Withdrawing security from an ex-IPS officer like @RSPraveenSwaero, who faces continuous life threats for his dynamic role in dismantling criminal and extremist networks, is not just politically vengeful; it is a blatant violation of @revanth_anumula’s administrative responsibility and constitutional Right to Life..
The ultimate irony is that while the State Security Review Committee acts on political whims to strip a decorated cop’s cover, the CM’s non-official relatives and brothers enjoy full, state-funded protection! @TelanganaDGP
If the CM thinks withdrawing security is an effective intimidation tactic, he is wrong. It is seen as his mediocre politics and an ugly, desperate display of unruly authority against the opposition.
No amount of your arrogant, authoritarian intimidation will ever silence RSP from questioning your anarchic governance.
We shall continue to fight tooth and nail against your TYRANNY & UNTILL YOU STEP DOWN.. @TelanganaCMO…Watch out✊
BIG BREAKING 🚨
మొత్తం మీద సీయం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు.
కంగ్రాట్స్💐💐💐
కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ కు నిన్న రాత్రే బెయిల్ మంజూరు అయింది. హోంమంత్రి రేవంత్ పోలీసులు, ప్రాసిక్యూటర్ లు నిందితుడి బెయిల్ పిటీషన్ ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం.
ఇవాళ ఉదయం ఫార్చూనర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్లి పోయారు!
తెలంగాణ మహిళలారా,
మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా?
@TelanganaDGP@TelanganaCOPs@CPCyberabad
ఈ రోజు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగుళూర్ గ్రామంలో ఒక ప్రార్థనా మందిరంపై మతోన్మాద అల్లరి మూకలు పట్టపగలే దాడి చేసి భక్తులను గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన స్వేచ్ఛ రాజ్యాంగం (Article 25) ఇచ్చిన ప్రాథమిక హక్కు. దీనిని ఎవరూ కాలరాయలేరు.
ఇవే అల్లరిమూకలు గతంలో కూడా ఇబ్రహీంపట్నంలో ఒక ప్రార్థనా మందిరం పై దాడి చేశాయి. వాళ్ల మీద పోలీసు నిఘా మరియు నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ రోజు మళ్లీ వాళ్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇరవై మంది దాడి చేస్తే కేవలం ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. ఈ సంఘటనలో విఫలమైనఅధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. నిందితులపై పీడీ యాక్ట్ వెంటనే ప్రయోగించాలి.
హైదరాబాదు నగరంలో లోనే మతోన్మాదులు ఈ విధంగా పెట్రేగిపోతుంటే పోలీసులు ఏంచేస్తున్నట్లు? ముఖ్యమంత్రి-హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సోయి ఉన్నదా? ఎప్పుడైనా రాష్ట్రం లో మతోన్మాదం పై రివ్యూలు చేసిండ్రా మీరు సీయం గారు? మీకు తెలిసిందంతా కేవలం @BJP4India తో కుమ్మక్కై @BRSparty పై అక్రమంగా కేసులు పెట్టడమే.
దాడికి సంబంధించిన వీడియోలు మా వద్ద ఉన్నాయి. కానీ ఇది శాంతిభద్రతల కు సంబంధించిన సున్నితమైన అంశం కావున ఇక్కడ షేర్ చేయడం లేదు. సీయం రేవంత్ రెడ్డికి బాధ్యత లేకపోవచ్చు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా మాకు రాష్ట్ర ప్రజల రక్షణ పై బాధ్యత ఉంది.
జై తెలంగాణ. జై భీం. జై భారత్.
✊
@TelanganaDGP@CPHydCity@SajjanarVC_IPS@KTRBRS@revanth_anumula@RahulGandhi@BuntyBRS@ManchireddyBRS
తెలంగాణలో లా లేదు, ఆర్డర్ లేదు, శాంతి లేదు, భద్రత కూడా లేదు.
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరియు హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నడి ఒడ్డున జరుగుతున్నటువంటి హత్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఈ రోజు సంజీవయ్య నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం హత్యకు గురైన, శ్రవణ్ అనే యువకుడి కుటుంబాన్ని బిఆర్ఎస్ నాయకులు డా. మన్నె క్రిశాంక్ తో కలిసి పరామర్శించడం జరిగింది.
గంజాయి తాగిన యువకులు శ్రావణ్ అనే యువకుడ్ని చంపే ప్రమాదం ఉన్నదని తెలిసి, బాధితుని కుటుంబ సభ్యులు సంఘటన జరిగిన రోజు రాత్రి 11.28 గం.లకు డయల్ 100 కు కాల్ చేస్తే పోలీసులు 40 నిమిషాల వరకు రాలేదు అని బాధితులు అంటున్నారు. This is serious breach of first responder protocol.
అంతేకాకుండా నిందితులంతా గతంలో మర్డర్, హత్య ప్రయత్నం కేసుల కింద జైలుకు వెళ్లి వచ్చినవారే. వారి మీద ఎలాంటి నిఘా లేదని అర్ధం అయితున్నది.
నాలుగు రోజుల క్రితం నిందితుల దగ్గరికి ఎక్సైజ్ పోలీసులు వచ్చి, వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి, వాళ్ల దగ్గర దొరికిన గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది.
కానీ ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారులకు తెలవదు. ఎక్సైజ్ ఏంచేస్తుందో అది సివిల్ పోలీసులకు తెలవడం లేదు!! మరి వందల కోట్ల తో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో ఏం జరుగుతున్నది?
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత నిచ్చి కోట్లాది రూపాయల ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ ను నిర్మించి,పోలీసులు అందరికీ పెట్రోలింగ్ వాహనాలు ఇచ్చి, షీ టీమ్స్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడడం జరిగింది.
కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరియు హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తానే హోం మంత్రిగా ఉంటూ పోలీసు యంత్రాంగాన్ని పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణలో హత్యలు నేరాలు పెరుగుతున్నాయి. పైగా పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడానికి వాడుతున్నారు!
ఇటీవలే డిజిపి ఆఫీస్ కు కేవలం కిలోమీటర్ దూరంలో ఒక అడ్వకేట్ ను దారుణంగా వాహనంతో గుద్ధి చంపారు.
కరీంనగర్ లో PMJ జువెల్లరీ షాప్ లో తుపాకులతో వచ్చి అక్కడి సిబ్బందిపై కాల్పులు జరిపి మరి దోచుకొని వెళ్లడం జరిగింది ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.
గతంలో సుమారు 10 నుండి 12 లక్షల సీసీటీవీ కెమెరాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఈరోజు మాత్రం గంజాయి, డ్రగ్స్ సేవిస్తున్న యువతకు భయపడి కాలనీవాసులే ఇంటింటికి సీసీ కెమెరా పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.
వెంటనే దీనిపై రాష్ట్ర డిజిపి విచారణ చేపట్టి, బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకొని నిందితులపై పిడి యాక్ట్ ప్రయోగించి, తిరిగి వాళ్ళు జైలు నుండి బయటకు రాకుండా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP@MalkajgiriCop@TelanganaCOPs
#TelanganaSinking
రాజస్థాన్ లో NEET పేపర్ లీక్ అయిందని నిర్ధారించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించడం చాలా దురదృష్టకరం.
తెలంగాణ లో మైనర్ బాలికల పై @BJP4India MP మరియు కేంద్ర హోంమంత్రి మంత్రి తనయుడి దురాగతాల వార్తల నుండి కోలుకోక మునుపే ఈ నీట్ దుర్వార్త రావడం అత్యంత బాధాకరం.
బిజెపి పాలనలో ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి లీకులు జరిగాయి. అయినా కమల నాధుల తీరు మారలేదు.
వీళ్లకు వ్యాపారం, ఎన్నికలు, మత కల్లోలాల మీద ఉన్న శ్రద్ధ విద్య మీద ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నేడు ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థి లోకానికి ఇది ఒక చీకటి రోజు.
ప్రధాని మోడీ గారు,దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఎటు పోతుంది మన దేశం?
@narendramodi@BRSparty
#NEET
#SayNo2BJP
Congratulations to @actorvijay@TVKVijayHQ on a remarkable debut in Tamil Nadu politics.
This mandate reflects the hopes of the people. Best wishes as he embarks on his journey in public life.
నేడు-నాడు:
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి డిగ్రీ విద్యార్థులను ఎగ్జామ్స్ సెంటర్ కి తీసుకొని వెళ్లే విధానంలో మహాలక్ష్మి బస్సు ద్వారానే మీరు ఎగ్జామ్స్ సెంటర్ కి వెళ్ళాలని వారికి హెడ్ ఆఫీస్ నుండి చెప్పారంట.
గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు మాట్లాడి విద్యార్థులను దూర ప్రాంతాల కాలేజీల నుండి ఎగ్జామ్స్ సెంటర్ వరకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చేవారు.
ఇప్పుడు ఈ మహాలక్ష్మి బస్సులో వెళ్తే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రశాంతత కోల్పోతారు. బస్సులు లేటయితే ఎగ్జామ్ సెంటర్ కు రానిస్తారా, సీయం గారు?
ఒక్క సారి ఆలోచించండి.
@TelanganaCMO
.@TelanganaCMO
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (కొత్త మరియు రెన్యువల్) దరఖాస్తు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 20, 2026 నుండి మరో నెల రోజులు పెంచాలని SC, ST, BC, EBC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు కొరుకుంటున్నారు .
కారణం: ఆధార్ కార్డుల సవరణ ఇంకా పూర్తిగా జరగకపోవడం.
@minister_adluri@TelanganaCS
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
ఈ రోజు ఏప్రిల్ 11 మహనీయులు మహాత్మ జ్యోతిభా ఫూలే జయంతి శుభాకాంక్షలు.
మహనీయులు చెప్పినట్లుగా విత్తం వివేకం విఙ్ఞానం సంపాదించినపుడే మనందరం అథోగతి పాలు కాకుండా అన్ని రంగాల్లో రాణించగలుగుతాం.
కేవలం విద్య ఒక్కటే విత్తం,వివేకం,విజ్ఞానం ఇస్తుంది.
అయితే ప్రభుత్వాలు ఆ విద్యనే మనకు అందకుండా చూస్తున్నాయి,విద్యకు దూరం చేయడానికే,వివేకానికి,విత్తానికి దూరం చేయడానికే కామారెడ్డి డిక్లరేషన్ వంటి అందమైన మేడిపండు లాంటి హామీలు ఇస్తున్నాయి.
కావున గమనిద్దాం. ఘర్షణ చేద్దాం. గెలుద్దాం.
జీవితాంతం విద్య కోసం పోరాడిన మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
#JyotibaPhule
పేద కుటుంబంలో జన్మించి,సుదీర్ఘంగా 50 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసి,8 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై,1974లో ఎదురైన కరువు సమయంలో,భారత్ పాక్ యుద్ధ సమయంలో అత్యంత ధైర్య సహసాలు ప్రదర్శించి,దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి, దేశ అభివృద్ది కోసం, ప్రజల్లో సమానత్వం కోసం పని చేసిన యోధుడు,మేధావి డా.బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిద్దాం.
💐💐💐🙏🙏🙏
Hon’ble Supreme Court completely got this Dalit Christian issue wrong. Today’s judgment is a direct violation of Article 15 and 25 of Indian Constitution.
Govt of India MUST file an appeal in Supreme Court requesting the bench to rescind this decision.
Practising a religion is a matter of personal choice of a citizen and it must NOT be linked to the rights accrue by virtue of being born in particular caste.
In spite of converting to Christianity or Islam or Buddhism,
Scheduled castes continued to be the victims of oppression. The famous Karamchedu and Tsundur of massacre victims (Andhra Pradesh) were all following Christian faith. This is the stark reality in India even today.
This judgment puts lives of lakhs of oppressed citizens who follow Christianity or Islam in peril. They cannot be protected by SC/ST Atrocities Act hereafter.
BJP is deliberately delaying Justice KG Balakrishnan’s Committee’s Report whose mandate was to look into this long pending issue.
దళిత క్రైస్తవుల అంశం పై నేటి సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
ఈ తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నది.
భారత ప్రభుత్వం తప్పనిసరిగా సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసి, ఈ తీర్పును రద్దు చేయాలని బెంచ్‌ను కోరాలని డిమాండ్ చేస్తున్న.
ఏ మతాన్ని అనుసరించాలనేది ప్రతి పౌరుని వ్యక్తిగత ఇష్టం. దీనిని ఒక నిర్దిష్ట కులంలో జన్మించడం వల్ల వచ్చే హక్కులతో ఎంతమాత్రం ముడిపెట్టకూడదు.
క్రైస్తవం, ఇస్లాం లేదా బౌద్ధం వంటి మతాలకు మారినప్పటికీ, షెడ్యూల్డ్ కులాల వారు ఇప్పటికీ అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ కారంచేడు మరియు చుండూరు హత్యాకాండలలో బాధితులంతా చాలా వరకు క్రైస్తవ మతాన్ని అనుసరించిన వారే. ఇది భారతదేశంలో ఈనాటికీ కనిపించే కఠోర వాస్తవం.
ఈ తీర్పు క్రైస్తవం లేదా ఇస్లాం మతాలను అనుసరించే లక్షలాది అణచివేతకు గురైన పౌరుల జీవితాలను ప్రమాదంలోపడేసే అవకాశం ఉన్నది.
ఇకపై వారు ఎస్సి/ఎస్టి అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ పొందడం కష్టం.
ఈ సుదీర్ఘకాలిక సమస్యను పరిశీలించడానికి నియమితమైన జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిటీ రిపోర్టును బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది. ఇది ఒక భారీ కుట్ర.
@ANI@PTIofficial@uniindianews@BRSparty