భోగి పండుగ శుభ సందర్భంగా హుజురాబాద్ శాసన సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారి స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, గోదాదేవి–రంగనాయకుల కల్యాణ మహోత్సవ పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన
పాడి కౌశిక్ రెడ్డి గారు వారి సతీమణి శాలిని రెడ్డి గారు.
పాడి పంటల పరవళ్ళు సంక్రాంతి లక్ష్మి రాకతో మురిసే మన లోగిళ్ళు !
ప్రజలందరి జీవితాల్లో కష్టాలు చీకట్లు తొలగిపోయి అభివృద్ధి వైపు పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో
ఆశలు, ఆనందాలు, విజయాల వెలుగులు నింపాలని కోరుకుంటూ…
ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ✨🎉
#HappyNewYear#HappyNewYear2026
హుజురాబాద్ గడ్డ కెసిఆర్ అడ్డా...
హుజురాబాద్ నియోజకవర్గంలో BRS పార్టీ సునామి..
అత్యధిక0గా 44స్థానాల్లో BRS అభ్యర్థుల హవా..
గ్రామాల్లో ప్రజలు మళ్ళీ కేసిఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు,
*గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెసిఆర్ గారు మరియు కౌశిక్ రెడ్డి ప్రభంజనం*
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కెసిఆర్ గారు మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభంజనం సృష్టించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బి.ఆర్.ఎస్ అభ్యర్థుల విజయంలో తనదైన పాత్ర పోషించి సంచలనం రేపారు. అధికార పార్టీ కాంగ్రెస్ ను కంగు తినిపించి హుజురాబాద్ నియోజకవర్గం తన కంచుకోటగా మరోమారు నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఇక్కడ తనకు తిరుగేలేదని గట్టిగా చాటి చెప్పారు. తాజా ఫలితాలతో విమర్శకుల నోరు మూయించి వారి గూబ గుయ్యిమనిపించారు. ఎన్నికలు ఏవైనా హుజురాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని, నియోజకవర్గ ప్రజల గుండెల్లో తానే ఉన్నాననే ఆత్మ విశ్వాసాన్ని కౌశిక్ రెడ్డి వెలిబుచ్చారు.
1. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం లో పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తనదైన వ్యూహంతో పావులు కదిపిన కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ మండలంలో7
.జమ్మికుంట మండలంలో 9, వీణవంక మండలంలో 12, కమలాపూర్ మండలంలో 11, ఇల్లంతకుంట మండలంలో 5 గ్రామపంచాయతీలను దక్కించుకున్నారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన నాయకత్వ పటిమను, సమర్థతను నిరూపించుకున్నారు.
2. పంచాయతీ ఎన్నికల్లో బి.జె.పి ప్రాబల్యం ఏమాత్రం కనిపించలేదు. ఎం.పి. ఈటల రాజేందర్ పరోక్షంగా వ్యవహారం నడిపించినా.. ఓటర్లు కౌశిక్ రెడ్డికే అండగా నిలిచారు. ఫలితంగా నియోజకవర్గంలో బి.జె.పి. నామమాత్రపు స్థానాలకే పరిమితం అవడమే కాకుండా.. ఇక్కడ ఈటల రాజేందర్ ఉనికి భూస్థాపితం అయినట్లు తేటతెల్లమైంది.
3. హుజూరాబాద్ నియోజకవర్గంలో వర్గ పోరుతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో చావు దెబ్బతింది. కుమ్ములాటలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. ఈ నిజాన్ని గుర్తించిన నియోజకవర్గ ప్రజలు కౌశిక్ రెడ్డిపై విశ్వాసం ప్రదర్శించారు. ఆయన వెంటే ఉన్నామంటూ అత్యధిక స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించారు.
4. కౌశిక్ రెడ్డికి దూకుడు స్వభావం ఉన్నా.. మనసు మాత్రం వెన్నపూస అనేది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఆయన దూకుడు ప్రదర్శించినా.. ప్రజలకు సేవ అందించడంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటారు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తారు. ఆపన్నులను ఆదుకోవడంలో ఆయనకు సాటి ఎవరూ రారు. ఈ గుణమే కౌశిక్ రెడ్డిని తిరుగులేని నేతగా నిలబెట్టింది. మనసున్న మారాజు గా జనం గుండెల్లో కొలువు తీర్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆయన సాధించిన ఫలితాలే దీనికి నిలువెత్తు నిదర్శనం.
తుమ్మనపల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా గెలుపొందిన మాదవి రవీందర్ రెడ్డి గారు, ఈరోజు గౌరవ హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారిని మర్యాదకపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తుమ్మనపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.