🚨 Account Update
My previous account, @Mr_uncivilized, has been suspended.
This is my new account for now.
If anyone knows a way to recover a suspended X account or has been through this before, I'd really appreciate your advice. 🙏
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ
•సోషల్ మీడియా ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు
•పలు ప్రాంతాల్లో నమూనాల సేకరణ.. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తింపు
•ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
•దిద్దుబాటు చర్యలు నిర్దేశించిన ఏపీ పీసీబీ
•ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనంతరమే విడుదల చేయాలని ఆదేశం
•అక్రమంగా ప్రమాదకర వ్యర్థాల విడుదల చేస్తే నిబంధనల మేరకు చర్యలు
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగుతో కూడిన నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తుందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్లో పోస్ట్ అయిన వీడియోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ పీసీబీ అధికారులను ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీడియో ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు, ఆ పరిసరాల్లో దుర్వాసనకు కారణమైన ఆరోపణలపై వివరణ కోరుతూ ఫార్మాసిటీ పరిధిలోని అన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 95 కంపెనీలకు ఏపీపీసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
•వ్యర్థాల నిర్వహణ డిజిటలీకరణకు ఆదేశం
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులతోపాటు పలు దిద్దుబాటు చర్యలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఏపీపీసీబీ పరిశ్రమలకు ఆదేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు లేదా కలుషిత నీటిని పరిశ్రమల వెలుపలికి విడుదల చేయకుండా చూడాలని, ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ మానిటరింగ్ నిర్వహించడం, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచడం, కన్సెంట్ టు ఆపరేట్ (CTO), హాజర్డస్ వేస్ట్ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి చర్యలను కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
అక్రమంగా మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల వంటి వాటిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. పై చర్యలను వివరిస్తూ ఒక నివేదికను ఏపీపీసీబీ ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయానికి పంపింది.
తాగు నీటి నాణ్యతపై జాగరూకత… ప్రజారోగ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం
•ఫిల్టర్ ఛాంబర్లు, బెడ్స్ లో హానికర కీటకాలు ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాలి
•నీటి వనరులు, వాటి పరిసరాలు కాలుష్యరహితంగా ఉండాలి
• సమగ్ర రక్షిత తాగు నీటి సరఫరా పథకాల నిర్వహణలో లోపాలు సహించం
•గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, జెడ్పీ సీఈవోలు నిరంతర తనిఖీలు చేపట్టాలి
•సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ, పర్యవేక్షణ పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆదేశం
గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగు నీటిని నిరంతరాయంగా అందించే సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను పటిష్టపరచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీపీడబ్ల్యూఎస్ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. ముఖ్యంగా తాను గుర్తించిన ఫిల్టర్ ఛాంబర్లు, బెడ్ల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక సూచనలు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 512 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1.65 కోట్ల మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి పథకం పరిశుభ్రంగా, సురక్షితంగా, పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పథకాలపై గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ అధికారులు, జెడ్పీ సీఈవోలు సంయుక్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నీటి వనరులు, శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్‌లు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, పైప్లైన్లు, వాల్వులు తదితర మౌలిక వసతుల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
వేసవి నిల్వ ట్యాంకులను పూర్తి సామర్థ్యంతో నిర్వహించడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, జంతువులు, కాలుష్య కారకాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లీకేజీలు, విద్యుత్ సంబంధిత లోపాలు, మౌలిక సదుపాయాల దెబ్బతినడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఫిల్టర్ బెడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
తాగు నీటి నాణ్యత పరిరక్షణలో ఫిల్టర్ బెడ్లు కీలకమని ఉప ముఖ్యమంత్రివర్యులు పేర్కొన్నారు. ఫిల్టర్ హౌస్‌లను అత్యంత పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. కప్పలు, బల్లులు, ఎలుకలు, పాములు, కీటకాలు వంటి జీవులు ఫిల్టర్ బెడ్లలోకి ప్రవేశించకుండా అన్ని ఓపెనింగ్లకు రక్షణ వలలు ఏర్పాటు చేయాలని సూచించారు. శుద్ధి చేసిన నీటి నాణ్యతను భౌతిక, రసాయన, బ్యాక్టీరియాలజికల్ ప్రమాణాల ప్రకారం నిరంతరం పరీక్షించాలని, ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. వెంటిలేటర్లు, ఓవర్‌ఫ్లో పైపులు, డ్రెయిన్ అవుట్లెట్లకు తుప్పు పట్టని మెష్ స్క్రీన్లు అమర్చాలని, ఫిల్టర్ మీడియాను నిర్దేశిత మందం మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని, అవసరమైన మేరకు స్క్రాపింగ్, బ్యాక్‌వాషింగ్, శుభ్రపరిచే పనులు క్రమం తప్పకుండా చేపట్టడంతో పాటు ఇన్లెట్, అవుట్లెట్ వ్యవస్థలు, చానెల్స్, పైప్లైన్లు, వాల్వులు, వాష్వాటర్ వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచనలు చేశారు. ఫిల్టర్ హౌస్ పరిసరాలను నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. నిర్వహణ అవసరాలకు సంబంధించిన వాటిని మినహాయించి ఇతర రసాయనాలు, వ్యర్థ పదార్థాలు లేదా పరికరాలను ఫిల్టర్ హౌస్‌లలో నిల్వ చేయవద్దని చెప్పారు. పైకప్పులు, గోడలు, ప్లాట్‌ఫామ్‌లు, మెట్లు, గ్రేటింగ్‌లు, నిచ్చెనలు వంటి నిర్మాణ భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు.
వీటితోపాటు నీటి వనరులు, వాటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా ఉంచాలని, వేసవి నిల్వ ట్యాంకులను (Summer Storage Tanks) తగిన సామర్థ్యంతో నింపి నిర్వహించడంతో పాటు ట్యాంకుల కట్టలను బలోపేతం చేసి, జంతువులు, పశువులు, ఇతర కాలుష్య కారకాలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు నీటి నాణ్యత పర్యవేక్షణను క్రమం తప్పకుండా నిర్వహించి, పరీక్షల ఫలితాలను వాటర్ క్వాలిటీ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి సీపీడబ్ల్యూఎస్ పథకానికి సంబంధించిన నిర్వహణ రికార్డులు, తనిఖీ నివేదికలు, మరమ్మతుల వివరాలు సక్రమంగా నిర్వహించాలని, నిర్దేశిత ప్రమాణాలు పాటించిన తర్వాత మాత్రమే చెల్లింపులను సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
తాగునీటి నాణ్యత, ప్రజారోగ్యం, భద్రత, నిరంతర సరఫరాకు సంబంధించిన లోపాల సవరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి నమ్మకమైన తాగునీటి సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు.. బస్సు వచ్చేసింది
పిఠాపురం - రాజమండ్రి డైరెక్ట్ బస్సు ప్రారంభం. PGRSలో మొదటి వినతికే స్పందించి బస్సు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన స్థానిక విద్యార్థులు & ప్రజలు.
@JanaSenaParty#PawanKalyan
పల్లె పండుగ 3.0 ⏳
ఈ నెల 29 న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 ప్రారంభం
బహిరంగ సభ - రామాపురం గ్రామం 🔥
#PallePanduga@JanaSenaParty || @PawanKalyan