ప్రైవేట్ స్థలంలో అభిమానంతో పెట్టుకున్న విగ్రహాన్ని 1500 మంది పోలీసుల బలగంతో కూల్చేయడమా..??
పెద్ది అన్న ఎలాంటోడో, తన మీద నర్సంపేట ప్రజలకు ఉన్న ప్రేమ అభిమానం ఎలాంటిదో మొన్న తన అంతిమ సంస్కారానికి తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి కూడా సిగ్గు రాలేదా ఈ స్కాంగ్రెస్ ప్రభుత్వానికి?
ఒక్క విగ్రహం కూల్చేస్తే ప్రజల మనసుల్లోంచి పెద్ది అన్న ని తీసేయగలుగుతారా?? తన పేరును నర్సంపేట చరిత్ర నుండి చెరిపెయ్యగలుగుతారా?
ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ప్రజలచేత ఇంకా ఇంకా ఛీ కొట్టించుకోకండిరా స్కాంగ్రెస్ సన్నాసుల్లారా.. మీరు ఆజన్మాంతం తలకిందులుగా తపస్సు చేసినా పెద్ది అన్నకు ఉన్న పేరులో అభిమానంలో 1 % కూడా సంపాదించుకోలేరు..
పెద్ది సుదర్శన్ రెడ్డి...
కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా, నర్సంపేట ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న అపారమైన అభిమానం ఏ స్థాయిలో ఉందో ఈ జనసంద్రాన్ని చూస్తేనే అర్థమవుతోంది.
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునివాళి 🙏
#BRSParty రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్,ఉస్మానియా ఉద్యమ కేరటం,ఆత్మీయ అన్న @Krishank_BRS గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు🌺.....నూరుద్దిన్, BRS సోషల్ మీడియా ,మహబూబ్ నగర్.
బీరప్ప దేవుని కళ్యాణ వేడుకల్లో కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప దేవుని కళ్యాణ మహోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
BRS నాయకుల పై అసభ్యకరమైన వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు అని కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మాజీ TSTS చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఫిర్యాదు చేసారు. దీనికోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ టీములను ఎంగేజ్ చేసి పనిచేస్తుందని ఆరోపించారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా గత 2 రోజులుగా ఊరు పేరు లేని ఈ-పేపర్ క్లిప్పింగ్స్ కాంగ్రెస్ పార్టీ టీములు సర్కులేట్ చేస్తున్నారని ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వార్తలను పోస్ట్ చేసిన మాజీ డిసిసి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శివ మరియు కొన్ని కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ గ్రూప్స్ పై ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, క్రిశాంక్, సతీష్ రెడ్డి, తనపై పదే పదే జరిగిన ఇటువంటి ప్రచారాలను ఖండించారు.
గతంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కూడా FIR వరకు మాత్రమే పరిమితం చేసి ఎంక్వయిరీ చేయకపోవడాన్ని వారు ప్రశ్నించారు.
10 సంవత్సరాలు అధికారంలో ఉన్న BRS ఏనాడు ఇటువంటి అసభ్యకర ప్రచారాలు చేసి ఇంత నీచ స్థాయికి దిగజారలేదని గుర్తు చేశారు
20 ఏళ్ల క్రితం ఉద్యమ యాదిలో..
2006 లో కాంగ్రెస్ పార్టీ.. అహంకారంతో తెలంగాణ ఉనికి గురుంచి అవహేళనగా మాట్లాడిన రోజు.. కేసీఆర్ గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నప్పటి దృశ్యం...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూరు మున్సిపల్ కేంద్రంలో పట్నం నరేందర్ రెడ్డి గారికి భింపూర్, రేనివట్ల, ఎర్రగుంట తండా చపంచెరువు తండా, నాగంపల్లిలో ఘన స్వాగతం పలికిన ప్రజలు...
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
@BRSparty పార్టీ శ్రేణులకు
✨ నూతన సంవత్సర శుభాకాంక్షలు – 2026 ✨
Wishing you and your family a very Happy New Year!
@KarthikIndrAnna#HappyNewYear
శంషాబాద్లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి.
శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొలను ప్రదీప్ రెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శంషాబాద్ ప్రాంతంలో ప్రదీప్ రెడ్డికి ఉన్న మంచి పేరు, ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
కొలను ప్రదీప్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, అభిమానులు కూడా బీఆర్ఎస్లో చేరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ గారి సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు.
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
#JubileeHillsWithBRS
#VoteForCar