స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి.. దేవునిపై అచంచలమైన భక్తిని, త్యాగనిరతిని చాటిచెప్పే పర్వదినమే బక్రీద్. అల్లాహ్ ఆదేశాల మేరకు తన ప్రాణప్రదమైన కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధమైన ఇబ్రహీం ప్రవక్త మహాత్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించుకునే పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#EidUlAdha
సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.
కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్ రిపోర్టులు చూపుతూ, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా?
ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.
English Version - https://t.co/jPDnnbQKk2
అమరావతి రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అంటే మిగతా ప్రాంతాల అవసరాలను పట్టించుకోకపోవడమే కదా @ncbn గారూ?
స్టేషన్ దగ్గర నిరసనకు దిగిన వైసీపీ నాయకులు.
పోలీసులపై జక్కంపూడి రాజా ఫైర్, సీఐతో వాగ్వాదం.
స్టేషన్ దగ్గర కార్యకర్తలతో జక్కంపూడి, సత్తి సూర్యనారాయణరెడ్డి ఆందోళన.
నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు.
డిప్యూటీ CM పవన్ కల్యాణ్ పేరిట ఫేక్ రికమండేషన్ లెటర్స్.
పశ్చిమ గోదావరి జిల్లాలో పది నెలలుగా సాగుతున్న మోసాలు.
నిరుద్యోగుల నుంచి రూ. 4 కోట్లు వసూలు.
BREAKING NEWS
రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
40ఏళ్ల ప్రజా జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు.
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ లేదు.
ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు.
లోక్సభ వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.
రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం పోలైన ఓట్లు 489.
అనుకూలంగా 278 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు.