ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
•సూత్రధారుల్ని వదలవద్దు
•అటవీ సంపద పరిరక్షణ చర్యల్లో రాజీపడేది లేదు
•కూటమి పాలనలో 70 శాతం తగ్గిన ఎర్రచందనం స్మగ్లింగ్
• ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశం
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని, స్మగ్లింగ్ ముఠాల వెనక ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం, బొందలవాడ గ్రామ పొలిమేరలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో రూ. 2 కోట్ల విలువ చేసే 109 దుంగలు పట్టుబడ్డ విషయాన్ని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నల్లాని నందకుమార్ అనే వ్యక్తితోపాటు మరో ఇద్దరిని టాస్క్ ఫోర్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అసలైన సూత్రధారి ఆచూకీ తెలుసుకొని చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘స్మగ్లింగ్ నిరోధానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా గడచిన రెండేళ్లలో ఎర్ర చందనం అక్రమ రవాణాలో 70 శాతం తగ్గుదల నమోదయింది. అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన వారిలో సుమారు 90 శాతం పైగా శిక్షలు పడుతుండడం కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దు దాటకుండా ఉండేందుకు టాస్క్ ఫోర్స్ సాయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అంతర్రాష్ట్ర సమన్వయంతో అక్రమ రవాణా నెట్వర్క్ లను ఛేదించే చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామ’న్నారు. అనంతపురం జిల్లాలో అక్రమ రవాణా ముఠా కదలికలను గుర్తించి, పక్కా సమాచారంతో దాడి చేసి స్మగ్లర్ల ఆటకట్టించిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ ఆపరేషన్ లో ఆర్.ఎస్.ఐ. శ్రీ మురళీధర్ రెడ్డి బృందం పాల్గొన్నట్లు అధికారులు వివరించారు. ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు నేతృత్వంలో, ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ శ్రీ పి. శ్రీనివాస్, అడిషల్ ఎస్పీ శ్రీ కులశేఖర్, ఎసీఎఫ్ శ్రీ జె శ్రీనివాస్, డీఎస్పీ శ్రీ వి. శ్రీనివాస్ రెడ్డి, అనంతపురం డీఎఫ్ఓ శ్రీ చక్రపాలి ఆధ్వర్వంలో రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ నిరోధక చర్యలను అధికారులు వివరించారు.
- ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం
YSRCP took a U turn on its poll promise within a week.
Pawan Kalyan delivered on a long pending CPS promise.
The difference between a leader and politician 👌🙏
#PawanKalyan#JokerJagan#JSPWorks
His has a Pet Anamata Annapudu #Dragon ni Pettav Em Plan Chesthunvo Mundhe Chappeseyi @Sujeethsign Na Shavam Intlo Icheyyamani Chapptha 😭🔥🥵
#OGUniverse#OG2