*తూఫాన్ ప్రభావంతో పంట నష్టాల పరిశీలించిన ఎచ్చెర్ల టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామల రావు గారు*
తేదీ :25/09/2026(శుక్రవారం)
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామంలో తోటమ్మ తల్లి దర్శనం అనంతరం గ్రామంలోని రైతులను పరామర్శించి, తూఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించడం జరిగింది.
పంటలకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్రంగా అంచనా వేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించడం జరిగింది. అలాగే రణస్థలం గ్రామంలోని అరటి తోటలను పరిశీలించి, తూఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించడం జరిగింది.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పంట నష్టాల వివరాలను సంబంధిత అధికారుల ద్వారా నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని లంక శ్యామల రావు గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, కుమరాపు రవికుమార్, బెండు మల్లేశ్వరరావు,మండల ప్రధాన కార్యదర్శలు మండపాక కనకరావు,పిన్నింటి మధుబాబు,కోష్ట మాజీ సర్పంచ్ పిసిని జగన్నాధం నాయుడు,జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు పిన్నింటి భానోజీ నాయుడు,మాజీ వైస్ ఎంపీపీ డుమ్ము అశోక్, పైడి భీమవరం ex సర్పంచ్ రౌతు శ్రీనివాస రావు, లీగల్ సెల్ కార్యదర్శి రెడ్డి కోటేశ్వరరావు, ఎంపీటీసీ సూరాడ రాములు, ex సర్పంచ్ సుంకరి ధనుంజయ్,ex ఎంపీటీసీ ముల్లు కృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ నడుపూరు శ్రీనివాసరావు, యూనిట్ ఇంచార్జ్ మైలపల్లి పోలీస్,అమర లక్ష్మణ,దన్నాన మహేష్, కొప్పిశెట్టి లక్ష్మణ రావు, గొర్లె ఈశ్వరరావు, పిట్ట అప్పలనాయుడు, మునకాల రామిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
#LankaShyamalaRao
#TDPincharge
#Etcherla
#NaraLokesh
#NaraChandrababuNaidu
#PawanKalyan
#TeamLSR
#NER
#Ranastalam
#Laveru
#Gsigadam
#etcherlaconstituency
#ShyamForEtcherla
#ManaEtcherlaManaShyam
పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన టీడీపీ ఎచ్చెర్ల ఇన్చార్జ్ లంక శ్యామల రావు.
*ఎచ్చెర్ల* : తెలుగుదేశం పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ *లంక శ్యామల రావు* ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని లంక శ్యామల రావు సూచించారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మరింత పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
#LankaShyamalaRao
#TDPincharge
#Etcherla
#NaraLokesh
#NaraChandrababuNaidu
ప్రజలు, కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యం: లంక శ్యామలరావు
ఎచ్చెర్ల: ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ లంక శ్యామలరావు తెలిపారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను లంక శ్యామలరావు దృష్టికి తీసుకువచ్చారు. వారి నుంచి వినతులు స్వీకరించి, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
కార్యకర్త జిప్ విప్పితే... సైకో లీడర్ సమాధానం విప్పకుండా జారుకున్నాడు.
వర్షం వంక చెప్పి జారుకోవడం కాదు అన్నా... ఆ చేష్టలకు సమాధానం చెప్పడానికి ధైర్యం లేక కదా ఆ పరుగు.
అన్న సిగ్గు మొత్తం ఇంట్లో దాచుకుని రోడ్ల మీదకు వస్తాడు అనుకుంటా.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP
#JaganAgainstTeachers
Teachers or rowdy-sheeters?
Today, @ysjagan chose to stand with these rowdy-sheeters who attacked our teachers.
I choose to stand with our teachers and sportspersons.
Now, it’s time for you to choose.
#TeachersVsYCPGoons#DSCFakesByYCP#JaganAgainstTeachers
DSC 2025 పై తప్పుడు ఆరోపణలు చేయడం, వాటిపై అధికారులు వివరణ ఇచ్చినా వినకపోవడం, మళ్లీ అవే తప్పుడు ఆరోపణలు చేయడం ‘గొడ్డలి పార్టీ’కి నిత్యకృత్యం అయింది. తమ పార్టీ ఛానెళ్ల ద్వారా, తమ దొంగ సాక్షి పత్రిక ద్వారా, సోషల్ మీడియాలో దొంగ హ్యాండిల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
DSC 2025 లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన పేద, దిగువ మధ్యతరగతికి చెందిన బలహీన వర్గాల యువతీయువకులు తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంటున్నా ‘గొడ్డలి పార్టీ’ తన తప్పుడు విధానాలను వదలడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారంటూ చాలా కాలంగా ‘గొడ్డలి పార్టీ’ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. సాఫ్ట్ బాల్ ఆటగాళ్లు ఎప్పుడు సర్టిఫికెట్లు పొందారు? వారు ఎప్పుడు క్రీడల్లో పాల్గొన్నారు? అనే విషయాలలో వాస్తవాలను పలుమార్లు వివరించి చెప్పినా తప్పుడు ప్రచారం ఆపడం లేదు.
సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో తలెత్తిన విభేదాల కారణంగా దాని గుర్తింపును SAP రద్దు చేసింది. ఇప్పుడు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు గుర్తింపు లేదు. అయితే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు SAP గుర్తింపు ఉన్న సమయంలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న వారికి DSC 2025 లో అన్యాయం జరగరాదు అనే సదాశయంతో SAP కొన్ని చర్యలు తీసుకున్నది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయం తీసుకున్నది. వారు ప్రస్తుత సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ పాత సర్టిఫికెట్లను తనిఖీ చేసి వాటిని ధృవీకరించేందుకు అనుమతించింది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ప్రకారం శ్రీ కూన రవికుమార్ గతంలో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్ధులకు మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.
ఈ వాస్తవాన్ని అధికారులు కూడా పలుమార్లు చెప్పారు.
సాఫ్ట్ బాల్ క్రీడాకారులను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శభాష్ అని అభినందించింది కూడా. వారితో ఫొటోలు దిగి సాక్షి పత్రికలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాలను ఎంతో బాధతో సాఫ్ట్ బాల్ క్రీడాకారులు చెబుతూనే ఉన్నారు…… ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో జగన్ రెడ్డీ…. పేద క్రీడాకారుల పొట్ట కొట్టవద్దు…
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
గురువులపై దాడి వెనుక జగన్ మార్క్ అరాచకత్వం
విజయవాడ SAAP కార్యాలయం వద్ద అల్లర్లు సృష్టించిన వారిలో ఏకంగా 45 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓటమి భారాన్ని తట్టుకోలేక, విద్యాబుద్ధులు చెప్పే టీచర్లపైకి రౌడీలను ప్రయోగించడం జగన్ సైకో, నేర మనస్తత్వానికి, అరాచక రాజకీయాలకు నిదర్శనం.
సీసీటీవీ, సోషల్ మీడియా ఆధారాలతో దొరికిన ప్రతీ ఒక్క రౌడీని లాగి లోపలేయాల్సిందే. అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను కించపరిచారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక రౌడీ మూకలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు.
#TeachersVsYCPGoons
#TeachersVersusYSRCP
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
#RespectOurTeachers
#SportsTeachersFightFakes
#MegaDSC
#AndhraPradesh
*వాయుగుండం - తుఫాన్ అప్రమత్తం*
ఎచ్చెర్ల: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితులపై ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజల్ని టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం ఇంచార్జ్ లంక శ్యామలరావు గారు సురక్షితంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు, రహదారులు, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర అంశాలపై ప్రజల్ని అప్రమత్తం చేశారు.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులుకు సూచించారు.
#LankaShyamalaRao
#TDPINCHARGE
#Etcherla
*వాయుగుండం ప్రభావంపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడిటి ఈశ్వరరావు గారు, ఎచ్చెర్ల టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామల రావు గారు సమీక్ష*
*ఎచ్చెర్ల* : వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితులపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే సమీక్ష ఈశ్వర రావు గారు, లంక శ్యామల రావు గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు, రహదారులు, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది.
వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు.
#LankaShyamalaRao
#TDPINCHARGE
#Etcherla
అంగన్వాడీ మిలన్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను
ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం పంచాయతీలో నిర్వహించిన అంగన్వాడీ మిలన్ సేవా కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుడిటి ఈశ్వరరావు గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా చిన్నారుల సంక్షేమం, పోషకాహారం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందిస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరాను.
“పోషణపై చర్చ – ఆరోగ్యంపై సంభాషణ” అనే లక్ష్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలి.
#LankaShyamalaRao
#TDPIncharge
#Etcherla
**లావేరులో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవం**
బాలికల విద్యాభివృద్ధికి మరో ముందడుగు వేస్తూ లావేరు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, అవసరమైన విద్యా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల లావేరు ప్రాంత విద్యార్థినులకు ఎంతో ప్రయోజనకరంగా నిలవనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు హాజరయ్యారు. సభాధ్యక్షులుగా ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నడుకుదిటి ఈశ్వరరావు (NER) గారు వ్యవహరించారు.
జనసేన పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ విశ్వక్సేన్ గారు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు తదితరులతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యత అభినందనీయం. ప్రతి బాలిక ఉన్నత విద్యను అభ్యసించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఈ పాఠశాల బలమైన పునాదిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.
బాలికలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భద్రమైన పునాది వేసే దిశగా ఇలాంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి.
#LankaShyam #Laveru #GirlsEducation #ResidentialSchool #EducationForAll
అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం మన భ్రమ. అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ గారి దుర్బుద్ధి బయటపడింది. జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగింది. రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టింది. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలి. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచుల పనిపడతాం.
#TeachersVersusYSRCP
#DSCFakesByYCP
#JaganAgainstTeachers
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- శ్వేత
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
కుల మతాలు, రాజకీయాలకు సంబంధం లేకుండా టీమ్ స్పిరిట్ తో కలిసికట్టుగా రాష్ట్రం, దేశం కోసం ఆడేదే స్పోర్ట్స్. క్రీడల వల్లనే మనందరం ఒక్కటవుతుంటాం. మెడల్ సాధిస్తే ప్రౌడ్ గా ఫీలవుతాం. అలాంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై రాజకీయం చేయడం, బురదచల్లడం, చిన్నచూపు చూడడం దారుణం. వైసీపీ దుష్ప్రచారం వల్ల క్రీడా కోటాలో ఉద్యోగం వచ్చిందని గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం. ఈ దుష్ప్రచారాన్ని క్రీడాకారులంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలి.
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. నేను ఎనిమిదేళ్లు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశా. పోస్టల్ శాఖలోనూ ఉద్యోగం వచ్చింది. టీచర్ అవ్వాలనేది ప్యాషన్. నాకు గత ప్రభుత్వంలోనూ ఉద్యోగం వచ్చింది. మరి వాళ్ళనూ ఫేక్ అంటారా. నేను జెన్యూన్ గా ఆడి జెన్యూన్ గా ఉద్యోగం సాధించుకున్నా.
#SportsTeachersFightFakes
#DSCFakesByYCP
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#TeachersVersusYSRCP
#MegaDSC
#AndhraPradesh