YSRCP Legal Team
Standing strong for your rights and the values we share. Our legal team is dedicated to defending justice, ensuring fair processes, and protect
బ్రహ్మనాయుడి అరెస్టు అక్రమం!
మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల్ని వెంటాడి అరెస్టు చేయడం అన్యాయం. అసలు బ్రహ్మనాయుడుపై ఆరోపిస్తున్న ఆ భూమికి సంబంధించి అవకతవకల్ని బయటకు తీసుకొచ్చిందే బ్రహ్మనాయుడుగారి మనుషులు. నేరుగా అగ్రిమెంట్లో కూడా ఎక్కడా ఆయన లేరు. బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నమ్మి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ పూర్తిగా రమేష్ పేరు మీదే ఉంది. ఎంతకీ భూముల రిజిస్ట్రేషన్ కు ముందుకు రాకపోవడంతో అనుమానం వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆరా తీస్తే, నకిలీ జీవోల ద్వారా అమ్మేందుకు ప్రయత్నించారని తేలింది. ఈ ఉదంతంలో నష్టపోయింది బొల్లా బ్రహ్మనాయుడు బంధువు రమేష్. కానీ అన్యాయంగా బ్రహ్మనాయుడును ఇందులో ఇరికించారు. బ్రహ్మనాయుడు కేవలం రమేష్ కు ఆర్థిక సహాయం మాత్రమే చేశారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోవడం లేదు. అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కూడా ఇక్కడివారేనని తేలిపోతోంది. రాజకీయ కక్షను మనసులో పెట్టుకుని బ్రహ్మనాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గం. అన్యాయాలు, అక్రమాలు చేయాల్సిన అవసరం, అంతటి దౌర్భాగ్యం బ్రహ్మనాయుడుకు లేదు.
-గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డ గారు, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే
Narasaraopet, June 5: Former Narasaraopet MLA Gopireddy Srinivasa Reddy strongly condemned the arrest of former MLA and YSRCP leader Bolla Brahma Naidu, describing it as an act of political vendetta and an attempt to target a victim rather than the actual wrongdoers.
He stated that the alleged land transaction now being cited against Brahma Naidu was, in fact, exposed by individuals associated with him. According to Gopireddy, Brahma Naidu had no direct role in the agreement under question. The agreement was entered into by his relative, Ramesh, who relied on representations made by real estate brokers. The agreement itself was executed entirely in Ramesh’s name, with no involvement of Brahma Naidu.
Gopireddy explained that when the promised land registration failed to materialize despite repeated follow-ups, suspicions arose and the matter was brought to the attention of government authorities. Subsequent inquiries reportedly revealed that attempts had been made to facilitate the transaction using forged government orders. He emphasized that Ramesh was the person who suffered financial loss in the episode and was the victim of the alleged fraud.
Despite this, Brahma Naidu has been implicated and arrested, even though his role was limited to extending financial assistance to his relative, Gopireddy said. He maintained that there was no basis for treating Brahma Naidu as an accused and argued that the arrest was driven by political considerations rather than facts.
Gopireddy further remarked that the developments suggest a coordinated effort to pursue political opponents across state boundaries. He asserted that Brahma Naidu neither had any reason nor any need to engage in unlawful activities and described the arrest as a grave misuse of power motivated by political hostility.
The former MLA demanded that the authorities act impartially, identify those actually responsible for the alleged fraud, and end what he termed the politically motivated targeting of opposition leaders.
@cyberabadpolice
గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
పొన్నూరులో వైయస్ఆర్సీపీ కార్యకర్త చాన్ బాషాను నిన్న అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా పోలీసులు తీసుకెళ్లడంపై బాషా కుటుంబ సభ్యులు ఆందోళన
ఇంకెంత కాలం ఈ తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లు @ncbn ?
వైయస్ఆర్సీపీ వాళ్లు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే తప్పుడు కేసులు పెడతారు. మరి ఇలా ఫొటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోరా @APPOLICE100, @prakasam_police ?
ఇలా ఫేక్ ప్రచారం చేసే వాళ్లపై మీరు చర్యలు తీసుకోకపోతే.. మేము కూడా ఈ తరహా పోస్టులు వేయాల్సి వస్తుంది. అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక బాధ్యత కూడా మీకు ఉండదు.
పోలీస్ స్టేషన్లో ఎస్సై నీ కొట్టడం దగ్గర్నుండి, సాక్షాత్ ప్రధాన మంత్రి పీవీ గారి మీద చెప్పులు వేయించడం వరకూ ఈ దరిద్రపు మేత ఫ్యామిలీ చేయని అరాచకం లేదు.
కడప ప్రజల పేదరికాన్ని, అమాయకత్వాన్ని వాడుకుంటూ గత 50 ఏళ్లుగా ఈ కుటుంబం చేయని అరాచకం లేదు. మూడు తరాలుగా ఒక్కడూ సక్రమంగా ప్రకృతి సహజ మరణం పొందలేదు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఇక కులం, మతం అయితే వీళ్ళు abuse చేసినట్టుగా ఎవరూ చేసి ఉండరు..చిల్లర విసిరి మనుషులను ఆకట్టుకోవడం, వాళ్ళ చేత మహానాయకులు అంటూ జేజేలు కొట్టించుకోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే చంపేయడం..ఇదే ఈ కుటుంబ విజయ రహస్యం.
ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నిర్ణయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లను తీవ్రవాదులుగా పరిగణిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ద్వారా రిపోర్టులు పంపి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్ ఇన్స్టా అకౌంట్ ను తొలగించారు. ఏ అసభ్యకరమైన పోస్టులూ లేకపోయినా, కేవలం అమరావతి అవినీతిని వ్యతిరేకించినందుకు, ఈనాడులో వచ్చిన వార్తలను పోస్ట్ చేసినా, వివిధ సంఘటనల్లో ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకు రిపోర్టులు చేశారు.
-మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
.@JaiTDP, @iTDP_Official మరో చిల్లర రాజకీయం.
తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ కేంద్రం ఏర్పాటును నిలిపివేయాలంటూ భూమన అభినయ్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఇలా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం
#YSRCPLegalCell#YSRCP #AndhraPradesh
.@JaiTDP, @iTDP_Official మరో చిల్లర రాజకీయం.
తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ కేంద్రం ఏర్పాటును నిలిపివేయాలంటూ భూమన అభినయ్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఇలా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం
#YSRCPLegalCell#YSRCP #AndhraPradesh
అనకాపల్లి..
మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని X (ట్విట్టర్) వేదికగా “Swathi Reddy” అనే ఖాతా నుండి అత్యంత అవమానకరమైన, దూషణాత్మకమైన మరియు అసత్య ఆరోపణలతో కూడిన పోస్టులు ప్రచురించబడిన విషయం తీవ్రంగా ఖండించదగినది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అనకాపల్లి సోషల్ మీడియా సభ్యులు అందరూ కలిసి సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ మరియు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లలో అధికారిక ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
సూరంపూడి శ్రీకాంత్ గారు రాష్ట్ర వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యదర్శి, కాండ్రేగుల శ్యామ్ గారు అనకాపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు, అలాగే జిల్లా మరియు మండల సోషల్ మీడియా సభ్యులు హరికృష్ణ, తంగెళ్ల రామకృష్ణ, ఆర్య సోమాజుల శివకుమార్, భూసర్ కిషోర్, గొర్లి వినయ్, రాజశేఖర్, కాండ్రెగుల తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఖండిస్తూ, చట్టపరమైన చర్యల ద్వారా నిజం బయటకు రావాలని కోరారు.
2024 అక్టోబర్ నుండి డిసెంబర్ దాకా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 1000 కేసులు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. పూడి శ్రీహరి అరెస్ట్ అక్రమం అని న్యాయస్థానం రిమాండ్ ను తిరస్కరిస్తున్నా, 3 సార్లు అక్రమ అరెస్టు చేశారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు. పోలీసులు కూడా చట్టానికి అతీతులు కాదని గుర్తు పెట్టుకోవాలి.
-పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు)
నోటీసులు ఇవ్వకుండా పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో పాలకుల పిచ్చి పరాకాష్టకు చేరింది.
-సుదర్శన్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రతిపక్ష పార్టీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. తమ అఫిషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో విష ప్రచారాలు చేస్తున్న టీడీపీ, ఈ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తే మాత్రం అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తోంది.
-మనోహర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు
#BabuDiversionPolitics
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ!
రాష్ట్రంలోని డీజిల్ లో అధిక మొత్తం వాటా అమరావతి కాంట్రాక్ట్ పనులు చేస్తున్న సంస్థలకు మళ్లించడంతో చంద్రబాబు కుటిల ఆలోచనలతో ప్రజలకు అవస్థలు మిగలగా అటు ఆయన బినామీలు మాత్రం కోట్లలో లాభపడ్డారు.. ప్రజల దృష్టి మళ్ళించడానికి వరుస అరెస్టులు
కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు.
-వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారిని అక్రమ అరెస్ట్
-నోటీసులిచ్చి మరోసారి అరెస్ట్ చేసిన కొత్తపేట పోలీసులు
-కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలింపు
-ఉదయమే పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చిన కుప్పం కోర్టు
-బెయిలిచ్చిన కాసేపటికే నోటీసులిచ్చి అక్రమ అరెస్ట్
#FuelShortageInAP
#CBNFailedCM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా రాతలు రాసిన ఏబీఎన్ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని గతంలో ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా వారు ఏమాత్రం స్పందించకపోయేసరికి ఈరోజు అమలాపురంలో ఎస్పీ గారికి ఏబీఎన్ రాధాకృష్ణ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిప్రజెంటేషన్ ఇచ్చిన ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు, సీఈసీ మెంబర్ పితాని బాలకృష్ణ గారు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు చెల్లిబోయిన శ్రీనివాస్ గారు, పార్టీ SEC మెంబర్ కాశీ బాల ముని కుమారి గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కోన శ్రీనివాస్ గారు, కాట్రేనికోన మండల ఎంపీపీ సత్యవతి సత్యం గారు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ గారు మరియు పార్టీ నాయకులు..
#YSRCPLegalCell #YSRCP
తెలంగాణ సీనియర్ జర్నలిస్టు KVR పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం, నిర్బంధించడం, కస్టోడియల్ టార్చర్, మానవ హక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు రిజిస్టర్ చేసి 8799/IN/2026 నంబర్ ఇవ్వడం జరిగింది.
ఈ ఫిర్యాదులో KVR పై జరిగిన కస్టోడియల్ టార్చర్, కర్నూలు IV టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు, అలాగే ఆయనపై జరిగిన అక్రమ నిర్బంధం వంటి అంశాలు ప్రస్తావించి అందుకు అవసరమైన ఆధారాలను NHRC సమర్పించడం జరిగింది.
అందులో అరెస్ట్ మెమో లేకపోవడం, మేజిస్ట్రేట్ ముందు హాజరు చేయకపోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం వంటి పలు అంశాలను ప్రస్తావించి ఇవి చట్టపరమైన ప్రక్రియలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది.
#YSRCPLegalCell #YSRCP
ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో సహాయ కార్యదర్శి గా పని చేస్తున్న కాకర్ల వెంకటరాంరెడ్డి పై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడాన్ని వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం.ఇంకా 14 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ మిగిలి ఉన్నా ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం అమానుషం.
#KakarlaVenkatramreddy
#DismissedFromService #AP
తాడేపల్లి
- గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
- ఆయనపై తగిన చర్యలు తీసుకొండి
- తాడేపల్లి పీఎస్లో వైయస్సార్సీపీ ఫిర్యాదు
తాడేపల్లి:
తమను ప్రత్యక్షంగా బెదిరించడమే కాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. అందుకే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘మాకు అధికారం ఉంది. మేం తల్చుకుంటే నరికేయగలం’.. అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారని, అది ప్రసార మాథ్యమాలతో పాటు, సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారమైందని కొమ్యూరి కనకారావు తెలిపారు. బుచ్చయ్యచౌదరి మాటలు సాధారణ రాజకీయ విమర్శలు దాటి, ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇంకా ప్రజల్లో భయాందోళనలు, సమాజంలో విభేదాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి నోట ఇలాంటి దారుణ విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అవి చట్టపరంగా శిక్షార్హమైనవని తేల్చి చెప్పారు.
అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వేగంగా నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని కొమ్మూరి కనకారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నోట్:
ఐటెం విత్ ఫోటో.
ఫోటో క్యాప్షన్:
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు.
వైయస్ జగన్ గారిని మొన్న షర్మిల గారు బానిస అని అన్నారు. దాంతో ఆ వ్యాఖ్యల్ని నేను ఖండిస్తూ టీడీపీకి దాసిలా షర్మిల గారు పనిచేస్తున్నారని అన్నాను
వ్యాఖ్యలపై కాంగ్రెస్ వాళ్లు ఎక్కడా స్పందించలేదు.. కానీ టీడీపీ వాళ్లు మాత్రం వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఈరోజు ఫిర్యాదు చేశాను
-కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల మాజీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీపై తిరగబడుతున్న తెలంగాణ జర్నలిస్టులు మరియు ఉద్యమకారులు
కేవీఆర్ పెట్టని థంబ్నెయిల్ ని సృష్టించి తప్పుడు కథనాలు పోస్ట్ చేసిన @JaiTDP.
కేవీఆర్ అనని పదాన్ని అన్నట్టు పెట్టి.. అరెస్ట్ చేయాలని చూడడం ఎంత వరుకు సమంజసం?
తెలంగాణ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తాం అంటే ఊరుకునేది లేదు తిరగబడతాం అంటున్న తెలంగాణ ఉద్యమకారులు
#YSRCPLegalCell #YSRCP #AndhraPradesh
గుంతకల్లు నియోజకవర్గం,
అనంతపురం జిల్లా.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే అక్రమ అరెస్టులు...
వైయస్ఆర్ సీపీకి వస్తున్న ప్రజా ఆదరణను ఓర్వలేక నే వైయస్ భారతమ్మ మీద అసభ్యకర పోస్టులు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతమ్మ గారి పట్ల తీవ్ర అసభ్యకరమైన పదజాలంతో think andhra, ఇతర అకౌంట్స్ పేరిట సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ లను చేస్తూ శునాకనందం పొందుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని గుంతకల్ ఒకటవ పట్టణ పోలీసు అధికారులను వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మరియ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిజనిజాలను ప్రజలకు తెలియజేస్తున్న వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా ను అణచివేయలనే కుట్రతోనే అక్రమ అరెస్ట్ లకు తెర లేపింది అని కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ మరియు వైయస్ఆర్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ పట్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేని లోటు సృష్టంగా కనిపిస్తోంది అని వాపోయారు, ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, యువజన విభాగ నగర అధ్యక్ష, ఉపాధ్యక్షుడు మనోజ్ , ఫయాజ్ బాషా, కార్యదర్శి జాఫర్, సోషల్ మీడియా కార్యకర్తలు ఫైజల్, ఆషిఫ్ , సోహైల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.