దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా యువత, రైతులు, మహిళలు, ఇతర వర్గాలు ప్రత్యేక విభాగాలుగా ఉంటాయి.
కానీ గొడ్డలి పార్టీకి మాత్రం —
▪️ గంజాయి బ్యాచ్
▪️ బ్లేడ్ బ్యాచ్
▪️ సోషల్ మీడియా సైకో బ్యాచ్
▪️ ఫేక్ ప్రచారాల కోసం పేటీఎం బ్యాచ్
▪️ హత్యా రాజకీయాల కిరాయి ముఠా బ్యాచ్
▪️ దేవాలయాలపై దాడి చేసే బ్యాచ్
▪️ కల్తీ లిక్కర్ బ్యాచ్
ఇలా ఏడు విభాగాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని విధ్వంసం చేసే రాజకీయాలకే పరిమితమైంది.
ప్రజలకు అభివృద్ధి చూపించలేని వారు… అశాంతి, అబద్ధాలు, అరాచకాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు.
#GoddaliParty
#PsychoFekuJagan
#EndOfYCP
#Andhrapradesh
#Mahanadu2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోట్లాది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి. సమష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయగలమో టీడీపీ కుటుంబం నిరూపించింది.
#SthreeShakti
నేను డీఎస్సీ కోసం ఎదురు చూసిన నిరుద్యోగిని... @ysjagan గారికి నా ప్రశ్నలు
ఒక ఉద్యోగం కోసం ఎంతకాలం ఎదురు చూడాలో నిరుద్యోగులకే తెలుసు. ఒక నోటిఫికేషన్ వస్తుందేమో అని ప్రతి రోజు పేపర్ చూస్తూ, ప్రతి బడ్జెట్లో ఆశలు పెట్టుకుని, ప్రతి ఎన్నికల్లో హామీలు వింటూ గడిపిన సంవత్సరాలు మావి.
నేను కూడా అలాంటి వేలాది మంది యువతలో ఒకడిని. టీచర్ కావాలనేది నా కల. మా కుటుంబం ఆశ. కానీ గత ఐదేళ్లు ఆ కల కేవలం కలగానే మిగిలిపోయింది.
2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ యువత ఎంతో ఆశ పెట్టుకుంది జగన్ గారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వస్తుందని, డీఎస్సీలు జరుగుతాయని, ఖాళీలు భర్తీ అవుతాయని నమ్మింది. కానీ జరిగినది ఏమిటి?
ఐదేళ్లలో ఒక్క మెగా డీఎస్సీ కూడా లేదు.
లక్షలాది మంది యువత వయసు పెరిగింది. కొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. కొందరు కుటుంబ బాధ్యతలతో పరీక్షలకే దూరమయ్యారు. మరికొందరు ఆశలు కోల్పోయారు.
అప్పుడు మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడని మీరు... ఇప్పుడు 16,347 పోస్టులతో జరిగిన మెగా డీఎస్సీపై ఏడాది తర్వాత అకస్మాత్తుగా కన్నీళ్లు కార్చడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.
నిజంగా మీకు యువతపై ప్రేమ ఉంటే ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు?
ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. నా లాంటి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. మా కుటుంబాల్లో ఆనందం వచ్చింది. మా తల్లిదండ్రుల కష్టాలకు ఫలితం దక్కింది. కానీ ఆ ఆనందం కూడా మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నట్టు ఉంది.
మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే కేసుల మీద కేసులు వేశారు. కోర్టులకు వెళ్లారు. ప్రక్రియ ఆగిపోవాలని ప్రయత్నించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు విడుదల చేసింది. మెరిట్ లిస్టులు పెట్టింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసింది. చివరకు నియామకాలు పూర్తిచేసింది.
ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాక, శిక్షణలు పూర్తయ్యాక, పాఠశాలల్లో చేరాక మళ్లీ కొత్త కథలు మొదలుపెట్టడం ఎందుకు?
మీ ఆరోపణలు నిజమైతే ఒక అభ్యర్థి అయినా ముందుకు వచ్చి "నేను డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాను" అని చెప్పాడా?
ఒక్క నియామకం అయినా అక్రమమని నిరూపించగలిగారా?
ఒక్క అభ్యర్థి అయినా రాజకీయ సిఫారసుతో ఉద్యోగం పొందాడని ఆధారాలు చూపించగలిగారా?
లేకపోతే ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలే కాదా?
ఇంకా విచిత్రం ఏమిటంటే... డీఎస్సీ గురించి మాట్లాడుతున్న మీ పార్టీకి గతంలో డీఎస్సీ అవినీతి ఆరోపణల చరిత్ర ఉంది. ఓఎంఆర్ షీట్లు మార్చారని, డబ్బులు తీసుకుని మార్కులు పెంచారని కేసులు నమోదైన రోజుల గురించి మేము కూడా చదివాం. ఆ చరిత్ర మర్చిపోయి ఇప్పుడు పారదర్శకంగా జరిగిన నియామకాలపై బురదజల్లడం ఏ నైతిక హక్కుతో?
ఈరోజు నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిలబడగలిగానంటే అది ఎన్నో సంవత్సరాల కష్టం, చదువు, పోటీ, మెరిట్ వల్లే. నా లాంటి వేలాది మంది కూడా అదే విధంగా ఉద్యోగాలు సాధించారు.
మా విజయాన్ని అవమానించవద్దు జగన్ గారు.
మేము లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకోలేదు.
మేము రాజకీయ సిఫారసులతో ఉద్యోగాలు పొందలేదు.
మేము రాత్రింబవళ్లు చదివి, పోటీ పరీక్షలు రాసి, మెరిట్‌తో ఉద్యోగాలు సాధించాం.
అందుకే మీకు ఒక నిరుద్యోగి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారిన యువకుడి ప్రశ్న...
ఐదేళ్లు ఉద్యోగాలు ఇవ్వని మీరు యువత గురించి మాట్లాడే అర్హత సంపాదించారా?
16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపిన మెగా డీఎస్సీపై విషం చిమ్మడం ఆపి, కనీసం వారి కష్టాన్ని గౌరవించలేరా?
ఎందుకంటే...
ఉద్యోగం రాకముందు మేము నిరుద్యోగులం.
ఉద్యోగం వచ్చిన తర్వాత మేము ఉపాధ్యాయులమయ్యాం.
కానీ యువత ఎదుగుదల చూడలేకపోవడం మాత్రం మీ రాజకీయాల అసలు స్వరూపాన్ని బయటపెడుతోంది.
#Mahanadu2026#NTRLivesOn
మహా నాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తి..
దార్శనికుడు చంద్రబాబు దిశా నిర్దేశం..
యువసారధి లోకేష్ కార్యాచరణ..
ప్రతిబింబించిన మహానాడు 2026
లక్షలాది టీడీపీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషితో మహా వేడుకగా విజయవంతమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ
హైబ్రిడ్ విధానంలో 24 లక్షల మందిపైగా డిజిటల్ అటెండెన్స్ నమోదైన ఈ మహానాడు రికార్డు సృష్టించింది.
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత