This morning at Vijayawada Rythu Bazaar, our NDA Government launched onion sales at ₹35 per kg to ease the burden on households.
Each family can buy up to 2 kg a month with Aadhaar or ration card. Grateful to the Government of India @narendramodi ji, @JoshiPralhad ji and @Nccf_India for their support.
Under the guidance of Hon’ble CM and Hon’ble Deputy CM garu, we will extend this facility in 115 Rythu bazaars across the State.
@ncbn@PawanKalyan
పల్లె పండుగ - రాష్ట్ర ప్రగతికి అండగా..
పల్లె పండుగ, పల్లె పండుగ 2.0 ఇచ్చిన సత్ఫలితాలకు కొనసాగింపుగా పల్లె పండుగ 3.0..
గ్రామీణ మౌలిక వసతులు, రైతు సంక్షేమం, పారిశుధ్యం, ఉద్యాన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ 11,085 కోట్లతో పల్లె పండుగ 3.0..
#PallePanduga#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#PawanKalyanMarkGovernance
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీ వై. శ్రీనివాస్, రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్పాలెంకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సుందరీకరణ పనులు పూర్తయిన మైసమ్మ చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఆధునీకరించిన ఎఫ్.కె.పాలెం చెరువుని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/8e3pCfqOzG
తెలుగు సాహిత్యంలో విప్లవం తీసుకొచ్చిన మహాకవి గురజాడ అప్పారావు.
బాల్య వివాహాలు, వృద్ధ వివాహాలు, వేశ్యా వ్యవస్థ వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపిన విప్లవాత్మక, అభ్యుదయ సాహిత్యకారుడు శ్రీ గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.
#GurajadaApparao
ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు
•ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో మారుతున్న గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు
•పిఠాపురం నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ
•ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును మోడల్‌గా తీర్చిదిద్దిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్క్, జెండా స్థూపం, గ్రీనింగ్ ఏర్పాటు
•రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ
పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు.
పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం మైసమ్మ చెరువును సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన గ్యాలరీని సందర్శించారు.
అనంతరం చెరువు గట్టు వెంబడి వాకింగ్ చేస్తూ, అక్కడ ఉన్న భారీ వృక్షాల వయసు, కొన్ని వృక్షాల శాస్త్రీయ నామం తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని తెలిపారు.
*చిన్నారులతో కలసి చిల్డ్రన్ పార్కు ప్రారంభోత్సవం*
మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు పరిసరాలను పచ్చటి మొక్కలతో అభివృద్ధి చేసి, గట్టును బలోపేతం చేశారు. అనంతరం గట్టుపై వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా వ్యాయామం చేసుకునేలా ఓపెన్ ఎయిర్ జిమ్‌ను, జాతీయ భావన పెంపొందించేలా జెండా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. చెరువు కుడి వైపున పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్కును చిన్నారులతో కలసి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కులో ఆడుకుంటున్న చిన్నారులకు తినుబండారాలు, చాక్లెట్లు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు మోడల్ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
•మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు
అంతకుముందు ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువు ప్రారంభోత్సవానికి ముందు గట్టుపై ఉన్న ఆలయంలో శ్రీ మైసమ్మ అమ్మవారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు మధ్య భాగానికి వచ్చే విధంగా నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఫకృద్ధీన్ పాలెంలోని వినాయకుడి గుడిని సందర్శించారు.
గ్రామస్తులతో మమేకం అవుతూ... గ్రామంలో సౌకర్యాల పరిశీలన*
చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా పలుకరించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం విడివిడిగా ఏర్పాటు చేసిన కుండీలు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులను పలుకరించి ఫొటోలు దిగారు.
పచ్చదనం పరిమళం.. పీఠికాపుర వనం ఆవిష్కారం
•నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
•కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద రూ. 1.83 కోట్లతో నిర్మాణం
•ఆహ్లాదం, ఆధ్యాత్మికతల కలబోతగా పిఠాపురం నగర వనం
•ప్రత్యేక ఆకర్షణగా నక్షత్ర వనం, శివ పంచాయతన వనం
•70 సెంట్ల విస్తీర్ణంలో మియావకీ ప్లాంటేషన్‌ను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
• ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 నగరవనాలు ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురం పట్టణ, నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంతోపాటు, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ‘పీఠికాపుర వనం’ నగర వనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నగర వనంలో మొక్క నాటి, పీఠికాపురవన ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ. 1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగరవనం పిఠాపురం పట్టణానికి సరికొత్త హరిత సొబగులను అద్దింది. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ప్రాంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో నేడు పచ్చదనపు పరిమళాలు వెదజల్లుతూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే నగరవనంగా మారింది.
పిఠాపురంకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరవనంలో ఆహ్లాదం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా తీర్చిదిద్దారు. అందులో ముఖ్యంగా నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ రెండింటి ప్రాధాన్యతను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటగా, ప్రతి మొక్కను ఉప ముఖ్యమంత్రివర్యులు ఆసక్తిగా తిలకించారు. శివ స్వరూపమైన మారేడుతో పాటు వినాయకుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యభగవానుడి స్వరూపాలైన మొక్కలను శివ పంచాయతనంగా ఏర్పాటు చేశారు. కార్తీక మాసంతోపాటు ప్రత్యేక దినాల్లో ఈ మొక్కలకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఆయా దేవతల ప్రదక్షిణ పుణ్యం ప్రాప్తిస్తుందని వివరించారు. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు.
అనంతరం 70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనును ఉప ముఖ్యమంత్రివర్యులు తిలకించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచుతూ వేగంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేసే విధంగా మియావకీ పద్ధతిలో చిట్టడవిని నాటారు. బాక్స్ క్రికెట్, ప్లే కోర్ట్స్ లాంటి మరిన్ని ఆకర్షణలు నగరవనానికి జోడించనున్నారు. పిఠాపురం ప్రజలతోపాటు ఆధ్యాత్మిక సందర్శనార్థం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మరింత సర్వాంగ సుందరంగా నగర వనాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గతంలో డంపింగ్ యార్డుగా ఉన్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండేది? దాన్ని ఎంత కష్టపడి నగరవనంగా తీర్చిదిద్దారో వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిలకించారు. ఈ సందర్భంగా పీఠికాపుర వనాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో నగర వనాలు అభివృద్ధి చేస్తున్నారు. రూ. 36 కోట్లతో ఏర్పాటు చేసిన 18 నగర వనాలను ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, కౌడా ఛైర్మన్ శ్రీ తలాటం సత్య, రాష్ట్ర అటవీ శాఖ ఐటీ సలహాదారు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు, పడా పీడీ శ్రీ శివరాం ప్రసాద్, సీసీఎఫ్ శ్రీమతి జ్యోతి, కాకినాడ డీఎఫ్ఓ శ్రీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
Sep - 9 2023 ❤️🔥 On Sep 9th, 2023, Chandrababu Naidu was arrested by the Andhra Pradesh CID in the Skill Development Corporation case. Pawan Kalyan strongly condemned the arrest and decided to travel from Hyderabad toward Vijayawada.
సరసమైన ధరల్లో నిత్యావసరాలు!
కూటమి ప్రభుత్వం ప్రజల వంటింటికి ఊరట!
“కిలో ఉల్లి రూ.32కే”
వచ్చే వారం నుంచి 115 రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా రాయితీ ధరకే విక్రయాలు.
చౌకడిపోల్లో రాయితీపై
కందిపప్పు, పామాయిల్ కూడా అందుబాటులోకి.
బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.
కేంద్ర సహకారానికి కృతజ్ఞతలు.
@ncbn@PawanKalyan@katchannaidu@Nccf_India
Wishing a very Happy Birthday to a true leader of the people @pawankalyan garu May your commitment to public service and your vision for a better tomorrow shine brighter than ever."
Once happy birthday boss🙏🏻❤️
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan