पिछले सप्ताह हुई UGC-NET परीक्षा को लेकर सामने आए गंभीर आरोप बेहद चौंकाने वाले हैं।
NEET पेपर लीक के कुछ ही हफ्तों बाद अब खबरें आ रही हैं कि -
- UGC-NET परीक्षा से ठीक पहले 100 पन्नों की एक PDF प्रसारित हुई।
- यह PDF उस question paper setting की है, जो सिर्फ़ NTA के पास उपलब्ध होती है।
- PDF के लगभग 90 सवाल Sociology के असली प्रश्नपत्र से मेल खाते हैं।
- वही प्रश्नपत्र ₹2.25 लाख में बिहार, उत्तर प्रदेश, हरियाणा, दिल्ली और राजस्थान में बेचा जा रहा था।
- इसी नेटवर्क ने CSIR-NET, HTET और ADA जैसी आगामी परीक्षाओं के प्रश्नपत्र उपलब्ध कराने का भी दावा किया।
NEET और NET में बार-बार सामने आए घोटालों के बाद भी मोदी सरकार आंखें मूंदकर सो रही है, क्योंकि लाखों छात्रों की रात-रात जागकर की गई सालों की मेहनत उनके लिए कोई मायने नहीं रखती।
सारा देश जानता है कि प्रधानमंत्री और शिक्षा मंत्री से किसी भी तरह की जवाबदेही या कार्रवाई की उम्मीद बेकार है - न जांच होगी, न छात्रों को न्याय मिलेगा।
बदलाव का एकमात्र औज़ार हमारी सम्मिलित आवाज़ है - देश भर के छात्रों की गूंज, जो भारत में शिक्षा revolution लाकर रहेगी।
మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టి, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే జీవో నంబర్ 975 లను వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు @ncbn గారికి లేఖ రాస్తున్నాం.
ప్రజల కోసం చెమటోడ్చే కార్మికులను రోడ్డున పడేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రైవేటీకరణ పేరుతో వేలాది కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
అధికారంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి అన్నీ ప్రైవేటైజేషన్ చేసే విధంగా అరాచకపు అడుగులు వేస్తున్న కూటమి సర్కారు, మన పట్టణ పరిసరాలను శుభ్రపరిచి, పౌరుల కోసం రాత్రిపగలు పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల కుటుంబాల బ్రతుకులతో ఆడుకోవటం వారికే చెల్లింది.
సింగపూర్, కొరియా దేశాల్లో కాలం గడుపుతూ, క్వాంటం, AI అంటూ కబుర్లతో పబ్బం గడిపేస్తున్న ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు, కులమతాల గొడవలకు ఆజ్యం పోయడానికే ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నట్టు వ్యవహరించే పవన్ కళ్యాణ్ గారు, అమరావతి ప్రాంతంలో కాలక్షేపానికి తిరగడం తప్ప ఎక్కడికి కదలని, ఇంకా ఏమీ చేయని మున్సిపల్ మంత్రిగారు, మీకు ఇదే కాంగ్రెస్ హెచ్చరిక: తీరు మార్చుకోండి, ప్రజలకోసం పనిచేయండి, ప్రజారంజకంగా పాలించండి. లేకపోతే మిమ్మల్ని కూడా మునుపటి పాలకుల్లా అంద పాతాళానికి తొక్కేస్తారు ప్రజలు.
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారుచేస్తానన్న బాబుగారు అసలుకే మోసంగా, ఉన్న ఉద్యోగాలను, జీవనాధారాన్ని పేదలకు లేకుండా చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ ఎప్పుడు బేషరతుగా మద్దతు ఇస్తుంది. నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి, కార్మిక ఉద్యమానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.
@INC_Andhra
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. కాలం మారినా తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకం. మరణం లేని మహానాయకుడు YSR. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా YSR. రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా. - @realyssharmila (President, Andhra Pradesh Congress Committee)
YSR లెజెండరీ లీడర్. ఆయనకు మరణం లేదు. మహానేత ముఖ్యమంత్రిగా పని చేసింది కేవలం 5 ఏళ్ళు మాత్రమే. ఆయన పథకాలు, చేసిన అభివృద్ధి అందని గడప రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేదు. ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్ , ఉచిత విద్యుత్ , జలయజ్ఞం లాంటి ప్రతి పథకం మనసు పెట్టి అమలు చేశారు. YSR చనిపోతే ఆయన వెంటే 700 వందల మంది వెళ్లిపోయారంటే ప్రజల గుండెల్లో దివంగత నేతపై పెట్టుకున్న అభిమానం ఏంటో అర్థమవుతుంది. YSR ను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి కుటుంబం తరుపున మనస్పూర్తిగా కృతజ్ఞతలు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 77 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. కాలం మారినా తెలుగు నేలపై నాన్నది ఎప్పటికీ చెరగని సంతకం. మరణం లేని మహానాయకుడు YSR. సంక్షేమానికి, అభివృద్ధికి శాశ్వత చిరునామా YSR. రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా.
Remembering senior Congress leader and former Chief Minister of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy ji, on his birth anniversary.
A true statesman, he uplifted countless lives through his unwavering commitment to the welfare of the people of Andhra Pradesh. His service to the people will always be remembered.
మహానేత వైయస్ఆర్ గారి హయాంలో రైతు రాజుగా తలెత్తుకుని తిరిగేవాడు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇపుడు వ్యవసాయం దండుగ అయ్యింది. పంటకు గిట్టుబాటు ధర లేదు.. పంట నష్ట పరిహారం లేదు.సబ్సిడీ పథకాలు పూర్తిగా ఎత్తివేశారు. రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి వాళ్ళ భూములే కబ్జాలు చేస్తున్నారు. రాజన్న రాజ్యం కోసం అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం.
నాగలి నేలను తాకే ఈ పవిత్రమైన ఏరువాక పౌర్ణమి సందర్భంగా... రైతన్నల శ్రమకు మంచి ఫలితం దక్కాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. - వైయస్ షర్మిల రెడ్డి (President, Andhra Pradesh Congress Committee)
దేశ సమగ్రత, యువత మరియు రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న మీ నాయకత్వం కోట్లాది మందికి స్ఫూర్తి.
మీరు ఆయురారోగ్యాలతో, ఆనందంతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము.
ప్రజలతో కలిసి నడిచే నాయకుడు...
ప్రజల సమస్యలపై పోరాడే యోధుడు...
ఏఐసీసీ అగ్ర నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నేత
శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు!
ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సాధికారత, రైతు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రతి భారతీయుడి గొంతుక వినిపించేందుకు, సమ సమాజ స్థాపన, సోదరభావంతో కూడిన భారతదేశ కోసం మీరు చేస్తున్న కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
మీరు ఆయురారోగ్యాలతో, ఆనందంతో, మరింత శక్తి సామర్థ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము.
జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారు!
-వైయస్ షర్మిల రెడ్డి
(President, Andhra Pradesh Congress Committee)
On the occasion of Shri Rahul Gandhi ji's birthday, I extend my heartfelt wishes to him.
I have always admired Rahul ji for his honesty, sincerity, and unwavering commitment to the values of democracy, social justice, and inclusive development. In an era where politics often demands courage and conviction, he has consistently stood by what he believes is right, irrespective of the challenges.
Coming from a family that has made extraordinary sacrifices for the nation, Rahul ji carries forward a legacy of public service with humility and dedication. I am reminded of the words of the late Dr. YSR, who believed Rahul Gandhi as the ideal leader to guide India towards a brighter future.
As Rahul ji celebrates another year of life, I wish him good health, happiness, strength, and continued success in the journey of serving the people of India.
Happy birthday, Rahul Gandhi ji. @RahulGandhi@INCIndia
#rahulgandhi
ఇది కూటమి మాయాబజార్! చంద్రబాబు గారి హామీలంటే అన్నీ ఇలాగే ఉంటాయి. ఎన్నికలు గెలిచే వరకు ఆహా.. ఓహో.. అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. గెలిచాక మాత్రం అన్నీ చేసేశాం అంటూ చేతులెత్తేస్తారు! వీళ్ళ పసిడి హామీల ఆయుష్షు కేవలం ఎన్నికల వరకే ఆ తర్వాత అంతా మాయ.