తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
Warm birthday greetings to Smt. Daggubati Purandeswari garu. Your grace in public life, commitment to democratic values, and dedication to serving the people continue to inspire many. Wishing you good health, happiness, and many more years of impactful service to the nation.
@PurandeswariBJP
QuerySurge’s new AI-powered technology provides a radical shift in ETL testing by automatically converting data mappings into data validation & ETL tests - simplifying & speeding up the process.
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై రాయలసీమ వాసుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం…. రాష్ట్ర ప్రజల ఆశలకు, ఆలోచనలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ప్రతి పౌరుడు గర్వించేలా ప్రజా రాజధాని నిర్మిద్దాం!
#HistoricAmaravatiResolution
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలతో కలిసి దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయం పైకి వెళ్లడం వైసీపీ విష సంస్కృతికి నిదర్శనం. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్దాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజా గళంగా నిలిచే పత్రికను, ఛానెల్‌ను నడుపుతున్నారు. జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించుకున్నారు. అలాంటి సంస్థ పై వైసీపీ బెదిరింపులు పనిచేయవు. రాజధాని అమరావతి పై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. ఆంధ్రజ్యోతి సంస్థపై వైసీపీ దాడిని అన్ని వర్గాలు ఖండించాలి.
@abntelugutv
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది. భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నాం. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకువచ్చి సహకరిస్తున్న దాతలకు నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
@TTDevasthanams
The InterLink Visa Card Will Officially Launch in the Coming Days
With Version 5.0 expected to be released in the near term, the InterLink Visa Card will be introduced in its initial phase as a virtual card, seamlessly integrated with the ITLX Super Wallet.
What the InterLink Visa Card enables:
-Payments using widely adopted digital assets such as USDT, USDC, and Ethereum
-Acceptance at more than 50 million Visa and Mastercard merchants worldwide
-Seamless usage across 170+ countries for real-world transactions, without concerns about currency exchange
This is only the beginning.
The primary objective is to progressively integrate $ITL and $ITLG into this payment infrastructure, enabling tens of millions of InterLink Visa Cards to transact directly using the ecosystem’s native tokens. This will position $ITL and $ITLG as widely adopted payment currencies within a global, real-world transaction ecosystem.
Digital assets are no longer confined to applications. They are becoming an integral part of the real-world economy.
💳 The InterLink Visa Card will be launching soon. Stay tuned.
#InterLink #ITLG #ITL
#44YearsOfTDP
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ‘టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ’ శుభాకాంక్షలు. యుగపురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగు వారి ఆకాంక్షలకు ప్రతిరూపం. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలనే ఆయన సిద్దాంతాన్ని సదా పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఆవిర్భావ దినోత్సవం అంటే మన ఇంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
చంద్రబాబు గారు, లోకేష్ ఏ కంపెనీ తీసుకొచ్చినా, “నేనే, నేనే, నేనే” అంటూ వచ్చేస్తాడు జగన్. దీనికి తోడు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ కూడా చేస్తాడు.
ఈ సుందరాంగుడి ముఖారవిందాన్ని చూసి పారిపోయిన కంపెనీలు ఉన్నాయి కానీ, వచ్చిన కొత్త కంపెనీ ఒక్కటైనా ఉందా?
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
#PsychoFekuJagan
గుండెపోటు–గొడ్డలి వేటు అయినట్టు.. జగన్ అనే వాడు మాటలు ఎలా మార్చేస్తాడో ఇది ఒక ఉదాహరణ..
మిట్టల్ అనే వ్యక్తి ఒడిశాలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు, చంద్రబాబు చెప్పేది మొత్తం ఫేక్ అన్నాడు.. ఇప్పుడు కంపెనీ భూమిపూజ అయితే నేనే తెచ్చా అంటున్నాడు..
గూగుల్ డేటా సెంటర్ వస్తే విశాఖలో నీళ్లు కూడా దొరకవు అన్నాడు.. గూగుల్ ప్రకటన చేయగానే, నేనే తెచ్చా అన్నాడు..
ఎవరిది క్రెడిట్ చోరీ? ఎవరు అవకాశవాది? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, ఎందుకిలా ప్రతి రోజు దిగజారిపోతున్నావు @ysjagan?
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు.
@narendramodi@AmitShah@RDT_anantapur
#AMNSIndiaComesToAP#ChooseSpeedChooseAP
మాట ఇచ్చాం...మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ రాకతో గొప్ప ముందడుగు వేశాం. 21 నెలల క్రితం కబ్జాలు, కూల్చివేతలు, కేసులతో అభద్రత, భయం, మానసిక క్షోభతో అల్లాడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో.....నేడు అభివృద్ది, అవకాశాలు, ఆకాంక్షలతో అన్ని చోట్లా ఆనందాన్ని, భవిష్యత్ పై భరోసాను తీసుకువచ్చాం.
ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిస్తే....ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్‌కు నూతన దిక్సూచి అవుతుంది. రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు అవుతున్న ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రాగా మారుస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉక్కు రంగంలో ఏపీ దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది.
గౌరవ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లనే 21 నెలల్లో ఇంత పెద్ద ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం. ప్లాంట్‌కు అవసరమైన ముడి ఖనిజం సరఫరా నుంచి అనుమతుల వరకు కేంద్రం వేగవంతమైన, సానుకూల నిర్ణయాలతో ప్రతి దశలోనూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిశీల నిర్ణయాల వల్లనే ఈ ప్రాంతంలో ఒక స్టీల్ సిటీ నిర్మితమవుతోంది. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వచ్చే మూడేళ్లలోనే ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో, అన్ని విధాలా అభివృద్ది ఫలాలు అందుతాయి.
భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్‌కు అడుగులు పడిన సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు శుభాకాంక్షలు.