This is atrocious and outrageous behaviour by @TelanganaCOPs
1. Golden Rule:
తాగడం మానేయాలి. కొంచెం శ్రమిస్తే చాలా ఈజీ. యూనిఫాం వేసుకునే ఏ ఉద్యోగమైనా అసలే తాగొద్దు. ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ వస్తుందో తెలియదు. Alcohol(C2H5OH) is poison.
2. తాగిన మత్తులో ఉన్న వ్యక్తులను ఎప్పుడూ కొట్టకూడదు. వాళ్లు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. నలుగురు బీట్ కానిస్టేబుళ్లు తాగిన కానిస్టేబుల్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ లేదా బెటాలియన్ కు తీసుకొని పోయి ఉన్నతాధికారులకు సమాచారం అందించవచ్చు. కానీ ఇక్కడ అది జరగలేదు.
4. తాగిన మైకంలో విచక్షణ ఉండదు. అలాంటి వాళ్లతో సంవాదం వృదా. మొదట తాగిన కానిస్టేబుల్‌ను కొట్టడం తప్పు. అందుకే ఆ తాగిన కానిస్టేబుల్ యూనిఫాం లో ఉన్న పీసీని కొట్టాడు. తరువాత యూనిఫాం లో ఉన్నాయన అహం దెబ్బ తిని మరీ రాక్షసంగా ప్రవర్తించాడు. పోలీసుల ప్రవర్తన చూసి పౌరులు కూడా ఇదే అదనుగా రెచ్చిపోయారు.
5. పోలీసులను ప్రజలు తాగే బార్లలో తాగనీయ రాదు. అందుకే వాళ్లకు గతంలో బెటాలియన్ లలో సపరేట్ మెస్ లు ఉండేవి. అక్కడ రెండు పెగ్గుల కన్నా ఎక్కువ ఇవ్వరు. ఎవరెవరు బాగా తాగుతున్నారో కమాండెంట్‌కు తెలిసేది.
6. Please take action on both the cops and the civilians who supported the cops in this outrageous attack.
7. పోలీసులకు రావలసిన టీఏ, డీయే, సరెండర్లు, ప్రమోషన్లు లాంటి సౌకర్యాలు సకాలంలో రాకపోవడం వల్లే వారిలో ‘కొందరు’ నిరాశకు లోనై తాగుతున్నారని నా అభిప్రాయం!
ప్రియమైన పేద మద్య తరగతి ప్రజలారా,
మీ బంధువులు ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే దయచేసి హైదరాబాదు మరియు ఇతర మహానగరాలలో ఉన్న నిమ్స్, గాంధీ, ఉస్మానియా, యంజీయం లాంటి ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లండి. 🙏🏼
అక్కడ మెరిసే టైల్స్, టీవీలు ఉన్న వార్డులు, ప్రేమ గా పలకరించే నర్సులు లేకపోవచ్చు కాని మానవత్వం ఉన్న వైద్యులు నర్సులు తప్పకుండా ఉంటారు. దురదృష్టవశాత్తు చనిపోతే ‘ప్రశాంతంగా’ బాడీని తీసుకొని ఇంటికి పోవచ్చు.
కానీ కార్పొరేట్ ఆసుపత్రులలో చనిపోతే పోయిన వ్యక్తి ఎలాగూ పోతాడు, మిగిలిన బంధువులను కూడా చికిత్సకు అయిన మొత్తం డబ్బులు కట్టే దాకా డెడ్ బాడీని ఇవ్వం అని రాబందుల్లా పీక్కు తింటారు ఈ దుర్మార్గులు. మీ అందమైన ఆసుపత్రుల అద్దాల వెనక ఇంత స్వార్థం, కర్కశత్వం ఉంటదా కార్పో’రేట్లు’?
కార్పొరేట్ హాస్పిటల్లు కేవలం కుబేరులకు ధనవంతులకు, ఖరీదైన ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే. పేదలకు ఇవి పనికిరావు. పేదలకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి చర్యలు తీసుకునే ధమ్ము ఏ ప్రభుత్వ అధికారికి కూడా లేదు.
ఇక ఆరోగ్య శాఖ మంత్రి గురించి మాట్లాడి లాభం లేదు.
(సిర్పూర్ తాలూకా నుండి హైదరాబాదు పంజాగుట్ట ఏరియాలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చనిపోయిన వ్యక్తి మృత దేహాన్ని బిల్లు పూర్తిగా కడితే తప్ప విడవం అని యాజమాన్యం వేధిస్తుంటే ఆ బాధిత కుటుంబం పడుతున్న నరకయాతనకు స్పందనగా ఈ పోస్టు😭)
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?
మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు.
ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు!
ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి @revanth_anumula గారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊
స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊
Art 19(1)(a)(b)
@BRSparty
#TelanganaUnderArrest
Attack on hon’ble Chief Justice of India, Justice BR Gawai in an open court by an alleged ‘Sanatani’ advocate is utterly condemnable. If this can happen to the Chief Justice in broad daylight, imagine what kind of havoc such woke minds are playing with ordinary citizens in the country!
This is a symptom of a deeper malaise in which vulnerable citizens are being constantly brainwashed by retrogressive and fundamentalist forces in various forms in this country.
This is a high time that all internal security agencies like IB, NIA, CBI, and state intelligence agencies keep a tight check on such radicalisation in any religion.
If unchecked, this virus polarises society and causes irreparable damage to all democratic institutions and throws India into dark ages again. A diverse nation like India can’t just afford this.
Jai Hind.
#IstandWithJusticeGawai
ఈ పాటకు అర్థం ఇపుడున్న కాంగ్రెస్ పాలనలో తెలుస్తుంది అందరికీ..
మల్లారెడ్డి కి రైతుబంధు వచ్చినపుడు ..
దొరల పాలన దొరకు అహంకారం అనుకున్నప్పుడు ..
TRS-BRS మార్చినప్పుడు..
దళిత బంధు ఇచ్చినపుడు.
యూరియా టైం కి వచ్చేది,నీళ్లు వచ్చేవి,రైతు బంధు పడేది..కల్యాణలక్ష్మి వచ్చేది కేసీఆర్ కిట్ వచ్చేది..
వెన్నుపోటుదార్ల వెన్నులో చలి పుట్టించిన గద్వాల గర్జన 👊
పార్టీ అధికారంలో ఉన్నపుడు అన్నీ అనుభవించి ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసి ప్రజలను మోసం చేసిన పది మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వదిలేది లేదని బలమైన హెచ్చరిక చేశారు గద్వాల ప్రజలు.
@KTRBRS వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ప్రసంగం ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప భరోసాను ఇచ్చింది.
వానను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన అశేష ప్రజానీకానికి వందనాలు.
జై తెలంగాణ.✊
@BRSparty
మాజీ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజు గారు @BRSparty ని వీడటం బాధాకరం. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలతో తల్లడిల్లుతున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి స్వర్ణయుగాన్ని నిరంతరం తలుచుకుంటూ, వారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్న ఈ తరుణంలో బాలరాజు గారు స్థానిక ప్రజల గొంతుకగా ముందుండి పోరాటం చేసుంటే బాగుండేది.
ఇది తన వ్యక్తిగత నిర్ణయమైనా, కాంగ్రెస్-బీజేపీల కూటమి అసత్య ప్రచారాన్ని నమ్మకుండా, మరో సారి పునరాలోచించాలని బాలరాజు గారిని కోరుతున్నా.
అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎలాంటి నిరాశకు గురికాకుండా బీఆరెస్ పార్టీ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ దోపిడి చేయాలని కుట్రలు చేస్తున్న వలస-భూస్వామ్య-మతోన్మాద శక్తులను తుదముట్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న.
ఈ మహా పోరాటంలో బీఆరెస్ పార్టీ మిమ్మల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు నడిపిస్తుంది.
అమరవీరుల ఆత్మల సాక్షిగా చెబుతున్న,
తెలంగాణ భవిష్యత్తును కాపాడే ధమ్మున్న కార్యకర్తలున్న పార్టీ బీఆరెస్ మాత్రమే.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆర్ గారే.
జై తెలంగాణ ✊
@KTRBRS@BRSHarish
ఈ మహేందర్ అనే దళిత యువకుడిపై సైదాపూర్ ట్రైనీ ఎస్సై దారుణంగా దాడి చేసి దాదాపుగా ఒక నెల రోజులైంది. న్యాయం కోసం ఈ యువకుడు తొక్కని గడప లేదు. నేను కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాను. జాతీయ ఎస్సీ కమీషన్ నోటీసులు కూడా ఇచ్చింది. అయినా ఎలాంటి స్పందన లేదు!
A dalit youth was brutally assaulted in Saidapur of Karimnagar district by police officers in broad daylight. So far @revanth_anumula’s government hasn’t taken any action on the offenders. Is this the nyay that you are preaching everyday @RahulGandhi ji ?
Shame on you @INCIndia .
@kharge@TelanganaCOPs@TelanganaDGP
ఇప్పుడే బండి శ్రవణ్ అనే యువకుడు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని గొల్లవాడలో ఉద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కుటుంబాన్ని సందర్శించాను.
ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ 60 వేల ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెబుతుంది. కానీ రోజూ వ్యాయామం చేస్తూ,పుస్తకాలతో కుస్తీ పడుతూ అలసిపోయి ఆఖరికి మనకు శాశ్వతంగా దూరమయ్యాడు.
కనీసం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా శ్రవణ్ బతికేవాడేమో.😞
#CongressFailedTelanganaYouth
రేవంత్ రెడ్డి గారు,
మీరే మంత్రిగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఒక IAS అధికారి, డా. అలుగు వర్షిణి గారు దళిత విద్యార్థులు సంపన్న వర్గాల నుండి రాలేదు కావున హాస్టల్స్ లో వారి టాయిలెట్స్ వాళ్లే శుభ్రం చేసుకోవాలి, వాళ్ల వంటలు వాళ్ళే చేసుకోవాలి, ఇందులో తప్పేముంది అని బహిరంగంగా హుకుం ఇచ్చారు. దీన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులను బయటకు గెంటేయండి అని చెబుతున్నారు.
ఈ లాంటి ‘మంచి’ అలవాట్లు విద్యార్థులకు భవిష్యత్ లో చాలా బాగా పనికొస్తాయని వారు గట్టిగా సమర్థించుకుంటున్నారు కూడా. పైగా దీన్ని రాజకీయం కూడా చేయొద్దు అని వారు హెచ్చరిస్తున్నారు.
మీ ఆదేశాలు లేకుండా ఏ అధికారి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. తరతరాలుగా మా టాయిలెట్లు మేం కడుక్కుంటూనే ఈ నిచ్చెనమెట్ల సమాజం టాయిలెట్లు కూడా మేమే కడుగుతున్నాం. అయినా ఇన్ని గొప్ప మనువాద సంస్కరణలు మా పేద విద్యార్థులకేనా?
మీ పిల్లలు చదివే కార్పొరేట్ స్కూల్స్ లో కూడా అమలు చేయాలని మీ అధికారులకు చెప్పండి.
అలాగే ముఖ్యమంత్రి గా, సంక్షేమ మంత్రిగా, సంపన్న వర్గాల ప్రతినిధిగా మీరు కూడా మీ టాయిలెట్ ఈ రోజు నుండే కడుక్కోండి, మీ మంత్రులతో, అధికారులతో కడిగించండి, గంధా భవన్ లో మీ సహచరులతో కడిగించండి. ప్రతి రోజూ ఆ ఫోటోలను వీడియోలను తెలంగాణ ప్రజలతో షేర్ చేసుకోండి.
రేవంత్ రెడ్డి గారి బంగళాకు ఈ రోజు నుండి పోవడం మానేయాలని హౌస్ కీపింగ్ సోదరులకు మనవి.
ప్రతిరోజూ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి కాంగ్రేసు ప్రభుత్వం అడుగడుగునా తూట్లుపొడుస్తున్నా, నిలదీయకుండా నిస్సిగ్గుగా అందులో బానిసలుగా కొనసాగుతున్న మా ఎస్సీ ఎస్టీ సోదరులకు (@Bhatti_Mallu@DamodarRajanar1 తో సహా) ఈ పోస్టు అంకితం.
జై భీం. జై తెలంగాణ.
We condemn the orders of @revanth_anumula’s @INCTelangana government which mandates that the dalit students clean their own toilets in welfare schools as they are not from ‘posh society’ in the name of civilising them.
These orders of an IAS Officer, Dr Alugu Varshini ji are utterly outrageous and reflect the manuvadi mindset of many in bureaucracy. She is even threatening the parents who question such ‘reformatory’ orders!!!
All these are happening under the very nose of @RahulGandhi ji who is talking of human dignity by holding the Constitution everyday and @kharge ji who claims he is a Dalit and is also the president of AICC.
@BRSparty@PTI_News@ANI@IASassociation@TelanganaCMO@TelanganaCS@ambedkariteIND@NationalDastak@TheBluePen25@DalitDastak@Murali_IASretd@KRajuINC@BRSHarish@KTRBRS
రేవంత్ రెడ్డి గారు,
మీరు గత @BRSparty@KCRBRSPresident గారి ప్రభుత్వంలో నేను గురుకుల అధికారిగా ఉన్నప్పటి కాలంలో అక్రమాలు జరిగాయన్న నెపంతో మీ ఆదేశాల మేరకు కొందరు అధికారులు ఇప్పుడు ఎన్ని ఆడిట్ పరిశోధనలు చేసి తవ్వకాలు జరిపినా మీకు కనిపించేవి పేద విద్యార్థుల విజయ గాథలు మాత్రమే. అంతకు మించి మీకేం దొరకదు. గాంధీ భవన్లో మీ లిల్లీపుట్ నాయకులు కొందరు మాట్లాడుతున్న చిల్లర మాటలు పేద వర్గాల పట్ల మీకున్న అక్కసును తెలియజేస్తున్నాయి.
తరతరాలుగా కొడవల్లు, చీపుర్లు తట్టలు పట్టిన చేతులు, కంప్యూటర్ చిప్ లతో ఆడుకోవడం, కోడింగ్ భాషను నేర్చుకోవడం అన్న గొప్ప కలను కని దాన్ని నిజం చేయాలంటే మొండి ధైర్యం కావాలి. ఈ వర్గాల పట్ల Empathy ఉండాలి. కేసీఆర్ గారికి ఇవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టే నేను ఈ కలను కాంతి వేగంతో నిజం చేసే ప్రయత్నం చేశాను.
మీ సంకుచిత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిమ్మల్ని గైడ్ చేస్తున్న కొందరు మనువాద అధికారులకు ఈ కలలు అర్థం కావాలంటే కనీసం కోటి సంవత్సరాలు పడుతుంది.
అందుకే మీరు మా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం పేరుతో టాయిలెట్ల భాష నేర్పిస్తామంటున్నారు, మేము మరో ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్ భాష నేర్పిస్తామంటున్నం.
మళ్లీ చెబుతున్నా, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే రాబోయే రోజుల్లో మునుపటి కంటే బాగా ఈ భవిష్యత్ భాష లను నేర్పిస్తాం. 👊
మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, మీ భాషలో- కోసుకొని తిన్నా, నేను నా పంథాను మార్చుకోను. మీరు పత్రికలకు ఇస్తున్న లీకులకు నిరాశపడను.
నేను చివరి వరకు అణచివేతకు గురైన వర్గాలను ఆకాశం అంచుల వైపు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటా.
Life is finite. Don’t waste it.
మీకొచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నా.
ధన్యవాదాలు.
@revanth_anumula@TelanganaCMO@BRSparty@KTRBRS
.@RSPraveenSwaero గారి గ్రే హౌండ్స్ అనుభవం వల్ల ఆయన సూచనల మేరకు ఆ రోజు నీ ప్రాణాలను కాపాడుకున్నావ్ @KRNagarajuTS . మీ యజమాని లాగా మీకు కూడా డ్రాయర్లు, పేగులు, బొందల గడ్డల పిచ్చి ఉన్నట్టుంది. ఆయన గుండు గురించి మాట్లాడే ముందు ఇప్పుడు బతికి ఉన్న నీ గుండెను అడిగి చూడు ఆయన గొప్ప దనం తెలుస్తుంది.
నేడు కడియం, కేకే గార్లు అకస్మాత్తుగా@BRSparty ను వీడటంతో నాకు కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నరు.
మరి కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరిండ్రు.
ప్రియమైన మిత్రులారా,
దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి.
నేను గొర్రెను కాను. కాలేను.
ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా
పార్టీని వీడను.👊
నేను గతంలో చేసిన బీయస్పీ-బీఆరెస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆరెస్ లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నవి. These were very conscious decisions.
మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదు.
నేను పుట్టి పెరిగిన సమాజం చాలా వేదనతో వెనకబడి ఉన్నది, వాళ్ల కోసం చట్ట సభల్లో ఒక గొంతుకగా బతికి, వాళ్ల జీవితాలను నా శక్తి మేరకు ‘సమూలంగా’ మార్చాలని నేను ప్రజా జీవితంలోకి వచ్చా.
ఇందులో భాగంగానే బహుజన వాదం, తెలంగాణ వాదం రెండూ కలవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని నేను నమ్మిన. తెలంగాణ ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఇంకా ఉందని నమ్మి, భారత రాజ్యాంగానికి ఫాసిస్టు శక్తుల వల్ల పొంచిఉన్న ప్రమాదాన్ని పసిగట్టి, అవిశ్రాంత,రాజీలేని పోరాటం నడిపి ప్రత్యేక రాష్ట్రం సాధించి, కొత్త తెలంగాణకు బలమైన పునాది వేసిన #KCR గారి నాయకత్వంలో నడుస్తున్న బలమైన @brsparty ని నేను వేదికగా ఎంచుకున్నా. ఇందులో నాకు గాని, నన్ను నమ్ముకున్న వర్గాలకు గాని ఎలాంటి సంశయం లేదు.
గెలుపుతో వచ్చే అధికార ఫలాలను అనుభవించినప్పుడు, ఓటమితో వచ్చే కష్టాలను కూడా భరించగలిగే వాడే నిజమైన పార్టీ నాయకుడు. ప్రతి దానికి భయపడే పిరికిపందలకు బీఆరెస్ లాంటి ఉద్యమ పార్టీల్లో స్థానం ఉండకూడదు.
దేశంలోను , రాష్ట్రంలోనూ అధికార పార్టీలు పోలీసు కేసులను, కట్టు కథలను, ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నేడు మన తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. దీన్ని ధైర్యంగా మనం సర్వశక్తులొడ్డి అధిగమించిన నాడే దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది.
అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా క్షమించరాని నేరానికి పాల్పడితే వారి మీద తప్పకుండా చట్ట ప్రకారం చర్యతీసుకోవలసిందే. ఆ విషయంలో పోలీసు ల డ్యూటీని ఎవరూ కాదనరు.
కానీ పోలీసు కేసులనే గోరంతలు కొండంతలుగా చూపించి, వాస్తవాలను వక్రీకరించి, సోషల్ మీడియా వేదికగా, అసభ్యకరమైన శీర్షికలతో (Thumbnails) రాజకీయ ప్రత్యర్థుల మీద జరుగుతున్న కుట్రపూరిత దాడులను మనం అందరం తిప్పికొట్టాల్సిందే.
#BRS సైనికులకు ఒక విజ్ఞప్తి:
ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదు. అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దాం👊
పదండి ముందుకు..
పదండి తోసుకు..
పోదాం పోదాం పైపైకి…
కదం తొక్కుతూ, పదం పాడుతూ
హృదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం పైపైకి..✊
జై భీం…జై తెలంగాణ🙏
@KTRBRS