అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు గారు @ncbn ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కుటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం. అభివృద్ధి బూటకం. సంపద సృష్టి మోసం. సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. “విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు” ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక.
రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం. అమలు చేశామాని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు గారు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ.
భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు. దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని PM కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు.
ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని 15 వేలు అని హామీ ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి 2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి 4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది.
32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు ? 12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు ? 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు ? తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా TDP @JaiTDP , YCP @YSRCParty లు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి 2 లక్షలు.
2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం.
@INC_Andhra
మహానేత వైయస్ఆర్ గారి హయాంలో రైతు రాజుగా తలెత్తుకుని తిరిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంటకు గిట్టుబాటు ధర లేదు.. పంట నష్ట పరిహారం లేదు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తామని మోసం చేశారు. ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం ?
#YSSharmila#APCongress#INCAndhra
ఈ పవిత్ర గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం, వినయం, ధర్మం, సేవాభావం, సద్బుద్ధి మరింత వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
“తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ @JaiTDP@JanaSenaParty@BJP4Andhra విధానం.
అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి YCP ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు గారు @ncbn తల్లులను నయవంచన చేస్తున్నారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
జూన్ 29,2023 న నాడు ప్రతిపక్షంలో ఉండగా, ఆనాడు YCP ప్రభుత్వానికి మీరు సంధించిన ప్రశ్నలు.( మీకు గుర్తు చేయడం కోసం )
1) రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ?
2) 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ?
3) 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ?
4) కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ?
5) అమ్మఒడి అంటూ నాన్న బుడ్డీ దోపిడీనా ?
“ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం”.
1) అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి YCP ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటి ?
2) మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ?
3) ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకు ?
4) సవాలక్ష కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే .. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ మీరు సైతం కొర్రీలు పెట్టడం ఎందుకు ?
5) నాన్న బుడ్డీని జగన్ గారు దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారు కదా ?
కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తల్లికి వందనంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 87( యూడైస్ లెక్కల ప్రకారం ఈ మూడేళ్ళలో పెరిగిన 4 లక్షల మంది బిడ్డలను కలుపుకొని) లక్షల మంది బిడ్డలకి, ఇవ్వాలి. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలి. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@INC_Andhra
बहुत हुआ, चलो युवा,
हाथ से हाथ जोड़ के,
अन्याय का घड़ा फोड़ के।
युवा ख्वाब ये जल जाएंगे,
सिंहासन तब हिल जाएंगे,
छात्रों की गूंज, ये है छात्रों की गूंज।
शिक्षा Revolution की ओर देश के सभी छात्रों और युवाओं का उत्साह और जोश बढ़ाने के लिए #ChhatronKiGoonj Anthem.
बदलाव अब दूर नहीं।
పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్ట్‌ను కాస్త రిజర్వాయర్‌గా మార్చారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే, టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మన రాష్ట్ర జీవనాడిలో జీవం తీసేస్తే, ఒక్క పార్టీ కూడా నోరు విప్పడం లేదు ఎందుకు?
#yssharmila
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత. ఎన్నికల్లో కూతలు.. అనంతరం జనాలకు వాతలు.. ఇప్పుడు చిల్లరతో పాచికలు. విద్యుత్ చార్జీల తగ్గింపు ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారు చేస్తున్నది మాయాజాలం.
ట్రూ అప్ కింద భారీగా షాకులు పెట్టి.. ట్రూ డౌన్ పేరుతో ఆయిట్మెంట్ రాస్తున్నారు. రూ.15485 కోట్ల మేర సర్దుపోటు వేసి, ముష్టి రూ. 923 కోట్లు తగ్గించి ఉద్ధరించామని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది.
నిజంగా కూటమి ప్రభుత్వానికి కరెంటు ఛార్జీల తగ్గింపుపై చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దమ్ముంటే ఏడాదికో పది పైసలు, పదమూడు పైసలు కాదు.. వసూలు చేస్తున్న ట్రూ అప్ భారాన్ని మొత్తంగా తగ్గించండి. రెండేళ్లుగా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని వినియోగ దారులకు తిరిగి చెల్లించండి. ఎన్నికల్లో 30 శాతం మేర చార్జీల తగ్గింపు హామీని వెంటనే అమలు చేయండి.
పోలవరం పాలిట సీఎం చంద్రబాబు @ncbn గారు కిల్లర్. ఉద్దరించడం కాదు.. దగ్గరుండి ఊపిరి తీస్తున్నారు. జీవనాడిలో జీవం తీసి, మోదీజీ మెప్పుకోసం పోలవరానికి వెన్నుపోటు పొడుస్తున్న అభినవ కట్టప్ప చంద్రబాబు గారు.
41.15 మీటర్ల ఎత్తులో ఉపయోగం లేదని, ప్రాజెక్ట్ ప్రయోజనాలు అసంపూర్ణమని, బహుళార్థకం కాస్త నీటి నిల్వకే పరిమితమని, ఎత్తు తగ్గింపుతో పోలవరం ఆత్మహత్య సదృశ్యమని చంద్రబాబు గారికి తెలిసి చేస్తున్న డ్రామానే ఇదంతా. 32 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ మిగులు కోసం ప్రాణాధార లాంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తున్నారు.
పోలవరంపై చంద్రబాబు గారు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టును తానే 37 సార్లు సందర్శించి, 136 సార్లు రివ్యూ చేశానని గొప్పలు చెప్పడానికున్న శ్రద్ధ.. 45.72 మీటర్ల ఎత్తులోనే కట్టాలని, దశలు దిశలు వద్దని కేంద్రాన్ని నిలదీయడంపై లేదు. గ్రావిటీ ప్రాజెక్ట్ కాస్త ఎత్తిపోతల పథకంగా మారుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్రానికి చేస్తున్న తీరని అన్యాయం.
మార్చ్ 31 లోపు జాతికి అంకితం ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటి ప్రశ్నలు.
1) రెండో దశ పనులకు చాలా డబ్బు కావాలి.. వచ్చే మూడేళ్ళలో రెండో దశ పూర్తి చేయడం కష్టమేనన్న మీ వ్యాఖ్యలకు ఆంతర్యం ఏమిటి ?
2) ఆర్ అండ్ ఆర్ కింద రెండో దశలో 32 వేల కోట్లు ఇవ్వకుంటే ప్రాజెక్ట్ ప్రయోజనం శూన్యమేనా ?
3) ఇంతకాలం హంగామా అంత బూడిదలో పోసిన పన్నీరుగా మిగలాల్సిందేనా ?
4) పోలవరం ప్రాజెక్టు DPR ప్రకారం పూర్తి నీటి నిలువ సామర్థ్యం (FRL) 45.72 మీటర్ల ఎత్తులో 194.6 TMC నిల్వ చేయగలిగితేనే 35 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మందికి త్రాగునీరు అందించడం సాధ్యమవుతుంది. మరి 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ద్వారా సమకూరే ప్రయోజనం ఏంటి ?
5) పోలవరం ప్రాజెక్టు కనీస నీటి నిల్వ సామర్థ్యం MDDL 41.15 మీటర్ల ఎత్తులో 119 TMC లకే తొలి దశ పూర్తి చేసి ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు ? ఎంతమంది గొంతు తడుపుతారు ?
41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు కాస్త పోలవరం బ్యారేజ్ గా మార్చి , జాతికి అంకితం ఇస్తామని చెప్తున్న చంద్రబాబు గారు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మొదటి దశ ప్రయోజనాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.
కేంద్రంలో మీ సర్కారే ఉంది కదా, మరి రెండో దశ గురించి నోరు ఎందుకు మెదపట్లేదు. ఖచ్చితమైన, కాంక్రీట్ హామీ తీసుకుని రాగలమని గుండెలమీద చేయి వేసుకొని చెప్పగలరా ?
ప్రాజెక్టు పోలవరమే, కానీ మీ వెన్నుపోటు తరతరాలకు శాపం.
@INCIndia@INC_Andhra
पिछले सप्ताह हुई UGC-NET परीक्षा को लेकर सामने आए गंभीर आरोप बेहद चौंकाने वाले हैं।
NEET पेपर लीक के कुछ ही हफ्तों बाद अब खबरें आ रही हैं कि -
- UGC-NET परीक्षा से ठीक पहले 100 पन्नों की एक PDF प्रसारित हुई।
- यह PDF उस question paper setting की है, जो सिर्फ़ NTA के पास उपलब्ध होती है।
- PDF के लगभग 90 सवाल Sociology के असली प्रश्नपत्र से मेल खाते हैं।
- वही प्रश्नपत्र ₹2.25 लाख में बिहार, उत्तर प्रदेश, हरियाणा, दिल्ली और राजस्थान में बेचा जा रहा था।
- इसी नेटवर्क ने CSIR-NET, HTET और ADA जैसी आगामी परीक्षाओं के प्रश्नपत्र उपलब्ध कराने का भी दावा किया।
NEET और NET में बार-बार सामने आए घोटालों के बाद भी मोदी सरकार आंखें मूंदकर सो रही है, क्योंकि लाखों छात्रों की रात-रात जागकर की गई सालों की मेहनत उनके लिए कोई मायने नहीं रखती।
सारा देश जानता है कि प्रधानमंत्री और शिक्षा मंत्री से किसी भी तरह की जवाबदेही या कार्रवाई की उम्मीद बेकार है - न जांच होगी, न छात्रों को न्याय मिलेगा।
बदलाव का एकमात्र औज़ार हमारी सम्मिलित आवाज़ है - देश भर के छात्रों की गूंज, जो भारत में शिक्षा revolution लाकर रहेगी।
మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టి, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే జీవో నంబర్ 975 లను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn గారికి లేఖ రాస్తున్నాం.
ప్రజల కోసం చెమటోడ్చే కార్మికులను రోడ్డున పడేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రైవేటీకరణ పేరుతో వేలాది కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
అధికారంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి అన్నీ ప్రైవేటైజేషన్ చేసే విధంగా అరాచకపు అడుగులు వేస్తున్న కూటమి సర్కారు, మన పట్టణ పరిసరాలను శుభ్రపరిచి, పౌరుల కోసం రాత్రిపగలు పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల కుటుంబాల బ్రతుకులతో ఆడుకోవటం వారికే చెల్లింది.
సింగపూర్, కొరియా దేశాల్లో కాలం గడుపుతూ, క్వాంటం, AI అంటూ కబుర్లతో పబ్బం గడిపేస్తున్న ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు, కులమతాల గొడవలకు ఆజ్యం పోయడానికే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నట్టు వ్యవహరించే పవన్ కళ్యాణ్ గారు, అమరావతి ప్రాంతంలో కాలక్షేపానికి తిరగడం తప్ప ఎక్కడికి కదలని, ఇంకా ఏమీ చేయని మున్సిపల్ మంత్రిగారు, మీకు ఇదే కాంగ్రెస్ హెచ్చరిక: తీరు మార్చుకోండి, ప్రజలకోసం పనిచేయండి, ప్రజారంజకంగా పాలించండి. లేకపోతే మిమ్మల్ని కూడా మునుపటి పాలకుల్లా అంద పాతాళానికి తొక్కేస్తారు ప్రజలు.
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారుచేస్తానన్న బాబుగారు అసలుకే మోసంగా, ఉన్న ఉద్యోగాలను, జీవనాధారాన్ని పేదలకు లేకుండా చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడు బేషరతుగా మద్దతు ఇస్తుంది. నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి, కార్మిక ఉద్యమానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.
@INC_Andhra
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. కాలం మారినా తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకం. మరణం లేని మహానాయకుడు YSR. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా YSR. రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా. - @realyssharmila (President, Andhra Pradesh Congress Committee)
YSR లెజెండరీ లీడర్. ఆయనకు మరణం లేదు. మహానేత ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. ఆయన పథకాలు, చేసిన అభివృద్ధి అందని గడప రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ , ఉచిత విద్యుత్ , జలయజ్ఞం లాంటి ప్రతి పథకం మనసు పెట్టి అమలు చేశారు. YSR చనిపోతే ఆయన వెంటే 700 వందల మంది వెళ్లిపోయారంటే ప్రజల గుండెల్లో దివంగత నేతపై పెట్టుకున్న అభిమానం ఏంటో అర్థమవుతుంది. YSR ను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరుపున మనస్పూర్తిగా కృతజ్ఞతలు.