#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రాయలసీమ రైజింగ్ ... స్వర్ణయుగం ప్రారంభమైంది.
రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న గుర్తుకు వచ్చేవారు. వీటితోపాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు, స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ కూడా గుర్తుకు వస్తున్నాయి.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#RayalaseemaRising#RayalaseemaSteelPlant
రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరింది. సీమ ఖనిజ సంపద... సీమ అభివృద్ధికే వినియోగించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని సున్నపురాళ్లపల్లిలో 'జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్' పనులు ప్రారంభించి నిజం చేశాం. దీనికి అనుబంధంగా 'నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు'కు, అలాగే విజయనగరం జిల్లాలోని 'జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు'కు కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నాం. 2028 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి జరుగుతాయి. స్టీల్ ప్లాంట్ రాకతో కడపజిల్లా వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, వేలాది మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయి. అటు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్... ఇటు జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు రాష్ట్రంగా మారుస్తున్నాం.
@TheJSWGroup
ఒకే మతం అయినా ఒకే ఊర్లో ఒక కుల దేవతను మరొకరు మొక్కరు. అన్ని భావ వైరుధ్యాల విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉంటాయి.
వేరే కులం, వేరే ప్రాంతం, వేరే మతాల పండగలను సాధారణంగా గౌరవించరు లేదా పట్టించుకోరు.
కానీ కుల, మత, ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా లక్షలాది మందితో ఒక పండగ జరుగుతుంది.
నాలుగు దశాబ్దాలుగా జరుగుతోంది.
సమాజమంతా శుభానికి సూచికైన పసుపుమయం అయిపోతుంది.
తెలుగు నేలపై పసుపు జెండా కేవలం ఒక రాజకీయ గుర్తు కాదు; అది కోట్ల మంది గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు గారు నాటిన ఆశయాల మొక్క, నేడు మహావృక్షమై నిలిచింది. ఆ వృక్షానికి ప్రతి ఏటా మే నెలలో జరిగే వసంతోత్సవమే ‘మహానాడు’.
ఇది కేవలం ఒక పార్టీ ప్రతినిధుల సభ కాదు; కష్టాల కడలిని ఈది, అణచివేతలను ఎదుర్కొని, త్యాగాల పునాదులపై నిలబడిన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాల మేళవింపు.
నాడు, తెలుగు జాతికి ఒక ప్రత్యేక గుర్తింపును, ఢిల్లీ పీఠాల ముందు మోకరిల్లని ఆత్మగౌరవాన్ని ప్రసాదించడానికి అన్న ఎన్టీఆర్ చైతన్య రథమెక్కిన రోజులు గుర్తొస్తే నేటికీ నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది. ‘సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు’ అంటూ ఆయన ప్రవచించిన సిద్ధాంతం ఈనాటికీ మహానాడు వేదికలపై ప్రతిధ్వనిస్తూనే ఉంది.
అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజా పక్షాన నిలబడి పోరాడే తత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ పండుగ ప్రతి కార్యకర్తకూ నూరిపోస్తుంది. నాయకుడు దిశానిర్దేశం చేస్తే, ఆ దిశను తమ శ్వాసగా మార్చుకునే సైనికులు కదిలే ప్రస్థానం ఇది.
"ప్రాణం పోయినా, పీక కోసినా ‘జై తెలుగుదేశం’ అని పలికే నిబద్ధత.. కష్టకాలంలోనూ జెండాను గుండెలకు హత్తుకుని నిలిచే కార్యకర్తల త్యాగనిరతే ఈ పసుపు సైన్యానికి అసలైన బలం."
మహానాడు విశిష్టత ఎక్కడుందంటే, అది సామాన్య కార్యకర్తను అగ్రపీఠంపై కూర్చోబెడుతుంది. ఎండనక, వాననక, కక్ష సాధింపు చర్యలకు భయపడక, పార్టీ కోసం సర్వస్వాన్ని ధారపోసిన ప్రతి ఒక్కరి శ్రమకు లభించే గౌరవ వందనం ఇది.
నారా చంద్రబాబు నాయుడి సుదీర్ఘ విజన్, నారా లోకేష్ యువ చైతన్యం ఈ పండుగలో మేళవించి, సరికొత్త భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇటీవల ‘స్త్రీ శక్తి’ వంటి వినూత్న థీమ్‌లతో సమాజంలో సగభాగమైన మహిళలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, ‘మహానాడు’ కేవలం రాజకీయ తీర్మానాలకే పరిమితం కాకుండా సామాజిక విప్లవాలకు వేదికగా మారుతోంది.
చరిత్ర ఎప్పుడూ సులువుగా రాయబడదు; ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర త్యాగాలతో, పోరాటాలతో లిఖించబడింది. చీకట్లు ముసిరినప్పుడు వెలుగురేఖలా, కష్టాలు ఎదురైనప్పుడు కొండంత అండలా నిలబడే వ్యవస్థ ఇది.
ఈ పసుపు తోరణాలు, రాత్రి వేళల్లో సైతం కార్యాలయాల్లో వెలిగే కాంతులు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాణానికి, తెలుగుజాతి అఖండ ప్రగతికి సరికొత్త శంఖారావం. మహానాడు స్ఫూర్తి ప్రతి ఒక్కరి గుండెల్లో నిరంతరం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి!
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే సిద్ధాంతం.. జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం!
#Mahanadu2026
#SthreeShakti
#TeluguDesamParty
#AndhraPradesh
లేడీకి, లేడీ గెట్అప్కి తేడా తెలియని @ysjagan, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఒక బీసీ మంత్రిని వాడు–వీడు అంటూ సంబోధించి తన సహజమైన అహంకార ధోరణిని చూపించాడు.
జగన్ చేసిన ఆరోపణలపై జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ స్పందిస్తూ, మంత్రి వాసంసెట్టి సుభాష్‌తో తానే కలిసి నృత్యం చేశానని, అక్కడ ఎటువంటి అశ్లీలత లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని కోరారు.
#PsychoFekuJagan
#AndhraPradesh
విశాఖలో సిబిఐ, ఇంటర్ పోల్ కలిసి, డ్రగ్స్ సీజ్ చేస్తున్న సమయంలో, కంగారు పడి సిబిఐ విచారణకు ఆటంకం కలిగించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. ఇదే విషయాన్ని FIR లో పొందుపరిచిన సిబిఐ. వైసీపీ పెద్దల సూచన మేరకే, ఏపీ అధికారులు అక్కడకు వెళ్లి హడావిడి చేసారా? #APDrugsCapitalOfIndia#YCPDrugMafia
విశాఖలో సిబిఐ, ఇంటర్ పోల్ కలిసి, డ్రగ్స్ సీజ్ చేస్తున్న సమయంలో, కంగారు పడి సిబిఐ విచారణకు ఆటంకం కలిగించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. ఇదే విషయాన్ని FIR లో పొందుపరిచిన సిబిఐ. వైసీపీ పెద్దల సూచన మేరకే, ఏపీ అధికారులు అక్కడకు వెళ్లి హడావిడి చేసారా? #APDrugsCapitalOfIndia#YCPDrugMafia
విశాఖ పోర్టులో పట్టుబడ్డ లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కంటైనర్ తెరవకుండా, వైసీపీ అగ్ర నేతలు ఎందుకు ఒత్తిడి చేశారు ? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీనియర్ అధికారులు ఎందుకు అక్కడికి వెళ్లి, సీబీఐకి అడ్డు తగిలారు ? #APDrugsCapitalOfIndia#YCPDrugMafia#ByeByeJaganIn2024#AndhraPrades
విశాఖ పోర్టులో పట్టుబడ్డ లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కంటైనర్ తెరవకుండా, వైసీపీ అగ్ర నేతలు ఎందుకు ఒత్తిడి చేశారు ? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీనియర్ అధికారులు ఎందుకు అక్కడికి వెళ్లి, సీబీఐకి అడ్డు తగిలారు ? #APDrugsCapitalOfIndia#YCPDrugMafia#ByeByeJaganIn2024#AndhraPrades