జనసేన శ్రేణులకు సూచన
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం కేంద్ర కార్యాలయానికి సంప్రదించగలరు. నామినేషన్ సందర్భంగా ఎదురయ్యే అడ్డంకులు(రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లే సమయంలో ఎవరైనా అడ్డుకున్నా, నామినేషన్ పత్రాలు స్వీకరించకున్నా, మరే ఇతర సమస్యలు) వచ్చినా వంటనే కింద నంబర్లకు సంప్రదించి సహాయం తీసుకోగలరు. నామినేషన్ పత్రాల్లో ఎవైనా తప్పులు ఉంటే గుర్తించి సరిచేసుకోమని చెప్పడం రిటర్నింగ్ అధికారి బాధ్యత. ఆ బాధ్యత సవ్యంగా నిర్వర్తించకుండా నామినేషన్లు తిరస్కరించడం, అలాంటి సమస్యలతో పాటు చిన్న చిన్న తప్పిదాలను సాకుగా చూపి నామినేషన్లు తిరస్కరించడం వంటి సమస్యలున్నా వెంటనే కింది నంబర్లకు సమాచారం ఇచ్చి సహాయం పొందగలరు.
సంప్రదించవలసిన నంబర్లు : 9247506895, 8978163111
@DpPoojian ha ha pk chesina rural development e country lo evadu cheyaledu ra just 2yrs lo AAtha ga , AAthu telidu ,huku telidu meku endhuku ra politics gurinchi
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు మరియు జనసేన నాయకులపై రాష్రంలోని వివిధ ప్రాంతాలలో దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈవిధమైన దాడులు చాలా గర్హనీయం, దాడి చేసిన వారు ఎవ్వరైనాగానీ, వారి మీద పోలీసులు తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తునాము. ప్రజాస్వామ్యంలో హింసాయుతమైన చర్యలకు తావులేదు, కావున ఎలక్షన్ కమీషన్ శాంతియుత వాతావరణములో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపవలెనని డిమాండ్ చేస్తున్నాము. అలగే అన్ని రాజకీయ పక్షాలు దీనికి సహకరించవలెనని కోరుతున్నాము.
@pawankalyan@NagaBabuOffl@itsRamTalluri@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila@CEOAndhra@Anitha_TDP
జనసేన నాయకులకు, జనసైనికులకు విజ్ఞప్తి.
కూటమి తరఫున పోటీ చేసే స్థానాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడనందున, ప్రతి MPTC, ZPTC స్థానంలో జనసేన నాయకులు, జనసైనికులు నామినేషన్లు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, మనకు బలమున్న స్థానాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్త అవసరం.
కాబట్టి, ఏ స్థానాన్నీ వదలకుండా బలమున్న ప్రతి MPTC, ZPTC స్థానాల్లో నామినేషన్లు వేయాలని ప్రతి జనసేన నాయకుడికి, జనసైనికుడికి మనవి చేస్తున్నాము.
జై జనసేన✊
@JanaSenaParty@PawanKalyan
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం
* వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి
* ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది.
*ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి.
(నాదెండ్ల మనోహర్)
చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ నాయకుడు దిన్నదేవరపాడు గ్రామం నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్లి అంబేద్కర్ భవన్ నుండి బయటికి వచ్చిన లక్ష్మన్న పై తెలుగుదేశం నాయకుల దాడి తీవ్ర గాయాలతో పోలీసువారి మధ్యలో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న చాకలి లక్ష్మన్న..
జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన సమస్యలు, ఇతర ఎన్నికల న్యాయపరమైన అంశాలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించగలరు.
న్యాయ సహాయ హెల్ప్‌లైన్:
+91 92475 06895
ఎన్నికల ప్రక్రియలో సకాలంలో న్యాయ సహాయం పొందేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోండి.
జై జనసేన! ✊
#APlocalbodyelections2026
JANASENA PARTY | IMPORTANT ANNOUNCEMENT
Local Body Elections Central Legal Coordinating Committee
All JanaSena Party candidates filing nominations, party leaders, cadre and other JanaSainiks are requested to contact the Central Legal Coordinating Committee for legal assistance and guidance regarding nomination-related issues or any other election-related legal matters.
For any legal issue or assistance, please contact:
📞 +91 92475 06895
జనసేన నాయకులకు, జనసైనికులకు విజ్ఞప్తి
MPTC, ZPTC స్థానాలకు అన్ని చోట్లా నామినేషన్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి నిర్ణయంలో భాగంగా పోటీ చేసే స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. ఏ స్థానాలు మనకు కేటాయిస్తారో ముందుగా తెలియదు. కాబట్టి మనకు అనుకూలమైన స్థానాల్లో నామినేషన్లు లేకపోతే చివరి సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందువల్ల, ఏ స్థానాన్నీ వదలకుండా అన్ని MPTC, ZPTC స్థానాల్లో నామినేషన్లు వేయాలని జనసేన నాయకులకు, జనసైనికులకు మనవి చేస్తున్నాము.
@JanaSenaParty@PawanKalyan
JANASENA PARTY | IMPORTANT ANNOUNCEMENT
Local Body Elections Central Legal Coordinating Committee
All JanaSena Party candidates filing nominations, party leaders, cadre and other JanaSainiks are requested to contact the Central Legal Coordinating Committee for legal assistance and guidance regarding nomination-related issues or any other election-related legal matters.
For any legal issue or assistance, please contact:
📞 +91 92475 06895
కళ్యాణ్ గారు సెక్యూరిటీ కూడా లేకుండా వెళ్లి చంద్రబాబుతో జరుగుతున్న పరిణామాలపైన నిలదీస్తే
తమ్ముళ్లు మొత్తం ఇంకా ఫోటోలు రాకుండానే, జనసేన నుంచి పోస్ట్ రాకుండానే, అర్ధరాత్రి వీళ్ళు చేసిన ఉమ్మడి ప్రకటన జనసేన చేయకుండానే
పాత వీడియో వేసి అంత బావుంది అని డ్యామేజ్ కంట్రోల్ చేయడం 🤡🤣