American singer Mary Millben urges young Indians to raise their voices and peacefully mobilise in support of democracy and freedom.
In her post, Mary Millben alleges that US-based donors are funding individuals opposed to Prime Minister Narendra Modi and his leadership.
@Cockroachisback@MaryMillben@NarendraModi
#MaryMillben #India #IndianYouth #NarendraModi #Democracy #YouthPower
Oh dear @abhijeet_dipke, the truth sets everybody free. Even you. And here’s the truth: these US donors will drop you like a hot cake when you don’t succeed. And you won’t, because lawlessness never wins. Instead, take your U.S. education, talent, and use it for good. Sit down with the PM @narendramodi and be a positive voice to advance India. The truth of your courage to do what’s right lies in your next steps.
And the PM doesn’t need American support. He has 1.5 billion beautiful Indian citizens who support him and have for 25 years, 12 years as PM, three consecutive terms. And will again in 2029. That’s the truth.
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పొత్తులో భాగంగా 40.1% వాటాతో 2,091 పదవులను కేటాయించాలని జనసేన పార్టీ ప్రతిపాదించింది.
@JanaSenaParty@PawanKalyan#APLocalBodyElections2026
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానిక సంస్థల ఎన్నికల్లో NDA కూటమి పొత్తులో భాగంగా 40.1% వాటాతో 2,091 పదవులను కేటాయించాలని జనసేన పార్టీ ప్రతిపాదించింది.
@JanaSenaParty@PawanKalyan#APLocalBodyElections2026
పన్నెండేళ్ల నిబద్ధత.. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, ఎదురుగాలులు ఎన్నో వీచాయి.. కానీ జనసేన అడుగు వెనక్కి వేయలేదు🔥
పన్నెండేళ్ళ జెండాను మోసిన చేతులు, రేపు ప్రజాసేవ బాధ్యతలను కూడా మోయాలి. పార్టీ కోసం చేసిన త్యాగాలు కొత్త నాయకత్వానికి పునాదులు కావాలి ✊🏽
#APLocalBodyElections
ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫ్రెండ్లీ ఫైట్ అంటూ మాట్లాడుతున్న తెలుగు తమ్ముళ్లకు మేము చెప్పేది ఒక్కటే…
మాకు కూడా ఫ్రెండ్లీ కాంటెస్టే కావాలి. మా బలమేంటో మేమూ చూపించుకుంటాం!
2024లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీ ప్రయోజనాలను రెండో స్థానంలో పెట్టాం. జనసేన కార్యకర్తలుగా మేము చేసిన త్యాగం చాలు. ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలం, క్యాడర్ ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఉండాలి.
రాష్ట్ర అభివృద్ధిలో మీకు ఎంత వాటా ఉందో, మాకూ అంతే వాటా ఉంది. పొత్తు అంటే ఒకరి బలాన్ని మరొకరు గుర్తించడం.. ఒకరి రాజకీయ ఉనికిని మరొకరు గౌరవించడం!
మమ్మల్ని రెచ్చగొట్టడం ఆపి, మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటాం. ఫ్రెండ్లీ ఫైట్కు మేము సిద్ధమే.. ఫలితం ప్రజలే నిర్ణయిస్తారు!
2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఆత్మగౌరవం, క్యాడర్ బలం, తగిన రాజకీయ ప్రాతినిధ్యం మా హక్కు. దాన్ని అడగడంలో తప్పులేదు!
@JanaSenaParty@PawanKalyan
#JanaSena #APLocalBodyElections2026
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్సిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*నగర పంచాయతీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: https://t.co/EOYFqsDsih
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం