ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి 37 టీఎంసీల నీరు వెళ్లినట్లు అధికారికంగా చెబుతున్నారు. కానీ వాస్తవంగా వెళ్లింది 70 టీఎంసీల నీరు. తెలంగాణకు మాత్రం 7 టీఎంసీల లోపే నీరు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పోతిరెడ్డిపాడు, వెలిగొండకు 24 గంటలు నీటి పంపిణీ.
తెలంగాణలోని గుడిపల్లి ప్రాజెక్టు వద్ద సాయంత్రం 6 గంటలకు మోటర్లు బంద్.
తెలంగాణ రైతులకు నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.
- వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి.
@BRSparty
విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి మరియు పాత పద్ధతిన ఫీజు రియాంబర్స్ మెంట్ ను నేరుగా కళాశాలలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ విద్యార్థి జేఏసి చైర్మన్ వేముల రామకృష్ణ, బిసి సంఘం జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ, సురేష్ మరియు తదితరులు హైద్రాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించడం జరిగింది. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణా రెడ్డి గారితో మాట్లాడి కౌన్సిలింగ్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…
# విద్యార్థులు జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది.
# తెలంగాణ సాధించింది పిల్లల చదువు..భవిష్యత్తు కోసం
# నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు.. అశోక్ నగర్ కి ఒక్క మంత్రి పోయే పరిస్థితి లేదు.. వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ము ఉందా..?
# రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే ఫీజు రేయంబర్స్ మెంట్ పథకం తీసుకువచ్చారు.. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మేము కొనసాగించాము.
# విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు కూడా బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్ధిక సహాయం అందించాము
# గురుకుల విద్యార్హ్తులకు కూడా ప్రమాణాలతో కూడిన విద్య..నాణ్యమైన విద్య కెసిఆర్ గారు అందించారు.
# ప్రభుత్వం ఫీజు రేయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు.. చదువు పూర్తి చేసుకున్న వారికీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు.. ఫీజు కడితేనే ఇస్తామని అంటున్నారు.. ఉద్యోగాలు.. ఉన్నత చదువులకు వెళ్లేందుకు సమస్య వస్తుంది.
# ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు అధ్యాపకులు వేతనాలు ఇవ్వడం లేదు.. అధ్యాపకుల కుటుంబాలు కూడా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి.
# కాలేజీ ల మీద బెదిరింపులకు దిగకుండా వారికీ నిధులు ఇస్తామని నచ్చ చెప్పి పాత పద్దతిలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకునే విధంగా చూడాలి.
# ఇప్పటికే కౌన్సెలింగ్ చివరిదశలో ఉంది.. విద్యార్థులు నుంచి ఫీజు తీసుకోకుండా పాత పద్దతిలో అడ్మిషన్లు తీసుకోవాలని చెప్పండి.
# విద్యార్థులు పోరాటాల వైపు మళ్లితే ఎవరు ఆపలేరు ..ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నది విద్యార్థులు..నిరుద్యోగులు ఇబ్బంది పడేందుకు కాదు.
# విద్య వ్యవస్థ చిన్నాభిన్నం ఐంది.. ముఖ్యమంత్రి శాఖ అవసరం అయితే వేరే వాళ్లకు ఇవ్వాలి.. వెంటనే సమీక్షా చెసి పరిస్థితులను చక్క దిద్దాలి.
# ఫీజు రేయంబర్స్ మీద 7 తేదీలోపు అధికార ప్రకటన చేయకుంటే చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని చేపట్టి ..అవసరం అయితే హైదరాబాద్ ను ముట్టడించి ఉద్యమ కార్యాచరణ చేపడతామని అన్నారు.
సవాల్ విసిరి పారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం పాత పాలమూరుకు చెందిన ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ శ్రీ కె. యాదగిరి గారి పదవీ విరమణ మహోత్సవానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, యాదగిరి గారిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. పదవీ విరమణ అనంతర జీవితాన్ని ఆయురారోగ్యాలతో, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న బి.ఆర్.అంబేద్కర్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. నేడు సమాజంలో పేదలకు, బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందంటే, వారి స్వరం బలంగా వినిపిస్తుందంటే, వారు తగిన రక్షణ, గౌరవం పొందుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ రాజ్యాంగం. అణగారిన వర్గాల్లో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలనూ పాటించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ కార్యకర్త గంగరాజు నర్సింహులు గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించడం జరిగింది.
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, వినయభాస్కర్, కోరుకంటి చందర్ గారితో కలిసి ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
#JubileeHillsWithBRS
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ పర్యటించి ప్రచారం నిర్వహించి, బూత్ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
#JubileeHillsWithBRS