*గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచించాయి*.
*కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన తర్వాత సుమారు రెండున్నర రోజుల్లో సిలిండర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది*.
*డెలివరీ ఆలస్యం అయితే*....
*ఇండేన్ గ్యాస్ వినియోగదారులు* 1800-2333-555 లేదా 7718955555 కు
*భారత్ గ్యాస్ కస్టమర్లు* 1800-22-4344 లేదా 7715012345 కు
*HP గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 లేదా 9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు
VIP break darshan
సిఫార్సు లెటర్ ద్వారా విఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొందటం :-
మీరు దర్శనం రెండవ తారీఖున తీసుకుంటే ఒక రోజు ముందుగా అంటే ఒకటవ తారీఖున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు JEO ఆఫీసులో సిఫార్సు లెటర్, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు,వారు ఒక ఫారం ఇస్తారు.అది పూర్తి చేసి ఇస్తే దాని మీద stamp వేసి ప్రక్క బిల్డింగ్ లోకి వెళితే ఒక slip ఇస్తారు.అది తీసుకుని వచ్చేయండి.ఒక లెటర్ మీద ఆరుగురికి మాత్రమే దర్శనం అవకాశం. లెటర్ ఎవరి పేరు మీద ఉన్నదో వారు మాత్రం తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది. మిగిలిన వారు అవసరం లేదు
వారు తనిఖీ చేసి లభ్యత, సిఫార్సు లెటర్ ఇచ్చిన వారి ప్రాముఖ్యత పరిగ��లోకి తీసుకొని సాయంత్రం 6 గంటలకు మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది. ఆ మేసేజ్ వచ్చిన తర్వాత మీరు MBC 34 కి వెళ్ళి మెసేజ్, మీకు ఉదయం ఇచ్చిన slip చూపించి మనిషికి 500/- చొప్పున చెల్లించి టిక్కెట్లు తీసుకోగలరు. లేదా మెసేజ్ తో పాటు మీకు వచ్చిన లింకును క్లిక్ చేసి Payment చేసి దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్లో ప్రింట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి ..
మరుసటి రోజు ఉదయం వారు ఇచ్చిన సమయానికి( షుమారు ఉదయం 6.30 నుండి 7.30 క��� మధ్యలో ఉంటుంది) వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు..ఇప్పుడు ఈ దర్శనం కూడా గంట పడుతుంది.ఈ బ్రేక్ దర్శనం సమయాలు మారుతుంటాయి.మీ టిక్కెట్ మీద చూసుకోండి. మొదట ప్రోటోకాల్ వ్యక్తులను (L1) బ్రేక్ దర్శనానికి పంపడం జరుగుతుంది ( వీరికి దర్శనం మొదటి గడప వరకు ఉంటుంది ). తరువాత రిఫరెన్స్ లెటర్ తో వచ్చిన వారిని పంపడం జరుగుతుంది. ( వీరికి జయవిజయులు దాటిన తరువాత రాములవారి మెడ వర��ూ దర్శనానికి అనుమతిస్తారు )
గమనిక : కొన్ని ప్రత్యేక పర్వదినాలలో ముందుగా ప్రకటించి బ్రేక్ దర్శనం రద్దు చేయవచ్చు.
దర్శన సమయములో ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డు తీసుకుని రావలసి ఉంటుంది.12 సంవత్సరాల లోపు పిల్లలకు టిక్కెట్ అవసరం లేదు.
**మీకు సిఫార్సు లెటర్ మీద వసతి కూడా కావాలి అనుకుంటే అదే లెటర్ ఒక ఫోటోస్టాట్ తీసుకుని వెళ్ళండి.
దాని మీద CRO ఆఫీసుకు stamp వేసి ఇస్తారు. అది తీసుకుని CRO ఆఫీసులో రూం తీసుకోవాలి. ( స్టాంప్ వేసేటప్పుడు MBC-34 స్టాంప్ వేయమని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది JEO ఆఫీసు ప్రక్కనే.. లేదంటే మీరు దూరంలో ఉన్న CRO ఆఫీసుకు రావలసి ఉంటుంది. అక్కడ చాలా రద్దీ ఉంటుంది.)
1.2. MBC 34
3. JEO ఆఫీస్ తిరుమల
*వృద్ధుల కో���ం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభం*
తిరుపతిలో వృద్ధుల కోసం ఉచితంగా బాలాజీ దర్శన పథకం ప్రారంభమయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించారు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులు ఈ పథకానికి అర్హులు.
ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులకు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఎస్ 1 కౌంటర్ వద్ద ఫొటో గుర్తింపు కార్డుు, వయస్సు ధృవీకరణ పత��రం చూపితే దర్శనానికి అనుమతిస్తరు.
వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా దేవాలయం కుడిగోడ వెంబడి ముందుకు వెళ్లాలి. దర్శనానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. క్యూ లైన్లోకి వెళ్లాక 30 నిమిషాల్లో దర్శనం పూర్తవుతుంది. దర్శనానంతరం భక్తులకు ఉచిత భోజనంతో పాటు వేడి పాలు అందిస్తారు. సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం హెల్ప్ డెస్క్ నంబర్ 87722 77777 ను సంప్రదించవచ్చు....
మా విలేజ్ లో సర్పంచ్ బరిలో ఉన్న ఓ వ్యక్తి వాట్సాప్ స్టేటస్
రెండు బంధాలను కలపాలంటే “ఒంగరం”కావాలి
అదే కలిసి ఉన్న బంధాలను విడదీయాలంటే “కత్తెర” కావాలి
దయచేసి ఆలోచించి ఓటు వేయండి
భారత్ చుట్టూ అంతులేని అశాంతి, ���ల్లర్లు.
మయన్మార్ ప్రజాస్వామ్యం కూలింది.
శ్రీలంక ప్రజాస్వామ్యం కూలింది.
బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం కూలింది.
పాకిస్తాన్ ప్రజాస్వామ్యం కూలింది.
ఇప్పుడు నేపాల్ ప్రజాస్వామ్యం కూలింది.
ఇన్ని విపత్తులను తట్ట��కుని కూడా భారత్ నిలిచింది.
ఎన్నో నిరసనలు వచ్చాయి, ఎన్నో విపత్తులు వచ్చాయి.
ప్రభుత్వాలు కూలాయి. కానీ ప్రజాస్వామ్యం చెక్కుచెదరలేదు.
ఒక పార్టీ పోయి, ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, పార్లమెంట్ సగర్వంగా నిలబడే ఉంది.
ఇంత పెద్ద దేశంలో ఎన్నో వైవిధ్యాలతో కూడా దేశం బెనకకుండా ఉందంటే.. దానికి కారణం బాబాసాహేబ్ అంబేద్కర్ విజన్.
ఆయన ఇచ్చిన విలువైన రాజ్యాంగ బ��లం.
ఆయన అందించిన ప్రజాస్వామ్య విలువల బలం.
జై భీం.. జై భారత్
*వారాహి* MCA travels
మిడిల్ క్లాస్ అరేంజ్మెంట్స్ ట్రావెల్స్
1. కారు ఒక్కటే రెంట్ ఒక రోజుకి 2500 /-
2. కారు+డ్రైవర్ రెంట్ ఒక రోజుకి 3000/-
3. పెట్రోల్ + టోల్ ప్లాజా కస్టమర్ బాధ్యత
4. డ్రైవర్ బీటా + భోజనం చార్జెస్ లేవు తీసుకోము
5. ఇండియాలో ఎక్కడి నుండి ఎక్కడికైనా మీ ఇష్టం లోకల్ or ఔట్ సైడ్ తక్కువ ధరలకే కారు ఏర్పాటు చేయబడును
6. తిరుపతి ట్రిప్ అరుణాచలం ట్రిప్ తమిళనాడు ట్రిప్ మహారాష్ట్ర ట్రిప్ కాశి అయోధ్య ట్రిప్ స్పెషల్ ప్యాకేజీ కలదు
7. *లోకల్ గుడులు* చిన్న తిరుపతి జమలాపురం గుబ్బలమగమ్మ పెనుగంచిప్రోలు తెనాలి కోటప్పకొండ మంగళగిరి అమరావతి సైడ్ తకువ ధరకి చూపించబడును
8. మాది 7సీటు కారు ఫుల్ ఏసీ 5 నెలల కొత్త కారు జనాభా లావు ఒక మాదిరి ఉన్న వారు 6 పడతారు సన్నగా ఉంటే 7 పడతారు డ్రైవర్ కాకుండా 6 లేదా 7 చాలా కంఫర్ట్ ఉంటుంది
9. మిడిల్ క్లాస్ వారి గురించి మేము ఆలోచించి చేసిన ట్రావెల్స్ వ్యాపారిని దయచేసి మాకు సహకరిస్తారని మీ ఆదరణ అందిస్తారని కోరుతున్న🙏
ముఖ్య గమనిక *కారు కావలసినవారు ఊరు వెళ్తామనుకునేవారు మాత్రమే సంప్రదించండి చాలా వివరంగా విషయం చెప్పాను ఫోన్ చేసి టైంపాస్ కాల్స్ చేయొద్దు*
ప్రేమ్ కుమార్ సుంకర
9014 946 946
విజయవాడ
రానున్న గురుపౌర్ణమి/ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే వారికి 👇🏽👇🏽
అరుణాచలంలో ఉదయం నుండి ర��త్రి దాకా భోజనాలు ఎక్కడెక్కడ లభించును అనే ఇన్ఫర్మేషన్ సేకరించి పొందుపరుస్తున్నాం అవసరం ఉన్నవాళ్లు ఉపయోగించుకోండి.
1. ఉదయం 5:00 నుంచి 5:30 లోపు శేషాద్రి అశ్రమం దగ్గర్లో తిరువడు దురై ఆటో వస్తుంది. (కామాక్షి గుడి దగ్గరనుండి వరుణ లింగం వరకు వెళ్తుంది) ఈ ఆటోలో వేడివేడి ఇడ్లీ సాంబారు, హెర్బల్ టీ లభించును.
2. ఉదయం 7.45 గంటలకు అతిధి ఆశ్రమం ముందు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం పక్కన మీనమ్మ అని ఒక ఆవిడ వేడి వేడి ఇడ్లీ చట్నీ సాంబార్ ఇస్తారు. ఇక్కడ ప్లేట్స్ మీరే తీసుకొని వెళ్లాలి.
3. ఉదయం 8 గంటలకు యమాలింగం పక్కన టిఫిన్ పెడతారు.
4. ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి దాటాక షేడ్ (వరుణ లింగం దగ్గర)లో సుకినోభవ ట్రస్టు వారు వేడివేడి టిఫిన్ అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు.
5. ఉదయం 8 గంటలకు 63 నాయనర్లు గుడి వారు ప్రసాదం ఇస్తారు.
6. ఉదయం 8 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు టిఫిన్ పెడతారు
7. ఉదయం 7:30 నుండి చంద్��� లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు గంజి పొస్తారు.
8. ఉదయం 8 గంటలకు సౌత్ గోపురం ముందు వున్న వినాయక గుడిలో గంజి పొస్తారు.
9. ఉదయం 9:00 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమం వారు టిఫిన్ పెడతారు.
10. ఉదయం 9:30 గంటలకు రమణ మహర్షి ఆశ్రమం నందు పెరుగన్నం, సాంబార్ అన్నము పెడతారు.
11. ఉదయం 11 గంటలకి యమలింగం దాటిన తర్వాత నంది పక్కన రుద్రాక్ష స్వామి వారు భోజనం ఇస్తారు.
12. ఉదయం 11 గంటల���ి రాఘవేంద్ర స్వామి గుడిలో నిత్యగ్ని ట్రస్టు వారు భోజనం పెడతారు.
13. ఉదయం 11:15 గంటలకు యోగిరాం సూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు (పర్మిషన్ తీసుకున్న వారికి) మాత్రమే భోజనం పెడతారు.
14. ఉదయం 11:30 గంటలకు ఆది అన్నామలై గుడిలో భోజనం లభించును.
15. ఉదయం 11:30 గంటలకు నీర�� అన్నామలై గుడి వెనకాల జీవ కారుణ్య, వల్లలార్, ఇంకొక ఆశ్రమం వుంది ఈ మూడు ఆశ్రమాలలో భోజనం లభించును.
16. 12:00 గంటలకు సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) నందు భోజనం లభించును.
17. 12:00 గంటలకి టెంపుల్ దగ్గర గాంధీ బొమ్మ వెనకాల సాదు సదం (సత్రం) గ్రిల్స్ ఉంటాయి అందులో సాధువులకు మాత్రమే భోజనం లభించును ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు గంటలకల్లా అక్కడికి వెళ్లాలి నిమిషం అటు ఇటు అయినా లోపలికి రానివ్వరు.
18. 12:00 గంటలక�� అన్నామలై మెయిన్ గుడి భోజనం లభించును దీనికి క్యూ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వెళ్లి నిల్చోగలరు రోజుకి 3 బంతులకు భోజనం పెడతారు.
19. 12:00 గంటలకు వళ్ళలార్ (రమణ ఆశ్రమం డిస్పెన్సెర్ ముందు) నందు భోజనం పెడతారు.
20. 12:00 గంటలకు శేషాద్రి ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.
21. 12:00 నుండి చంద్ర లింగం దాటిన తరువాత (అధికార నందికి ముందు) కుడివైపు వళ్ళలార్ వాళ్ళు భోజనం పెడతారు.
22. 12:30 గంటలకు యోగిరా�� సూరత్ కుమార్ ఆశ్రమంలో పెరుగన్నం, సాంబార్ అన్నము లభించును.
23. గిరివలం రహదారిలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఆహార వాహనం బండ్లు తిరుగుతూ ఉంటాయి మీకు కనబడినప్పుడు మీరు ఆపి తినవచ్చు.
24. పెద్ద గుడి దగ్గర రాజగోపురం ముందు ఎడమవైపు కుడివైపు మెయిన్ రోడ్ లో ఉదయం పూట, సాయంత్రం పూట ఎవరో ఒకరు బండి మీద ప్రసాదం పెడుతూనే ఉంటారు.
25. సౌత్ గోపురం ముందున్న రోడ్ లో కామాక్షి గుడి దాటాక వచ్చే ఎడమ పక్క రహదారిలో కొంచెం ముందుకు వెళ్ళాక ఆవులు కట్టేసి ఉంటాయి అక్కడ ఉదయం పూట టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం పూట భోజనం పెడతారు, సాయంత్రం పూట భోజనం పెడతారు.
26. గిరి వలం రహదారిలో రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అన్ని ఆశ్రమాలలో అప్పుడప్పుడు (డోనార్స్ వున్నప్పుడు) భోజనం పెడుతూనే ఉంటారు.
27. 4గంటలకు అతిధి ఆశ్రమం (యోగి రాం సూరత్ కుమార్ ముందు) వాళ్ళు సాధువులకు టిఫిన్ పాకెట్స్ ఇస్తారు.
28. సాయంత్రం 5 గంటలకు పలకొత్తు శక్తి అమ్మ గుడి వెనుక చపాతీ కానీ ఇడ్లీ కానీ పాకెట్స్ (పర్మిషన్ తీసుకున్న వాళ్లకు లోపల) ఇస్తారు.
29. సాయంత్రం 5 నుండి 63 నాయనర్ ట్రస్ట్ (సద్గురు ట్రస్ట్ ఎదురు, వరుణ లింగం వెళ్ళాక ముందు ఎడమవైపు) వాళ్ళు సాంబార్ రైస్ పెడతారు.
30. సాయంత్రం 6 గంటల నుండి సద్గురు ట్రస్ట్ (సడై స్వామి) బండి గిరివలం రోడ్ లో భోజనం ��ెడుతూ శేషాద్రి ఆశ్రమం వరకు వస్తారు.
31. సాయంత్రం 6:00 గంటలకు శేషాద్రి స్వామి వారి హారతి తరువాత ప్రసాదం పెడతారు.
32. సాయంత్రం 6:00 నుండి 6:30 గంటల వరకు అగస్తియర్ ఆశ్రమం నందు చపాతీ ఇస్తారు, వీరు ఉదయం 7:00 గంటలకు టిఫిన్ ఇస్తారు, 11:00 గంటల నుండి బోజనం పెడతారు. వీరికి ఇప్పుడు ఫండ్స్ లేవు కనుక చపాతీ మాత్రమే ఇస్తున్నారు. ఈ ఆశ్రమం నాన్నగారి ఆశ్రమం దగ్గర వుంది.
33. సాయంత్రం 7:30 గంటలకు కొడిస్వామి (వరుణ లింగం వెళ��ళాక ముందు ఎడమవైపు) వారు ప్రసాదం పెడతారు. 1/2