పుట్టిన రోజు జరుపుకుంటున్న @ManagingTrustee గారికి శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, @ncbn గారి ఆదర్శ సతీమణి గా అలాగే @naralokesh గారి తల్లి గానే కాకుండా అన్నార్థులను ఆదుకుంటూ తెలుగు ప్రజల హృదయాల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మేటి మహిళ గా మీరు నిలిచారు.మీరు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేసి మరింత ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను
మా తండ్రి సయ్యద్ హఫీజ్ గారు నిన్న 17.06.2026 న కన్ను మూశారు, కొద్ది రోజులు గా అస్వస్థత తో ఉన్నారు, నిన్న మధ్యానం విజయవాడ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట జేపీ అపార్ట్మెంట్ నందు మా ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అంతిక్రియలు ఈ రోజు మధ్యానం జోహార్ నమాజు తర్వాత నిర్వహించబడును
కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పై భౌతిక దాడిని ఖండిస్తున్నాను. రాజ్యాంగాన్ని గౌరవించే వారంతా కూడా ఖండించండి. న్యాయాన్ని అడిగినందుకే ఇలా దాడి చేస్తారా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండవద్దా? ప్రశ్నించే హక్కు లేదా? పరీక్షా పేపర్లు లీక్ అయితే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని యువత అడుగుతున్నారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువత తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం @abijetdepke కు రక్షణ కల్పించాలని ప్రధానమంత్రి @narendramodi గారిని కోరుతున్నాను. ప్రజాసామ్యప్రియులైతే మీరు కూడా కోరండి.
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే దళిత యువకుడు అని తెలియటం తోనే అతని మీద ఉన్న క్రేజ్ తగ్గింది. దాంతో ఉద్యమానికి ఊపు తగ్గింది !దేశం ఎదుర్కుంటున్న సమస్యల కంటే కులం, మతం మీదనే జనం దృష్టి ! ఈ వివక్షత ఎన్నాళ్లు?
CJI సూర్యకాంత్ యువకులు కాంక్రోచ్ లని సంబోధించటం,ఆ పోలికను తీసుకుని అభిజీత్ దిప్కే అనే యువకుడు ఏకంగా కాంక్రోచ్ జనతా పార్టీ ని ఆన్ లైన్లో ప్రారంభించటం చక చక జరిగిపోయింది. అది దేశ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం గా మారిపోయింది. అందుకే అంటారు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని. ఇపుడు అదే జరిగింది, అభిజిత్ దీప్కే పేరు మారిమోగుతుంది .
అనుకున్నట్లే ఈరోజు 6 వ తేదీన కాక్రోచ్ జనతాపార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే ఢిల్లీ కి వచ్చేశాడు. రావటం రావటంతోనే అంబేద్కర్ బొమ్మ తో ఉన్న రాజ్యాంగం చేత పట్టుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తాము జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇవ్వటం,వెంటనే పర్మిషన్ ఇవ్వటం చక చక జరిగిపోయింది. వెను వెంటనే అభిజిత్ అతని బృందం అంతా ధర్నాకు ఉపక్రమించింది. ఇది సీజేపీ సాధించిన తొలి విజయం గా పేర్కొనవచ్చు.యువత పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్ కు చేరుకున్నారు, వారితో పాటు విద్యార్థులు వారి తల్లి తండ్రులు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. వీళ్లంతా స్వస్చందంగా వచ్చిన వాళ్ళే ఎవరో తెచ్చిన వాళ్ళు కాదు,దేశవ్యాప్తo గా అనేక రాష్ట్రాల నుండి యువకులు హాజరయ్యారు, మీడియా కూడా పెద్ద సంఖ్యలో వచ్చింది విదేశీ మీడియా కూడా వచ్చింది .ఇంత వరకు సీజేపీ అనేది ఆన్ లైన్ ఉద్యమం అని దీంతో ఏమీ కాదు అని లైట్ గా తీసుకున్న విశ్లేషకులు ,రాజకీయ నాయకులు ఆలోచనలో పడ్డారు, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్ ను తీసుకుని క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించటం దేశ రాజకీయాల్లో గొప్ప పరిణామం .ఇది ఏ విధమైన మలుపులు తీసుకుంటున్నదని వారు లెక్కలు వేస్తున్నారు, ఇది ఒక డిమాండ్ కు పరిమితమైన ఉద్యమం కాదు సీజేపీ ఎక్కుపెట్టిన ఐదు డిమాండ్ లు మెత్తం కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసురుతున్నాయి , ఈ మార్పులు జరగాలని అందుకు అవసరమైన సంస్కరణలు అమలు చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది, ఇది ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ డిమాండ్లను తీసుకుని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కూడా ఆలోచన చేయవచ్చు .ఢిల్లీ లో హిట్ అయిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రౌండ్ లెవెల్ లో సీజేపీ కి ఎంత మద్దతు ఉందో ?తెలుసుకోవాలని కూడా ఈ ధర్నాకు అనుమతి ఇచ్చి ఉండవచ్చు, ఒకవేళ అనుమతి ఇవ్వకుండా సీజేపీ ఫౌండర్ ను అరెస్టు చేస్తే అతను దేశ ప్రజల దృష్టిలో హీరో అవుతాడు ఆ అవకాశం అతనికి ఇవ్వకూడదని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఉండవచ్చు, అభిజిత్ ఎపుడు మాట్లాడినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం , అహింసా అనే మూడు అంశాలు మాటాడుతున్నాడు, ఒక చేత్తో జాతీయ జెండా పట్టుకోవాలని మరో చేత్తో పుస్తకం పట్టుకోని ధర్నా చేయాలని సూచన చేశాడు.ఒక వేళ ఏదోక సాకుతో పోలీసులు ధర్నా కు అనుమతి ఇవ్వకుంటే యావత్ జన్ జీ దృష్టిలో కేంద్ర పెద్దలు విలన్లు గా మారుతామని అనుమతి ఇచ్చారని అనుకోవాలి.ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల మోహరింపు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిందనుకోవాలి.ఇప్పటికే లడ్డాక్ ఉద్యమనాయకుడు సోనమ్ వాంచుక్ సీజేపీ కి మద్దతుగా నిలిచాడు, ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ ఉద్యమ కారులు సీజేపీ కి మద్దతు తెలుపుతున్నారు . సీజేపీ ఎక్కుపెట్టిన డిమాండ్లు తీసుకుని దేశవ్యాప్త ఉద్యమం చేపట్టితే
ప్రతిపక్షపార్టీలు కూడా సీజేపీ కి మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది. గతంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, అన్నా హజారే లు చేపట్టిన ఉద్యమాల తరహాలో ఈ ఉద్యమం కూడా కొనసాగుతుంది, ఆ ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాలను గద్దెదించిన చరిత్ర ఉంది.
ఆమ్ఆద్మీ పార్టీ లో కీలకబాద్యతలు చేపట్టి అనుభవం గడించిన ఉన్నత విద్యావంతుడు అభిజిత్ దిప్కే, దళిత యువకుడు ,కుల మతాలకు అతీతంగా అతన్ని యువత అనుసరించటం దేశ చరిత్ర లో ఐదో మంచి పరిణామం .సీజేపీ చేపట్టిన తొలి డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కనుక సాధించగలిగే అది సీజేపీ అపూర్వ విజయం సాధించినట్లే అవుతుంది . మోదీ ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించక తప్పదు, ఒక వేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించకుండా అతన్ని వెనుకేసుకువస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.ఆ తర్వాత అంతటితో ఆగకుండా దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుంది , ఎపుడు ఏం జరుగుతుందో చూడాలి, కాలచక్రం ఎపుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు, అది తిరుగుతూ ఉంటుంది. ఇపుడు అది తిరగటాన్ని మనం చూస్తున్నాం.
కాక్రోచ్ (అభిజిత్ దిప్కే ) ఈ నెల 6 న ఢిల్లీ వస్తున్నాడు, ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా ఢిల్లీ పోలీసు స్టేషన్ కు వెళ్లి, జంతర్ మంతర్ లో ధర్నా చేయటానికి పర్మిషన్ కోసం అప్లై చేస్తాడట, ఇది అతను సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్, అయితే తనను ఎయిర్పోర్ట్ లో కలవమని కాక్రోచ్ లకు పిలుపు ఇచ్చాడు, తనను ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేసాడు, తాను గాంధీ, నెహ్రూ,అంబేద్కర్,భగత్ సింగ్ లను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతానని, తా ను ప్రజాస్వామ్య వాదినని,భారతదేశం ప్రజాసామ్య దేశం అని దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పాడు, అనేక పరీక్షల నిర్వహణ లో ప్రభుత్వం విఫలమైందని అందుకే తాము విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ను కోరుతున్నామని అందుకే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆందోళన చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశాడు, ఇప్పటికే ఆన్ లైన్లో లక్షలాది మంది ఈ డిమాండ్ పై సంతకాలు చేశారని తెలిపాడు, తాను అరెస్టుకు వెనకాడేది లేదని ఎంతటి పరిస్థితి నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 6 వ తేదీన ఏం జరుగుతుందో అనే ఉత్సుకత దేశవ్యాప్తంగా ప్రజల్లో మొదలైంది, గత రెండు రోజుల క్రితమే అభిజిత్ దీప్కే ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు అతని తల్లితండ్రులు ఇల్లు విడిచి వెళ్లిపోయారు. దేశ రాజకీయాల్లో ఐదో కొత్త పరిణామం, గతంలో పౌర సమాజం స్పందించిన దానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది . సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆన్లైన్ లో ఏర్పాటు చేసిన సీజేపీ కి ఇంత భారీ స్పందన రావడం ఎవరూ ఊహించలేదు, ఈ పరిణామం దేశ రాజకీయ పార్టీలకు ఆశ్చర్యం కలిగించింది , రాజకీయ పార్టీలు ఎలా స్పందించాలో తెలియక అయోమయంలో పడిపోయాయి.ఇంతవరకు ప్రధాన రాజకీయపార్టీలు నేరుగా ఎటువంటి ప్రకటన చేయలేదు,కేవలం ఆన్లైన్ లో ఏర్పడిన ఈ ఉద్యమం కాస్తా ఇపుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చేసింది. ఎపుడు ఏం పరిణామాలు జరుగుతాయో చూడాలి? దేశ రాజకీయాల్లో CJP ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి?
దేశంలో పరీక్షల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి కత్తి మీద సాము గా మారింది,NEET పేపరు అనేకసార్లు లీకైంది,పరీక్షలు వాయిదా పడ్డాయి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, CBSC పేపర్ పరిస్థితి కూడా అంతే, ఇప్పటి వరకు మెత్తంగా 81 పరీక్షా పేపర్లు లీకేజ్ అయ్యాయి, చివరకు NTA ఏజెన్సీ మీద కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం పోయింది, చివరకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్థ మీద నమ్మకం లేక NEET పేపరు తయారీ దాని బట్వాడా కూడా మిలటరీ అధ్వర్యం లో చేస్తామని వాయుసేన కు సంభందించి విమానాల్లో తరలిస్తామని దాన్ని స్వయంగా ప్రధాని మోడీ పర్వ్యక్షిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ పరీక్షల నిర్వహణ లో జరుగుతున్న అవినీతి కారణంగా మిలటరీ కు అప్పజెప్పారంటే వ్యవస్థలు ఎలా గాడి తప్పాయో అర్థమవుతుంది. ఇక ప్రతి పరీక్ష ప్రధాని పర్వ్యక్షణ చేయాలా? మిలిటరీ ఆధ్వర్యంలో పేపర్లు తయారు చేసి వాయుసేన కు చెందిన విమానాల్లో తరలించాలా? అర్థం కావటం లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ విఫలం అయింది కాబట్టి మిలటరీ ని రంగం లో దించామని కేంద్రం ఒప్పుకున్నట్లేగా? కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు వారి భవిషత్ నాశనం చేసి సొమ్ము చేసుకునే సమాంతర వ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందిని భావించాలా? NTA ను సర్వనాశనం చేసిన వారిపై చర్యలు ఏవి? ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో తెలంగాణలో Coempt edvteck p ltd కంపనీకి ఇంటర్ పరీక్ష పేపర్ల నిర్వహణ ఇచ్చారు, అందులో జరిగిన అవకతవకలు కారణంగా 21 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది తెలిసికూడా ఢిల్లీ లో CBSC పేపర్ అదే సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది కూడా తప్పుల తడకగా చేసింది, ఒకరి పేపరు ఒకరికి ఒకరి మార్కులు వేరొకరికి వచ్చాయి, దీన్ని ప్రశ్నించిన విద్యార్థులకు సమాధానం చెప్పడం చేతకాక వారిని పాకిస్థాన్ ఏజెంట్లు అని ఎదురుదాడి చేశారు, ఇంత అసమర్థగా పరీక్షలు నిర్వహించడం చేస్తుంటే యువత భవిషత్ ఎం కావాలి? అందుకే గా కోట్లాదిమంది యువకులు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు.
నేను కూడా కాక్రోచ్ నే,మీరు కూడా కాక్రోచ్ గా మారండి,అవినీతిని ప్రశ్నంచండి,అసమానతను ఎత్తి చూపండి,వ్యవస్థల పతనాన్ని నిలదీయండి,అన్యాయాన్ని నిలదీయండి,జాతి కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమికొట్టండి.రాజకీయo వారసుల హక్కు కాదని వారిని ఓడించండి,గోది మీడియా బ్యాన్ చేయండి
జోసఫ్ విజయ్ కి పవన్ కళ్యాణ్ కు మధ్య తేడా ఏమిటి అంటే పవన్ తొలుత ప్రజారాజ్యం పార్టీ తో రాజకీయ అరంగ్రేటం చేశాడు, ఆ తర్వాత 2014 లో జనసేన పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్నాడు, 2018 లో ఎన్డీయే నుండి బయటకు వచ్చి కమ్యూనిస్టులతో కలిసి BSP తో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఆ తర్వాత బీజేపీ తో కలసి పని చేస్తూ 2024 లో టీడీపీ, బీజేపీ తో కలసి సీట్లు పొంది ఎన్డీయే గా పోటీ చేసి గెలిచాడు 100 % స్టేక్ రేటు సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది పవన్ కళ్యాణ్ పరిస్థితి, జోసెఫ్ విజయ్ సినిమాల్లో స్టార్ గా మారటం తోనే తన అభిమానులతో ఫాన్స్ క్లబ్లు ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని గ్రామ గ్రామాన్న విస్తరించాడు, వాళ్ళతో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు, 2024 లో రాజకీయ పార్టీ TVK ని స్థాపించి తన అభిమానులను కొంత మంది రాజకీయ నాయకులను కలిపి పార్టీని బలోపేతం చేయడం మొదలు పెట్టాడు, తమిళ ప్రజల సెంటిమెంటును తమిళ ప్రజలు అభిమానించే ప్రముఖులను వారి సిద్ధాంతాలను గౌరవిస్తానని ప్రకటించి వారి ఫోటో ల తో ప్రచారం చేశాడు , తన రాజకీయ లక్ష్యాన్ని తన రాజకీయ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పాడు, సామాన్యులకు టికెట్ లు ఇచ్చి డబ్బు పంచకుండా నిరాడంబరమైన ప్రచారం చేసాడు, పాజిటివ్ పంథాలో ప్రచారం చేసాడు, వ్యక్తి గత విమర్శలు లేకుండా జాగ్రత్త పడ్డాడు, అలా చాప కింద నీరు లా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాడు, తమిళ పార్టీల ఆధిపత్యాన్ని గండి కొట్టాడు, విజేతగా నిలిచాడు, ఏదో కటోట్ పెట్టుకుని గెలవలేదు కనీసం 15 ఏళ్ల పాటు వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశ రాజకీయాల్లో ఔరా అనిపించాడు. పవన్ కళ్యాణ్ కు జోసెఫ్ విజయ్ కు ఇంత తేడా ఉంది, తాను నమ్మిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్లాడు,
ఈ దేశం లో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతాయా? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే సీట్లు పెంచాలా? సీట్లు పెంచకపోతే అమలు సాధ్యం కాదా? 2023 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందింది కాబట్టి,లోకసభ లో ఇప్పుడున్న 543 సీట్లలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వలేరా? అందుకు పురుషులు ఒప్పుకోరా? వాళ్ల స్థానాలు పోతాయని వారికి భయమా? ప్రభుత్వాలు వారికి భయపడి మహిళా రిజర్వేషన్ లు అమలు చేయటం లేదా? 50 శాతం స్థానాలు పెంచితే గానీ 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేరా? ఏ కమిషన్ చెప్పింది? ఏ కమిటీ చెప్పింది ? దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లు పెంచాలని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది ,ఏ నివేదిక ఆధారం లేకుండా? ఈ పెంపు న్యాయ సమీక్షకు ప్రభుత్వ నిర్ణయం నిలబడుతుందా? ఇది ఇలా ఉండగా మహిళలకు 33 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలనటం కూడా హేతు బద్ధంగా లేదు, జనాభాలో 50 శాతం మంది మహిళలు ఉండంగా 33 శాతం ఇవ్వటం ఏమిటి? ఏ ప్రాతిపదికన 33 శాతం యివ్వాలనుకుంటున్నారు, ఏ కమిటీ చెప్పింది? ఏ కమిషన్ చెప్పింది? 33 శాతం అంటున్నారు ఇది తప్పు.మహిళలు జనాభాలో 50 శాతం ఉన్నారు కాబట్టి వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలిసిందే? అది న్యాయమైన పరిష్కారం అవుతుంది, ఒక వేళ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే అందులో 15 శాతం దళిత మహిళలుకు,ఏడున్నర శాతం గిరిజన మహిళలకు రిజర్వేషన్ లు కల్పించడం తప్పనిసరి ఇది రాజ్యాంగం సూత్రాల ప్రకారం చేయాలి . మహిళా రిజర్వేషన్ లు 33 శాతం గానీ 50 శాతం గానీ రిజర్వేషన్ అమలు చేసేటప్పుడు OBC మహిళలకు కూడా 27 శాతం కోటా ఇవ్వాలి. అందుకు చట్ట సవరణ చేయాలి.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అపుడే మహిళా సాధికారత సాఫల్యం అవుతుంది