తెలంగాణలో ప్రజా సమస్యలను పట్టించుకునే రాజకీయ పార్టీ లేదు
BRS-Congress అసెంబ్లీలో బలాలు ప్రదర్శిస్తున్నరు, బట్టలిప్పుకుంటున్నరు
ప్రజా సమస్యలపై ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని ప్రజలంటున్నరు
జనసేన మాత్రమే ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తోందని ప్రజలే చెప్తున్నరు
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
హైదరాబాద్ నగరంలోని వివిధ గణపతి పూజా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు పాల్గొన్నారు.
కిరణ్ టీవీ కిరణ్ గారి ఆహ్వానం మేరకు నిర్వహించిన గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే శ్రీ సాయి ప్రకాష్ గారి ఆహ్వానం మేరకు సనత్‌నగర్‌లోని ఉదయ్‌నగర్ కాలనీలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులతో ఆత్మీయంగా మమేకమయ్యారు.
ఈ సందర్భంగా వినాయక స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని, రాష్ట్రంలో సుఖశాంతులు, అభివృద్ధి, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
#RamTalluri #JanaSenaParty #Hyderabad #GaneshChaturthi #GanapathiPooja #JanaSenaTelangana
పిఠాపురం నియోజకవర్గం, ఫకృద్ధీన్ పాలెంలో రూ.73 లక్షలతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన జనసేనాని, పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan
గారు.
పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెంలో రూ.73 లక్షలతో సుందరీకరించిన మైసమ్మ చెరువును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. చెరువులను కేవలం నీటి వనరులుగా కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే వేదికలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్, జెండా స్థూపం, పచ్చదనం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా పలుకరించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.
పిఠాపురం నియోజకవర్గంలో రూ.6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టగా, రాష్ట్రవ్యాప్తంగా రూ.50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి.
#PawanKalyanAneNenu #PawanKalyanForPithapuram
పచ్చదన పరిమళం.. పీఠికాపురవనం ఆవిష్కారం
•నగరవనాన్ని ప్రారంభించిన శ్రీ @PawanKalyan గారు
•కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద రూ. 1.83 కోట్లతో నిర్మాణం
•ఆహ్లాదం, ఆధ్యాత్మికతల కలబోతగా పిఠాపురం నగరవనం
•ప్రత్యేక ఆకర్షణగా నక్షత్రవనం, శివపంచాయతన వనం
•70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ప్లాంటేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 నగరవనాలు ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురం పట్టణ, నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన “పీఠికాపురవనం” నగరవనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నగరవనంలో మొక్కను నాటి, పీఠికాపురవన ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ. 1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగరవనం పిఠాపురం పట్టణానికి సరికొత్త హరిత సొబగులను అద్దింది. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ప్రాంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో నేడు పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే నగరవనంగా మారింది.
పిఠాపురంకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరవనంలో ఆహ్లాదం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా తీర్చిదిద్దారు. అందులో ముఖ్యంగా నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీశాఖ అధికారులు ఈ రెండింటి ప్రాధాన్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటగా, ప్రతి మొక్కను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆసక్తిగా తిలకించారు. శివస్వరూపమైన మారేడుతో పాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాలైన మొక్కలను శివపంచాయతనంగా ఏర్పాటు చేశారు. కార్తీక మాసంతో పాటు ప్రత్యేక దినాల్లో ఈ మొక్కలకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆయా దేవతల ప్రదక్షిణ పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.
అనంతరం 70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనును ఉప ముఖ్యమంత్రివర్యులు తిలకించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచుతూ వేగంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసే విధంగా మియావకీ పద్ధతిలో చిట్టడవిని నాటారు. బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ లాంటి మరిన్ని ఆకర్షణలు నగరవనానికి జోడించనున్నారు. పిఠాపురం ప్రజలతో పాటు ఆధ్యాత్మిక సందర్శనార్థం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మరింత సర్వాంగ సుందరంగా నగరవనాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గతంలో డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండేది? దాన్ని ఎంత కష్టపడి నగరవనంగా తీర్చిదిద్దారో వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిలకించారు. ఈ సందర్భంగా పీఠికాపురవనాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో నగరవనాలు అభివృద్ధి చేస్తున్నారు. రూ. 36 కోట్లతో ఏర్పాటు చేసిన 18 నగరవనాలను ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, కౌడా ఛైర్మన్ శ్రీ తలాటం సత్య, రాష్ట్ర అటవీశాఖ ఐటీ సలహాదారు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు, పడా పీడీ శ్రీ శివరాం ప్రసాద్, సీసీఎఫ్ శ్రీమతి జ్యోతి, కాకినాడ డీఎఫ్ఓ శ్రీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. (1/3)