Deeply saddened by demise of Congress veteran and the former chief minister of Kerala, Sir Sree Oommen Chandy . A true friend to Dr YS Rajashekara Reddy, He was one of the outstanding politicians and people’s representatives that this country has produced. I pray for the peace of his soul. @AICCMedia #RIPOommenChandy
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదన. 9 ఏండ్లలో ఉన్న బోర్లకు అదనంగా 15 లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ పని తీరు చెప్పనక్కర్లే. మసి పూసి మారేడు కాయ చేసినట్లు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం "గోదారి నీళ్లను గోదారిలో ఎత్తిపోయడానికే". 38 వేల కోట్లతో మహానేత కట్టాలనుకున్న తెలంగాణ జీవధార ప్రాణహిత - చేవెళ్లను రీడిజైన్ చేసి కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధారగా మార్చాడు. కోటి ఎకరాల పేరుతో కోటి భ్రమలే తప్పా లక్ష ఎకరాలకు దిక్కులేదు. లక్ష 51 వేల కోట్లతో ప్రపంచం గర్వించే ప్రాజెక్ట్ కట్టి ఫామ్ హౌజ్ కి తప్పా తెలంగాణ మాగాణికి పారింది లేదు. బోరు ఉంటే సాగు.. లేకుంటే పడావులా ఉంది తెలంగాణ వ్యవసాయం. పనికి రాని ప్రాజెక్టులకు వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టే దొర గారు.. రైతులకు సరిపడా కరెంట్ మాత్రం ఇవ్వరు. కాలువల్లో నీళ్ళు రావు. బోర్లు నడవవు.పంటల్ని ఎండబెట్టి.. రైతుల్ని రోడ్లపైకి ఈడ్చి పట్టుమని 8 గంటలు ఇయ్యలేనోళ్ళు.. 24 గంటలు ఇస్తున్నం అంటుంటే..దెయ్యాలు వేదాలు పలికినట్లుంది.24గంటల ఉచిత విద్యుత్ అబద్ధం అనడానికి ట్రాన్స్ కో,జెన్కో CMD చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
"మూడు పంటలు అబద్ధం - 24గంటల కరెంటు పచ్చి అబద్ధం"
రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట,రోజుకో వేషం.నమ్మి ఓటేస్తే పథకానికే పంగనామాలు పెట్టి,రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్.లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలే. మాట తప్పం,మడమ తిప్పం..ఆరు నూరైనా, నూరు ఆరైనా,మాట ఇస్తే తల నరుక్కుంటం అంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు దొర గడప దాటలే.రైతులకు రుణాలు మాఫీ కాలే. కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డడు.నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నడు. దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు "డీ ఫాల్టర్" అనే ముద్ర వేసిన పాపం ద్రోహి కేసీఆర్ కే దక్కింది. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇండ్ల మీద పడుతున్నా..రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నా...20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేసినా...రోడ్ల మీద పడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదు.కరోనా పేరు చెప్పి రైతులకు చెల్లించాల్సిన 6 వేల కోట్లకే 60 కష్టాలు చెప్పే దొరలకు.. కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వచ్చినయ్ ? అప్పు తెచ్చిన 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినయ్ ? విలాసాలకు,కొత్త భవనాలకు వందల కోట్లు ఎక్కడియ్ ?35 వేల ఎకరాలు అమ్మిన సొమ్ము ఎక్కడ పెట్టినట్లు ? కరోనా కష్టకాలమే అయితే BRS అకౌంట్లో 12 వందల కోట్లు ఎట్లొచ్చినయ్ ? పథకాలకు నిధులు ఉండవ్ కానీ ..దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటది.దీన్నే అంటారు బంగారు తెలంగాణ.ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే.. తక్షణం 31లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
అప్పులు ఘనం,అభివృద్ధి శూన్యం.10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన అప్పులకు రాష్ట్రం దివాళా.పరిమితి మించి దొర తెచ్చిన అప్పులు అక్షరాల 5లక్షల కోట్లు.ఇంత అప్పు చేసినా దేనికి డబ్బు లేదు.ఖజానా ఖల్లాస్.పథకాల నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్ని బంద్. కాంట్రాక్టర్లకు బిల్లుల కింద 37 వేల కోట్లు, డిస్కంలకు 25 వేల కోట్లు, ఆరోగ్యశ్రీకి వెయ్యి కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 5 వేల కోట్లు,సున్నా వడ్డీలకు 17వేల కోట్లు,ఆర్టీసీకి 4 వేల కోట్లు,రుణమాఫీ కింద 6 వేల కోట్లు,ఇలా చెప్పుకుంటూ పోతే దొర బాకీల జాబితా చాంతాడు కన్నా పొడువే. అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పా? అని అడిగే కేసీఆర్.. తెచ్చిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టినట్లు? ఎక్కడ అభివృద్ధి చేసినట్లు? నెల నెలా రాష్ట్ర ఆమ్దానీ ఎక్కడ పోతున్నట్లు? లక్షల కోట్లు అప్పులు తెచ్చి అర చేతిలో 3D చూపి.. కమీషన్ల కింద దొర ఖజానాకే నిధులు అన్ని దారి మళ్లినయ్. పనికి రాని ప్రాజెక్ట్ చెప్పి తెచ్చిన అప్పులు దొర కడుపు నింపినయ్. ఒక్కో తలపై 2లక్షల అప్పు పెట్టి, మొత్తం దోచుకుతిన్నరు తప్పితే రెండు రూపాయల మేలు చేయలే. ఆఖరికి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రానిది. ఇప్పటికే 35 వేల ఎకరాల భూములు అమ్మిన దొర..ఉన్న భూములు అమ్మితే తప్పా సర్కారును నడిపించలేని దుస్థితి. పైకి ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే.. తెలంగాణను మరో 40 ఏండ్లు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఖాళీ బిందెకు బంగారు పూత,ఇదే కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ.
I’m repulsed by this disgraceful episode where a woman journalist is humiliated and looked down upon by a Member of Parliament belonging to the ruling party.
While the BJP sings peans about their honour for the Bharatiya naari, in reality, their party leaders, drunk on power, assault, insult, and disdain women.
This incident clearly reflects the true nature of this leader and his ‘privilege’ of impunity.
The nation wants to know why there is no action yet against Brij Bhushan, despite the outcry across India for the manner in which he had harassed the 6 women wrestlers.
As a woman I take serious offence and demand that this brute be stripped of his parliamentarian membership and legally prosecuted.
4కోట్ల నా తెలంగాణ ప్రజలకు ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి, అధికారమిస్తే.. నట్టేట ముంచడంలో బహుశా ప్రపంచంలోనే కేసీఆర్ నెంబర్.1. ప్రజాక్షేమానికి దొర చెప్పిన సంక్షేమానికి పొంతనే లేదు. జనాలను గొర్రెలను చేసి, స్కీంల పేరిట బురిడీ కొట్టించి, ఓట్లు దండుకున్నాక అన్ని పథకాలకు పిండం పెట్టిండు. ‘అర చేతిలో వైకుంఠం, ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్ లో ఉంటం’ ఇదే 10 యేండ్లుగా దొర చేస్తున్న మాయాజాలం. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. 10 ఏళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు అమలు చేయని కేసీఆర్ దేశానికి అసలైన దార్శనికుడట. సున్నా వడ్డీ పేరు చెప్పి 60లక్షల మంది మహిళలను మోసం చేశాడు. లక్ష రుణమాఫీ అని చెప్పి, 30 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టిండు. కేజీ టు పీజీ అని చెప్పి 2 వేల సర్కారీ బడులనే బంద్ పెట్టిండు. పిల్లలకు సన్న బువ్వ అని చెప్పి 22 లక్షల మంది పిల్లలకు ఉన్న బువ్వ లేకుండా చేసిండు. 3వేల నిరుద్యోగ భృతి పేరు చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగులకు పంగనామాలు పెట్టిండు. ముష్టి 5 వేల రైతు బంధు చూపించి, 35వేల సబ్సిడీ పథకాలను ఆపిండు. 3ఎకరాల భూ పంపిణీ పథకం 30మందికైనా దక్కకుండా 18 లక్షల మంది దళితులను మోసం చేసిండు. ఆత్మగౌరవం పేరు చెప్పి అర లక్ష మందికైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కలే. స్వయం ఉపాధి పథకం ఉపాధిని చూపలే. 10లక్షల మందిలో పట్టుపని 10 వేల మందికి రుణాలు ఇవ్వలే. దళిత బిడ్డలకు దక్కాల్సిన దళితబంధు ఎమ్మెల్యేలకు బంధువైంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ చేసి కోమాలోకి నెట్టాడు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. కేసీఆర్ పాలనలో స్కీంలన్నీ స్కాంలే. ప్రజల సొమ్ము దోచుకో.. ఫామ్ హౌజ్ లో దాచుకో.. ఇదే కేసీఆర్ పాలనా సిద్ధాంతం. బంధిపోట్ల రాష్ట్ర సమితి మేనిఫెస్టోకి విలువ లేదు. చేసిన వాగ్దానానికి దిక్కులేదు. ‘మస్త్ చెప్తం తియ్’ ఇదే కేసీఆర్ చెప్పే తల నరుక్కునే మాట.
ఊరు గొప్ప,పేరు దిబ్బ లెక్కుంది.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి. కష్టమొస్తే విలువ తెలుస్తదని చెప్పిన మాటలకు, కష్టకాలంలో ప్రాజెక్ట్ చూపే ప్రతిభకు పొంతనే లేదు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్నా.. ఎత్తిపోయాల్సిన బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయ్. వారంలో 21 టీఎంసీలు తోడాల్సిన కేసీఆర్ కీర్తి కిరీటం.. 4 TMCలకే చతికిలబడ్డది. రోజుకు 3 TMCలు అని చెప్పిన ప్రాజెక్ట్ అసలు స్వరూపం అర TMC దాటలేదు. 17 మోటార్లకు పట్టుమని పది మోటార్లు కూడా నడుస్తలేవు. కాళేశ్వరానికి అన్ని తానై కట్టిన దొర అండ్ మెగా ఇంజినీర్ పనితనం మూన్నాళ్ల ముచ్చటే. వర్షాలు లేకున్నా కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అని చెప్పి..నార్లు పోసేందుకు చుక్క నీరు అందకపాయే. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేసి.. ఇదేనా దొర నువ్వు సాధించిన జలకళ? కాళేశ్వరం తెలంగాణకు జలజాతర కాదు. రాష్ట్రం నెత్తిన గుదిబండ. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర సొమ్మును ఆరగించే వైట్ ఎలిఫెంట్ అయితే.. ప్రాజెక్ట్ పేరు చెప్పి ఖజానాను పీల్చిన జలగ కేసీఆర్. రూ.1.51 లక్షల కోట్లు పెట్టి లక్ష ఎకరాలను కూడా తడపలేదు. విద్యుత్ ఉత్పత్తిలో సగం కరెంట్ వాడి ఏ ప్రాజెక్టు నింపలేదు. నికరంగా ఎకరాకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టినా.. కనీసం రైతుకు లక్ష ప్రయోజనం కూడా దక్కలేదు. ఒక్క తడికైనా సాగునీరు పారాలంటే ఎకరాకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.46 వేలు. రైతు పండించే పంటకు వచ్చే లాభం కన్నా... దొర కాళేశ్వరంపై పెట్టే ఖర్చే తడిసిపోపెడు! రాష్ట్ర సంపదకు కాళేశ్వరం చిల్లులు పెడుతుంటే, దొర ఖజానాలో కాసులు గలగలమంటున్నయ్.
ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెబుతున్న బీజేపీకి..కేంద్రంలో అధికారం పెట్టుకొని చర్యలకు చేతులు రావెందుకో.!అవినీతి కేసీఅర్ ను అరెస్ట్ చేయడానికి మనసు రాదేందుకో.!మోడీ కేసీఅర్ ను కేడి అంటే..మోడీని బోడి అని కేసీఅర్ అంటాడు.నువ్వు కొట్టినట్లు చెయ్యి,నేను పడ్డట్లు ఏడుస్త ఇదే ఇద్దరి మద్య రహస్య ఒప్పందం. మోడీ గారు ..కేసీఅర్ అవినీతిపై మీ దగ్గర ఇంత సమాచారం ఉంటే...ఇన్నాళ్లు ఎందుకు విచారణ జరిపించలేదు?
బీజేపీకి,బీఆర్ఎస్ B టీం కాకపోతే కేసీఅర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? కేసీఅర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం అయితే తక్షణ దర్యాప్తుకి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు ?మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు కేసీఅర్ అవినీతి చిట్టా మీ దగ్గరుంది. మీకు నచ్చినట్లు కేసీఅర్ ను ఆడిస్తుంటే,మీరు చెప్పినట్లు కేసీఅర్ ఆడుతున్నాడు. కాళేశ్వరం అవినీతిపై సాక్ష్యాధారాలు మీ చేతుల్లో పెట్టుకొని యాక్షన్ తీసుకోక పోవడం మీ రహస్య బంధానికి ప్రతీక.లిక్కర్ స్కాంపై దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు..కేసీఅర్ బిడ్డ కవిత ప్రధాన సూత్రదారి అని తెలిసి..
ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం మీ దోస్తానాలో భాగం.TSPSC స్కాంపై కేంద్రం వేసిన ఈడీ విచారణలో ఐటీ మంత్రి లోపమే అని తెలిసి పట్టింపు లేకపోవడం మీరు మీరు ఒక్కటే అనడానికి నిదర్శనం.రాష్ట్రాన్ని దోచుకు తిన్న కల్వకుంట్ల కుటుంబానికి బీజేపీనే అండా దండ ."పైకి సిగపట్లు, లోపల చప్పట్లు" ఇదే రెండు పార్టీల దొంగ రాజకీయం.
నిజంగా కేసీఅర్ తెలంగాణ బిడ్డనే అయితే, బీజేపీతో వైరమే ఉంటే ..మోడీ రాష్ట్రానికి వస్తే ఎందుకు మొహం చాటేస్తున్నట్లు..? ప్రధానికి ఎదుటపడి ఎందుకు ప్రశ్నించనట్లు?విభజన హామీలపై అమితుమి అంటూ ఎందుకు పట్టుబట్టడం లేదు ?బయ్యారం ఉక్కు పరిశ్రమ ,గిరిజన యూనివర్సిటీ,కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు లాంటి విషయాల్లో ఎందుకు కేంద్రంపై దండయాత్ర సిద్ధ పడటం లేదు ? బీజేపీ బీఆర్ఎస్ లు రెండు వేర్వేరు పార్టీలు కాదు. రెండు పార్టీలు కలిసి " బీజేపీ రాష్ట్ర సమితి " రాజకీయాన్ని నడుపుతున్నయ్.
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా పాలేరులో పార్టీ కార్యాలయం వద్ద వైయస్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహానేతపై అభిమానంతో మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన అశేష ప్రజానీకానికి ధన్యవాదాలు. నా పై మీరు చూపిస్తున్న అభిమానం, ఆప్యాయత ప్రజలపై వైయస్ఆర్ గారు చూపించిన ప్రేమకు నిదర్శనం. పాలేరులో ప్రతి గడపకు వైయస్ఆర్ గారి సంక్షేమ పాలన అందిస్తా. పాలేరు అభివృద్ధి కోసం కృషి చేస్తా.
రాష్ట్ర ప్రజలను ఎంతగానో ప్రేమించిన నాయకుడు వైయస్ఆర్ గారు. పాలేరులో మహానేత విగ్రహావిష్కరణకు తరలివచ్చిన జనం వైయస్ఆర్ గారు ప్రజల గుండెల్లో నేటికీ బ్రతికే ఉన్నారని నిరూపించారు. రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పాలేరు ప్రజలతో జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో రుణపడి ఉంటా.
ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చాను. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశాను. అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని మాటిస్తున్నా.
అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తరతరాలకు ఆదర్శం. రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైయస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో కలిసి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు వైయస్ఆర్ గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు వైయస్ఆర్ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
Thank you @rahulgandhi ji for your affectionate words, reminiscing late Dr YS Rajashekara Reddy on his birth anniversary. Dr YSR was a committed Congress leader who died in the service of Telugu people, believing in the bright future for this country under your leadership.
His model of welfarism remains the preferred model of governance across the country even to date. Thank you Sir that Dr. YSR remains in your heart.
ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆయనను ప్రేమించే, అభిమానించే ప్రతి హృదయానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో, తెలుగు ప్రజల సంక్షేమం కోసం ఎంతగా కృషి చేశారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం రైతుల కోసమే పెట్టారు. రుణమాఫీ, ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది. కేవలం 5 సంవత్సరాలలో 46 లక్షల పేదలకు ఇండ్లు కట్టించారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు అందించారు. పోడు భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారు. ప్రతి వర్గంలో ప్రతి ఒక్కరి హృదయంలో చోటు సంపాదించుకున్నారు. వైయస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్క హృదయానికి వైయస్ఆర్ గారి కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటుంది.
వైయస్ఆర్ గారి 74వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించడం జరిగింది. నాన్న ఈ లోకాన్ని వదిలివెళ్ళినా..ప్రతి పేదవాడి చిరునవ్వులోనూ నాన్న బ్రతికే ఉన్నారు. రైతులు, ఆడబిడ్డల అభ్యున్నతి కోసం నాన్న కన్న ప్రతి కల.. నేను నెరవేరుస్తా. #YSRJayanthi
కేసీఆర్, బీజేపీ ఒక్కటికాదని చిన్నదొర నొక్కినొక్కి చెబుతుంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదు పాపం. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్.. కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడు. కేసుల నుంచి బయట పడేందుకు కేంద్రం వద్ద మోకరిల్లాడు. ఒక్కసారిగా కేసీఆర్ నాలుక బీజేపీ నుంచి ఇంకో పార్టీకి మళ్లింది. తొమ్మిదేండ్లుగా విభజన హామీలపై మోడీని నిలదీయలేని బీఆర్ఎస్.. బీజేపీకి ‘బీ’ టీం కాదా? రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడలేని కేసీఆర్.. మోడీ తొత్తు కాదా? కాళేశ్వరంలో కేసీఆర్ రూ.వేల కోట్లు తినేసినా కనీసం విచారణ చేయించని బీజేపీ.. బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినట్లు కాదా? లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని బీజేపీ.. బీఆర్ఎస్ ను కాపాడుతున్నట్లు కాదా? బీఆర్ఎస్ అంటే "బీజేపీకి రహస్య సమితి". బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం. బీజేపీతో కేసీఆర్ చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కాళేశ్వరం కమీషన్లతో దేశ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరం. రూ.80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు ఎలా తింటం అని చేస్తున్న వితండవాదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. రాష్ట్రాన్ని దోచుకుతిన్న దొంగలు CAG రిపోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు. రూ.62 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ను అంచనా వ్యయం 1,51,168 కోట్లకు పెంచారని, నెలకు రూ.2,100 కోట్లు ఎలా కడతారని కాగ్ తూర్పారపడితే.. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ.. ప్రశ్నించే వారిపై అక్కసు వెళ్లగక్కడం మాత్రమే BRS దొంగలకు తెలుసు. YSR హయాంలో రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి, రూ.1.51 లక్షల కోట్లకు అంచనా వ్యయం పెంచారు.రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్టిన ప్రాజెక్టు మూడేండ్లకే మునిగిపోతే కనీసం విచారణ కూడా చేపట్టలేదు. మరి లక్ష కోట్లతో ఎవరి జేబులు నింపినట్టు? ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి మేలు జరిగినట్టు? కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు, దాని వల్ల జరుగుతున్న ప్రయోజనాలకు పొంతనే లేదు. కాళేశ్వరం వల్ల జరిగే ప్రయోజనాలను ఎక్కువగా చూపించారని చెబుతున్న కాగ్ మాటలు దొరకు వినిపించడం లేదా? ఇంత అవినీతి జరుగుతుందని తెలిసినా బీజేపీ ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, షెకావత్ సైతం ఆరోపణలు చేసింది నిజం కాదా? కేసీఆర్ బీజేపీకి బీ టీం కాకపోతే కేంద్ర పెద్దలు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అడుగడుగునా అవినీతి, తప్పుడు లెక్కలే... కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల "MEGA" కుంభకోణంపై పోరాటం చేస్తున్నది కేవలం YSR తెలంగాణ పార్టీ మాత్రమే. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై ఢిల్లీ వరకు పోరాడి CBI, CAG లకు ఫిర్యాదు చేశాం. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై CBI విచారణ జరిపించాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదు.
తాగుబోతుల మీద ఉన్న ప్రేమ..సర్కారీ బడుల్లో వసతుల కల్పన మీద లేదు.
తాగు,తాగిపించు ఇదే దొరకు తెలిసిన రాష్ట్ర అభివృద్ధి.
కేసీఆర్ కు బడుల కన్నా బార్లే ఎక్కువ. విద్యార్థుల కన్నా మందుబాబులే మక్కువ.
విద్యాభివృద్ధిపై దొర చెప్పే మాటలకు,చేతలకు పొంతనే ఉండదు.
కేసీఆర్ మనవడు, రంగయ్య మనవడు ఒకే బువ్వ తినాలి, ఒకే చదువు చదవాలి అని మాయ మాటలు చెప్పాడు.
సర్కారీ బడుల్లో సౌలత్ లు లేక,రంగయ్య మనవడు తెల్లమొహం ఏస్తే..
కేసీఆర్ మనవడు అంగరంగ వైభవంగా పట్టాలు అందుకుంటున్నడు.
రూ.3500 కోట్లతో మన ఊరు-మన బడి అంటూ ఊదరగొట్టారు.
కార్పొరేట్ ను తలదన్నే ఎడ్యుకేషన్ అని గొప్పలు చెప్పారు.
ఏటికేటా అడ్మిషన్లు హైక్ అంటూ ఫేక్ కథలు అల్లారు.
అసలు విషయం ఆరా తెస్తే దొర గారి విద్యా వ్యవస్థ అంతా పైన పటారం,లోన లొటారం
26 వేల పాఠశాలలకు,12వందల స్కూళ్లను బాగుచేయడం దొర చెప్పే విద్యాభివృద్ధి.
3వేల కోట్లు కేటాయించి 30 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం దొరకు విద్యా వ్యవస్థపై ఉన్న ప్రేమ.
సగానికి సగం స్కూళ్ళలో 30 మంది విద్యార్థులు లేకపోవడం విద్యాశాఖ గొప్ప పనితనం.
ఏటికేటా అడ్మిషన్లు లేక మూతపడుతున్న బడులు కేసీఆర్ అభివృద్ధి పాలనకు చిహ్నాలు.
6 వేల పాఠశాలలకు "ఏకోపాధ్యాయ" ఇదేనా ప్రభుత్వ విద్య.?
రాష్ట్రంలో 26 వేల టీచర్స్ పోస్టులు ఖాళీగా పెట్టి..
సర్కార్ విద్యను బొంద పెట్టి..కార్పొరేట్ విద్యకు కొమ్ముగాయడమే దొర ప్లాన్.
పాఠశాల విద్యకు చెదలు పట్టించి.. ఉన్నత విద్యను దొర భ్రష్టు పట్టించాడు.
5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక వృత్తి విద్యను ఆగం చేసిన మోసగాడు కేసీఆర్.