మాకు బాబాసాహెబ్ సహనం చట్టంపై విలువలతోపాటు, పోరాటం, యుద్ధం కూడా నేర్పారని మర్చిపోవొద్దు || 💙Jai bheem💙 || @mayawati Indian iron lady 🐘🙏 History created 🇪🇺
ఇది ఒక తెలంగాణా ముస్లిం సోదరుడు
ఇచ్చిన సజీవ సాక్ష్యం
లక్నో లో అక్టోబర్ 9 2025 లో BSP ఒక సభ పెడితే తాను చూసిన జనసందేహాన్ని చూస్తు
ఉప్పొంగుతూ మాట్లాడిన మాటలు
BSP అనేది ఈ దేశానికీ వెన్నుముక దానిని
బలంగా నడిపిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలను
చైతన్యం చేస్తున్న యూపీ BSP కార్యకర్తల్లా
ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం మీ స్ఫూర్తిని
మాలో నింపుకోవడం తప్ప 🔥
#BSP
BJP మీద కోపాన్ని BJP మీదనే చూపించాలి.
కానీ దేశాన్ని అవమానించొద్దు.
BJP అనేది దేశంలో ఒక పార్టీ మాత్రమే.
BJP నే దేశం కాదు.
"నేను మొదటగా చివరగా భారతీయుడిని" అని బాబాసాహెబ్ గర్వంగా చెప్పేవారు.
దేశాన్ని అవమానించడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమే.
ఇలాంటి లుచ్చాగాళ్ల వల్ల అంబేద్కరిస్టులకు చెడ్డ పేరు వస్తోంది.
ఆలోచన ఒక్కటే సరిపోదు; దానికి సరైన రాజకీయ ఆచరణ తోడైతేనే ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుంటుంది.
బహుజన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు రెడ్లు–కమ్మల రాజకీయాల పావుగా కాకుండా మాన్యవర్ కాన్షీరాం గారి బహుజన రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఉంటే, కాపులు సహా బహుజనులు అధికారాన్ని సాధించేవారు; హక్కుల కోసం మళ్లీ మళ్లీ రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు.
ఏదైతేనేమి ఆయన మరణం కలచి వేసింది.
బహుజన సమాజం నుంచి కాన్షీరాంలు రావాలే కానీ ముద్రగడలు కాదు.
గ్రామ స్థాయిలో ప్రచారానికి బహుజన్ సమాజ్ పార్టీ స్టెన్సిల్స్ విడుదల చేసిన చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్లు అత్తార్ సింగ్ రావు గారు, సురేష్ ఆర్య గారు.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ గారు
ఆజమ్ ఖాన్ కట్టిన జౌహర్ అలీ యూనివర్సిటీని యోగి ప్రభుత్వం కూల్చబోతోంది.
కుహనా సెక్యులర్ రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ నోరు విప్పడం లేదు ఎందుకు?
బీజేపీకి వ్యతిరేకం ఎన్నికల హంగామా మాత్రమేనా?
ముస్లిం ఓట్లు కావాలి. కానీ వారి రక్షణ అక్కర్లేదా?
#SonamWangchuk#CJP
స్వతంత్ర భారతదేశంలో "ప్రొఫెషనల్" నిరాహార దీక్షలు:
- ఇరోమ్ శర్మిళ – AFSPA చట్టాన్ని తొలగించాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నిరాహార దీక్ష. కానీ AFSPA మాత్రం ఇంకా అలాగే ఉంది!
- అన్నా హజారే – 12 రోజులు నిరాహార దీక్ష చేశారు. లోక్‌పాల్ బిల్లు, ప్రధానమంత్రిని జవాబుదారీ చేసే వ్యవస్థ కోసం పోరాడారు. కానీ ఆ జవాబుదారీతనం ఇప్పటికీ కనిపించలేదు!
- బాబా రాందేవ్ – 9 రోజులు నిరాహార దీక్ష చేశారు. విదేశాల్లోని నల్లధనం వెనక్కి తీసుకురావాలన్నారు. కానీ నల్ల చిల్లిగవ్వ కూడా తిరిగి రాలేదు!
- మేధా పాట్కర్ – 22 రోజులు నిరాహార దీక్ష చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించాలని కోరారు. కానీ ఆ పని ఇప్పటికీ పూర్తి కాలేదు!
- ఆశారాం బాపూ – కరోనా సమయంలో జైలు నుంచి పరోల్ కోసం 3 రోజుల నిరాహార దీక్ష చేశారు. నాలుగో రోజుకే దీక్షకు సెలవు చెప్పారు!
- సోనం వాంగ్‌చుక్ – ఇది మూడోసారి నిరాహార దీక్ష. ఒకసారి మంచు కోసం, ఇంకోసారి హిమనదాల కోసం... మొత్తానికి నిరాహార దీక్షలే ఫుల్‌టైమ్ ఉద్యోగమైపోయిందని అనిపిస్తోంది!
ఇప్పుడు మళ్లీ నిరాహార దీక్ష. దేశానికి గొప్ప ఋణం ఇచ్చినట్టే. ఇక ఆయనను నాయకుడిగా కూడా ఒప్పుకోవాలట!
పైగా ఈ దీక్షాధారులు బతికే ఉన్నారు.
అందరూ దోపిడీ కులాలకు చెందినవాళ్లే. వీరిలో చాలామంది కాంగ్రెస్, బీజేపీల భావోద్వేగ రాజకీయాల బ్రాండ్ అంబాసిడర్లే. దీక్షల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందికి డిపాజిట్ కూడా దక్కలేదు!
ఇక మరో సైడ్.. ఫ్యాక్టరీ గేటు ముందు తమ హక్కుల కోసం సమ్మె చేసిన పేద కూలీలను మాత్రం పోలీసులు లాఠీలతో చితకబాది, జైలులో వేసి సమ్మె విరమింపజేస్తారు!
అంటే ఈ దేశంలో నిరాహార దీక్ష చేసే హక్కు కూడా అందరికీ ఉండదు. దానికి కూడా ప్రత్యేక కులం లేదా ప్రత్యేక కులాల రాజకీయ పార్టీల ఆశీర్వాదం ఉండాల్సిందే!
ఇన్ని ఫెయిల్యూర్ దీక్షల్లో మనం ఒక దీక్ష గురించి మాట్లాడుకోవాలి.
స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత విజయవంతమైన నిరాహార దీక్ష అది. అది మనిషి తోలు కప్పుకున్న మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే నక్క చేసినది. దళితులకు ప్రత్యేక ఎన్నికల నియోజకవర్గాలు ఇవ్వకుండా ఉండేందుకు నిరాహార దీక్ష చేసి, డాక్టర్ అంబేడ్కర్‌పై భావోద్వేగ ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యాడు.
ఇక ఇప్పటి నిరాహార దీక్షల సంగతే వేరే! ఉదయం బబ్లీ పంజాబీ ఛోలే భటూరే... మధ్యాహ్నం జునైద్ హలీమ్ బిర్యానీ... సాయంత్రం డోల్మా ఆంటీ మోమోలు... రాత్రికి హల్దీరామ్ పనీర్ థాళీ... మధ్యలో ఫుడ్ బ్లాగర్లు రేటింగ్‌లు, రివ్యూలు!
NEET విద్యార్థులు తప్ప మిగతా అందరూ కనిపిస్తారు. అక్కడ ఉన్న చాలామందికి NEET పూర్తి పేరు కూడా తెలియదు. ఒకపూట భోజనం తీసేస్తే సగం మంది మాయం... రెండు పూటలు తీసేస్తే జనమే ఖాళీ... మూడో పూట కూడా తీసేస్తే అభిజీత్ కూడా కనిపించడు!
ఈ మొత్తం దీక్షలో జోకర్ అభిజీత్.
పెళ్లి అంతా సిద్ధం చేశాడు... కానీ పెళ్లికొడుకు మాత్రం వాంగ్‌చుక్ అయిపోయాడు!
క్రెడిట్ పోస్టు: @grtbabamanish
The difference between Behen Mayawati Ji and the rest of the Bahujan leaders?
While others were busy demanding justice through protests, Mayawati chose political power to deliver it. When Behen Mayawati first time became Chief Minister, over 140,000 goons were jailed within just 2 months.
Others demand justice. Mayawati delivers it. That's the difference.
మన దేశంలో చాలా నిరాహార దీక్షలు జరిగాయి.
ఎవరి దీక్ష పూర్తిగా సక్సెస్ కాలేదు.
కానీ, SC-ST లకు వ్యతిరేకంగా గాంధీ చేసిన నిరాహార దీక్ష ఒక్కటే ఫుల్ సక్సెస్ అయింది.
సర్వే.నెం.367 నిషేధిత ప్రభుత్వ జాబితాలో ఉన్న భూమిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించొద్దు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో కష్ట జీవులకు ఒక న్యాయం-కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయమా?
అంటూ ముక్త కంఠంతో రౌండ్ టేబుల్ సమావేశంలో నినదించిన అఖిలపక్ష నాయకులు.
#Nagarkurnool#savegovtland
కారంచేడు నుంచి నేర్చుకున్నది సున్నా.
రాజ్యాంగం వచ్చి అనేక హక్కులను ఇచ్చింది, రక్షణ ఇచ్చింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చింది.
కానీ వచ్చిన మార్పేంటి?
తమను కొడుతున్నారని, వివక్ష చూపుతున్నారని నేటికీ ఫిర్యాదులు చేసే పరిస్థితిలోనే దళితులు ఉన్నరు.
దళిత సభలు జోరుగా జరుగుతున్నయి. రాజ్యాంగంపై లెక్చర్లు దంచుతూనే ఉన్నరు. తిరగేయలేనన్ని పేజీలతో పుస్తకాలు, ఆగిపోని రాగలతో పాటలు వస్తూనే ఉన్నయి.
ఆడుతున్నారు, పాడుతున్నరు.
ధర్నాలు, నిరసనలు చేస్తున్నరు.
అయినా పరిస్థితులు మారడం లేదు.
కారణం, ఓటు అనే ఆయుధాన్ని వదిలేసి యుద్ధం చేస్తున్నరు.
సంఘాలు, మేధావులు అని చెప్పుకునే దరిద్రులు కూడా అదే చేస్తున్నరు.
నిజం చెప్పాలంటే, ఈ దిక్కుమాలిన అలవాటు ఆ సంఘాలు, మేధావులు చేసిందే.
రాజ్యాంగ సభలో బాబాసాహేబ్ చెప్పిన మాట.. ఈ రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది అమలు చేసే వాడి చేతిలో ఉంటది. చెడ్డవాడు అధికారంలో ఉంటే రాజ్యాంగం పక్కదారి పడుతుందని అన్నరు. ఇదే కారంచేడు ఘటన నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ చట్టం ఉండి కూడా పాలకుల చేతిలో పతనం అవుతూనే ఉంది కదా.
చట్టాలు చేయించి, హక్కులు సాధించి పేపర్లలో పేర్లు వేసుకోవడానికి, సభలు పెట్టుకుని సన్మానం చేసుకోవడానికో తప్పితే ఎందుకూ పనికి రావడం లేదు.
ఎందుకంటే దళితుల దగ్గర అధికారం లేదు. నిజానికి అధికారం ఉంటే ఏ చట్టం అవసరం లేదు.
కమ్మలు, రెడ్లు, వెలమల కోసం ఏం చట్టాలున్నాయి? వారు బాగానే ఉన్నరు కదా. స్కాంలు చేసినా, నేరాలు చేసినా వారి వెంట్రుక కూడా ఊడటం లేదు కదా. అధికారం వల్లనే కదా అదంతా.
అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే అని బాబాసాహేబ్ చెప్తే.. అది వదిలేసి అడ్డమైన పనులన్నీ చేస్తరు. మాన్యవర్ కాన్షీరాం అధికారం సాధించి, నిరూపించినా కూడా.. దళితులకు రాజ్యాధికారం మీద నమ్మకం రావడం లేదు. మనువాద సమాజం విధించిన బానిసత్వం కంటే, దళితులు తమకు తాము విధించుకున్న బానిసత్వమే దీనికి ప్రధాన కారణం.
అరె, మామూలు ప్రజలకు తెలియదు. సంఘాలు, మేధావులన్నా అలా ఆలోచిస్తారనుకుంటే, వాళ్లు ఇంకా దారుణం. అధికారంతో ఏమొస్తది, అడుక్కుంటే పాచిపోయిన కూరలు పదొస్తయి అన్నట్లు ఉంటరు. దళిత, లెఫ్ట్ సంఘాల పగటి వేషాలు మామూలుగా ఉండవు. రాజకీయం అనే ప్రస్తావన లేకుండా పోరాటం, పోరాటం అని దళితులను గొర్రెల్లాగ ఉంచుతున్నరు. ఏడుపు గొట్టు పాటలు రాసుకుంట, ఏడుపుగొట్టు మాటలు చెప్పుకుంట దళితులను ఇంకా బలహీనులుగా, చాతకాని దద్దమ్మలుగా మారుస్తున్నరు.
ఈరోజు కారంచేడులో సభలు జరిగాయి, కారంచేడు గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ బాగానే జరిగింది. 40 ఏండ్ల నుంచి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. అప్పుడు ఊచకోత కోసిన కమ్మలు ఆనాదిగా అధికారం అనుభవిస్తూనే ఉన్నరు. దళితులు అదే దరిద్రంలో బతుకుతూనే ఉన్నరు.
తమ ఓటు తాము వేసుకోనంత కాలం.. ఇంకో వందేళ్లైనా.. కారంచేడు మీద కంటితుడుపు సభలు జరుగుతూనే ఉంటయి.