రేవంత్ రెడ్డికి మాటలే ఎక్కువ… చేతలు తక్కువ.
తన దగ్గరే పెట్టుకున్న హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ - అన్ని శాఖల్లో ఫెయిల్.
ఢిల్లీకి సంచులు మోసి, కుర్చీ కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్.
- @BRSHarish అన్న
వానాకాలం రైతుబంధు వేస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారు.. మరి యాసంగి మీ తాత ఇస్తాడా?
ఇవాళ్టికి రూ.30 వేల కోట్లు మీరు తెలంగాణ రైతులకి బాకీ ఉన్నారు!
ప్రభుత్వం నాటకాలు ఆపి, రైతులకు చెల్లించాల్సిన ప్రతి రూపాయిని వెంటనే జమ చేయాలి!
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS గారు
The complaint filed against the victim by the accused in this POCSO case is now circulating widely on social media precisely because the administration and society are treating it as a "special case" due to the involvement of Union Minister Bandi Sanjay Kumar’s family. This selective approach has led to the constitution of an SIT, which is turning out to be pure SHIT.
Worse, the victim’s identity has already been revealed publicly, directly violating the core protections under the POCSO Act.
POCSO cases must be handled uniformly, irrespective of the accused’s political connections or family background. SITs have been formed in several other POCSO cases (such as Ghaziabad, Gurugram, and others) only when there were clear delays, lapses, or proven reluctance by the local police — often on court directions. No such widespread demand or judicial finding of investigative failure existed at the initial stage here.
Yet an SIT was constituted solely because a central minister’s family is involved. If there was no initial public or judicial demand for a special team, why create one now? Treating this matter differently undermines the seriousness of all other POCSO cases. It defeats the core purpose of the Act — equal protection and swift justice for every child victim, regardless of the accused’s influence.
The very formation of the SIT in this case signals selective handling rather than impartial justice. When even the victim’s identity is no longer protected, the entire system stands compromised.
Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage
I personally am strictly against drugs and usage of illicit substances.
My party BRS condemns usage of drugs and any illegal activities. Any one using and peddling drugs should be strictly punished as per the law irrespective of their political affiliation
Having said that, I vehemently condemn the way BRS party is being dragged into this highly deplorable situation. Using the drug case to settle scores with BRS is a reflection of your disgusting politics
I have already repeated several times that am ready for any test. I welcome Mahesh Kumar Goud’s suggestion that public representatives from all political parties should take this test. Let’s lead by example
I also hereby warn strongly that dragging my name into any and every drug case will be responded with legal notices
బ్రేకింగ్ న్యూస్
ఇకపై బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సమావేశాలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదు.
ABN టీవీ ఛానల్ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్న రాదని నిర్ణయించిన పార్టీ అధిష్టానం..
కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమై, 90% పైగా పనులు పూర్తిచేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవ్వాళ ప్రారంభం కావడం సంతోషదాయకం:
💧చనాక కొరాట బరాజ్:
👉🏽 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యింది.
👉🏽 దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపొనెంట్‌తో కలిపి, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
👉🏽 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది
💧సదర్మాట్ బరాజ్:
👉🏽 దీని నీటి నిల్వ సార్ధ్యం 1.58 టీఎంసీలు
👉🏽 కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయ్యింది
👉🏽 నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది.
కేసీఆర్ పాలనలో #తెలంగాణదశాబ్ది (2014-2023), నెర్రెలుబారిన ఈ నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చింది
జై తెలంగాణ
#TelanganaDecade
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సీఓడీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు.
ఈ విజయం కోసం కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు.
కేసీఆర్ గారి ముందు చూపుకు, దార్శనికతకు 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విజయగాథ నిదర్శనం.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతి పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే కావటం గొప్ప విషయం.
అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా నిలిపి, రాష్టంలో వెలుగు జిలుగులు నింపిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది.
కేసీఆర్ గారు ఆనవాళ్లను తుడిచేస్తామంటూ అడ్డగోలుగా నోరు పారేసుకునే నేతలకు చెబుతున్నా..
తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చేసిన మరో చెరగని సంతకం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. దీన్ని తుడిచేయలేరు, చెరిపేయలేరు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని కారు కూతలు కూసినా భవిష్యత్ తెలంగాణకు దారి దీపం యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్
రాబోయే కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రంలోని ప్రజల, రైతుల విద్యుత్ అవసరాలను తీర్చడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది.
కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే కురచ బుద్ధిని, కుళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి.. రాష్ట్ర రైతాంగం, తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో మిగిలిన రెండు యూనిట్లను త్వరితగతిన పూర్తి చేసి, కమర్షియల్ ఆపరేషన్ లోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం.
కేసీఆర్ పాలనలో
యూరియా కోసం కుస్తీ లేదు..
విత్తనాల కోసం పోటీ లేదు..
కరెంటు కష్టాలు లేవు..
క్రాప్ హాలిడేలు లేవు.
కానీ ఈ దద్దమ్మ కాంగ్రెస్ పాలనలో
ఒక్క బస్తా యూరియా కోసం లైన్లలో కుస్తీలు..
క్రాప్ హాలిడేలు ప్రకటించే దుస్థితి వచ్చింది!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
✴️ శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్కు కూడా అవకాశం ఇవ్వాలి
✴️ నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు ఉపన్యాసాలు ఇస్తారా?
✴️ మేము మీ దగ్గర ఏమి నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో వివరిస్తారా?
✴️ కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో చెప్పబోతున్నారా?
✴️ రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా?
✴️ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా?
✴️ సభలో సమాన హక్కులు ఇవ్వండి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం కల్పించాలి
✴️ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్‌కాట్ చేసింది
✴️ ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆనాడు కాంగ్రెస్ ఆరోపించింది
✴️ తెలంగాణ భవన్లో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔸శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా అదే అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
🔸తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.
🔸మేము అడిగింది చాలా సింపుల్, “మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతాం. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నాం.
🔸మేము ప్రధాన ప్రతిపక్షం. గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.
🔸గతంలో 2016 మార్చి 31న కేసీఆర్ గారు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని బాయ్‌కాట్ చేసి, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
🔸“అప్పుడు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారింది?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్ గారికి లేఖ కూడా ఇచ్చామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని తెలిపారు.
🔸నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
🔸స్వాతంత్ర్య దినోత్సవం నాడు భాక్రా నంగల్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
🔸దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్లో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రి గారితో గోదావరి–కృష్ణా జలాలపై ఈరోజు చర్చ చేయాలా? అని ప్రశ్నించారు.
🔸కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో చోటుచేసుకున్న వైఫల్యాలను కేటీఆర్ వివరించారు.
🔸శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.
🔸సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ, ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
🔸వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇది అని కేటీఆర్ ఆరోపించారు.
🔸“మేము మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్లో చూపిస్తారా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
🔸పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.
🔸ముఖ్యమంత్రి గారు తరచూ “పండబెట్టి తొక్కుతాం” అంటారని, నిజంగానే ఆ పథకాన్ని పండుకోబెట్టి, తెలంగాణ రైతాంగాన్ని – ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔸రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. “ఏం చేశారని మీరు ప్రజల ముందు చెప్పుకుంటారు?” అని నిలదీశారు.
🔸పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి విస్తరణ ద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్లామని, ఆ నిజాలను శాసనసభలో వివరించేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
🔸ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం అయితే, ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈరోజు రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారు.
అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి.
నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారు.
బేసిన్ల పై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది బహిరంగ సత్యం. ఇవాళ కొత్తగా తెలిసింది, ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని వెల్లడైంది.
పాపం కీర్తిశేషులైన బచావత్ గారు ఏ లోకంలో ఉన్నారో కానీ, ముఖ్యమంత్రిగా మీరు ప్రదర్శిస్తున్న అజ్ఞానాన్ని చూసి ఎంత మదన పడుతున్నారో.
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంతు నైజం.
సభకు వస్తే కేసీఆర్ ను అవమానించం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారిని కసబ్ తో పోల్చుతావా?
తెలంగాణ పోరాటాన్ని ఉరకలెత్తించి, నాలుగు కోట్ల ప్రజలను ఒక్కటి చేసి ప్రాణాలకు తెగించి నిరాహారదీక్ష చేసి నీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహనీయుడిని కసబ్ తో పోల్చిన నీకు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు.
నీకు తెలిసిందళ్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం.
కేసీఆర్ గారిని, నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యానాలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా నటిస్తావా?
ఆవు తోలు కప్పుకున్న తోడేలువు నువ్వు
బీటింగ్ అరౌండ్ ద బుష్ అన్నట్లు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడినవు తప్ప, పోలవరం నల్లమలసాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఎందుకు?
నువ్వు గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే, ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయినవు, కమిటీ ఎందుకు వేసినవు, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచినవు?
కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరికైనా అర్థం అవుతది.
కృష్ణాలో 763 టిఎంసీలు నువ్వు అడుగుతుంటే కేసీఆర్ 299 టిఎంసీలకు ఒప్పుకున్నాడని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అబద్దాలాడినవు.
కేసీఆర్ గారు 299కి ఒప్పుకున్నది నిజం అయితే, మొత్తం 811 టిఎంసీలు పున:పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాసారు?
ఈరోజు నువ్వు కొత్తగా 71శాతం వాటా తెలంగాణకు రావాలని మాట్లాడినవు, ఆనాడే కేసీఆర్ గారు 811 టిఎంసీల్లో 69శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసిన విషయం నీకు తెలియదా?
(కాపీ Enclosed)
కేంద్రం స్పందిస్తే సుప్రీంకు ఎందుకు వెళ్తారు?
బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని ఎందుకు 28 లేఖలు రాస్తారు?
రెండు అపెక్స్ మీటింగ్స్ లో కేంద్రాన్ని ఎందుకు నిలదీస్తారు?
అపెక్స్ లో మీటింగ్ మినట్స్ పంపిస్తున్నా కళ్లు పెద్దవి చేసి చదువుకో రేవంత్ రెడ్డి?
(మినట్స్ కాపీ Enclosed)
ముందు నుంచి చదువుకుంటవో, వెనుక నుంచి చదువుకుంటవో, అడ్డంగా చదువుకుంటవో, నిలువుగా చదువుకుంటవో, చిన్నప్పుడు చదివినట్లు చదువుకుంటువో నీ ఇష్టం ఉన్నట్లు చదువుకో.
సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున: పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామి మేరకు కేసు విత్ డ్రా చేసుకున్న సంగతి నీకు తెల్వదా?
ఎందుకు ఈ నిజాన్ని దాచి పెట్టి గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతున్నావు?
తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేసారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున: పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు చేసిన మహనీయుడు కేసీఆర్.
ఆయనను విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే.
అన్ని నదుల నీళ్లు జూరాలకే వస్తాయి, కొత్తగా శ్రీశైలంకు వచ్చేది ఏందని అతి తెలివితో అజ్నానంతో మాట్లాడినవు.
తుంగభద్ర అనే నది ఉందని నీకు తెలుసా. ఆ నది ద్వారా 450-600 టిఎంసీలు ప్రతి సంవత్సరం శ్రీశైలంకు వస్తాయనే కనీస జ్ఞానం నీకు లేకపాయె.
ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50లక్షల ఎకరాల ఆయకట్టుకు మీ ప్రభుత్వమే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించింది?
అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నది మీ ప్రభుత్వమే కదా?
జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసు
ఇంక దాని మీద పాలమూరు రంగారెడ్డి భారం కూడా పెడితే ఎవరికి నీళ్లు రాక అందరూ ఆగం అయిపోరా?
పాలమూరు రంగారెడ్డి మీద ఎన్జీటీలో ప్రబుద్దుడు ఒకడు కేసులు వేసిండు అన్నవు, ఆ ప్రబుద్దుడిని పురమాయించింది నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా?
అయినా పాలమూరుకు 90 టీఎంసీలకు డిపిఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బిఆర్ఎస్, కేసీఆర్.
మీరు వచ్చిన రెండేళ్ల ఒక నెలలో ఒక్క అనుమతి తెచ్చింది లేదు, డిపీఆర్ వెనక్కి వచ్చేలా చేసారు.
ఇదీ నీ సమర్థత, నీ గొప్పతనం. @revanth_anumula
#CongressFailedTelangana
వరంగల్ ఎనుమాముల మార్కెట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
పత్తి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న హరీష్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు
రైతన్న కంట నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం
ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడంలేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న
ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు
దాదాపు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టిన, ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు
దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి
ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకుని నా పంటను, నా ఒంటిని తగలబెట్టుకుంటా - అదిలాబాద్ రైతు
ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారు.
కళ్ల ముందే పండించిన పత్తి ఈ చలికాలపు తేమకు పాడవుతోంటే ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో మొద్దు నిద్ర నటిస్తున్నాయి.
నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేశారంటేనే రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ళ సంక్షోభానికి అద్దం పడుతోంది.
తేమశాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడింగ్ అంటూ కుంటి సాకులతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి కొనుగోలు నిరాకరిస్తుంటే, దానికి జిన్నింగ్ మిల్లుల అవినీతి తోడై రైతన్న నడ్డి విరుస్తున్నది. మద్ధతు ధర దొరకక, మధ్య దళారులకు తెగనమ్ముకుని నష్టాల పాలవుతున్నారు రైతులు.
రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ బిజెపి, ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలుకు కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను.
ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి మార్గమధ్యలో ఎమ్మెల్యే @drsanjayBRS ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా, కోరుట్ల నియోజకవర్గం, మెట్ పల్లిలో… నిజామాబాద్ జిల్లా కమరపల్లిలో మాజీ మంత్రి @VPR_BRS ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
దివాలా తీసిన కేసు గురించి సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కుంటున్న KLSR INFRATECH అనే సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వ కాంట్రాక్టులు ఎందుకు ఇస్తుంది?
తమిళనాడు రాష్ట్రంలో ఒక జడ్జిని బెదిరిస్తున్నారని, ఈ సంస్థ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది
ఇన్ని ఆరోపణలు ఉన్న నెల్లూరుకు చెందిన ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎందుకు?
ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అని ఈడీ గతంలో ప్రకటన చేసినా కూడా చర్యలు ఎందుకు లేవు ? – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్