తెలంగాణ సగటు వ్యక్తి యెక్క
తెలంగాణ, కేసిఆర్, 9.5 సంవత్సారాలు పాలన,2023 ఎన్నికల పై అభిప్రాయం..
నేను ఒక తెలంగాణ సగటు సాధారణ వ్యక్తిని...మాది ఉమ్మడి కుటుంబం....
నాకు తెలుసు... 1956 నుండి తెలంగాణ కోసం ఎంత గోసపడ్డమో.. తొలిదశ ఉద్యమంలో ఎంత మంది పోరాడిన... ఎంతమంది పాణాలు కోల్పోయిన... కనికరించలే.... రాష్ట్రం రాలే...
మలిదస ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ జెండా పట్టినప్పుడు అవహేళన అవమానాల మధ్య తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం పక్కకు పెట్ట పెడితే
"నన్ను రాళ్లతో కొట్టి చంపుల్లి"అని సబ్బండ వర్గాలను జాగురాపరచి " *బొంత పురుగునైన తెలంగాణ కోసం ముద్దాడుతా"* అని రాజకీయ ప్రయత్నం ఎంత చేసిన అయితలేదని
*"కెసిఆర్ సచ్చుడో -తెలంగాణ వచ్చుడో"* అని ఆమరణ నిరాహార దీక్షకు కూసోని తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేపించుండు... అయినా తర్వాత మళ్లీ గవ్వే కుట్రలు... ఎవరెన్ని కుట్రలు, ప్రయత్నాలు చేసినా ఢిల్లీలో రెండు సభలల్ల,రాష్ట్రపతి ముద్ర పడేదాకా వదల్లే..
అందరిని,అన్ని పార్టీలను ఒప్పించిండు... ఒప్పుకునేలా చేసిండు...1956 నుండి పడ్డ గోస జూన్ 2 2014 నాడు తీరిపోయింది.... మా తెలంగాణ మాకొచ్చింది...
వచ్చిన తెలంగాణ బాగుపడాలంటే.. బాగుపరచాలి అనే సంకల్పం ఉన్న మా కెసిఆర్ నే గెలిపించుకున్నాం....
ఆత్మగళ్ల సారు.. తెలంగాణ ఆణువణువూ, ప్రజల సాధకబాదకాలు తెలిసిన కేసీఆర్ ఉద్యమ సమయం నుండి ఆయనకున్న పట్టుదల తెలంగాణను ఎట్ల ముందుకు తీసుకుపోవాలని తపన మా కష్టాలు తీర్చడానికి ఒక్కొక్కటి ముందు వేసుకొని చేస్తుండు....
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది దానికి రైతుబంధు ఇచ్చి పెట్టుబడి సాయం చేస్తుండు.... అప్పట్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలవక అర్ధరాత్రి అపరాత్రి పొలం కాడికి పోవాల్సి వచ్చేది ఆడనే పన్న రోజులు కూడా ఉన్నాయి... మస్తు మంది రైతులు పాము కాట్లకు, తేలుకాట్లకు, కరెంట్ షాక్‌లకు బలైటోళ్లు... బాయిల కాడ మీటర్లు మోటర్లు కాలుతుండే ట్రాన్స్ఫార్మర్లు పేలుతుండే...
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు *వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా* ఇస్తుండు మా కెసిఆర్ ...
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి వచ్చే పైసలు ఇయ్యమని ఢిల్లీలో సర్కార్ వాళ్ళు అన్న... వినకుండా వేల లక్షల కోట్లు రాష్ట్రానికి నష్టపోయిన రైతుల మోటార్లకు మీటర్లు పెడితే తర్వాత రైతులను ఆగం చేస్తారని కేసీఆర్ ఒప్పుకోలే....
మా ఇంటామే కడుపుతో ఉన్నప్పుడు *న్యూట్రిషన్ కిట్* ఇచ్చిండ్రు
[న్యూట్రిషన్ కిట్ -1Kg పోషకాహార మిశ్రమపౌడర్, 1Kg ఖర్జూర, 3బాటిల్ల ఐరన్ సిరప్,500gr నెయ్యి, ఒక కప్పు ఉంటాయి ]
*104 వాహనంల దావకానకు తీసుకుపోయి, పరీక్షలు చేయించి,డాక్టర్ అమ్మకు చూపెట్టి,ఇండ్ల దింపేటోళ్లు..
( రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు కలవు )
ప్రభుత్వాసుపత్రిలోనే పైసా ఖర్చు లేకుండా సాధారణ కాన్పు చేసి ఆడపిల్ల పుడితే 13000 మగ పిల్లవాడు పుడితే 12000 ఇంకా కెసిఆర్ కిట్ ఇచ్చిండ్రు..
[కెసిఆర్ కిట్‌లో - బట్టలు, సబ్బులు, ఆయిల్, పౌడర్, దోమతెర, బొమ్మలు, టవళ్లు డైపర్లు ఉంటాయి... 2022డిసెంబర్ నాటికీ 1.9లక్షల కిట్లను అందచేయడం జరిగింది ]
మా పిల్లలకు టైం కు వ్యాక్సిన్లు,బాలామృతం ఇచ్చేటోళ్లు...
ప్రభుత్వ స్కూలల్ల సౌలతులు
"మన ఊరు మన బడి "
మన బస్తి మన బడి ",
తొలిమెట్టు ద్వారా పెంచుతున్రు...
అందరు పిల్లలు సదువుకోవాలే, ఖాళీ కడుపుతో ఉండొద్దు అని "సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం "ద్వారా పోద్దున టిఫిన్, మధ్యాన్నం భోజనం పెట్టి సదువు చెప్తున్రు...
5వ తరగతి నుండి మా పిల్లలు గురుకులాలలో సదువుతున్రు...
కెసిఆర్ అచ్చినంక 293 నుండి 1002 గురుకుల స్కూళ్లు అయినాయి.. దాంట్లో 86లో కాలేజీ సదువు కూడా ఉన్నది...
గురుకులాల్ల అన్ని సౌలతులు ఉన్నాయి, యూనిఫామ్, పుస్తకాలు, మూడు పూటలా తిండి,ఉండటానికి అన్ని సౌలతులు ఇచ్చి మంచిగా సదువు చెప్తున్రు.. పెద్ద గ్రౌండ్, ఆటలు పాటలు అన్ని నేర్పుతారు... మస్తు మందికి IIT, NIT, మెడికల్ కాలేజెలల్ల సీట్లు అచ్చినాయట,ఆటలాల్ల మస్త్ మెడల్స్, అవార్డులు వచ్చినాయట,ఎవరెస్టు కూడా ఎక్కిలాట.....
బయట కాలేజెలల్ల పిల్లల సదువులకు అవ్వ అయ్యా తోని అయితేలేదని సదువు మనోద్దు అని ఫీరెయంబర్స్మెంట్, ప్రీ మెట్రిక్ &పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లను ఇస్తున్రు...
మా తమ్ముడు సదువుల జరా హుషారు ఉన్నాడు... బయట దేశం లా సదువుతాడట... మనతోని ఏడైతాది అని మా అవ్వ అయ్యా మస్తు రంది పడ్డారు. కానీ బయట దేశాలలో చదవనీకి కూడా ప్రభుత్వం మా తమ్మునికి సహాయం చేసింది మాకే కాదు మొత్తం 863.49 కోట్లు ఖర్చుపెట్టి
2,976 బీసీలకు "మహాత్మ జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి" ద్వారా
953 ఎస్సీలకు 249 మంది ఎస్టీలకు "డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్య నిధి" ద్వారా
2174 మైనార్టీలకు "ముఖ్య మంత్రి విదేశీ ఉపకార వేతనం" ద్వారా
బయట దేశాలల్ల సదువుకునుటకు పంప్పిలాట....
1/N
#KCROnceAgain
#VoteForCar @BRSparty@GoudNareshBrs@KTRBRS@BTR_KTR
గౌరవ శ్రీ @KCRBRSPresident
గారి ఆదర్శాలను హృదయంలో నింపుకొని, ఆయనకు వెన్నుదన్నుగా నడుస్తున్న @BRSHarish అన్న ఈ ప్రయాణం... భావితరాలకు స్ఫూర్తి, నిబద్ధతకు ఉదాహరణ, సమాజ సేవకు నిర్వచనంగా చరిత్రలో నిలిచిపోతుంది. నిజాయితీ, అచంచలమైన విశ్వాసం, అలుపెరగని నిబద్ధతతో ఎంచుకున్న ఈ మార్గం భావితరాలకు స్పూర్తిగా ఉంటుంది.
ఇది కేవలం రాజకీయం కాదు...
ఇది ఒక లెగసీ.
హ్యాపీ బర్త్‌డే @BRSHarish అన్న 💐
మీరు స్ఫూర్తి, మీ ప్రయాణం చరిత్ర. #HappyBirthdayHarishAnna #LegacyOfValues #InspiredByKCR #BRSFamily
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు...💐
జై తెలంగాణ ✊
Telangana is never given,
it is won.
Go explore!
#జైతెలంగాణ ✊
జోహార్ తెలంగాణ అమరవీరులారా 🙏
#TelanganaFormationDay#ThankYouKCR 🙏
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.
ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ అన్నారు.
నూతన రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని వివరించారు.
సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ తెలిపారు.
ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. ప్రతీప శక్తుల నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ కు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
స్వరాష్ట్ర సాధనలోనూ, ఆ తర్వాతి పదేండ్ల పునర్నిర్మాణంలోనూ చూపిన స్పూర్థిని నిరంతరం కొనసాగించాలనీ, అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలనీ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు.
రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు,సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కేసీఆర్ ఈ సందర్భంగా కోరుకున్నారు.
#TelanganaFormationDay
బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
ఇటీవల నియమించిన డీసీసీ అధ్యక్షుడి పదవిపై అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలకు తన ప్రమేయం లేకుండా పదవుల నియామకాలు జరిగాయని చెప్పిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి మండలం ఎల్లారం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల అసంతృప్తిపై స్పందించిన ఎమ్మెల్యే వినోద్
ప్రజల పక్షాన నిలిచే గొంతుక.. ఎవరికీ తలవంచని నైజం!
నేను పారిపోయేవాణ్ణి కాదు,
నా పేరు రాయొద్దు అని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే బాపతు కాదు!
నా తండ్రి పేరు కేసీఆర్..
నా పేరు కేటీఆర్..
నా కొడుకు పేరు హిమాన్షు!
@KTRBRS
#తెలంగాణజాగరణసేన
తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనే తలంపుతో టిఆర్ఎస్ పార్టీ "తెలంగాణ జాగరణ సేన” అనే పేరుతో లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటిదశలో తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 605 మందికి పైగా కార్యకర్తలకు సెప్టెంబర్ 10, 2005 నుంచి నాచారం (హైదరాబాద్)లోని 'నోమా' ఫంక్షన్హాల్లో శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యకర్తలను 'ప్రేరక్'లని పిలిచారు.ఈ కార్యకర్తలకు ఉద్యమ భావజాలంతోపాటు కర్రసాము మొదలగు శారీరక శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రతి జిల్లాలలోను శిక్షణా తరగతులను నిర్వహించారు,అయితే అనేక కారణాలవల్ల ఈ విధమైన శిక్షణను తరువాత కాలంలో అందించలేదు.
With a view to spread the Telangana ideology, the TRS party has decided to train one lakh workers under the name "Telangana Jagarana Sena". As part of this training program, in the first phase, more than 605 workers selected from all the districts of the Telangana region were trained at 'Noma' function hall in Nacharam (Hyderabad) from September 10, 2005. These activists were called 'Preraks'. Physical training programs were also conducted for these activists in Karrasamu etc. However, this type of training was not provided in the later period due to many reasons.
#ఉద్యమయాదిలో
#చరిత్ర #తెలంగాణకథ #TelanganaStory
@KonathamDileep@BRSparty@KTRBRS@BRSHarish@balkasumantrs@JaganReddyBRS@SkWarangal@UttamKBRS@ShankarKondapa3@KarthikIndrAnna@Mythreyaa@GoudNareshBrs@Brs_Teja@NAR_Handle
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం!
పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊
జై తెలంగాణ ✊
#KCR #Telangana
ఎత్తిన జెండాను దించకుండా
పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి
ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని
గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్!
దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన
తెలంగాణ అస్థిత్వం బీఆర్ఎస్.
పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరుగుతూ…
సూటిగా, స్పష్టంగా తన మార్క్ పంచ్‌లతో కొనసాగిన గులాబీ బాస్ ప్రసంగాన్ని వినేందుకు,
తండోపతండాలుగా తరలివచ్చిన జన సందోహం.