వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
* కరవు నేలకు జలప్రదాత చంద్రబాబు
* వెలిగొండ వెలుగులు... కరవు నేలకు కృష్ణమ్మ జలాలు
* దశాబ్దాల కల... చంద్రన్న నిజం చేసిన వేళ
* చంద్రబాబు 30 ఏళ్ల పంతం... మార్కాపురం కరవు అంతం
* అవాంతర���లు... అడ్డంకులు.. సవాళ్లు... సమస్యలు దాటుకుని కృష్ణమ్మ పరుగులు
* చరిత్రలో నిలిచిపోనున్న చంద్రబాబు భగీరధ ప్రయత్నం
* వెలిగొండ సాకారంతో ఇక కరవుపై గెలుపు
* కరువును చూసిన తరాలకు... కృష్ణమ్మను చూపుతున్న సీబీఎన్
* 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు... 23 లక్షల మందికి తాగునీరు
* శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మ
* 2026 ఆగస్టు 31వ తేదీన ఫేజ్-1 ప్రారంభంతో కొత్త చరిత్రకు శ్రీకారం
తరతరాల వ్యథకు ముగింపు – ఇక వెలిగొండ వెలుగులు ఆరంభం
ఒక బిందెడు నీళ్ల కోసం ఎదురు చూడడం... ఫ్లోరైడ్ సమస్యలతో అనారోగ్యానికి దరిచేరడం... పంట పండుతుందనే ఆశతో విత్తనం వేయడం... పంట పండకపోతే వలస పోవడం... ఇవన్నీ మార్కా���ురం జిల్లా ప్రజల కథలు కావు... వాళ్లు అనుభవించిన బాధ.. పడ్డ వ్యధ.
ఎండాకాలాన్ని తలుచుకుంటేనే ఈ నేల ప్రజల గొంతు తడారేది. నీరు లేని నేలలో రైతు భవిష్యత్తు వాడిపోయేది. వర్షం పడితే పంట... పడకపోతే అప్పు. బోరు పనిచేస్తే సాగు... అడుగంటితే వలస. ఇలా తరతరాలుగా కరువుతో పోరాడిన నేలకు వెలిగొండ అనేది ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు... బతుకు మీద భరోసా.
సీఎం చంద్రబాబు తన భగీరధ ప్రయత్నంతో కరువుతో పోరాడిన నేలకు కృష్ణమ్మను చేర్చారు. ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం కంటే తీవ్ర కరువు కష్టాలకు చిరునామాగా నిలిచిన మార్కాపురం ప్రాంతానికి ఇప్పుడు వెలిగొండ జలాలు కొత్త ఆశను తీసుకొస్తున్నాయి.
వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించడం అంటే అదో కార్యక్రమం కాదు... నీటి కోసం ఎదురుచూసిన తరాల నిరీక్షణకు సమాధానం. బిందెడు నీటి కోసం తిరిగిన తల్లుల కష్టాలకు ఉపశమనం. నీటి కోసం ఎండిన డొక్కలతో ఎదురు చూసే రైతుల్లో కలిగిన నమ్మకం. వలసలు బాధలు తప్పుతున్నాయనే ఊరట. కరువు నేలపై కృష్ణమ్మ అడుగుపెడితే రైతు ఇంటికి ఆదాయం. గ్రామానికి జీవం. యువతకు ఉపాధి. కుటుంబానికి భరోసా.
ఇప్పటివరకు వర్షం కోసం ఆకాశం వైపు చూసిన కళ్లు... ఇక నీటి కోసం కాలువ వైపు చూడనున్నాయి.. బోరుబావి పని చేస్తుందో లేదోనని ఆందోళన చెందిన ర���తు... ఇక ఏ పంట వేయాలా అని ఆలోచించనున్నాడు. ఏ ఊరు వలస వెళ్లాలా అని నగరాల వైపు చూసిన కుటుంబాలు... సొంత ఊరిలో��ే ఉపాధి వెతుక్కోనున్నాయి. ఒకప్పుడు పొట్ట చేత పట్టుకున్న కుటుంబాలు... ఇక పంట చేత పట్టుకోనున్నాయి. ఇక ఈ నేల నుంచి వలసలు ఆగనున్నాయి... పంటలు, ఉత్పత్తులు, మార్కెట్లకు వెళ్లనున్నాయి.
ఇది ప్రాజెక్టు కాదు.. ఒక ప్రాంతం పునర్జన్మ. ఏళ్ల తరబడి కరువును చూసిన మార్కాపురం నేలకు వెలిగొండ ఒక కొత్త అధ్యాయం. నీళ్లు ఎక్కడ? అనే ప్రశ్న కాదు... ఏ పంట వేయాలి? అనే ప్రశ్న ఉండాలి. పని కోసం ఎక్కడికి వెళ్లాలి? అనే మ��ట కాదు... మన ఊరిలోనే ఏ పని చేసుకోవాలి? అనే మాట వినిపించాలి. వాన కోసం ఎదురుచూపు మాత్రమే కాదు... పంటపై భరోసా ఉండాలి.
నీటి కోసం ఎదురుచూసిన ఈ నేల... ఇకపై నీటితో తన బతుకును తానే మార్చుకున్న ప్రాంతంగా గుర్తింపు పొందాలి... విజయాల మోత మోగాలి. వెలిగొండ ఒక సాగునీటి మాత్రమే ప్రాజెక్టు కాదు... ఈ నేలకు కొత్త శ్వాస.
వెలిగొండ ప్రాజెక్టు వివరాలు – ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ-కూటమిది కీలక పాత్ర
•వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం ఫోర్‌షోర్ - కొల్లం వాగు ఎగువ భాగం నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తరలిస్తారు. మొత్తంగా 53.85 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టులో నిల్వ చేసుకోవచ్చు.
•మొత్తం ప్రాజెక్టు వ్యయం ర��. 10,200 కోట్లు, మొదటి విడత పూర్తయ్యే నాటికి మొత్తంగా రూ. 7983 కోట్ల విలువైన పనులు జరిగాయి.
•ఇందులో 2014-19, 2024-26 మధ్య కాలంలో దాదాపు సగం పనులను టీడీపీ, కూటమి ప్రభుత్వాలే చేశాయి. 2019-24 మధ్య కాలంలో రూ. 981 కోట్ల పనులను చేపడితే.. వాటిల్లో రూ. 140 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారు.
•అంటే వైసీపీ హయాంలో కేవలం రూ. 841 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి... 2.77 శాతం పనులను మాత్రమే జరిగాయి. ఇక మిగిలిన పనులను ఉమ్మడి రాష్ట్రంలో ఖ��్చు పెట్టారు.
•2014-19, 2024 తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 18.8 కిలో మీటర్ల మేర పొడవున జంట సొరంగాలు వేగంగా తవ్వారు. 21.8 కిలోమీటర్ల మేర ఫీడర్ కాలువల పనులు చేపట్టారు.
•జలాశయ నిర్మాణం కోసం సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాప్‌ల వద్ద మూడు కాంక్రీట్ NOF డ్యామ్‌లు నిర్మించారు. ప్రధాన కాలువలుగా తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువలు ఉన్నాయి.
•మొత్తంగా 4,47,300 ఎకరాల ఆయకట్టుకు లబ్ది చేకూరుతుంది. ప్ర��ాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 30 మండలాల ప్రజల దశ-దిశను ఈ ప్రాజెక్టు మార్చనుంది.
•ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3,36,100 ఎకరాలు, నెల్లూరు జిల్లా పరిధిలో 84,000 ఎకరాలు, కడప జిల్లాలో 27,200 ఎకరాలకు సాగునీరు అందనుంది.
•తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, తూర్పు ప్రధాన కాల్వ కింద 3,70,800 ఎకరాల ఆయకట్టు ఉంది.
•ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రయోజనం... ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 23 లక్షల మందికి తాగునీరు సరఫరా అవుతుంది.
•ఈ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా 10.70 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు కృష్ణా జలాలను రిలీజ్ చేస్తున్నారు.
•తొలి విడతగా 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు-4 లక్షల మందికి తాగునీరు, రెండో విడతగా 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు-11.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.
•మొత్తం 35,032 ఎకరాల భూమి అవసరంలో 30,300 ఎకరాలు సేకరణ పూర్తి... 11 ముంపు గ్రామాలకు చెందిన 7,321 ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు గుర్తింపు.
చంద్రబాబు 30 ఏళ్ల పంతం... మార్కాపురం కరువు అంతం
•రాష్ట్రంలో అత్యంత కరువు ప్రభావిత ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం ప్రాంతం ఉంది. పశ్చిమ ప్రకాశంలో సగటు వర్షపాతం 650 మి.మీ. దాటని పరిస్థితులు ��న్నాయి.
•తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోవడం, పంట నష్టాలు. కనిగిరి, కంభం, పొదిలి ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య... ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వీటిని అధిగమించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది.
•శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్స్ నుంచి పూర్తి గ్రావిటీతో 43.50 టీఎంసీల కృష్ణా జలాలను జంట సొరంగాల ద్వారా తరలించేలా వెలిగొండ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
•నదీగర్భంలో కాకుండా గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చి నింపే అతి పెద్ద ప్రాజెక్టుల్లో వెలిగొండ ఒకటి. నల్లమలసాగర్‌లో నిల్వ చేసి, 3 ప్రధాన కాల్వల ద్వారా సాగు–తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు.
వెలిగొండ ప్రయోజనాలు
•దశాబ్దాల కలను సాకారం చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారు. వెలిగొండను కేవలం వ్యవసాయానికి ఉపయోగపడే ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాకుండా, స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రజారోగ్య ప్రాజెక్ట���గా చూడాలి.
•ఈ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశంలో భాగమైన మార్కాపురం ప్రాంతం సహా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం కలుగుతుంది.
•పంటలకు అవసరమైన నీటి కోసం దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. ఈ ప్రాజెక్టుతో నీటి భద్రత–ఆర్థిక భవిష్యత్తు కలగనుంది. సాగునీటి లభ్యతతో ప��టలపై అనిశ్చితి తగ్గుతుంది. వైవిధ్య పంటలు వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. దిగుబడి మెరుగవుతుంది... తద్వారా రైతు ఆదాయం పెరుగుతుంది.
•భూగర్భజలాల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుతుంది... దీంతో బోర్లపై ఆధారపడటం తగ్గుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ ఉపాధి, మార్కెటింగ్, ప్రాసెసింగ్, సేవారంగం విస్తరిస్తాయి.
వలసలకు అడ్డుకట్ట...
•APIIC, దొనకొండ, వంటి పారిశ్రామిక అవ��రాలకు నీరు లభిస్తుంది... దీంతో అభివృద్ధికి బాటలు పడతాయి. వలసలు తగ్గి, గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం ఏర్పడుతుంది.
•వెలిగొండ నీరు అందుబాటులోకి వస్తే వ్యవసాయంతో పాటు హార్టికల్చర్, అగ్రో-ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు అవకాశం పెరుగుతుంది.
•వెలిగొండతో పాటు హార్టికల్చర్, అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను రామాయపట్నం పోర్టుతో అనుసంధానం చేయవచ్చు. వెలిగొండ నీరు వస్తే సా��ు విస్తీర్ణం పెరుగుతుంది... ఉద్యాన పంటలు వృద్ధి చెందుతాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
శంకుస్థాపన చేసింది సీబీఎన్... ప్రారంభిస్తోంది సీబీఎన్
•వెలిగొండకు 1996లో సీఎం @ncbn శంకుస్థాపన చేశారు.
•1999లో మొదటి దశకు పరిపాలనా అనుమతులిచ్చి నిర్మాణ ప్రక్రియకు పునాది వేశారు.
•ఆర్థిక పరిమితులున్నా 2014–19లో ప్రాధాన్యతా ప్రాజెక్టుగా వెలిగొండ ఉంది.
•2.8 కిలోమీటర్ల మినహా టన్నెల్-1 పనులను పూర్తి చేశారు.
•2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే సుమారు రూ.140 కోట్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ చేసింది. బ్యాలెన్స్ పనులను తక్షణమే మొదలు పెట్టాం..
•TBM సమ��్య పరిష్కారానికి సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న యంత్రాన్ని తొలగించారు.
•టన్నెల్–II బెంచింగ్లో 4,563 మీటర్లు, టన్నెల్ హెడ్ రెగ్యులేటర్లలో 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, రూ.456 కోట్లతో ఫీడర్ కాల్వ లైనింగ్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు చేపట్టింది.
అనేక సవాళ్లను సమస్యలను ఎదుర్కొని వెలిగొండ నిర్మాణ పనులు
•మొదటి దశను పూర్తి చేసి నీరు తరలించ��లా ప్రాజెక్టును సిద్దం చేయడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడింది.
•సొరంగాల్లో మిగిలిన బెంచింగ్, లైనింగ్ పనులు, టన్నెల్–2లో చిక్కుకున్న బోరింగ్ మిషన్ ��ొలగింపు, టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్, గేట్ల పనులను పూర్తి చేశారు.
•21.8 కి.మీ. ఫీడర్ కాలువ తవ్వకం, లైనింగ్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, తీగలేరు, తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం పూర్తి. డైవర్షన్ రోడ్, అనుబంధ హైడ్రాలిక్ నిర్మాణాలను పూర్తి చేశారు.
•భూసేకరణ, 11 గ్రామాల నిర్వాసితుల పరిహారం, 7 R&R కాలనీల మౌలిక వసతులు కల్పించాం.
•ఓవైపు పనులు చేపడుతూ... మరోవైపు ఆర్ అండ్ ఆర్ చె��్లింపులు జరుపుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భగీరథుడిలా పని చేసింది.
•48 రోజుల్లోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేశారు.
•ప్రాజెక్టు పనుల్లో ఏ మాత్రం వేగం తగ్గకుండా టైమ్ లైన్ పెట్టుకుని సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పని చేసింది.
•మొదటి విడత పనులను పూర్తి చేసుకుని ఆగస్టు 31వ తేదీన ప్రాజెక్టును ప్రారంభించడం చరిత్ర.
•వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... 30 ఏళ్ల తర్వాత ఆయనే ప్రారంభించడం విశేషం.
@YSRCParty పాపం - వెలిగొండకు శాపం
•2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ఆ ప్రభుత్వం చేసిన పాపాలు.. ప్రాజెక్టు పాలిట శాపంగా మారాయి.
•వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ పనులను కేవలం 1 కిలోమీటర్ మాత్రమే పూర్తి చేసింది.
•రెండో టన్నెల్లో ఇరుక్కుపో��ిన బోరింగ్ మిషన్ ను వెలికి తీసేందుకు కనీస చర్యలు తీసుకోలేదు.
•రెండో సొరంగంలో నిబంధనలకు విరుద్దంగా పేలుళ్లు జరిపి మాన్యూవల్ గా పనులు చేశారు.
•ఆ మట్టిని బయటకు తెచ్చేందుకు మొదటి సొరంగానికి ఏడు చోట్ల రంధ్రాలు పెట్టారు. ఆ రంధ్రాల ద్వారా 2వ సొరంగంలోని మట్టిని మొదటి సొరంగం ద్వారా బయటకు తెచ్చారు.
•మొదటి టన్నెల్ కు రంధ్రాలు చేయకుంటే... కొన్ని కీలక పనులను పూర్తి చేయడం ద్వారా 2024లో కూటమి ప్���భుత్వం వచ్చిన కొన్ని నెలలకే టన్నెల్-1 ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు వెసులుబాటు కలిగేది.
•ఇక ఫీడర్ కాల్వలో చాలా చోట్ల స్ట్రక్చర్ల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అనేక చోట్ల మట్టి కట్టలు కోతకు గురై లైనింగ్ చేపట్టకుండా వదిలేశారు.
•ఫీడర్ కాల్వల లైనింగ్ పనులు చేయలేదు... కొన్ని చోట్ల నిర్మించాల్సిన వంతెన పనులను గాలికి వదిలేశారు.
•ప్రాజెక్టు పరిధిలోని న���ర్వాసితుల పరిహరం కోసం జీవో ఇచ్చారు కానీ... నామ్ కే వాస్తేగా కేవలం రూ.18 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిపి చేతులు దులుపుకున్నారు.
•ఇవేవీ చేయకుండానే ఎన్నికలకు నెల రోజుల ముందు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ డ్రామా ఆడారు.
•ఒక్క చుక్క నీ��ు పారించలేదు. ఒక్క ఎకరం తడవ లేదు. ఎన్నికల కోసం జాతికి అంకితం అంటూ జగన్ రైతులను మోసం చేశారు.
#VeligondaProject
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
కారు కూతల వెంకట రెడ్డి... నువ్వు చెప్పే నోరియాన్ డాక్టర్స్ బ్రాందీ ఈ రోజు వచ్చింది కాదు...2004లో వచ్చింది.
12 ఏళ్లుగా తమిళనాడులో విక్రయాలు చేస్తోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా ఉంది.
మీ మాదిరిగా ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లతో పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మడం లేదు. మీ @YSRCParty హయాంలోని కల్తీ మద్యం సేవించి ఎంతమంది మంచానపడ్డారో అందరికీ తెలుసు
మీ నాయకుడు రోగి ��మేష్( @JogiRameshYSRCP ) ఏకంగా సొంత గూడెం ఒకటి ఏర్పాటు చేసి ఎంతమంది కడుపులో స్పిరిట్ పోశాడో ఏపీ ప్రజలు చూశారు
మీ కల్తీ బ్రాండ్లన్నీ నిలిపేరికి కూటమి ప్రభుత్వంపై ఇలా కారుకూతలు కూస్తున్నావు @Venkat_karmuru
ఎల్లప్పుడూ మద్యాన్ని అందుబాటులో ఉంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ తాగమని, తాగి ఏమైనా చేయమని పర్మిషన్, లైసెన్స్ కూడా ఇచ్చేశాడు. అందుకే రాష్ట్రంలో వరుస నేరాలు ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి.
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రెండేళ్ల నమ్మకం... క్రీడల్లో కొత్త శకం!
చంద్రబాబు విజన్‌తో క్రీడా రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగం
ఒక రాష్ట్ర అభివృద్ధిని కొలవాలంటే కేవలం రోడ్లు, భవనాలు, పరిశ���రమలు మాత్రమే కాదు... ఆ రాష్ట్ర యువత ఎంత బలంగా ఉందో, వారి ప్రతిభకు ప్రభుత్వం ఎంత విలువ ఇస్తుందో కూడా చూడాలి. ఎందుకంటే నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు. ఆ యువతను క్రీడల వైపు మళ్లించడం అంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని, క్రమశిక్షణ కలిగిన తరాన్ని, ప్రపంచ స్థాయిలో పోటీపడే భారతీయులను తయారు చేయడమే.
గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదనే అభిప్రాయం చాలామందిలో ఉండేది. మైదానాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. క్రీడా అకాడమీలు మూతపడ్డాయి. ప్రతిభ ఉన్నా అవకాశాలు లేక వేలాది మంది యువకులు తమ కలలను మధ్యలోనే వదిలేశారు. క్రీడల్లో కెరీర్ అంటే అనిశ్చితి అనే భావన ఏర్పడింది.
అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రీడలను కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగంగా గుర్తించి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గత రెండేళ్లలో జరిగిన మార్పులు చూస్తే ఇది కేవలం క్రీడల శాఖ పని మాత్రమే కాదు... భవిష్యత్ తరాన్న�� తీర్చిదిద్దే విజన్ అని అర్థమవుతుంది.
మౌలిక వసతుల విప్లవం... రాష్ట్రవ్యాప్తంగా స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు
క్రీడాకారుడు తయార���్వాలంటే ముందు సరైన మైదానం కావాలి. సరైన కోర్టు కావాలి. నాణ్యమైన శిక్షణా కేంద్రాలు ఉండాలి. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిని ప్రారంభించింది.
విజయనగరంలోని విజీ స్టేడియాన్ని రూ.6 కోట్ల వ్యయంతో ఆధునిక మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి చేసి ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.5.77 కోట్లతో అత్యాధునిక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పూర్తి చేశారు.
ఇది అక్కడితో ఆగలేదు. ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రానికి రూ.75 కోట్ల నిధులు సాధించి ఐదు ప్రధాన క్రీడా కేంద్రాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రూ.19 కోట్లతో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్, ఆర్టిఫిషియల్ టర్ఫ్ ఫుట్‌బాల్ గ్రౌండ్, టెన్నిస్ కోర్టులు, బాస్కెట్‌బాల్ కోర��టులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
కుప్పంలో రూ.14 కోట్లతో మల్టీ పర్పస్ ఇండోర్ బ్లాక్ నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో రూ.14 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మాణం కొనసాగుత��ంది. రాజమహేంద్రవరంలో రూ.13.76 కోట్లతో ఆధునిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణంలో ఉంది. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని కూడా ఆధునిక ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇవి కేవలం భవనాలు కాదు... వేలాది మంది యువ క్రీడాకారుల భవిష్యత్తుకు పునాది.
గ్రామం నుంచే ఛాంపియన్లు... ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాసం
గతంలో పెద్ద పట్టణాల్లో మాత్రమే క్రీడా సదుపాయాలు ఉండేవి. గ్���ామీణ యువతకు అవకాశాలు చాలా తక్కువ.
ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రతిభను వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే డజన్ల కొద్దీ కేంద్రాలు పూర్తి కాగా, మరెన్నో పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇది గ్రామీణ యువతకు గొప్ప అవకాశం.
క్రీడాకారుడికి గౌరవం... ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్
క్రీడల్లో రాణించినా ఉద్యోగ భద్రత లేక చాలామంది మధ్యలోనే ఆటను వదిలేసేవారు.
ఈ పరిస్థితిని మార్చుతూ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది.
దీని వల్ల వందలాది మంది ��్రతిభావంతులైన క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం పొందారు.
మెగా డీఎస్సీ ద్వారా కూడా క్రీడాకారులకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం వల్ల ఎన్నో కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి.
క్రీడ అంటే కేవలం పతకం కాదు... జీవితానికి భరోసా కూడా అని ప్రభుత్వం నిరూపించింది.
పతకం సాధిస్తే ప్రభుత్వం వెన్నంటే
క్రీడల్లో విజయం సాధించడం అంత సులభం కాదు.
సంవత్సరాల తరబడి కఠిన సాధన చేయాలి. కు��ుంబం కూడా ఎన్నో త్యాగాలు చేయాలి.
అలాంటి క్రీడాకారుల కృషిని గుర్తిస్తూ ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వారికి కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందించింది.
వందలాది మంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది.
"మీరు ఆడండి... మీ వెనుక ప్రభుత్వం ఉంటుంది."
మళ్లీ తెరుచుకున్న క్రీడా అకాడమీలు
గతంలో మూతపడిన క్రీడా అకాడమీలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి కేంద్రాల్లో తిరిగి శిక్షణ ప్రారంభమైంది.
13కు పైగా క్రీడా విభాగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే లక్ష్యంతో శిక్షణ అందిస్తున్నారు.
వేసవి శిబిరాలతో లక్షలాది యువతకు కొత్త ��వకాశం
ప్రతి వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
వేలాది మంది పిల్లలు, యువత ఈ శిబిరాల్లో పాల్గొని నాణ్యమైన శిక్షణ పొందుతున్నారు.
గతంలో సెలవులు అంటే ఇంట్లో గడిపే పరిస్థితి ఉండేది.
ఇప్పుడు వేసవి అంటే క్రీడా శిబిరాలు... కోచ్‌ల శిక్షణ... కొత్త కలలు.
జాతీయ స్థాయి టోర్నమెంట్లకు ఆతిథ్యం
రాష్ట్రంలో గత రెండేళ్లలో అనేక ప్రతిష్ఠాత��మక టోర్నమెంట్లు నిర్వహించడం మరో విశేషం.
అమరావతి ఛాంపియన్షిప్, రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, వివిధ జాతీయ పోటీలు విజయవంతంగా నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ క్రీడా పటంలో మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.
గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు లీగ్ క్రీడలు నిర్వహిస్తూ చెస్, సైక్లింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వాటర్ స్పోర్ట్స్ వంటి అనేక క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
భవిష్యత్తు లక్ష్యం... ఒలింపిక్స్ వైపు అడుగులు
ఇప్పటి అభివృద్ధి ఇక్కడితో ఆగడం లేదు.
అమరావతిలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ సిటీ, హై-పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
విశాఖలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
పాఠశాల స్థాయి నుంచే ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు సిద్ధం చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
చంద్రబాబు విజన్... క్రీడల్లోనూ ఫలిస్తోంది
చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెబుతారు.
"యువతే రాష్ట్ర భవిష్యత్తు."
ఆ ఆలోచన ఇప్పుడు క్రీడా రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది.
మౌలిక వసతులు...
అవకాశాలు...
ఉద్యోగ భరోసా...
నగదు ప్రోత్సాహకాలు...
అకాడమీలు...
జాతీయ స్థాయి పోటీలు...
ఒలింపిక్ లక్ష్యాలు...
ఇవన్నీ కలిసి చూస్తే క్రీడలను ఒక హాబీగా కాకుండా, ఒక కెరీర్‌గా, ఒక గౌరవప్రదమైన జీవన మార్గంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రెండేళ్ల నమ్మకం... రేపటి స్వర్ణయుగానికి పునాది
గత రెండేళ్లలో జరిగిన మ���ర్పులు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి.
క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రతిభ కనుమరుగవుతుంది.
ప్రోత్సహిస్తే ప్రపంచ ఛాంపియన్లు తయారవుతారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మార్పులు అదే దిశగా ఉన్నాయి.
గ్రామీణ యువకుడి చేతిలో బ్యాట్, బంతి, రాకెట్, జావెలిన్, బాక్సింగ్ గ్లౌజ్ లేదా చెస్ బోర్డు కనిపిస్తే... అది కేవలం ఒక ఆట కాదు... ��క కుటుంబం కల, ఒక రాష్ట్రం ఆశ, ఒక దేశం గర్వం.
"రెండేళ్ల నమ్మకం" కేవలం సంక్షేమం, అభివృద్ధిలోనే కాదు... క్రీడల్లో కూడా ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పడానికి ఈ రెండేళ్ల విజయాలే నిదర్శనం. రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ప్రయాణం మరింత వేగం అందుకుంటే, జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్ యువత మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి త���సుకెళ్లే రోజు ఎంతో దూరంలో లేదనే ఆశ ప్రతి యువకుడిలో కనిపిస్తోంది.
@narendramodi @ncbn @PawanKalyan @naralokesh
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్ల నమ్మకం... ఏపీకి క్యూ కట్టిన పరిశ్రమలు!
ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చేది కేవలం ప్రకటనలు కాదు... పెట్టుబడులు. పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే యువత భవిష్యత్తు మారుతుంది. అదే అసలు అభివృద్ధి. ఈ సత్యాన్ని గత రెండే��్లలో ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపించింది.
ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి కూడా వెనుకాడిన పరిస్థితి. నేడు ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న పరిస్థితి. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు. ఇది నాయకత్వంపై ఏర్పడిన నమ్మకం ఫలితం. అందుకే "రెండేళ్ల నమ్మకం" అనే మాట ఇప్పుడు రాజకీయ నినాదం కాదు... పారిశ్రామిక వాస్తవం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ��్చిన తర్వాత రాష్ట్రంలో కనిపించిన అతిపెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది "ట్రస్ట్". పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడింది. విధానాల్లో స్థిరత్వం ఉంటుందనే విశ్వాసం వచ్చింది. అనుమతుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనే ధైర్యం వచ్చింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి న��రా చంద్రబాబు నాయుడు పేరు, ఆయన పాలనా అనుభవం, ప్రపంచ స్థాయి నెట్వర్క్... ఇవే నేడు ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి.
రెండేళ్లలో రాష్ట్రానికి దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చిన్న విషయం కాదు. ఇది దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెట్టుబడి గమ్యస్థానాల్లో ఏపీని నిలబెట్టింది. రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా రూ.7.66 లక్షల కోట్ల పెట్టుబడు��ు ఇప్పటికే క్లియర్ అయి గ్రౌండింగ్ దశలో ఉండటం చూస్తే... ప్రకటనలు మాత్రమే కాదు, అమలు కూడా వేగంగా జరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది.
ఈ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు బలం ఒక్కటే... "చంద్రబాబు బ్రాండ్." దావోస్ నుంచి దుబాయ్ వరకు... ఢిల్లీ నుంచి సియోల్ వరకు... ఎక్కడికి వెళ్లినా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా ల���కేష్ అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, పారిశ్రామిక దిగ్గజాలతో జరిపిన సమావేశాలు ఇప్పుడు ఫలితాలుగా మారుతున్నాయి.
గూగుల్ ఏఐ డేటా సెంటర్, అమరావతి క్వాంటం వ్యాలీ, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు, గ్రీన్ ఎన���్జీ ప్రాజెక్టులు... ఇవన్నీ కేవలం ప్రాజెక్టులు కాదు. ఇవి రాబోయే దశాబ్దాల ఉద్యోగాల పునాది.
ఒకప్పుడు పరిశ్రమ పెట్టాలంటే అర ఎకరం భూమి కోసం కూడా క్యాబినెట్ ఆమోదం కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు 50 ఎకరాల లోపు భూముల కేటాయింపును ఏపీఐఐసీ స్థాయిలోనే పూర్తి చేసేలా విధానాన్ని మార్చడం పరిపాలనా సంస్కరణకు మంచి ఉదాహరణ. ప్రభుత్వం అంటే అడ్డంకి కాదు... భాగస్వామి అనే భావనను ఈ మార్పు తీసుకొచ్చింది.
అదే సమయంలో పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని పనులు ప్రారంభించకుండా నిల్వ పెట్టే సంస్కృతికి కూడా ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇప్పటికే వందలాది నోటీసులు జారీ చేసి భూముల వినియోగంపై కఠినంగా వ్యవహరించడం ద్వారా నిజమైన పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సంకేతం ఇచ్చింది.
పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఉద్యోగాలపై పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యమన��� ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని కేవలం ఎన్నికల వాగ్దానంగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంది. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం పనిచేయడం, వచ్చిన ఉద్యోగాలను ఆధార్‌తో అనుసంధానం చేసి పారదర్శక వ్యవస్థను తీసుకురావడం దేశంలోనే కొత్త ప్రయోగంగా చెప్పవచ్చు.
యువతకు ఉద్యోగాలు కల్పించడం అంటే కేవలం పెద్ద కంపెనీలను తీసుకురావడం మాత్రమే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవకాశాలు పెరగాలి. అందుకే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. "ఇంటింటికీ ఒక పారిశ్రామికవేత్త" అనే లక్ష్యం వ���నడానికి నినాదంలా అనిపించినా... గ్రామీణ పారిశ్రామికీకరణ దిశగా ఇది కీలక ఆలోచన.
త్వరలో రానున్న ఏపీ టాయ్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ, ఫర్నిచర్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీ వంటి విధానాలు పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయనున్నాయి. ప్రపంచ స్థాయి పరిశ్రమలు రావాలంటే కార్మికులకు కూడా ప్రపంచ స్థాయి వసతులు ఉండాలనే ఆలోచన ఈ విధానాల వెనుక కనిపిస్తోంది.
వ్యవసా��ం బలంగా ఉంటేనే పరిశ్రమలు బలపడతాయి. అందుకే ప్రభుత్వం "సీడ్ టు ప్లేట్" విజన్‌తో ఆహార శుద్ధి రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలో ఆకర్షించాలనే లక్ష్యంతో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.
భారతదేశంలో ఉత్పత్తి అయ్యే కోకో బీన్��్లో సగం ఆంధ్రప్రదేశ్ నుంచే రావడం రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత. ఈ బలాన్ని ఉపయోగించుకుని విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే ప్రయత్నం జరుగుతోంది.
కర్నూలు జిల్లాలో టమాటా రైతులు పంటను రోడ్లపై పారబోసే రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో భారీ టమాటా ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చివరి దశకు చేరుకోవడం రైతులకు భరోసానిస్తోంది. అనకాపల్ల��లో పనసపండు, చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు, తిరుపతి ఐఐటీ ఇంక్యుబేషన్ కేంద్రంలో మామిడి, టమాటా, సిట్రస్ ప్రాసెసింగ్... ఇవన్నీ రైతు ఉత్పత్తికి మార్కెట్ విలువ పెంచే ప్రయత్నాలే.
ప్రపంచ పెట్టుబడిదారులను మరోసారి ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేందుకు ప్రభుత్వం నవంబర్‌లో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించబోతోంది. దేశవ్యాప్తంగా, విదేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తూ ఏపీ అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించింది. ఇది ఒక రాష్ట్రం తనను తాను ప్రపంచ పెట్టుబడి మ్యాప్‌లో ఎలా నిలబెట్టుకోవాలో చూపించే ప్రయత్నం.
అరకు కాఫీకి ప్రపంచ మార్కెట్లో మరింత బ్రాండింగ్ ��ల్పించడం కూడా ఇదే ఆలోచనలో భాగం. గిరిజన రైతు పండించిన ఉత్పత్తి అంతర్జాతీయ మార్కెట్లో విలువ పెంచుకుంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
గత ప్రభుత్వ కాలంలో పరిశ్రమలు తగ్గుముఖం పట్టాయని, పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ప్రభుత్వం చెబుతోంది. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారులు తిరిగి ఏపీ వైపు చూస్తుండటం, పార్ట్నర్��ిప్ సమ్మిట్‌లో వచ్చిన పెట్టుబడుల్లో ఇప్పటికే 40 శాతానికి పైగా గ్రౌండింగ్ దశకు చేరుకోవడం ఆ మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.
ప్రపంచ స్థాయి కంపెనీలు ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే ముందు అక్కడి రాజకీయ స్థిరత్వం, విధానాల పారదర్శకత, ప్రభుత్వ స్పందన, మౌలిక వసతులు, నాయకత్వంపై విశ్వాసం... ఈ ఐదు అంశాలను ప్రధానంగా పరిశీలిస్తాయి. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రంగాల్లో సానుకూల సంకేతాలు ��వ్వగలిగిందనే అభిప్రాయం పెట్టుబడుల రూపంలో కనిపిస్తోంది.
అయితే అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ప్రకటించిన పెట్టుబడులన్నీ ఎంత వేగంగా గ్రౌండింగ్ అవుతాయి? వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగాలు ఎంత వేగంగా యువతకు అందుతాయి? పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల వరకు ఎంత మేర విస్తరిస్తాయి? చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంత బలోపేతం అవుతాయి? ఇవే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ పనితీరును నిర్ణయించే అసలు ప��రమాణాలు.
అయినప్పటికీ ఒక వి��యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌పై పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పరిశ్రమలను ఉత్పత్తిగా, ఉత్పత్తిని ఉద్యోగాలుగా, ఉద్యోగాలను యువత భవిష్యత్తుగా మార్చగలిగితే... "స్వర్ణాంధ్ర 2047" కేవలం ఒక విజన్ డాక్యుమెంట్‌గా కాకుండా, ఆచరణలో కనిపించే అభివృద్ధి గాథగా నిలిచే అవకాశం ఉంది.
ఎందుకంటే... పెట్టుబడులు రాష్ట్రాన్ని మార్చవు. ఆ ��ెట్టుబడులపై ప్రజల్లో ఏర్పడిన నమ్మకమే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుంది. ఇదే గత రెండేళ్ల ఆంధ్రప్రదేశ్ కథ. ఇదే "రెండేళ్ల నమ్మకం"కు అసలైనఅర్థం.
@narendramodi @ncbn @PawanKalyan @naralokesh
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
2 ఏళ్ల నమ్మకం... బీసీల భవిష్యత్తుకు బంగారు బాట
రెండు సంవత్సరాలు... రాజకీయాల్లో ఇది చిన్న కాలమే కావచ్చు. కానీ ప్రజల జీవితాల్లో మార్పు కనిపించాలంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యంగా సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బ���సీల అభివృద్ధిని నిజంగా కోరుకున��� నాయకత్వం ఉండాలి. ఈ రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కనిపించిన అతిపెద్ద మార్పు అదే.
ఒకప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొచ్చే బీసీలు... ఇప్పుడు ప్రభుత్వ విధానాల కేంద్రబిందువుగా మారారు. "బీసీలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది" అనే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే, ఇది కేవలం సంక్షేమం కాదు... భవిష్యత్తును నిర్మించే ప్రయత్నమని ��ర్థమవుతోంది.
గతంలో బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు బడ్జెట్లోనే బీసీలకు ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి బడ్జెట్లో రూ.39 వేల కోట్లు... రెండో బడ్జెట్లో రూ.47 వేల కోట్లు... మూడో బడ్జెట్లో రూ.51 వేల కోట్ల కేటాయింపు జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బీసీల సంక్షేమానికి ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి.
ఈ నిధులు కేవలం లెక్కలకే ప���ిమితం కాలేదు. విద్య, ఉపాధి, నైపుణ్యం, రాజకీయ సాధికారత, స్వయం ఉపాధి... ప్రతి రంగంలో బీసీలకు కొత్త అవకాశాలు సృష్టించేలా ఉపయోగపడుతున్నాయి.
గురుకులాల నుంచి గ్లోబల్ స్థాయికి...
పేద కుటుంబానికి చెందిన పిల్లవాడు కూడా ఐఐటీ, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి తల్లిదండ్��ి కోరుకుంటారు. ఆ కల నిజం కావాలంటే నాణ్యమైన విద్య అవసరం.
అందుకే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 109 బీసీ గురుకులాలకు తోడు మరో 10 కొత్త గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.500 కోట్లతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తోంది. సంవత్సరాలుగా అద్దె భవనాల్లో నడిచిన గురుకులాలకు ఇప్పుడు సొంత గౌరవం దక్కుతోంది.
టేకులోడు, సింహాచలం గురుకులాల్లో ఐఐటీ, నీట్ ప్రవేశాల కోసం ప్ర��్యేక ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇది గ్రామీణ బీసీ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాన్ని కల్పిస్తోంది.
గతంలో నిర్మాణాలు ఆగిపోయిన గుడిబండ, గుండుమల, పులివెందుల, రొద్దం గురుకులాలను మళ్లీ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు... వేలాది కుటుంబాల ఆశలకు రూపం.
హాస్టల్ అంటే ఇక కష్టాల నిలయం కాదు...
ఒకప్పుడు ప్రభుత్వ హాస్టళ్లంటే ఇబ్బందులు, తాగునీటి సమస్యలు, మరమ్మతుల కోసం ఎదురు చూపులు గుర్తొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
రాష్ట్రంలోని 998 బీసీ హాస్టళ్లలో 85 వేల మంది విద్యార్థులకు మెరుగైన వసతి కల్పిస్తున్నారు. రూ.80 కోట్లతో భవనాల మరమ్మతులు, రూ.16.85 కోట్లతో 772 ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, దోమతెరలు, వంట సామగ్రి, సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం... ఇవన్నీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం.
260 మంది కొత్త కుక్ల నియామకం, త్వరలో మరో 142 మంది నియామకం, 1,291 మంది పారిశుధ్య సిబ్బంది ఏర్పాటు... ఇవన్నీ విద్యార్థులు ఇంట్లో ఉన్నట్టే ఉండాలనే ఆలోచనకు ప్రతిరూపం.
ప్రతిభకు ప్రోత్సాహం... ఉద్యోగాలకు దారి
చదువు పూర��తయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలని ప్రతి యువకుడు కోరుకుంటాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
ప్రతి ఏడాది వందమంది బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తోంది. కొందరు ఇప్పటికే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అర్హత సాధించగా, మరికొందరు బ్యాంకులు, ఆర్ఆర్బీ, గ్రూప్-2 వంటి ఉద్యోగాలు సాధించారు.
మెగా డీఎస్సీకి ఉచిత కో���ింగ్ ద్వారా 280 మంది బీసీ యువత ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. ఇక విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ప్రత్యేక బీసీ స్ట��ీ సర్కిళ్లు ఏర్పాటు చేసి గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఆదరణ 3.0... చేతివృత్తులకు కొత్త జీవం
బీసీ కుటుంబాల జీవనాధారం ఎక్కువగా సంప్రదాయ వృత్తులే. కాలానుగుణంగా ఆ వృత్తులకు ఆధునిక పరికరాలు, మార్కెట్ అవకాశాలు లేక చాలామంది వెనుకబడ్డారు.
ఇప్పుడు రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందించి, సంప్రదాయ వృత్తులను లాభదాయ���మైన వ్యాపారాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెంపు, నేతన్నలకు ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్, వడ్డెరలకు క్వారీల్లో రాయితీలు, మత్స్యకారులకు నిషేధకాల భృతి రెట్టింపు... ఇవన్నీ వృత్తి ఆధారిత బీసీల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్నాయి.
రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట
బీసీలు కేవలం ఓటు బ్యాంక్ కాదు... పాలనలో భాగస్��ాములు కావాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపట్టింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
బీసీలకు ఆత్మగౌరవం, సామాజిక రక్షణ కల్పించే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇది అమల్లోకి వస్తే దేశంలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
ప్రతి జిల్లాలో బీసీ భవనం
సంఘటిత శక్తి సమాజ అభివృద్ధికి అవసరం. అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు నిర్మిస్తున్నారు. కర్నూలు, ఏలూరు, నెల్లూరులో ఇప్పటికే పనులు ప్రార���భమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మిస్తున్నారు.
కోట్లాది మందికి నేరుగా లబ్ధి
రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా 117.68 లక్షల మంది బీసీలకు రూ.32,533 కోట్లకు పైగా ప్రయోజనాలు అందాయి. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ.19,429 కోట్లకు పైగా సహాయం అందింది.
ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు. లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన వాస్తవాలు.
నమ్మకం ఎందుకు పెరిగింది?
ప్రజలు మాటలు ���ాదు... పనులు చూస్తారు.
బడ్జెట్లో భారీ నిధులు...
కొత్త గురుకులాలు...
శాశ్వత భవనాలు...
ఉచిత కోచింగ్...
హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు...
ఆదరణ 3.0...
రాజకీయ రిజర్వేషన్లు...
సంప్రదాయ వృత్తులకు ఆధునిక బలం...
బీసీ రక్షణ చట్టం...
ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటర్లుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తోందనే భావన బలపడుతోంది.
రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. బీసీ పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ అవకాశాలు, సంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికత, రాజకీయాల్లో ప్రాధాన్యం, సామాజిక గౌరవం... ఇవన్నీ కలిసి ఒక కొత్త దిశను చూపిస్తున్నాయి.
ఇంకా ప్రయాణం పూర్తికాలేదు. చేయాల్సిన పనులు ఇంకా చ���లా ఉన్నాయి. కానీ మొదటి రెండేళ్లలో కనిపించిన దిశ మాత్రం స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తోంది.
"బీసీల అభ్యున్నతి అంటేనే రాష్ట్ర అభివృద్ధి" అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంపై ప్రజల్లో ఒక కొత్త నమ్మకం ఏర్పడింది.
అందుకే ఈ రెండేళ్లను చాలామంది ఒక మాటలో చెబుతున్నారు... "2 ఏళ్ల నమ్మకం... బీసీల భవిష్యత్తుకు బంగారు బాట."
@narendramodi @ncbn @PawanKalyan @naralokesh
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
2 ఏళ్ల నమ్మకం... సామాజిక న్యాయానికి కొత్త నిర్వచనం
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన రెండేళ్లలో చాలా రంగాల్లో మార్పులు కనిపించాయి. కానీ అందులో అత్యంత ముఖ్యమైన మార్పు ఏదైనా ఉందంటే... అది సామాజిక న్యాయం అనే భావనకు కొత్త అర్థం రావడం. ఒకప్పుడు సంక్షేమం అంటే పథకాలు ప్రకటించడం, నిధులు కేటాయించడం వరకే పరిమితమయ్యేది. ఇప్పుడు సంక్షేమం అంటే విద్య, నైపుణ్యం, ఉపాధి, భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైన జీవితం కల్పించడం అనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
రెండేళ్లలో తీసుకున్న అనేక నిర్ణయాలు చూస్తే... ఈ ప్రభుత్వం కేవలం సహాయం చేయడం కాదు, సమాజంలోని అట్టడుగు వర్గాలను శాశ్వతంగా నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
విద్యే నిజమైన సాధికారత... అదే ప్రభుత్వ ప్రాధాన్యం
పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందితేనే తరాలు మారతాయి. ఈ ఆలోచనతో విద్యారంగంలో భారీ స్థాయిలో చర్యలు చేపట్టడం విశేషం.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద రూ.1,543.17 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ విడ���దల చేసి 5.40 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు అండగా నిలిచింది ప్రభుత్వం.
అలాగే తల్లికి వందనం ద్వారా 2.51 లక్షల మంది విద్యార్థులకు రూ.326.74 కోట్ల సహాయం అందింది.
విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ వ్యవస్థలోనే అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్య��చరణ చేపట్టడం మరో విశేషం.
పోటీ పరీక్షల్లో పేద విద్యార్థులకూ సమాన అవకాశాలు
గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు కూడా IAS, IPS, టీచర్, గ్రూప్స్ వంటి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది.
NEET, JEE, Civils, Groups, DSC వంటి పరీక్షలకు పూర్తిగా ఉచిత కోచింగ్ అందిస్తోంది.
మెగా డీఎస్సీ కోచింగ్‌లో 2,000 మంది శిక్షణ పొందగా అందులో 331 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధిం��డం ప్రభుత్వ శిక్షణ నాణ్యతకు నిదర్శనం.
పోటీ పరీక్షలు ఇక నగరాలకే పరిమితం కావడం లేదు... ప్రభుత్వ కోచింగ్ ద్వారానే వేలాది మంది యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
గురుకులాలు... ఇప్పుడు ప్రతిభకు చిరునామా
ఒకప్పుడు గురుకులాల్లో కేవలం వసతి మాత్రమే ఉండేదని భావించేవారు. ఇప్పుడు అక్కడి ఫలితాలే ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి.
టెన్త్‌లో 89 శాతం, ఇంటర్మీడియట్లో 92 శాతం ఉత్తీర్ణత సాధ��ంచడం చిన్న విషయం కాదు.
టెన్త్‌లో 591 మార్కులు, ఇంటర్లో 950 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు గురుకులాల నుంచే రావడం ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకాన్ని చూపిస్తోంది.
ఇంకా జాతీయ స్థాయి పరీక్షల్లో మరింత మంది రాణించేలా నాలుగు ప్రత్యేక ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం భవిష్యత్తు తరాలకు పెద్ద పె��్టుబడి.
హాస్టళ్లు అంటే వసతి మాత్రమే కాదు... భద్రత కూడా
ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి గతంలో ఎలా ఉండేదో అందరికీ తెలుసు.
ఇప్పుడు మాత్రం రూ.104.96 కోట్లతో 774 హాస్టళ్లలో మరమ్మతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టడం జరిగింది.
ప్రతి హాస్టల్లో
* RO ప్లాంట్లు
* పరిశుభ్రమైన వంటశాలలు
* హౌస్‌కీపింగ్ వ్యవస్థ
* AI ఆధారిత CCTV కెమెరాలు
* శుభ్రమైన పడకలు
* పోషకాహారం
వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్య���ర్థులకు కుటుంబ వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతోంది.
ఆరోగ్యంగా ఉంటేనే విద్య పూర్తి అవుతుంది
విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఈ రెండేళ్లలో కనిపించిన ముఖ్యమైన మార్పు.
ప్రతి హాస్టల్లో ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్ సేవలు ఏర్పాటు చేయడం, అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సహాయం అందించడం, మానసిక ఆరోగ్యంపై కౌన్సెలింగ్ సేవలు అందించడం వంటి చర్యలు విద్యార్థుల్లో భరోసా పెంచుతున్నాయి.
దివ్యాంగులకు సంక్షేమం కాదు... గౌరవప్రద జీవితం
సమాజంలో అత్యంత అవసరమైన వర్గమైన దివ్యాంగుల పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
52 వేలకుపైగా దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది.
వారి కోసం పెండింగ్ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ��్రారంభమైంది.
పింఛన్‌ను రూ.6,000కు పెంచడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ప్రతి కలెక్టరేట్లో దివ్యాంగులకు అనుకూల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా మంచి ముందడుగు.
ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన స్థానం
సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి, సంక్షేమం, ���ౌరవప్రద జీవితం కల్పించే చర్యలు ప్రారంభమయ్యాయి.
ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదు... సమాజాన్ని సమానత్వం వైపు తీసుకెళ్లే అడుగు.
డిజిటల్ పరిపాలన... ప్రతి ఇంటికీ ప్రభుత్వం
స్వర్ణ గ్రామం – వార్డు వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది.
1.68 కోట్ల ఇళ్ల మ్యాపింగ్, 1.71 కోట్ల కుటుంబాల ఈ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా మారాయి.
డిజిలాకర్ ద్వారా పౌరుల ము��్య పత్రాలు డిజిటల్ రూపంలో భద్రపరిచే అవకాశం కల్పించడం కూడా ఆధునిక పరిపాలనకు నిదర్శనం.
ఎస్సీ సబ్ ప్లాన్... నిధులు మాత్రమే కాదు వినియోగం కూడా
చాలా ప్రభుత్వాలు భారీ కేటాయింపులు ప్రకటిస్తాయి.
కానీ వాటి అమలే అసలు పరీక్ష.
2024-25 సంవత్సరానికి రూ.26,044 కోట్ల ��స్సీ సబ్ ప్లాన్ కేటాయించి, నిధుల వినియోగంలో కూడా రికార్డు స్థాయి పురోగతి సాధించడం ప్రత్యేకత.
అభివృద్ధి నిధులు నిజంగా లబ్ధిదారులకు చేరినప్పుడే వాటి విలువ ఉంటుంది.
మహిళలకు, వృద్ధులకు, బలహీన వర్గాలకు భరోసా
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలుస్తున్నాయి.
మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సబ్సిడీ రుణాలు వంటి కార్యక్రమాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నాయి.
ఇది కేవలం సంక్షేమం కాదు... కుటుంబాలను నిలబెట్టే ఆర్థిక బలం.
సంక్షేమం నుంచి సాధికారత వైపు... ఇదే అసలైన మార్పు
గతంలో సంక్షేమం అంటే డబ్బు పంపిణీ.
ఇప్పుడు సంక్షేమం అంటే విద్య, ఉద్యోగం, నైపుణ్యం, డిజిటల్ సేవలు, ఆరోగ్యం, భద్రత, గౌరవప్రద జీవితం.
ఇదే ఈ రెండేళ్లలో కనిపించిన అసలైన మార్పు.
ఒక విద్యార్థి మంచి ఉద్యోగం పొందితే ఒక కుటుంబం మారుతుం���ి.
ఒక దివ్యాంగుడు స్వయం ఉపాధి పొందితే ఒక జీవితం మారుతుంది.
ఒక మహిళ ఆర్థికంగా నిలబడితే ఒక తరం మారుతుంది.
అదే నిజమైన సామాజిక న్యాయం.
2 ఏళ్ల నమ్మకం... సమాన అవకాశాల వైపు రాష్ట్ర ప్రయాణం
ఈ రెండేళ్లలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే ప్రభుత్వం కేవలం పథకాలు ప్రకటించడం కాదు... సమాజంలో వెనుకబడిన ప్రతి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తోందనే విషయం స్పష్టమవుతోంది.
��ిద్యలో నాణ్యత...
పోటీ పరీక్షల్లో అవకాశాలు...
గురుకులాల బలోపేతం...
హాస్టళ్ల ఆధునికీకరణ...
��ివ్యాంగుల గౌరవప్రద జీవితం...
మహిళల సాధికారత...
డిజిటల్ పరిపాలన...
సబ్‌ప్లాన్ నిధుల సమర్థ వినియోగం...
ఇవి ఒక్కోటి విడివిడిగా కనిపించినా, కలిపి చూస్తే ఒక పెద్ద దిశ కనిపిస్తోంది. అదే సంక్షేమాన్ని సాధికారతగా మార్చే పరిపాలన.
అందుకే రెండేళ్ల క్రితం ప్రజలు ఉంచిన నమ్మకం, ఈ రోజు కేవలం హామీల్లో కాదు... విద్యార్థుల విజయాల్లో, హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాల్లో, దివ్యాంగుల చిరునవ్వుల్లో, మహిళల ఆత్మవిశ్వాసంలో, గ్రామీణ కుటుంబాల ఆశల్లో కనిపిస్తోంది.
"రెండేళ్ల నమ్మకం... ప్రతి బలహీన వర్గం జీవితంలో గౌరవప్రదమైన మార్పుకు బలమైన పునాది."
@narendramodi @ncbn @PawanKalyan @naralokesh
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్ల నమ్మకం... గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగు...
రెండేళ్లు... ఒక ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి చాలా పెద్ద కాలం కాకపోవచ్చు. కానీ ఆ రెండేళ్లలో దిశ మారితే, వ్యవస్థ మారితే, ప్రజల్లో నమ్మకం పెరిగితే... అదే నిజమైన పాలనకు గుర్తు. ���ేడు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్ర��ంతాలను చూస్తే అలాంటి మార్పే కనిపిస్తోంది. ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన గ్రామాలు ఇప్పుడు విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు, హక్కుల పరిరక్షణ వంటి ప్రతి రంగంలో ముందుకు అడుగులు వేస్తున్నాయి.
గిరిజనుడు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారుడిగా కాకుండా, అభివృద్ధిలో భాగస్వామిగా ఎదగాలన్న ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే ఈ రెండేళ్లలో కనిపించిన అతిపెద్ద మార్పు.
విద్���కు పెద్దపీట... భవిష్యత్తుకు బలమైన పునాది
గిరిజన పిల్లల భవిష్యత్తు చదువులోనే ఉందన్న నమ్మకంతో రాష్ట్రవ్యాప్తంగా 371 ఆశ్రమ పాఠశాలలు, 17 ప్రీ-మ్యాట్రిక్ హాస్టళ్లు, 170 పోస్ట్-మ్యాట్రిక్ హాస్టళ్లు, 1,958 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ద్వారా 1,61,082 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది.
మొత్తం రూ.4,671.61 కోట్ల బడ్జెట్లో రూ.1,368.06 కోట్లను గిరిజన విద్య కోసం కేటాయించడం విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపుతోంది.
విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్టేషనరీ, పడక సామగ్రి, లక్షకు పైగా నోట్‌బుక్స్ అందించడం ద్వారా హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించారు.
మాతృభాషలోనే విద్య... కొత్త ఆత్మవిశ్వాసం
సవారా, కూవి, కొండ, ఆదివాసీ ఒరియా, కోయ, సుగాలి వంటి గిరిజన భాషల��లో 1,127 పాఠశాలల్లో మల్టీ లింగ్వల్ విద్యను ప్రవేశపెట్టడం ఒక చారిత్రక నిర్ణయం. పిల్లలు తమ భాషలోనే చదువుకోవడం వల్ల చదువుపై ఆసక్తి, అవగాహన రెండూ పెరిగాయి.
ఉపాధ్యాయుల నియామకాలు... విద్యకు కొత్త ఊపు
1,260 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల సేవలను కొనసాగించారు.
మెగా డీఎస్సీ ద్వారా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 850 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు.
63 మంది బోధనా, బోధనేతర సిబ్బందికి పదోన��నతులు ఇచ్చారు.
1,789 క్లీనింగ్, శానిటేషన్, వంట సేవలను అవుట్సోర్సింగ్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి మళ్లీ జీవం
గతంలో నిలిచిపోయిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని పునరుద్ధరించి 2019-2023 మధ్య బకాయిగా ఉన్న రూ.22.95 కోట్లను చెల్లించడం ద్వారా వేలాది గిరిజన విద్యార్థులకు మళ్లీ అవకాశాలు కల్పించారు.
ఉన్��త విద్యకు కొత్త అవకాశాలు
విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, తిరుపతిలో ఎస్టీ స్టడీ సర్కిళ్లకు రూ.4.22 కోట్లతో అనుమతులు ఇచ్చి 300 మంది విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు.
1,15,909 మంది విద్యార్థులకు రూ.192.32 కోట్లతో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్స్ అందించారు.
'ముస్తాబు'... పరిశుభ్రతకు కొత్త సంస్కృతి
వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు "ముస్తాబు" కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా విద్యార్థుల్లో మంచి అలవాట్లను పెంపొందిస్తున్నారు.
ఆరోగ్య రక్షణకు పెద్ద అడుగులు
35 బర్త్ వెయిటింగ్ హోమ్స్ కోసం రూ.14.29 కోట్లు ఖర్చు చేసి గిరిజన గర్భిణులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
2047 నాటికి సికిల్ సెల్ అనీమియాను నిర్మూలించాలన్న లక్ష్యంతో ఇప్పటికే 14,95,185 మంది గిరిజనులకు స్క్రీనింగ్ నిర్వహించడం దేశంలోనే ఒక పెద్ద కార్యక్రమంగా నిలిచింది.
పెండింగ్ నిధుల విడుదల... కేంద్ర పథకాల వేగవంతమైన అమలు
2018-19 నుంచి పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల్లో రూ.206.93 కోట్లను విడుదల చేయించారు.
ఆర్టికల్ 275(1) కింద రూ.71.21 కోట్లతో 53 పనులు పూర్తయ్యాయి.
98 గిరిజన హాబిటేషన్లకు రూ.118.71 కోట్లతో రోడ్డు సౌకర్యాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
గిరిజన మహిళలకు ఆర్థిక బలం
SERPతో కలిసి "ఉన్నత���" పథకం కింద 56 జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
రూ.40.30 కోట్ల వ్యయంతో 4,030 మంది గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
PM JANMAN... అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు అండ
పీవీటీజీ కుటుంబాల అభివృద్ధి కోసం పక్కా ఇళ్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్, మొబైల్ టవర్లు, హాస్టళ్లు, అంగన్వాడీలు, సోలార్ విద్యుత్, మొబైల్ మెడికల్ యూనిట్లు, మల్టీపర్పస్ సెంటర్లు, వనధన్ వికాస్ కేంద్రాలు వంటి సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి.
8,250 పక్కా ఇళ్లు, 25,168 ఇళ్లకు విద్యుత్, 2,146 తాగునీటి కనెక్షన్లు, 1,353 మొబైల్ టవర్లు, 4,152 నివాస ప్రాంతాలకు మొబైల్ మెడికల్ సేవలు, 125 మల్టీపర్పస్ సెంటర్లు, 73 వనధన్ వికాస్ కేంద్రాలు ఈ మిషన్‌లో భాగంగా ముందుకు సాగుతున్నాయి.
ధర్తి ఆబా జనజాతియా గ్రామ ఉత్త్కర్ష్ అభియాన్
18 జిల్లాల్లోని 878 గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ పథకం అమలవుతోంది.
పక్కా ఇళ్లు, రహదారులు, జల్ జీవన్ మిషన్, విద్యుదీకరణ, మొబైల్ వైద్యం, అంగన్వాడీలు, హాస్టళ్లు, స్కిల్ ఇండియా, హోమ్ స్టేలు, మార్కెటింగ్ కేంద్రాలు, వ్యవసాయం, పశుసంవర్ధక, చేపల పెంపకం, డిజిటల్ సేవలు, గిరిజన మార్కెట్లు, ఆశ్రమ పాఠశాలల అప్గ్ర��డేషన్, సికిల్ సెల్ సెంటర్ వంటి 25 కీలక అంశాలపై పనులు కొనసాగుతున్నాయి.
రూ.20.47 కోట్ల కేటాయింపుకు బదులుగా సమర్థవంతమైన అనుసరణతో రూ.169.48 కోట్ల నిధులను రాష్ట్రం సాధించడం విశేషం.
ST కంపోనెంట్ నిధుల సమర్థ వినియోగం
2025-26లో రూ.8,159.68 కోట్లలో ఇప్పటికే రూ.5,318.76 కోట్లు ఖర్చు చేశారు.
2026-27కు రూ.9,189.64 కోట్ల కేటాయింపు గిరిజన అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.
అడవి హక్కులకు గౌరవం
RoFR భూ రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేశారు.
1.14 లక్షల మంది RoFR రైతులకు PM-KISAN – అన్నదాత సుఖీభవ లబ్ధి అందింది.
ISB-BIPPతో భాగస్వామ్యం ద్వారా అటవీ ఉత్పత్తులకు విలువ జోడించి గిరిజన మహిళలకు ఆదాయ అవకాశాలు పెంచుతున్నారు.
వ్యవసాయానికి ప్రోత్సాహం
1,20,782 ఎకరాల్లో వ్యవసాయం, 2,86,155 ఎకరాల్లో కాఫీ, మిరియాలు, ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.
40 వేల ఎకరాల్లో తోటల అభివృద్ధి కొనసాగుతుండగా, సాగుకు అనుకూలం కాని భూముల్లో గ్రీన్ కవర్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
పేసా గ్రామ సభలకు పునర్జీవం
2019 నుంచి పెండింగ్‌లో ఉన్న 2,038 పేసా గ్రామ సభల ఎన్నికల్లో ఇప్పటికే 1,954 పూర్తి��ేయడం ద్వారా గ్రామ స్వయంపాలనకు బలం చేకూరింది.
గిరిజన భూముల రక్షణ
108 LTR కేసుల్లో 83 కేసులు పరిష్కరించి 229 ఎకరాల భూమిని రక్షించారు.
ASR జిల్లాలో 2,623 ఎకరాల భూమికి సంబంధించిన 307 ఆదేశాలను అమలు చేశారు.
30,556 LTR కేసుల్లో 17,222 కేసుల సమాచారాన్ని వెబ్ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చారు.
ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ పునర్వ్యవస్థీకరణ
గిరిజన సమస్యలపై సమగ్ర నిర్ణయాల కోసం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌ను పున���్వ్యవస్థీకరించి సమావేశాలు నిర్వహించారు.
ఆది కర్మయోగి అభియాన్
338 మంది అధికారులు, 20 వేల మందికి పైగా గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
2,314 గ్రామ సభలు నిర్వహించి రూ.11,480 కోట్ల విలువైన సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేశారు.
దేశవ్యాప్తంగా గుర్తింపు
గిరిజన సంక్షేమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. భారత రాష్ట్��పతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ గౌరవం అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణం.
రెండేళ్లలో కనిపించిన అసలు మార్పు
గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి అనేది కేవలం ప్రకటనల్లో కాదు... గ్రామాల్లో కనిపిస్తోంది. ��ాఠశాలల్లో నాణ్యమైన విద్య కనిపిస్తోంది. హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కనిపిస్తున్నాయి. రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గిరిజన మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. గిరిజన రైతులకు భూ హక్కులు బలపడుతున్నాయి. యువతకు ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాల దారులు తెరుచుకుంటున్నాయి.
ఈ రెండేళ్లు గిరిజనుల జీవితాల్లో నమ్మకాన్ని పెంచిన రెండ���ళ్లు. అభివృద్ధి అంటే ఏమిటో గిరిజన గ్రామాలకే చేరువ చేసిన రెండేళ్లు. ప్రతి గిరిజన కుటుంబం గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రయాణం... రాబోయే రోజుల్లో మరింత వేగంగా కొనసాగాలని కోరుకుంటూ, ఈ రెండేళ్లను నిజంగానే "నమ్మకం నిండిన రెండేళ్లు" అని చెప్పొచ్చు.
@narendramodi @ncbn @PawanKalyan @naralokesh
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
.@ysjagan గారూ… మీ పోస్టులు చూస్తుంటే ఒకటే సందేహం - ఇవన్నీ మీరే రాస్తున్నారా? లేక ChatGPTని అడిగి పెట్టిస్తున్నారా? 😏
తెలుగు మీద పట్టు లేదు…
ఇంగ్లీష్ మీదా పట్టు లేదు…
కానీ ప్రశ్నాపత్రాల వ్యవహారాలు, స్కామ్‌ల ఆరోపణల విషయంలో మాత్రం మీకంటే ఎక్స్పర్ట్ ఎవరూ లేరు!
రెండేళ్ల నమ్మకం... ఉత్తరాంధ్రకు కొత్త దిక్సూచి
నినాదాల ఉత్తరాంధ్ర నుంచి అవకాశాల ఉత్తరాంధ్ర వైపు...
ఒకప్పుడ��� ఉత్తరాంధ్ర అంటే గుర్తొచ్చేది వలసలు. చదువు పూర్తయిన యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణే వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. పరిశ్రమలు లేవు... పెట్టుబడులు లేవు... ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు లేవు... రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర పేరు చెప్పినా, అభివృద్ధి మాత్రం కనిపించేది కాదు. దశాబ్దాలుగా "వెనుకబడిన ప్రాంతం" అనే ముద్రతోనే ఈ ప్రాంతం కొనసాగింది.
కానీ గత ర���ండేళ్లలో పరిస్థితి క్రమంగా మారుతోంది. అభివృద్ధిని నినాదాలకే పరిమితం చేయకుండా, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, మౌలిక వసతుల ద్వారా ఉత్తరాంధ్రను రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విజన్, మంత్రి పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి కలిసి ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాల ద్వారాలు తెరిచాయి.
రాష్ట్ర పెట్టుబడుల్లో సగం... ఉత్తరాంధ్రకే
గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు సగం, అంటే సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్ర ప్రాంతానికే రావడం సాధారణ విషయం కాదు. ఇది పెట్టుబడిదారులు ఈ ప్రాంత భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం.
విశాఖపట్నం ఇప్పుడు కేవలం ఉక్కు నగరం కాదు. డేటా, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ పరిశ్రమలకు కేంద్రంగా ఎదుగుత��ంది. ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే పరిణామం.
డేటా ఎకానమీకి విశాఖ చిరునామా
రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్‌కు భూమిపూజ జరగడం విశాఖ చరిత్రలో కీలక ఘట్టం. అదే సమయంలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం మరో శుభపరిణామం.
డేటా సెంటర్లు అంటే కేవలం భవనాలు కాదు. వాటి చుట్టూ ఐటీ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయి. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి. విశాఖ ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడు��ులు వేస్తోంది.
ఉక్కు నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు... పరిశ్రమల విప్లవం
ఉత్తరాంధ్రలో పెట్టుబడులు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు.
అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ రూ.1.36 లక్షల కోట్లతో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఎన్టీపీసీ రూ.2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. టీసీఎస్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగాల్లో కొత్త పెట్టుబడులు విశాఖను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మార్చే సంకేతాలు ఇస్తున్నాయి.
ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లేది. ఇప్పుడు ప్రపంచ కంపెనీలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. ఇదే అసలు మార్పు.
పెట్టుబడులు రావాలంటే... నమ్మకం ఉండాలి
ఏ పరిశ్రమ అయినా పెట్టుబడి పెట్టే ముందు ప్రభుత్వ స్థిరత్వాన్ని, విధానాల పారదర్శకతను, అనుమతుల వేగాన్ని పరిశీలిస్తుంది. గతంలో వివిధ కారణాలతో విశాఖ నుంచి వెళ్లిపోయిన సుమారు 26 కంపెనీలను తిరిగి తీసుకురావడం ప్రభుత్వం సాధించిన ముఖ్య విజయంగా చెప్పుకోవచ్చు.
"స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంతో ప��ిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడం, విధానాల్లో స్థిరత్వం కల్పించడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది.
మౌలిక వసతుల్లో కొత్త అధ్యాయం
అభివృద్ధికి పరిశ్రమలతో పాటు రవాణా సౌకర్యాలు కూడా కీలకం.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించడం ప్రాంత అభివృద్ధికి కీలక అడుగు. శ్రీకాకుళం జిల్లా మూలపేట నుంచి భీమిలి వరకు గ్రీన్‌ఫీల్డ్ కోస్టల్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తీరప్రాంత ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది.
చీపురుపల్లి ఫ్లైఓవర్ పూర్తి కావడం ద్వారా సుమారు ఎనిమిది నియోజకవర్గాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ఇవి కేవలం రోడ్లు కాదు... ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు.
భోగాపురం... ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు గేట్‌వే
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ప్రాజెక్టు.
ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రను అంతర్జాతీయ వ్యాపార పటంలో నిలబెట్టే సామర్థ్యం కలిగి ఉంది. విమానాశ్రయం వస్తే కేవలం విమానాల రాకపోకలే కాదు... హోటళ��లు, లాజిస్టిక్స్, కార్గో, ఐటీ, పర్యాటకం, సేవారంగం వేగంగా అభివృద్ధి చెందుతాయి. వేలాది ఉద్యోగాలకు ఇది మార్గం చూపుతుంది.
వ్యవసాయానికీ సమాన ప్రాధాన్యం
ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు మాత్రమే కాదు. రైతుకు నీరు, గిరిజన ప్రాంతాలకు ఆదాయం కూడా అంతే ముఖ్యం.
అరకు కాఫీ సాగును లక్ష ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాలకు విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తోటపల్లి రిజర్��ాయర్ ద్వారా చెరువులు నింపేందుకు ప్రత్యేక జీవో జారీ చేసింది.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.980 కోట్లు కేటాయించి పనులను వేగవంతం చేసింది. 2027 నాటికి పోలవరం నీటిని ఉత్తరాంధ్రకు తీసుకురావాలన్న లక్ష్యం ఈ ప్రాంత వ్యవసాయ భవిష్యత్తును బలోపేతం చేయగలదు.
విద���య, పరిశోధన, పరిశ్రమల సమన్వయం
విశాఖ అభివృద్ధి కేవలం పరిశ్రమలతోనే పరిమితం కాకుండా విద్యా రంగానికీ ప్రాధాన్యం ఇస్తోంది.
ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్ల కేటాయింపు ప్రకటన ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపునిస్తుంది. విశాఖలో పరిశోధన, టెక్నాలజీ, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.
విశాఖ స్టీల్‌కు కొత్త ఊపిరి
విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్తరాం��్ర ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉంది.
ఈ పరిశ్రమను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల సహాయం రావడం, మరో రూ.8,090 కోట్లకు సిద్ధత వ్యక్తం చేయడం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది.
గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కంటే రాజకీయ నినాదాలకే ఎక్కువ ప్రాధాన్యం లభించిందని విమర్శలు వచ్చాయి. మూడు రాజధానుల పేరుతో ప్రాంత ప్రజల్లో ఆశలు కలిగించినా, ఆశించిన స్థాయిలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రాలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
రుషికొండ వివాదం, ఐటీ సంస్థల తరలింపు, సాగునీటి ప్రాజెక్టుల మందగమనం, భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యం వంటి అంశాలు కూడా చర్చనీయాంశాలయ్యాయి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ రాజకీయాలు జరిగాయన్�� విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి.
రెండేళ్లలో నమ్మకం... రాబోయే దశాబ్దానికి పునాది
అభివృద్ధి అంటే కేవలం భారీ ప్రకటనలు కాదు. ప్రకటించిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి. పెట్టుబడులు పరిశ్రమలుగా మారాలి. పరిశ్రమలు ఉద్యోగాలుగా మారాలి. ఉద్యోగాలు కుటుంబాల జీవితాలను మార్చాలి.
గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ప్రాజెక్టులు, వచ్చిన పెట్టుబడులు, వేగవంతమైన మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమలపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక దృష్టి చూస్తే... ఈ ప్రాంతం కొత్త ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు వలసలకు ప్రతీకగా నిలిచిన ఉత్తరాంధ్ర... నేడు పెట్టుబడులకు, పరిశ్రమలకు, ఉద్యోగాలకు, సాంకేతికతకు కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు, అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధి కొత్త దిశలో అడుగులు పడుతున్నాయి.
ప్రకటనల�� ఎంత గొప్పగా ఉన్నా, వాటి విజయం అమలులోనే ఉంటుంది. అయితే గత రెండేళ్లలో ఏర్పడిన పెట్టుబడిదారుల నమ్మకం, ప్రారంభమైన మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక ప్రాజెక్టుల వేగం, ఉత్తరాంధ్ర భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
ఒకప్పుడు అవకాశాల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు... రేపు అవకాశాల కోసం ఇతర ప్రాంతాల ప్రజలు ఉత్తరాంధ్రకు వచ్చే రోజులు దగ్గరపడుతున్నాయనే విశ���వాసమే ఈ రెండేళ్ల పాలన కలిగించిన అతిపెద్ద మార్పు.
#UttarandhraKalalakuRekkalu
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్ల నమ్మకం... కోస్తాంధ్రకు కొత్త దిశ!
విధ్వంసం నుంచి వికాసం వైపు... కోస్తాంధ్రను దేశ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్న కూటమి ప్రభుత్వం
ఒక రాష్ట్ర అభివృద్ధిని కొలవాలంటే కేవలం సంక్షేమ పథకాలతో కాదు... భవిష్యత్తును నిర్మించే మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఉద్యోగాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, పెట్టుబడులు ఎలా పెరిగాయో చూడాలి. గత రెండేళ్లలో కోస్తాంధ్రలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది... కూటమి ప్రభుత్వం కోస్తాంధ్రను మళ్లీ అభివృద్ధి ట్రాక్‌పైకి తీసుకొచ్చింది.
ఐదేళ్లపాటు రాజధాని లేకుం��ా, పెట్టుబడులు లేకుండా, పరిశ్రమలు పారిపోయే పరిస్థితులు చూసిన కోస్తాంధ్ర... నేడు దేశంలోనే అతిపెద్ద పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. "స్వర్ణాంధ్ర @ 2047" లక్ష్యానికి కోస్తాంధ్రనే ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
అమరావతి... మళ్లీ ఆశల రాజధాని
గత ప్రభుత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతిని నిర్వీర్యం చేశారు. మూడు రాజధానుల పేరుతో అయోమయం సృష్టించి, వేలాది రైతుల త్యాగాన్ని అవమానించారు. ఫలితంగా రాష్ట్రం రాజధాని లేని పరిస్థితికి చేరుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించింది. నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభమైంది. ప్రభుత్వ భవన��లు, రహదారులు, భూగర్భ యుటిలిటీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, క్వాంటం టెక్నాలజీ హబ్, హెల్త్ సిటీ... ఇలా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి పునాది వేయబడింది.
VIT-AP, SRM, అమృత, XLRI, BITS, NID వంటి విద్యాసంస్థలు అమరావతిని నాలెడ్జ్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాయి. AIIMS స్థాయి వైద్యసదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి.
���మరావతి ఎకనామిక్ రీజియన్... రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి, పల్నాడు, మార్కాపురం జిల్లాలను కలుపుతూ ఏర్పడిన Amaravati Economic Region (AER) నేడు రాష్ట్ర జీడీపీలో 35 శాతానికి పైగా వాటాను అందిస్తోంది.
వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం సమన్వయంతో పాటు AI, క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ వంటి భవిష్యత్ పరిశ్రమలకు ఇది ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది.
పోర్టులే కాదు... ప్రపంచానికి ద్వారాలు
987 కిల���మీటర్ల సముద్రతీరాన్ని సద్వినియోగం చేసుకోవడం కోస్తాంధ్ర భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఈ రెండేళ్లలో ప్రభుత్వం అదే దిశగా వేగంగా ముందుకెళ్లింది.
కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టు పనులకు క్లియరెన్సులు పూర్తి చేసి వేగం పెంచింది. రామాయపట్నం పోర్టును వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం చేస్తోంది. మచిలీపట్నం పోర్టు పనులను మళ్లీ ప్రారంభించింది. సూర్యలంకతో పాటు పలు బీచ్‌లను అంతర్జాతీయ పర్యాటక కేంద్���ాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పోర్టులు అంటే కేవలం నౌకలు కాదు... లక్షలాది ఉద్యోగాలు, పరిశ్రమలు, ఎగుమతులు, లాజిస్టిక్స్, వ్యాపార అవకాశాలు.
గ్రీన్ ఎనర్జీలో కోస్తాంధ్రకు కొత్త శకం
కోనసీమలో రూ.84 వేల కోట్లతో ఏర్పాటు కానున్న AM Green Ammonia ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పెట్టుబడుల్లో ఒకటి.
గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ ప్రపంచ స్థాయి స్వచ్ఛ ఇంధన రంగంలో కోస్తాంధ్రను ముందంజలో నిలబెడుతుంది.
ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్స్, ఇథనాల్ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక విధానం తీసుకువచ్చింద��. భవిష్యత్ శక్తి అవసరాలకు కోస్తాంధ్రను సిద్ధం చేస్తోంది.
పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి
గత ప్రభుత్వం జే-ట్యాక్స్, బెదిరింపులు, విధానాల గందరగోళంతో పరిశ్రమలను తరిమేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది.
కృష్ణపట్నం పారిశ్రామిక స్మార్ట్ సిటీ, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, MSME పార్కులు, టెక్స్టైల్ పార్కులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు కోస్తాంధ్ర వైపు వస్తున్నాయి.
యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ��ూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
వ్యవసాయం... రైతు భవిష్యత్తుకు భరోసా
కోస్తాంధ్ర అంటే వ్యవసాయం.
వ్యవసాయం అంటే నీరు.
నీరు అంటే పోలవరం.
గత ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేయగా... కూటమి ప్రభుత్వం 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.23,658 కోట్ల వ్యయం జరిగింది.
నిర్వాసితులకు గత రెండేళ��లలో రూ.2,250 కోట్ల పరిహారం చెల్లించడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం.
వెలిగొండ ప్రాజెక్టుకు రెండేళ్లలో భారీ నిధులు విడుదల చేసి పనులు వేగవంతం చేశారు. రైతుల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.
పంటలకు మార్కెట్లో ధరలు పడిపోతే ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవడం ఈ ప్రభుత్వ ప్రత్యేకత.
రోడ్లు... రవాణా... అభివృద్ధి
హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే, విజ��వాడ-అమరావతి మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, కాలువ గట్ల వెంట రహదారులు, బెంగళూరు-కడప-విజయవాడ కారిడార్...
ఇవి కేవలం రోడ్లు కావు.
ఇవి కోస్తాంధ్ర ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసే అభివృద్ధి ధమనులు.
విద్య... ఆరోగ్యం... భవిష్యత్తు
నాణ్యమైన విద్య, ఆధునిక వైద్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం.
మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తయ్యాయి.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, AI, క్వాంటం, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ల ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నారు.
సంక్షేమం కూడా... అభివృద్ధి కూడా
ఈ ప్రభుత్వం ఒకవైపు భారీ పెట్టుబడులు తీసుకొస్తూనే మరోవైపు ప్రజల సంక్షేమాన్ని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తోంది.
రూ.4,000 పెన్షన్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పారదర్శక ఉద్యోగ నియామకాలు... ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత బలపరిచాయి.
రెండేళ్లలో కనిపించిన మార్పు... భవిష్యత్తుపై పెరిగిన నమ్మకం
ఒకప్పుడు అభివృద్ధి ఆగిపోయిన ప్రాంతంగా కనిపించిన కోస్తాంధ్ర... నేడు పెట్టుబడులు, పోర్టులు, పరిశ్రమలు, రాజధాని, విద్య, ఆరోగ్యం, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, పర్యాటకం, మౌలిక సదుపాయాల సమన్వయంతో దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక ప్రాంతంగా మారుతోంది.
రెండేళ్ల క్రితం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం ఓటు కాదు... ఒక అవకాశం.
ఆ అవకాశాన్ని ప్రభుత్వం అభివృద్ధిగా మార్చింది.
విధ్వంసం నుంచి వికాసం వైపు...
అనిశ్చితి నుంచి విశ్వాసం వైపు...
రాజకీయ నినాదాల నుంచి అభివృద్ధి కార్యాచరణ వైపు...
కోస్తాంధ్ర నేడు కొత్త ప్రయాణం ప్రారంభించింది.
"2 ��ళ్ల నమ్మకం" ఇప్పుడు ఒక భావోద్వేగం మాత్రమే కాదు... కోస్తాంధ్ర ప్రజలు కళ్లారా చూస్తున్న అభివృద్ధి వాస్తవం.
@jaitdp @ncbn @naralokesh
#SunriseKostha
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్లలో రాయలసీమ తలరాత మార్చిన కూటమి ప్రభుత్వం
ఒకప్పుడు "రాయలసీమ" అనే పేరు వినగానే దేశానికి గుర్తొచ్చేవి మూడు మాటలు... కరువు, వలసలు, ఫ్యాక్షన్.
వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూసే రైతు... ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వలస వెళ్లే యువత... రాజకీయ కక్షలతో రక్తం చిందిన నేల... ఇదే రాయలసీమ గురించి బయట ప్రపంచానికి ఉన్న అభిప్రాయం.
కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది.
ఇప్పుడు రాయలసీమ అంటే... స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, హార్టీకల్చర్ హబ్, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ కారిడార్, గోల్డ్ మైనింగ్, భారీ పరిశ్రమలు, లక్షల ఉద్యోగాలు గుర్తుకు వస్తున్నాయి.
ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం వేసిన బలమైన పునాదుల ఫలితం ఇది.
@ncbn గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచ�� రాయలసీమను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని సంకల్పించారు. యువగళం పాదయాత్రలో మంత్రి @naralokesh ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తోంది.
కరువు సీమను నీటి సీమగా మార్చిన ప్రభుత్వం
జగన్ పాలనలో 102 సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పనులు ఆగిపోయాయి. రైతు ఆశలు ఎండిపోయాయి.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది.
రెండేళ్లలోనే సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,484 కోట్ల వ్యయం, ఈ ఏడాది బడ్జెట్లో మరో రూ.10 వేల కోట్లు కేటాయించింది.
హంద్రీ-నీవా విస్తరణ వేగవంతమైంది. కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువల పనులు పూర్తయ్యాయి. శ్రీశైలం నుంచి రికార్డు స్థాయిలో 52 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రాయలసీమలో 530 జలాశయాలు నింపారు.
దీని ఫలితం...
భూగర్భజలాలు పెరిగాయి. వేలాది బోర్లలో మళ్లీ నీళ్లు వచ్చాయి. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రైతు ముఖంలో ఆశ కనిపిస్తోంది.
రాయలసీమను హార్టీకల్చర్ రాజధానిగా తీర్చిదిద్దుతున్న విజన్
రాయలసీమ భవిష్యత్తు నీటిపైనే ఆధారపడదని... అధిక ఆదాయం ఇచ్చే పంటలపైనా ఆధారపడాలని ముందుగానే ఆలోచించింది కూటమి ప్రభుత్వం.
అందుకే రూ.1 లక్ష కోట్లతో ర���యలసీమ మిషన్ ప్రారంభించింది.
90 శాతం రాయితీపై డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ప్రోత్సాహం, ఉద్యాన పంటలకు ప్రత్యేక సహాయం...
ఇవన్నీ కలిసి రాయలసీమను దేశంలోనే అతిపెద్ద హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే నంబర్-1గా నిలవడం వెనుక రాయలసీమ రైతుల కృషి, ప్రభుత్వ ప్రోత్సాహమే కారణం.
జలధార - జలహారతి... నీటికి కొత్త నిర్వచనం
ఒకప్పుడు చెరువులు ఎండిపోయేవి. ఇప్పుడు చెరువులు కళకళలాడుతున్నాయి.
"జలధార - జలహారతి" కార్యక్రమంతో వేలాది చెరువులు నింపి భూగర్భజలాలను పెంచారు.
అన్నమయ్య జిల్లాలోనే వేలాది ఎండిపోయిన బోర్లకు మళ్లీ నీళ్లు వచ్చాయి. వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది. ఉద్యాన పంటల సాగు పెరిగింది. పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.
నీరు వస్తే గ్రామం బతుకుతుందని... ప్రభుత్వం చేసి చూపించింది.
రాయలసీమలో పరిశ్రమల విప్లవం
ఇప్పటి వరకు పరిశ్రమలు కోస్తాకే వస్తాయని అనుకునేవాళ్లు.
ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పెట్టుబడులు రాయలసీమ వైపు పరుగులు తీస్తున్నాయి.
రూ.4.63 లక్షల కోట్ల పెట్టుబడులు... 4.11 లక్షల ఉద్యోగాలు... 239 పరిశ్రమలు.
ఇది సాధారణ విషయం కాదు.
భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన���స్ కారిడార్, ఏరోస్పేస్ హబ్ అన్నీ రాయలసీమలోనే రూపుదిద్దుకుంటున్నాయి.
సత్యసాయి జిల్లాలో AMCA యుద్ధవిమానాల ఎకోసిస్టమ్...
కర్నూలులో డ్రోన్ సిటీ...
తిరుపతిలో స్పేస్ సిటీ...
చిత్తూరులో ఏవియేషన్ పరిశోధన కేంద్రాలు...
ఇవి కేవలం ప్రాజెక్టులు కావు. రాయలసీమ యువత భవిష్యత్తును మార్చే అవకాశాలు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్... సీమ ఆత్మగౌరవానికి నిదర్శనం
దశాబ్దాలుగా వినిపించిన ఒక కల...
"రాయలసీమ స్ట���ల్ ప్లాంట్."
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. హామీలు ఇచ్చాయి. కానీ పనులు మొదలుపెట్టలేదు.
ఆ కలకు ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు గారే.
జమ్మలమడుగులో **రూ.16,350 కోట్లతో JSW స్టీల్ ప్లాంట్** పనులు ప్రారంభమయ్యాయి.
2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు... 20 వేలకుపైగా పరో��్ష ఉద్యోగాలు...
ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు. రాయలసీమ ఆత్మగౌరవానికి ప్రతీక.
దానికి అవసరమైన విద్యుత్ కోసం మరో రూ.20,350 కోట్ల సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభమైంది.
గ్రీన్ ఎనర్జీ రాజధానిగా రాయలసీమ
సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో రాయలసీమను గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.
అగస్త్య ఎనర్జీ, ప్రీమియర్ ఎనర్జీస్, వెబ్‌సోల్, వోల్ట్‌సన్, SAEL, అదానీ గ్రీ���్ వంటి దిగ్గజ సంస్థలు వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి.
రాబోయే రోజుల్లో దేశానికి విద్యుత్ ఇచ్చే ప్రాంతంగా రాయలసీమ నిలబడబోతోంది.
ఉద్యోగాల కోసం వలస వెళ్లే రోజులు ముగియాలి
ఒకప్పుడు ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువకుడు బెంగళూరు వెళ్లాల్సిందే.
ఈరోజు పరిస్థితి మారుతోంది.
సెమికండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, స్టీల్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్లు...
ఇన్ని రంగాల్లో ఉద్యోగాలు రాయలసీమకే వస్తున్నాయి.
యువత తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే రోజులు దూరంలో లేవు.
రోడ్లు... ఎయిర్‌పోర్టులు... భవిష్యత్తు కనెక్టివిటీ
రూ.39 వేల కోట్లతో జాతీయ రహదారులు...
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే...
కర్నూలు, కడప విమానాశ్రయాల అభివృద్ధి...
కుప్పం ఎయిర్పోర్ట్ ప్ర��ిపాదన...
శాశ్వత హైకోర్టు బెంచ్ కోసం చర్యలు...
ఇవి రాయలసీమను దేశ ఆర్థిక వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానిస్తున్నాయి.
సంక్షేమం కూడా... అభివృద్ధి కూడా
తల్లికి వందనం...
అన్నదాత సుఖీభవ...
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం...
మత్స్యకారులకు జీవనభృతి...
అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా అందిస్తున్న ప్రభుత్వం ఇది.
నా రాయలసీమ... నా గర్వం
రెండేళ్ల క్రితం వరకు...
"రాయలసీమలో ఏముంది?" అని అడ���గేవారు.
ఇప్పుడు...
"రాయలసీమలో ఏ పరిశ్రమ వస్తోంది?" అని అడుగుతున్నారు.
అదే అసలు మార్పు.
ఒకప్పుడు కరువుకు చిరునామా...
ఈరోజు పెట్టుబడులకు చిరునామా.
ఒకప్పుడు వలసలకు నిలయం...
ఈరోజు ఉద్యోగాలకు నిలయం.
ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు గుర్తింపు...
ఈరోజు అభివృద్ధికి ప్రతీక.
ఈ మార్పు ఇంకా ప్రారంభమే.
రాబోయే పదేళ్లలో రాయలసీమ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా నిలుస్తుందనే నమ్మకం నాకు ఉంది.
ఎందుకంటే...
విజన్ ఉన్న నాయకత్వం ఉంది.
ప్రణాళిక ఉంది.
అమలు చేసే సంకల్పం ఉంది.
అందుకే ఒక రాయలసీమ యువకుడిగా నేను గర్వంగా చెప్పగలను...
"ఇది కేవలం రాయలసీమ అభివృద్ధి కాదు... ఇది రాయలసీమ ఆత్మవిశ్వాసం పునర్జన్మ."
రాళ్లసీమగా అపహాస్యం ఎదుర్కొన్న నేల... ఇప్పుడు నిజంగానే రత్నాల సీమగా ప్రపంచం ముందుకు వస్తోంది.
#RayalaseemaRising
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
సుపరిపాలనతో స్వర్ణాంధ్ర... నమ్మకాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం
"ఒక మంచి ప్రభుత���వం ప్రజల జీవితాలను మార్చగలదు... ఒక గొప్ప ప్రభుత్వం ప్రజల ఆలోచనా విధానాన్నే మార్చగలదు."
ఈ మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే అక్షరాలా నిజమని అనిపిస్తోంది.
ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయం అంటే భయం... పాలన అంటే అవినీతి... హక్కు కోసం అడిగితే కేసులు... అభివృద్ధి గురించి మాట్లాడితే కక్షలు... పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడడానికి కూడా భయపడే పరిస్థితి. రాజ్యాంగం కంటే పాలకుడి మాటే చట్టంగా మారిన ఐదేళ్లు ప్రజలు అనుభవించారు.
అలాంటి సమయంలో ప్రజలు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే సుపరిపాలన అవసరమని భావించి కూటమికి అపూర్వ విజయాన్ని అందించారు. అది కేవలం ప్రభుత్వ ��ార్పు కాదు... పాలనా సంస్కృతిలో వచ్చిన విప్లవం.
నిజాయితీ రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన @ncbn గారు... వ్యవస్థల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకున్న @pawankalyan గారు... దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రధాని @narendramodi గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా కేంద్రిత పాలనకు శ్రీకారం చుట్టబడింది.
మొదటి నిర్ణయమే ప్రజల ఆస్తులకు భద్రత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయాల్ల��� అత్యంత ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ప్రజల భూములపై అనుమానాలు, భయాలు తొలగిపోయాయి.
అంతటితో ఆగకుండా ఏపీ భూ ఆక్రమణ నిరోధక చట్టం-1982 స్థానంలో మరింత బలమైన AP Land Grabbing (Prohibition) Act-2024 తీసుకొచ్చింది. రీసర్వే ద్వారా అసలైన హక్కుదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది.
ప్రతి కుటుంబం తన భూమిపై నిశ్చింతగా జీవించే పరిస్థితి కల్పించడమే ప్రభుత్వ లక��ష్యం.
ప్రజల మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరచిపోకుండా కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది.
ఇది ఎన్నికల హామీని పాలనలో అమలు చేసిన బాధ్యతాయుత ప్రభుత్వానికి నిదర్శనం.
పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
గతంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయి. కొత్త పెట్టుబడులు రావడం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ���చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది.
28 కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చి పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించింది. దేశంలోనే తొలిసారిగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను సమయానికి చెల్లించేందుకు ఎస్క్రో అకౌంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి
గత ప్రభుత్వంలో అప్పుల భారంతో ర��ష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రుణాల రీషెడ్యూలింగ్ ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించింది.
90కి పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయించింది. స్థానిక సంస్థలకు బలం చేకూర్చింది.
మూలధన వ్యయం పెంచి 11.28 శాతం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించడం రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి నిదర్శనం.
అభివృద్ధికి మళ్లీ ఊపిరి
గతంలో వేలాది నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు.
కూటమి ప్రభుత్వం 50 వేల మంది కాంట్రాక్టర్లకు సుమారు రూ.2,000 కోట్ల బకాయిలు చెల్లించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి.
ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగా��ికి ఊతమిచ్చింది.
స్వచ్ఛమైన రాష్ట్రం... ప్రజల భాగస్వామ్యం
ప్రజలపై భారంగా మారిన చెత్తపన్నును రద్దు చేసింది.
84 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను తొలగిస్తూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ప్రతి నెలా మూడో శనివారం ముఖ్యమంత్రి స్వయంగా స్వర్ణాంధ్ర - స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల్లో అవగాహన పెంచుతోంది.
ప్రజల చేతిలోనే ప్రభుత్వం
ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు ముగిశాయి.
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1,035 ప్రభుత్వ సేవలు ప్రజల మొబైల్ ఫోన్లో అందుబాటులోకి వచ్చాయి.
ఇది డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
విద్యుత్ రంగంలో ��ంస్కరణలు
గత ప్రభుత్వంలో వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది.
దేశంలో తొలిసారిగా ట్రూ డౌన్ విధానానికి శ్రీకారం చుట్టింది.
90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకుని భవిష్యత్ విద్యుత్ అవసరాలకు పునాది వేసింది.
అమరావతికి శాశ్వత హామీ
ఒక రాష్ట్రానికి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం ము��ించింది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత, ఏకైక రాజధానిగా చట్టబద్ధంగా రక్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
రాజధాని రైతుల త్యాగానికి న్యాయం చేసింది.
గంజాయిపై ఉక్కుపాదం
ఒకప్పుడు గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి, మాదకద్రవ్యాలపై నిరంతర దాడులు చేపడుతోంది.
నేరాల నియంత్రణలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.
విద్యలో విలువల విప్లవం
మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో ఎన్నో వినూత్న సంస్కరణలు అమలవుతున్నాయి.
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్, ముస్తాబు, ఆధునిక మౌలిక వసతులు, నాణ్యమైన బోధన...
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.
విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంపొందించే దిశగా విద్యా వ్యవస్థ మారుతోంది.
ఇదే అసలైన సుపరిపాలన
సుపరిపాలన అంటే కేవలం పథకాలు ఇవ్వడం కాదు.
ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం...
వ్యవస్థలపై నమ్మకం పెంచడం...
పెట్టుబడులు తీసుకురావడం...
యువతకు ఉ��్యోగాలు కల్పించడం...
సాంకేతికతతో ప్రభుత్వాన్ని ప్రజల ఇంటి ముంగిటికి తీసుకురావడం...
పారదర్శకతతో నిర్ణయాలు తీసుకోవడం...
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాల ప్రణాళికలు అమలు చేయడం.
ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అదే చేసి చూపించింది.
ఒక యువకుడిగా నాకు రాజకీయాల కంటే పాలన ముఖ్యం. నినాదాల కంటే ఫలితాలు ముఖ్యం. మాటల కంటే పనులు ముఖ్యం.
ఈ రెండేళ్లలో రాష్ట్రంలో కనిపిస్తున��న మార్పు చూస్తుంటే... సరైన నాయకత్వం ఉంటే వ్యవస్థలు మారతాయని, ప్రజల జీవితాలు మారతాయని మరోసారి నిరూపితమైంది.
స్వర్ణాంధ్ర కేవలం ఒక నినాదం కాదు.
అది ప్రతి రైతు చిరునవ్వులో...
ప్రతి విద్యార్థి ఆశలో...
ప్రతి మహిళ భద్రతలో...
ప్రతి యువకుడి ఉద్యోగంలో...
ప్రతి పెట్టుబడిలో...
ప్రతి గ్రామ అభివృద్ధిలో కనిపించాలి.
ఆ లక్ష్యంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు కొనసాగితే... రా���ోయే ��శాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ పాలనకు చిరునామాగా నిలుస్తుందనే నమ్మకం నాలో ఉంది.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్ల నమ్మకం... అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్
ఒక రాష్ట్ర భవిష్యత్తును అంచనా వేయాలంటే కేవలం మాటలను కాదు... నేలపై కనిపించే మార్పులను చూడాలి. ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు, రోడ్లపై కనిపించే అభివృద్ధి, పరిశ్రమల రాక, యువతకు పెరుగుతున్న అవకాశాలు, రైతుకు అందుతున్న భరోసా... ఇవే ఒక ప్రభుత్వ పనితీరుకు అసలైన కొలమా���ాలు.
గతంలో ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు అభివృద్ధి, ఆత్మగౌరవం అనే రెండు అంశాలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ముఖ్యమంత్రి @ncbn గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ��్రజల్లో మళ్లీ ఒక నమ్మకం ఏర్పడటానికి కారణం కూడా ఇదే.
ప్రధాని @narendramodi గారి ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్-2047 లక్ష్యాల స్ఫూర్తితో... ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర-2047 దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆర్థికంగా బలమైన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, సాంకేతికంగా ముందున్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
అభివృద్ధికి తొలి మెట్టు... మౌలిక వసతులు
ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ ప్రాంత రోడ్లను చూడాలి. గతంలో రాష్ట్ర రహదారుల పరిస్థితి దారుణంగా మారి, ప్రయాణాలు కూడా ప్రజలకు ఇబ్బందిగా మారాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
రూ.861 కోట్లతో 20,060 కిలోమీటర్ల రోడ్లపై గుంతల పూడ్చివేత పనులు చేపట్టింది. మరోవైపు రూ.2,500 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ-మచిలీపట్నం మధ్య 6 లైన్ల రహదారి వంటి ప్రాజెక్టులు రాష్ట్ర కనెక్టివిటీని మరింత బలోపేతం చేయనున్నాయి.
అమరావతి... ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక
ఒక రాష్ట్రానికి రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రం కాదు... అది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాజధాని ��ిషయంలో అనిశ్చితిని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సహకారంతో అమరావతికి సంబంధించి కేంద్ర స్థాయిలో కీలక ముందడుగులు పడటం రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త ఆశలను కలిగిస్తోంది.
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ఏపీ
ఒకప్పుడు ఉద్యోగాల కోసం యువత ఇతర ���ాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే యువతకు రాష్ట్రంలోనే అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
చంద్రబాబు గారు, మంత్రి @naralokesh గారి కృషితో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" విధానంతో భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండేళ్లలో సుమారు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదికగా మారడం ఏపీపై పెరుగుతు���్న నమ్మకానికి నిదర్శనం.
2025-26లో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెరుగుతున్నదానికి ఉదాహరణ.
యువతకు అవకాశాలు... పరిశ్రమలకు కొత్త దారులు
ప్రతి కుటుంబంలో ఒకరు అయినా పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
విశాఖపట్నం ఐటీ హబ్‌గా, డేటా హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. భారీ స్థాయిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కావడం రాష్ట్ర సాంకేతిక భవిష్యత్తుకు పెద్ద ముందడుగు. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు పడుతున్నాయి.
కాకినాడలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, రాయలసీమలో సెమీకండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధి... ఇవన్నీ ���పీని పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారుస్తున్నాయి.
శ్రీసిటీలో LG, క్యారియర్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. అనకాపల్లి, సత్యసాయి జిల్లాల్లో భారీ పరిశ్రమలు రావడం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి.
గ్రామీణ ఆంధ్ర అభివృద్ధికి కొత్త ఊపు
అభివృద్ధి అంటే కేవలం నగరాలకే పరిమితం కాకూడదు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
ఉప ముఖ్యమంత్రి @pawankalyan గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. పల్లె పండుగ ద్వారా గ్రామీణ రోడ్ల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో రహదారులు, 4జీ నెట్వర్క్ సౌకర్యాలు కల్పించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించ��� లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
రైతుకు భరోసా... సాగుకు కొత్త ఊపిరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రైతు పాత్ర ఎంతో కీలకం. అందుకే సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
హంద్రీ-నీవా కాలువ పనులను పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలు అందించడం, పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, వెలిగొండ, నేరడి బ్యారేజీ, చింతలపూడి వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ద్వారా ర��ష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నారు.
రూ.24 వేల కోట్లకు పైగా సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయడం, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి చర్యలు రైతుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.
రెండేళ్లలో మారిన దిశ... పెరిగిన నమ్మకం
ఒక ప్రభుత్వం విజయాన్ని కేవలం పథకాల సంఖ్యతో కొలవలేం. ప్రజల మనసుల్లో ఏర్పడిన నమ్మకంతో కొలవాలి. గతంలో అభివృద్ధి ఆగిపోయిందనే భావనలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుతోంది.
యువతకు ఉద్యోగాలు కావాలి, రైతుకు భరోసా కావాలి, మహిళలకు సాధికారత కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి... ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఒక యువకుడిగా నేను చూస్తున్న మార్పు ఇదే...
రెండేళ్లలో కేవలం పాలన మారలేదు... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై నమ్మకం కూడా తిరిగి వచ్చింది.
#IntintikiTeluguDesam #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
రెండేళ్లలో నమ్మకానికి ప్రతిరూపంగా సంక్షేమం.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న కూటమి ప్రభ��త్వం
సంక్షేమం అంటే కేవలం డబ్బులు పంచడం కాదు... ఒక కుటుంబం భవిష్యత్తును మార్చడం. ఒక తల్లి కళ్లలో ఆనందం చూడటం, ఒక రైతు ముఖంలో ధైర్యం నింపడం, ఒక విద్యార్థి కలలకు రెక్కలు ఇవ్వడం, ఒక పేద కుటుంబానికి ఆత్మవిశ్వాసం కల్పించడం. అదే నిజమైన సుపరిపాలన అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు.
ఆ నమ్మకానికే ప్రతిరూపంగా గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన సంక్షేమ పథకాలు నేడు లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారం, ప్రధాని నరేంద్ర మోదీ గారి కేంద్ర సహకారంతో ప్రజా సంక్షేమం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోంది.
గతంలో ��ామీలు ఎన్నికల వరకే పరిమితం అయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడాన్నే తొలి ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ... నమ్మకానికి కొత్త అర్థం చెబుతోంది.
తల్లికి వందనం... ప్రతి బిడ్డ చదువు బాధ్యత
ఏ తల్లికైనా తన పిల్లల భవిష్యత్తే ముఖ్యం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ మంచి విద్య అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన "తల్లికి వందనం" పథకం లక్షలాది కుటుంబాలకు భరోసా ఇచ్చింది.
రాష్ట్రంలోని 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్ల ఆర్థిక సహాయం అందించడం ద్వారా... పేద కుటుంబాల్లో చదువు ఆగిపోకుండా ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యే పేదరికాన్ని జయించే ఆయుధం అనే చంద్రబాబు గారి ఆలోచనకు ఇది నిదర్శనం.
మహిళల సాధికారతే కుటుంబ అభివృద్ధికి మార్గం
ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం మొత్తం ఎదుగుతుంది. అందుకే మహిళలకు స్వేచ్ఛ, భద్రత, ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా "స్త్రీ శక్తి" పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఇప్పటివరకు 71 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. ఉద్యోగం, విద్య, ఉపాధి కోసం బయటకు వెళ్లే మహిళలకు ఇది ఒక గొప్ప ఆర్థిక అండగా మారింది.
అదే విధంగా దివ్యాంగుల కోసం "దివ్యాంగ శక్తి" పథకం ద్వారా 31 లక్షల ఉచిత ప్రయాణాలు అందించడం ద్వారా ప్రభుత్వం ప్రతి వర్గాన్ని సమానంగా చూస్తోందనే సందేశాన్ని ఇచ్చింది.
పేద కుటుంబాలకు వంటింటి భారం తగ్గించిన దీపం-2
పేద కుటుంబాల్లో వంట గ్యాస్ ఖర్చు ఒక పెద్ద భారంగా ��ారకుండా "దీపం-2" పథకం ద్వారా ప్రతి ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇప్పటివరకు 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేశారు.
ఇది కేవలం ఒక సిలిండర్ కాదు... లక్షలాది మహిళల జీవితాల్లో కొంత ఉపశమనం.
అన్న క్యాంటీన్లు... ఆకలికి అండగా
పేదలు, చిరుద్యోగులు, కార్మికులు తక్కువ ఖర్చుతో గౌరవంగా భోజనం చేయాలనే ఆలోచనతో తిరిగి ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతు���్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 9.71 కోట్ల భోజనాలు అందించారు. ఆకలి తీర్చడం కూడా ఒక సామాజిక బాధ్యత అనే భావనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రైతే రాజు అనే నమ్మకంతో అన్నదాతకు భరోసా
వ్యవసాయం బలపడితేనే రాష్ట్రం బలపడుతుందని నమ్మే చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
"అన్నదాత సుఖీభవ" పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.8,985 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేసి, కొనుగోలు డబ్బులను వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
పంట నష్టాల సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.1100 కోట్ల సాయం అందించడం ద్వారా రైతుల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను చాటుకుంది.
పేదల ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ భరోసా
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎ��రి మీదా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు సామాజిక భద్రతా పింఛన్ల కింద రూ.65 వేల కోట్లకు పైగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వయంగా పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించడం ప్రజలకు మరింత దగ్గరైన పాలనకు నిదర్శనం.
యువత భవిష్యత్తుకు ఉద్యోగాల దిశ
యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మెగా ��ీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు, 5,757 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు.
అంతేకాదు జాబ్ క్యాలెండర్ ద్వారా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
విద్యారంగంలో మార్పుకు మంత్రి లోకేష్ కృషి
పేద విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి విద్య అందుకోవాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో ��నేక సంస్కరణలు తీసుకొస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, వర్క్ బుక్స్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ ప్రభుత్వ విద్యపై నమ్మకం పెంచుతున్నారు.
ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన అద్భుత ఫలితాలు ఈ మార్పుకు నిదర్శనం.
పేదరిక నిర్మూలన దిశగా P-4
పేద కుటుంబాలను కేవలం సహాయం పొందేవారిగా కాకుండా అభివృద్ధి చెందే కుటుంబాలుగా మార్చాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు P-4 కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను అనుసంధానం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
ప్రతి వర్గానికి అండగా ప్రభుత్వం
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, కార్మికులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు... ప్రతి వర్గం కోసం ప్రత్యేక కార్యక్���మాలు అమలు చేస్తున్నారు.
మత్స్యకారులకు ఆర్థిక సాయం, ఆటో డ్రైవర్లకు "ఆటో డ్రైవర్ల సేవలో" పథకం, బీసీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు... ఇలా ప్రతి వర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.
ఆరోగ్యవంతమైన సమాజమే అభివృద్ధికి పునాది
"హెల్తీ సొసైటీనే హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీ" అని నమ్మే చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య రంగంలో కూడా కీలక మ���ర్పులు చేస్తోంది.
డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది.
రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చూపించిన మార్పు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది...
సంక్షేమం అంటే కేవలం పథకాలు కాదు... ప్రజల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత.
గతంలో పేదల పేరు చెప్పి రాజకీయాలు జరిగితే... ఇప్పుడు పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పాలన సాగుతోంది.
@ncbn గారు, @pawankalyan గారు, మంత్రి @naralokesh గారి నాయకత్వంలో... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం "ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం" అనే భావనకు నిజమైన అర్థం చూపిస్తోంది.
#IntintikiTeluguDesam
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh