#IntintikiTeluguDesam#2YrsOfTrustDevelopmentWelfare
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నా కోసం ఈ రోజు పుట్టావు..
కోట్లాది మంది కోసం జీవించావు..
మీలో సగమై.. మీ కృషిలో భాగమై..
నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
మీ
భూ
#HBDOneAndOnlyCBN
Many happy returns of the day to the Honourable Chief Minister of Andhra Pradesh, Sri @NCBN Mavayya garu. Wishing you continued good health, happiness, and the strength to lead and serve our people with the same dedication and vision. May your leadership continue to inspire progress, prosperity, and pride for the state.
వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు గారు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించాను. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయనుంది. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాల ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది.
మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించాను. వివిధ పనుల పురోగతి వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంజేషన్ ద్వారా వివరించారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని ఈ సందర్భంగా ఆదేశించాను. మంగళగిరిలో రెండో విడతలో 2వేల ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలి. ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో 10వేల టిడ్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించాను.
ఈరోజు అద్దంకి మండలం, వెంపరాల గ్రామంలో రూ.5.10కోట్ల నిధులతో వెంపరాల - మైలవరం బిటి రోడ్డు పనుల పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసాను. అలాగే ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందించే దిశగా వెంపరాల గ్రామంలో రూ.55 లక్షల నిధులతో జల్ జీవిన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వంలోఅందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనపై ప్రజలకు వివరించడం జరిగింది. కూటమి సర్కార్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.
#Addanki #AndhraPradesh
#GottipatiRavikumar
#ఇంటింటికీసుపరిపాలన
#IntintikiSuparipalana
#FirstStepRebuildingAP
#సుపరిపాలనలోతొలిఅడుగు
#IdhiManchiPrabhutvam
ఢిల్లీలో పీఎం మ్యూజియంలో జరిగే "ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు" అనే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు https://t.co/iRdQcyr3nf
జగన్ కుట్ర బయట పెట్టిన డ్రోన్ వీడియో..
జగన్ వచ్చే సమయానికి తోటల్లోంచి, మామిడి లోడ్ తో ఉన్న ట్రాక్టర్లు బయటతెచ్చి, రోడ్డు పై పారబోసి డ్రామా. ఇదీ వైసీపీ ఈవెంట్ పాలిటిక్స్ ప్లాన్.
ఈ ఈవెంట్ లో పాత్రధారాలు :
ఆ తోట - ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిది, అతను చిత్తూరు వైసీపీ సెక్రటరీ
ఆ ట్రాక్టర్లు - శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని, అతను మాజీ వైసీపీ సర్పంచ్
నటించింది - జగన్ రెడ్డి
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బ్రిటీష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన గొప్ప పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు. మన్యంలో పోరాట వీరులను తీర్చిదిద్ది.. బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం పునరంకితం అవుదాం.
దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందాం.
జలకళ.. నిండుగా జలాశయాలు
రాష్ట్రంలో ముఖ్య జలాశయాలు పూర్తిగా నిండి జల కళ సంతరించుకున్నాయి.
పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. నాడు పట్టిసీమని వట్టిసీమ అని కొందరు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేశారు. వరుసగా 11 ఏళ్లు పట్టిసీమ ద్వారా 428 టీఎంసీల నీరు విడుదలైంది. ఇది నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం కంటే ఎక్కువ. కృష్ణా డెల్టా, రాయలసీమకు వరప్రదాయిని పట్టిసీమ.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
రెవెన్యూ శాఖ సంబంధిత అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#AndhraPradesh
నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. నైపుణ్యం పోర్టల్ ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 90 రోజులపాటు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నైపుణ్యం పోర్టల్ లో ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా రెజ్యుమ్ సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని ఆదేశించాను. ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా రూ.600 కోట్లు కేటాయించడం జరిగింది.