*సంతలో మధ్యవర్తులను ఏమంటారు?*
( అమ్మే వాడు , అమ్ముడుపోయే వాడు, కొనేవాడు )
—————————————————-
ఓడిపోయిన వాడు ప్రజాస్వామ్యం ఖూనీ అయింది అంటాడు.
గెలిచిన వాడు ప్రజాస్వామ్యం దే విజయం అంటాడు.
డబ్బులు ఇచ్చాం అని ఎవడూ చెప్పడు.
దొంగ రాస్కల్స్ , ఓటర్ల ని సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారు.
“అమ్ముడు పోవడానికి మేము సిద్ధం” అని ప్రజలను తయారుచేసారు.
పులివెందులైన, కుప్పం అయినా ఒకటే !
*డకోట పాకిస్తాన్ (ఆర్మీ చీఫ్ మునీర్)*
—————————————————
ఇతను ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు ? అతనికి తెలుసు “మనం భిన్నత్వంలో ఏకత్వం కాదు, విభిన్న కులాల సమూహాలమని”
అంటే “ఎవడికి వాడే యమునా తీరే “ లాగా మనం బతుకు తున్నామనే ధైర్యంతో అంత ఈజీగా మాట్లాడినాడు. దేశం కంటే మనం కులాన్నే ఎక్కువగా ప్రేమిస్తామనే సంగతి అతనికి బాగా తెలుసు.
సైన్యం చరిత్రలో “సిక్కు రెజిమెంట్లు”, “మహర్ రెజిమెంట్లు” “గూర్ఖా రైఫిల్ గ్రూప్స్” ఉన్నాయి. “బ్రాహ్మణ, బనియ, కమ్మ , రెడ్డి” రెజిమెంట్లు లేవు.
తెగ కబుర్లు చెబుతూ ఉంటారు కానీ, దేశం మీద ప్రేమ సోషల్ మీడియా వరకే. విదేశాల్లో కూడా కుల సంఘాలే. వేరే కులం వాడిని కలుపుకుంటే ఒట్టు.
అందుకే ఎవడెవడో పది గుర్రాలపై వచ్చి మనల్ని ఆక్రమించి పరిపాలించారు.
దేశభక్తి….. హంబక్. కుల భక్తి (పిచ్చి) అమోఘం.
కనుకనే మన గురించి ఎవడైనా, ఏదైనా అంటాడు, ఎక్కడైనా అంటాడు, టాం-టాం వేస్తాడు.
కొడుకు ల్లార!
—————
మాకు వస్తాయ్ రా మంచి రోజులు.
చరిత్ర ఎప్పుడు ఒకేరకంగా ఉండదు, ఒక్క చోటే ఆగిపోదు. అప్పుడు మిమ్మల్ని ఇలా కొట్టం. అంకుశం సినిమా లో రామిరెడ్డి క్యారెక్టర్ ని చార్మినార్ దగ్గర గుడ్డలు ఊడదీసి ఉరికించి, ఉరికించి కొట్టి న సీన్ గుర్తు తెచ్చుకోండి.
ఒరేయ్, లిక్కర్ స్కాంలో ఉన్న వాడిని జైల్లో పెడితే, అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసిన చవటల్లార, ఇలాంటి వాటికి స్పందించండి రా.
రెడ్డొచ్చినా, కమ్మొచ్చినా మన బతుకులు ఇలగే ఉంటాయి. మెదడు మకిలి పట్టిన మడ్డు సన్నాసుల్లార, వాళ్ళ చంకలు నాకడం ఆపి, సిగ్గు నేర్చుకోండి.
నిజాల పేరు తో “పుండు” కెలికిన “దగ్గుబాటి”
————————————————————-
40 ఏండ్ల తర్వాత ఇప్పుడు నిద్ర లేచిన
“దగ్గుబాటి చెంచురామయ్య గారి కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు” గారు, వాళ్ళ నాన్న “పులుగడిగిన ముత్యం” అని చెబుతున్నాడు.
ఒక పక్క ఊరిలో లేడంటున్నాడు. మరోపక్క ఆ ఊరి పెద్దరికం ఆయన దే అంటున్నాడు. పెద్దలు కనుగీటకుండా, వారి అండలేకుండ అంత మందిని చంపే దమ్ముందా అక్కడి వాళ్ళకు? (ఆ రోజుల్లో )
పైగా అది “ఘర్షణ” అంటున్నాడు.
ఎంత మాత్రం కాదు, చెరువు దగ్గర జరిగింది “దాడి, దౌర్జన్యం”. ఆ మరుసటి రోజు జరిగింది “వేట, నర మేధం”. ఆ విషయం దేశమంతా తెలుసు.
మీ అంత “కూల్” గ మాట్లాడలేం వెంకటేశ్వర రావు గారు, మేం “కూలి” వాళ్ళం కదా, ఈ వ్యవస్థ లో అడుగడుగునా ఎదురయ్యే అవమానాలు భరించలేక “కసి” తో మాట్లాడుతుంటాము. అందుకే “పద్మారావు గారు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా”, వాస్తవాలను అంగీకరించ లేని మీబోటి వారు గింజుకుంటుంటారు.
అదేదో “క్యాజువల్” గ జరిగి నట్లుగా అంటున్నారు గాని, మీ వాళ్ళు వెంటాడి, వేటాడి చంపారని మాత్రం ఒప్పుకోలేకపోతున్నారు. మీ నాన్న గురించి బాధ పడటం తప్పు లేదు కాని అంత మంది ని వేటాడి నందుకు కించత్ పశ్చాత్తాపం లేదు మీకు.
అయినా ప్రస్తుతం మా సమస్య మీ కులాలతో (So called Upper Castes) కాదు, మా కులాలతో నే మాకు సమస్య. మీ లాంటి వాళ్ళ మూతులు నాకుతూ, పాదాలు పిసుకుతూ, వంగి వంగి, నంగనాచి వేషాలు వేసే వాళ్లు మాలోనే తయారయ్యారు. అమాయక ప్రజల్ని ఆసాంతం మీ ముందు మోకరిల్లేలాగు చేస్తున్న మా వాళ్ళతో నే మా సమస్య. ( ముఖ్యంగా “మేం చాలా గొప్ప” అని అనుకునే వాళ్ళే అసలు సమస్య ).
చుండూరు మృతులకు మరోసారి నివాళి
(06-08-1991)
( చరిత్ర (నాటి సంఘటన) తెలియని ఈ తరం కోసం)
————————————————————————
చుండూరు దారుణ మారణ కాండ:-
34 సంవత్సరాల క్రితం ఇదే రోజున గుంటూరు జిల్ల, “చుండూరు” గ్రామంలో “అధికారంలో ఉన్న రెడ్లు”
ఏడుగురు మాలలని, ఒక మాదిగని చంపారు. (మొత్తం 8 మంది ).
అప్పుడు నేను Bank Manager గ పనిచేస్తూ…తిరువూరు లో ఉంటున్న. చుండూరు వెళ్ళాలని ప్రయత్నిస్తే, police లు అనుమతించలేదు. అప్పుడు చుండూరు పోలీసుల నిర్భందం లో ఉంది. వెనక్కు వచ్చి గుంటూరులోని “కుగ్లర్ హాస్పటల్ కాంపౌండ్” లో ఉన్న బాధితులను పరామర్శిస్తున్న. ఆ సమయంలో చుండూరు వెళ్ళి, బాధిత కుటుంబాలకు వైద్యం చేయాలనుకుంటున్న డాక్టర్స్ టీమ్ ని convince చేసి వాళ్ళతో కలసి చుండూరు వెళ్ళాను. ( నేనొక డాక్టర్ కాని డాక్టర్ గ).
అక్కడ జరిగిన ఘోరాన్ని 8 మంది ఇళ్ళకు వెళ్ళి ఆ భయంకర సంఘటనలను ఆయా కుటుంబ సభ్యుల ద్వారా విని, అప్పటి కే మేము నడుపుతున్న “దళిత్ వాయిస్” లో ప్రచురించడం జరిగింది. ఆ రిపోర్ట్ ని Pamphlet గ print చేసి, “ తిరువూరులో “ అనేకమందిని సమీకరించి అతిపెద్ద “ర్యాలి” తీయడం జరిగింది.
అంతకుముందెన్నడు తిరువూరు లో అంత పెద్ద నిరసన ఎప్పుడూ జరగ లేదు.
ఆ రిపోర్ట్ మళ్ళీ సమాంతర పత్రికలో 2010 సం॥ లో ముద్రించారు. దాన్ని ఇక్కడ జతపరుస్తున్న. నాటి భయంకర సంఘటన ఎలా జరిగిందో తెలియని వారు చదవ వచ్చు.
*ఈనాడు పత్రికలో (3-8-25) జాతీయ పార్టీల గురించి*
-------------------------------------------------------------------------
దేశంలో "ఆరు జాతీయ పార్టీలు" మాత్రమే ఉన్నాయి. వాటిలో "బీఎస్పీ" మూడవ స్థానంలో ఉన్నది.
"ఏనుగెక్కి" అంబారి పై ఊరేగుదాం రండర్రా అంటే కొంతమంది మా లెవెల్ కు "సైకిల్" చాలు అని సరిపెట్టుకుంటారు. మరి కొంతమంది "ఫ్యానుకు" ఉరేసుకుంటామంటారు. ఇంకొంతమంది కబంధ"హస్తాల్లో" నలిగిపోతామంటారు.
గతంలో మనవాళ్లు "కొడవళ్ల" పై "కథక్ నృత్యం" చేసి అలసిపోయిన సందర్భాన్ని గుర్తుంచుకోవాలి.
( ఈ ఏనుగు "అంబేద్కర్" సృష్టి. కాన్షిరాం "దూరదృష్టి" )
*ఇంటి సొమ్ము ఏమైనా ఇస్తున్నారా?*
——————————————————
జగనన్న “జనం జేబులు కొట్టేయ్, దాచేయ్” స్కీం
చంద్రన్న “చెమ్మ-చెక్కలతో చిడతలు వాయించేయ్” స్కీం
రేవంతన్న “రంగులు మార్చేయ్, రంగంలో దూకేయ్” స్కీం
కె.సి.ఆర్ “కాకమ్మ కథలతో కాలక్షేపం చేయ్” స్కీం
ఇలా రకరకాల చెత్త పేర్లతో స్కీం లు పెట్టి, ప్రజల ఆలోచనలను “అడక్కోవడానికి” పరిమితం చేసి, జన జీవనాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ నాయకులకు , ఈ తీర్పు తోనైనా బుద్ధి వస్తుందా?
కుళ్ళు తో కుత-కుత లాడే కళ్ళల్లో కారం పోయాలి
——————————————————
వంటినిండ అహంకారంతో తెగ బలిసి, కొవ్వెక్కిన కుక్కలు ప్రతి చోట ఉంటాయనడానికి నిదర్శనమే ఈ సంఘటన.
వీళ్ళబ్బ సొమ్ము మనమేదో తింటున్నాం అనే విధంగా మనమీద పడి ఏడుస్తుంటారు.
దొడ్డి దారిన రిజర్వేషన్లు అనుభవిస్తూ, మనలో కాస్త ఎదిగిన వాళ్ళను చూసి భరించలేని బద్మాషుల మధ్య బ్రతుకుతున్నందుకు ప్రతిక్షణం వళ్ళంతా కంపిస్తూ ఉంటుంది.
ఎవరేమనుకున్నా సరే
——————————
ఈ post సంవత్సరం క్రితం పెట్టాను. ( ఈ రోజు FB open చేయడం తోనే ప్రత్యక్ష మయింది).
మళ్ళీ పెట్టాలని అనిపించింది
గుర్తు వచ్చిన ప్రతి సారి పెట్టాలని అనిపిస్తుంది.