి నిందితుడు సింగారపు శ్యామ్ కుమార్ తీసుకున్నాడు. మొదట అడ్వాన్స్‌గా రూ.35 వేలు చెల్లించిన అనంతరం వాహనాన్ని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి, అద్దె చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే తరహాలో పలువురు వాహన యజమానులను మోసం చేసినట్లు విచారణలో తేలింది.
09-07-2026న తెలంగాణ జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యామ్ కుమార్ (A1), ఎం.డి. సోహైల్ (A2)లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి ఒక మారుతి డిజైర్ కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, వారి సమాచారంతో చింతల్ ఫ్లైఓవర్ కింద దాచిపెట్టిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బలెనో) మరియు నేరాలకు ఉపయోగించిన హెచ్ఎమ్డీ కీప్యాడ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు సింగారపు శ్యామ్ కుమార్ గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి, చెన్నారావుపేట, ఇంటేజార్గంజ్, ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇతర బాధితులను గుర్తించడం, మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకోవడం, డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరించడం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు వెల్లడించారు.
@TelanganaDGP@TelanganaCOPs
డబ్బులు రెట్టింపయ్యే ట్రేడింగ్ సీక్రెట్స్ మీకు ఉచితంగా ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వేలల్లో పెట్టుబడితో లక్షలు వస్తాయన్న మాటలకు పడిపోవద్దు. ఈజీ మనీకోసం వెళ్లి మోసపోవద్దు.
#TelanganaPolice#TradingScams
పిల్లల వెబ్ యాక్టివిటీని తల్లిదండ్రులు తరచూ పరిశీలించండి. ఆన్లైన్ గేమ్స్ మాటున ఉన్న బెట్టింగ్ యాప్స్ వలలో వారు పడకుండా జాగ్రత్త వహించండి. బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను వివరించండి. పిల్లల ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను కూడా పరిశీలించడం మంచిది.
#TelanganaPolice
BACK TO BASICS. That's what I told officers at Khammam today effective, strong policing built on integrity, visibility, impartiality, and technology.
Chaired a Crime Review Meeting and walked officers through lapses in district crime strategies, advising remedial measures. Financial fraud up 30%, job fraud up 36%, fake document cases rising fast, GST offences now under investigation. Cyber crime has claimed 9.48 crore from 711 victims this year, 1.41 crore recovered so far. On narcotics, 1,700 kg of ganja seized this year Khammam remains one of the highest seizure districts in the State. Inaugurated the Road Safety Park and 250 new CCTVs linked to the district Command Centre, along with the Commissionerate's CCTV Command Facility appreciate citizens who installed cameras in their own villages. Educated students on traffic discipline, distributed helmets. Accidents down sharply 146 this year against 317 last year. Also planted saplings for Vanamahotsavam.
Directions to officers, wage war against narcotics, protect the future generation. Work strictly as per law justice must reach the poor and helpless first. Strengthen night patrolling, enforce strict CCTNS data discipline. No interference in civil and land disputes SOPs without exception. Sand mafia, soil mafia, rowdy elements targeted action, backed by CCTNS 3.0, Hawk Eye 3.0 and TG COPS 3.0. A Traffic Management Bureau, on the lines of EAGLE is coming soon.
Told officers plainly wearing this uniform is a privilege. Only 0.16% of our 4.5 crore population ever gets this chance. Wear it with integrity or don't wear it at all.
#TelanganaPolice
వాయిస్ క్లోనింగ్ స్కామ్‌తో మోసగాళ్లు డబ్బులు కొల్లగొడుతున్నారు. మీ సన్నిహితుల వాయిస్‌తో ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడుగుతారు. ఆపదలో ఉన్నామంటూ కంగారు పెడతారు. ఇలాంటి కాల్స్ వస్తే తొలుత నిర్ధారించుకోండి.
#TelanganaPolice#VoiceCloning
#CHILDLABOUR is illegal and robs children of their education, dignity, and future.
If you witness child labour, speak up and report it. Together, we can ensure every child has the chance to learn, grow, and succeed.
Education today. Success tomorrow. Say NO to Child Labour.
న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలి
– వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడిలో న్యాయం జరుగుతుందనే విశ్వాసం, భరోసా కలిగేలా పోలీసులు పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ అధికారులు, సిబ్బందికి సూచించారు.
బుధవారం వెస్ట్ జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించడంతో పాటు, స్టేషన్ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు, పరిధిలోని గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సేవే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు తప్పనిసరిగా రశీదు అందజేయాలని సూచించారు. ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ భీమ్ శర్మ, స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐ మనీషా తదితరులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
అపరిచితుల నుంచి మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ వస్తే జాగ్రత్త. వెంటనే యూపీఐ యాప్‌లోకి వెళ్లి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవద్దు. సైబర్ నేరగాళ్లు రూపాయి ఎర వేసి లక్షల్లో కాజేసే యత్నం ఇది. అప్రమత్తంగా ఉండండి.
#TelanganaPolice#UPIScams#BeAlert
మొబైల్ ఫోన్‌ను ఎక్కడవాడాలో గుర్తుంచుకోండి. వాహనాలు నడిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ వాడకండి. రీల్స్ చూస్తూ...రీల్స్ చేస్తూ డ్రైవింగ్ చేయొద్దు. సెల్ఫీలు తీసుకుంటూ వాహనం నడపకండి.
#TelanganaPolice#CellPhoneDriving#ArriveAlive
Chaired a review meeting today on the pending issues regarding the reorganisation of police stations across Hyderabad, Cyberabad, Malkajgiri and Future City Commissionerates.
Directed that jurisdictional restructuring be carried out strictly as per Government Orders, factoring in municipal, revenue and court boundaries. Emphasised long-term planning, urban expansion, population growth and future administrative needs must guide these decisions, along with stakeholder consultation.
Issued specific directions on finalising police station limits in parts of Hyderabad city which are under dispute and finalised the process , ensuring operational efficiency for the police department and also causing no inconvenience to citizens, government departments or the judiciary.
ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించాను.
ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా, మున్సిపల్, రెవెన్యూ మరియు న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుంటూ పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించాను. ఈ ప్రక్రియలో దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాను.
హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, ఆ ప్రక్రియను తుదిరూపు దిద్దాం. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా పోలీస్ శాఖ కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలు, ప్రభుత్వ శాఖలు మరియు న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
#TelanganaPolice
మామునూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పోలీస్ జాగృతి కళా బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, షీ టీమ్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 550 మంది విధ్యార్థులు పాల్గొన్నారు .
డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్, సాంకేతికత వినియోగం, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు భద్రత, దర్యాప్తుపై సమీక్షించి కీలక ఆదేశాలు జారీ చేశారు. #TelanganaPolice