డ్రోన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ...
కోవూరు నియోజకవర్గం జొన్నవాడలో పాదయాత్ర ముగింపు సందర్బంగా ఏర్పాటు చేశారు గాదిరాజు జీవన్ కృష్ణ,నక్కల శివకృష్ణ,సురేష్ ❤️🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
జనసేన పార్టీ కోవూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా
శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆరోగ్యం కోసం జనసేన మహా పాదయాత్ర – జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పణ..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయన యోగక్షేమాల కోసం జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి మరియు ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు, కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గాదిరాజు జీవన్ కృష్ణ గారు, శ్రీ నక్కల శివకృష్ణ గారు, అలాగే బుచ్చిరెడ్డిపాలెం మండల జనసేన పార్టీ నాయకులు శ్రీ చిరమణ సురేష్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం నుండి శ్రీ జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారి దేవస్థానం వరకు సుమారు 10 కి.మీ. మహా పాదయాత్ర భక్తి, శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడింది.
అనంతరం అమ్మవారికి అత్యంత పవిత్రమైన ఆషాఢ మాస సారెను జనసేన పార్టీ మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున సమర్పించడం జరిగింది. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని కామాక్షి తాయి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.
పాదయాత్ర మార్గమధ్యంలోని గ్రామాలు, పంచాయతీలలో ప్రజలు, మహిళలు భక్తిశ్రద్ధలతో హారతులు ఇచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలకడం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో ఉన్న అపారమైన ప్రేమ, విశ్వాసం, అభిమానానికి నిదర్శనంగా నిలిచింది.
@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri@mnadendla@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
ఇకనైనా కోడి చెరువు భూములపై కారు కూతలు మానేస్తారా?
• యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా అని నిజాయితీకి పర్యాయపదంగా నిలిచే @JanaSenaParty అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నిందలు వేస్తామంటే కుదరదు @Mana_tolivelugu
• లిక్కర్ స్కాం లో తీహార్ జైలుకు వెళ్లిన @RaoKavitha గారికి మా నాయకుడిపై మాట్లాడే కనీస అర్హత లేదు
• మా నాయకుడు ఫాం హౌస్ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగలేదు అని హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారు స్వయంగా ఆధారాలతో చెప్పారు
• ఇప్పుడు క్షమాపణలు చెప్తారా? లేదా?
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో నిజంగా ఎంతమంది నాయకుల కబ్జాలో ఎన్ని స్థలాలు ఉన్నాయో బయటపెట్టాలి.... జాగృతి పేరుతో మొదలుపెట్టి నేటి రక్షణ సేన వరకు ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో కవిత గారు చెప్పాలి.
#JanasenaTelangana
పవన్ కళ్యాణ్‌కి మా లాగా రాజకీయ లక్షణాలు లేవు - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
బతికి ఉన్న యజమానిని చనిపోయినట్లు చూపించి 4 కోట్ల భూమిని కొట్టేసిన - వైసీపీ మాజీ స్పీకర్ తమ్మినేని శ్రీనివాస్
#YCPCriminalPolitics
నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
అందరికీ నమస్కారం... ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, ఖశ్చితత్వం, సమగ్రంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన SPECIAL INTENSIVE REVISION (SIR) ప్రక్రియ గడువు త్వరలో ముగియనుంది.
ఎన్నికల సంఘం నియమించిన బూత్ స్థాయి అధికారులు అంటే BLO లు మీ అందరి ఇళ్ళకీ వచ్చి ఒక్కొక్క ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారంలు ఇస్తారు. ఇప్పటికే చాలామందికి ఇవ్వడం జరిగింది. మీకు ఫామ్ లు రాకపోతే మీ స్థానిక BLO ను సంప్రదించి ఫామ్ లు తీసుకోండి. వాటిలో మీ పేరు, మీ గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు మీ యొక్క పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగతా వివరాలను మీరు నింపాలి.
తాజా సర్ లో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా ప్రస్తుత ఓటర్ల జాబితాను పరిశీలించి లింక్ చేస్తున్నారు. 2002 నాటి జాబితాలో మీ పేరు ఉంటె ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫామ్ లో నింపాలి. అప్పటి జాబితాలో మీపేరు లేకపోతే మీ తల్లి తండ్రుల పేర్లు, మీ భర్త లేదా మీ భార్య లేదా ఇతరత్రా కుటుంబీకులు, సంబంధీకుల పేర్లు ఎవరివి ఉంటె వారి వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబరు, మీ తండ్రి మరియు మీ తల్లి వివరాలు ఆ ఫామ్ లో నింపి, కొత్త కలర్ ఫోటోలు అతికించి BLO కి ఇవ్వాలి. రెండు ఫామ్ లపై BLO సంతకం చేసి ఒకటి మీకు రసీదుగా ఇస్తారు. దాన్ని మీరు భద్రపరుచుకోవాలి. ఫామ్ లు ఫిల్ చేయడానికి మీ BLO మీకు పూర్తిగా సహకరిస్తారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, విదేశాల్లో ఉన్న రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్ లైన్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. దాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి.
మీ అందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి.... ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ SIR ప్రక్రియలో పాల్గొని మన ఓటును భద్రపరుచుకోవడం మనందరి బాధ్యత. ప్రతి పౌరుడు తన ఓటుని రక్షించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది సమాజంలో మార్పు తీసుకురావడానికి, మంచి పాలనను అందించడానికి ఓటు ఆయుధం వంటిది. మీ ఓటు హక్కు ద్వారా, స్థానిక, రాష్ట్ర లేదా జాతీయ స్థాయిలో నాయకులను ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరే భాగస్వాములు అవుతారు. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు జరుగుతున్న సర్ ప్రక్రియను విజయవంతం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వాములవుదాం. జైహింద్!
@ECISVEEP@PawanKalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భుజ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా బాధించిన నొప్పి పూర్తిగా తొలగి, సంపూర్ణ ఆరోగ్యంతో మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. 🙏❤️
అనంతపురంలో గడిపిన ఈ ఏడు రోజులు కేవలం ఒక కార్యక్రమం కాదు… నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో మధురమైన జ్ఞాపకాల సమాహారం. ఈ ప్రయాణంలో నేను చూసింది దరఖాస్తులు కాదు… జనసేనపై అపారమైన విశ్వాసాన్ని. నేను కలిసింది కార్యకర్తలను కాదు… పార్టీ కోసం తమ సమయాన్ని, శ్రమను, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టి సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను.
పదవి కోసం కాదు… బాధ్యత కోసం. గుర్తింపు కోసం కాదు… జనసేన బలోపేతం కోసం. ప్రతి ఒక్కరిలో కనిపించిన ఆ సేవా తపన, ఆ అంకితభావం, ఆ నిస్వార్థ ప్రేమ నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసింది.
28 మంది సభ్యులతో కూడిన మా బృందం ఏడు రోజుల పాటు ఒక కుటుంబంలా పనిచేసింది. అలసటను లెక్కచేయకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చిరునవ్వుతో బాధ్యతను నిర్వర్తించింది. అందరి సమిష్టి కృషి వల్లే జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ఈ విజయం ఒక్కరిది కాదు… పార్టీని ప్రేమించే ప్రతి జనసైనికుడిది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి కమిటీ సభ్యునికి, ప్రతి జనసైనికుడికి, వీర మహిళకు, నాయకుడికి, కార్యకర్తకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కష్టం, మీ నిబద్ధత, మీ విశ్వాసమే జనసేన పార్టీకి అతిపెద్ద సంపద. మీలాంటి సేవాభావం ఉన్న కార్యకర్తలు ఉన్నంతకాలం జనసేన ప్రస్థానం మరింత బలంగా ముందుకు సాగుతుందనే నమ్మకం నాకు మరింత పెరిగింది.
అనంతపురం నాకు కేవలం ఒక జిల్లా కాదు… జనసేన సిద్ధాంతాల కోసం హృదయపూర్వకంగా నిలబడే వేలాది కుటుంబాల ప్రేమను, నమ్మకాన్ని పరిచయం చేసిన పవిత్రమైన నేల. ఈ ఏడు రోజుల అనుబంధాన్ని, మీ అందరి ప్రేమను జీవితాంతం గుండెల్లో దాచుకుంటాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
– శ్రీ వేములపాటి అజయ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్
జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl@itsRamTalluri@JSPShatagniTeam@JSPVeeraMahila
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
#AjayaKumarVemulapati
#anantapuram
#janasena
#PawanKalyan
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ప్రక్రియకు అరకు పార్లమెంట్లో మొదటి రోజు మంచి స్పందన లభించింది. రాజకీయ చైతన్యంతో ఉన్న యువత అధ్యక్షులు @pawankalyan గారి సిద్ధాంతాలు నచ్చి ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీలో ఇలాంటి ఒక పారదర్శిక ప్రక్రియ దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు.
#JSPMembershipToLeadership
అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ‘జల్ సంచయ్ జన భాగీదారి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాను.
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల భాగస్వామ్యంతో జల వనరులను పరిరక్షిస్తూ, భావి తరాలకు సుస్థిరమైన నీటి భద్రతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
@JanaSenaParty@APDeputyCMO
ప్రో॥ నాగేశ్వర్ గారు ఎవరి మన్నలను పొందడానికి @PawanKalyan గారి మీద మరియు @JanaSenaParty మీద అవాస్తమైన, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసారో ప్రజలు గమనించాలి. ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రకోణాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జరగని విషయాన్ని జరిగినట్టు ఒక అభూత కల్పనచేసి, వైసీపీ పార్టీకి అనకూలముగా, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగించే నాగేశ్వర్ గారి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాగేశ్వర్ వెంటనే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
@APDeputyCMO@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@NagaBabuOffl@mnadendla@itsRamTalluri