కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు.
పవన్ కళ్యాణ్ గారు నింపిన స్పూర్తితో, అనుక్షణం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం పరితపించే అన్నదమ్ముల్లాంటి జనసైనికులను కోల్పోయామనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి పవిత్రాత్మకు శ���ంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము 🙏