⚠️ వర్షాల ప్రభావంతో పాల్వంచ వాగు ప్రవహిస్తోంది.
దీంతో అప్పర్ మానేరు డ్యాంకు నీటి రాక కొనసాగుతోంది.
ప్రస్తుతం డ్యాం నీటి మట్టం రీల్ లో చూపిన విధంగా ఉంది👇💧
Date :29 July 2026
Time : 6pm
#update#uppermanairdam😍 #moonsoonvibes☔️
Dear Collector Madam, Upper Manair Dam is a popular tourist spot, loved by all ages for its history and scenic views. However, it's missing from the district's official tourism website. Kindly look into this and take necessary action. 🙏 #Tourism#UpperManairDam@Collector_RSL
పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
రైతులు, ప్రజలు, మత్స్యకారులు జాగ్రతగా ఉండాలి
గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన
-------------------------------
గంభీరావుపేట, సెప్టెంబర్ - 02
-------------------------------
భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో గంభీరావుపేట మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ పరికరాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. నర్మాల నుంచి లింగన్నపేట వెళ్లే రహదారి మొత్తం వరదలకు పాడైంది. రహదారులు, మిషన్ భగీరథ పైప్ లైన్లు, విద్యుత్ పరికరాలకు వెంటనే మరమ్మతు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసి నీటి, విద్యుత్ లైన్ లను పునరుద్ధరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వర్షాలు తగ్గే వరకూ పశువుల కాపరులు నీటి ప్రవాహం ప్రదేశాలకు జీవాలను తీసుకువెళ్ళవద్దని సూచించారు. రైతులు, ప్రజలు, మత్స్యకారులు వరద ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇక్కడ గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసిల్దార్, ఎంపీడీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 5 లక్షల చెక్కు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వరదలో మృతి చెందిన పశువుల యజమానులకు రూ. లక్ష 50 వేల పరిహారం చెక్కుల పంపిణీ
------------------------------------
గంభీరావుపేట, సెప్టెంబర్ - 02
------------------------------------
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులను పంపిణీ చేసింది.
ఆర్ధిక సహాయం అందించి.. భరోసా కల్పించి..
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద పంపుకాడి నాగయ్య మానేరు దాటుతూ గల్లంతు అయ్యారు. ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఇప్పటికే వెతుకుతున్నారు. ఈ సందర్భంగా పంపుకాడి నాగయ్య భార్య లక్ష్మీకి రూ. ఐదు లక్షల విలువైన చెక్కును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం అందజేశారు.
పశువుల యజమానులకు...
గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన గడ్డమీది మణెమ్మకు చెందిన రెండు పశువులు, ప్రవీణ్ గౌడ్ కు చెందిన ఒక పశువు వరదలో గల్లంతు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం చెక్కులు గడ్డమీది మణెమ్మకు రూ. లక్ష, ప్రవీణ్ గౌడ్ కు రూ. 50 వేల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ సిరిసిల్ల ఆర్డిఓ వెంకటేశ్వర్లు జిల్లా పశువుల సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి తాసిల్దార్ ఎంపీడీవో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రెండు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆర్మీ అధికారులు,ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.
@TelanganaCOPs
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటగ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా #DDRF+#SDRF తక్షణమే స్పందించి సురక్షితంగా రక్షించారు.
@TelanganaCOPs
*ఫ్లాష్.... ఫ్లాష్..... న్యూస్....*
కలెక్టర్, ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించి
ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం
కేంద్ర హోం శాఖ సహయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యవేక్షణ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు
----------------------------
గంభీరావుపేట, ఆగస్టు - 28
---------------------------
గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని దగ్గరుండి పర్యవేక్షించి.. క్షేమంగా తరలించారు. ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి, వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, మరో ఇద్దరు బిసే ప్రదీప్,
బిసే ఛాయా అక్కడే చిక్కుకుపోగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయం కల్పించారు.
ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా..
ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు.
ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేరుకొని క్షేమంగా చేరుకున్న వారిని పరామర్శించారు.
క్షేమంగా ఇంటికి..
ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే అక్కడికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. లింగన్నపేట లో వాగులో చిక్కుకుపోయిన ప్రవీణ్ ను క్షేమంగా ఒడ్డుకు చేర్చే వరకు కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి పర్యవేక్షించి.. ఎన్డీఆర్ ఎఫ్ బృందానికి సలహాలు సూచనలు అందించారు. గురువారం ఉదయమే మళ్లీ ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, ఎగువ నుంచి ఎంత వస్తుందని ఆరా తీస్తూ.. ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారికి మనోధైర్యం కల్పించారు. ఏడుగురు క్షేమంగా గమ్యం చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన విషయం తెలిసి దగ్గరుండి అందరిని క్షేమంగా తరలించడంలో విశేష కృషి చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని, వారికి అధికార యంత్రాంగాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.
మానేరులో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీం
ఐదు శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
-------------------------------
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు - 29
-------------------------------
ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనిపెట్టేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రత్యేక సెర్చింగ్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎగువ మానేరు వద్ద వాగును దాటుతున్న క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య బుధవారం గల్లంతు అయ్యారు.
ఆయన ఆచూకీ కనిపెట్టేందుకు రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, నీటి పారుదల, మత్స్య శాఖ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎగువ మానేరు ప్రవహించే మండలాల్లోని చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు, కల్వర్టులు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేయాలని సూచించారు.
నర్మాల నుంచి గంభీరావుపేట వరకు, గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు, మల్లారెడ్డిపేట నుంచి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వరకు, వెంకటాపూర్ నుంచి సిరిసిల్ల వరకు, సిరిసిల్ల నుంచి మధ్య మానేరు రిజర్వాయర్ వరకు వెతకాలని ఒక్కో ప్రాంతానికి ఐదుగురితో కలిపి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ సభ్యులు వెంటనే తమ విధి నిర్వహణను మొదలు పెట్టాలని ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా పల్వంచ వాగు : చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పల్వంచ వాగు ఇంత ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ వరద అప్పర్ మానేరు కి చేరుతుంది , ఆందోళన చెందకండి జాగ్రత్తగా ఉండండి వీలైనంతమట్టుకు సందర్శించడానికి మరియు ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేయకండి
@balaji25_t
Spoke to Swami, one of the five persons trapped in Upper Maneru near Gambhiraopet, Sircilla in Floods
Assured full support and asked them not to panic. Directed officials to provide food. @Collector_RSL Garu is on-site monitoring rescue efforts.
Kamareddy Floods
కామారెడ్డిలో కురిసిన కుండపోత వర్షాలకు.. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టుకు భారీగా వరద
రెండు TMCల సామర్థ్యం గల నర్మాల ప్రాజెక్ట్ నిండటంతో.. అలుగు పారుతున్న ఎగువ మానేర్
దీంతో మిడ్ మానేర్‌కు భారీగా వరద.. ఆరు గేట్లు ఎత్తి LMDకి 10 వేల క్యూసెక్కుల నీరు రిలీజ్
మిడ్ మానేరు నుంచి.. అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ 9600 క్యూసెక్కుల నీటిని తరలింపు
ప్రస్తుతం మిడ్ మానేర్‌కు ఇన్‌ఫ్లో 23,500 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 19,715 క్యూసెక్కులు
#Kamareddy #KamareddyFloods #NarmalaProject #MidManeru #TelanganaFloods #Telangana