సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన వడ్డెరుల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి హాజరయ్యాను. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వడ్డెరలు తరతరాలుగా వెనుకబడ్డారు. ఈ అధిపత్య పాలకులు వడ్డెరులను కేవలం ఓటర్లుగానే చూస్తూ, చట్టసభల్లో అవకాశాలు కల్పించకుండా సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా అణిచివేస్తున్నారు.
వడ్డెరలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంలో గతంలో పాలించిన అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్ర అసెంబ్లీలో వడ్డెర సామాజిక వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్య��� కూడా లేరు.వడ్డెర కులాలు అభ్యున్నతికి ఏకైక పరిష్కారం రాజ్యాధికారం ఒక్కటే.
రండి..!,ఆధిపత్య పార్టీలు ఇచ్చే బీ-ఫామ్ ల కోసం వాళ్ల పార్టీ కార్యాలయాలకు బారులు తీరడం అవసరం లేదు. మన పార్టీలో మనమే పోటీ చేసుకుందాం! మన ఓట్లు మనమే వేసుకుందాం! బహుజన వర్గాలకు రాజకీయ ఫలాలు అందించి, చట్టసభల్లోకి పంపించే ఏకైక పార్టీ #BSP మాత్రమే.
#VR99
#BSP4BC
తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమల కార్పొరేషన్ (ఒకప్పటి లిడ్ క్యాప్) ���ూములను ప్రభుత్వం రక్షించాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో "మా భూములు మాకేనని" ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నాను. తెలంగాణలో లిడ్ క్యాప్ కోసం కేటాయించిన వందల ఎకరాల భూముల్లో #KCR ప్రభుత్వం స్టార్టప్ లెదర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయకుండా ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా లిడ్ క్యాప్ భూముల్లో స్టార్టప్ లెదర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి, చర్మకారులకు బ్యాం��ు రుణాలు మంజూరు చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. దళితులకు రాజకీయ అధికారం దక్కితేనే సామాజిక,రాజకీయ,ఆర్థిక విముక్తి లభిస్తుంది. అందుకు ఓటే మన వజ్రాయుధం. దాన్ని వాడుకొని బహుజనరాజ్యాన్ని స్థాపిద్దం.
#VR99
#Lidcap
#Savelidcaplands