@airindia Memorable Journey with Airindia. Fleet is in excellent conditions.and we received marvellous service from Crew .Safe and comfortable takeoff and landing .
@NeverSayYesDude హైవే పెట్రోలింగ్ అసలు ఎక్కడా చేయడం లేదండి, దాదాపు జరుగుతున్న ఆక్సిడెంట్లు అన్నీ కూడా “రోడ్డు పైన నిలుపుతున్న లారీల వలనే” .మామూళ్ళు తీసుకుని వదిలేస్తున్నట్లున్నారు……వారి కుటుంబ సభ్యులు ఇటువంటి ప్రమాదాల్లో ఉంటే వారికి నెప్పి తెలుస్తుంది.
చాలా బాధాకరమైన పరిస్థితి. 😞 😔 😢
చిన్న పిల్లల గ్రాఫ్, చదరంగం లెక్క అమరావతి?
చిన్నప్పుడు మనం ఆడిన చదరంగం బోర్డు లేదా గ్రాఫ్ పేపర్‌ను ఒక్కసారి గుర్తుచేసుకోండి, నిలువు గీతలు, అడ్డ గీతలు ఎంత స్పష్టంగా, ఎంత సరళంగా ఉంటాయో!
అమరావతి మాస్టర్ ప్లాన్ కథ సరిగ్గా ఇక్కడే ప్రారంభం.
మన దేశంలో నగరాలు ఒకే తరహాలో ఉంటాయి. ముందు ఇళ్లు, ఊరు వచ్చేస్తాయి, ఆ తరవాత ఎక్కడ స్థలం దొరికితే అక్కడ రోడ్లు వేసుకుంటూ పోతారు. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వీటన్నింటి రోడ్ నెట్‌వర్క్‌ను గమనిస్తే అది ఒక చెట్టు వేర్ల గుత్తిలా, ఎటు పడితే అటు వంకర్లు తిరిగిన సందులతో, ఎక్కడో ఆగిపోయే డెడ్ ఎండ్ లతో ఉంటుంది. వర్షం పడితే చాలు, ఈ నగరాలు జలమయమైపోవడం మనకు అలవాటైన ప్రతినిత్య దృశ్యం.
కానీ, అమరావతిని సింగపూర్ ప్రభుత్వ సంస్థ సుర్బానా జురాంగ్ డిజైన్ చేసినప్పుడు ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పి, ఒక నగర నిర్మాణాన్ని అక్షరాలా చదరంగం బోర్డుపై పరిచే వేగవంతమైన ఇంజనీరింగ్ అద్భుతంగా మార్చేసింది.
చెస్ బోర్డ్ లాంటి గ్రిడ్ లాజిక్: N & E రోడ్ల నెట్వర్క్.
అమరావతి ప్లానింగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్, పక్కా గ్రిడ్ సిస్టమ్.
N - రోడ్లు (నార్త్ టు సౌత్): ఉత్తరం నుంచి దక్షిణానికి నిలువుగా వెళ్లే ప్రధాన రహదారులు (చదరంగం బోర్డులోని నిలువు గీతల్లా) మాస్టర్ ప్లాన్ ప్రకారం N1 నుండి N19 వరకు (మొత్తం 19 ప్రధాన నిలువు రోడ్లు) ఏర్పడుతున్నాయి.
E - రోడ్లు (ఈస్ట్ టు వెస్ట్): తూర్పు నుంచి పడమరకు అడ్డంగా వెళ్లే రహదారులు (బోర్డు లోని అడ్డ గీతల్లా). ఇవి E1 నుండి E15 వరకు (మొత్తం 15 ప్రధాన అడ్డ రోడ్లు) ఉంటాయి.
ప్రత్యేకత: ఇందులో E3 రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన సీడ్ యాక్సిస్ రోడ్డుగా రూపుదిద్దుకుంది.
ఈ రెండు సెట్ల రోడ్లు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఒకదానికొకటి ఛేదించుకుంటూ నగరాన్ని సుమారు 1 కి.మీ × 1 కి.మీ అత్యంత వ్యవస్థీకృతమైన దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా విభజిస్తాయి. ఈ ప్రధాన రోడ్లు 50 నుండి 60 మీటర్ల వెడల్పుతో (165 - 200 అడుగులు) 6 నుండి 8 లేన్లుగా డిజైన్ చేయబడ్డాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే సింగపూర్ సొంత నగరంలో ఈ మోడల్ లేదు!
సింగపూర్‌లో రోడ్లకు ఆర్చర్డ్ రోడ్, జురాంగ్ రోడ్ అని పేర్లు పెడతారు. పెద్ద ఎక్స్‌ప్రెస్ వేలకు CTE, PIE లాంటి అక్షరాలు వాడతారు. కానీ అమరావతి విషయంలో, సున్నా నుంచి ఒక సరికొత్త నగర రూపకల్పన చేసేటప్పుడు వేగంగా ప్లాన్ చేయడానికి, ఇంజనీర్లు మరియు ప్లానర్లందరూ ఒకే టెక్నికల్ భాషలో మాట్లాడటానికి ఈ సరళమైన గ్రాఫ్-పేపర్ లాజిక్‌ను ఎంచుకున్నారు. న్యూయార్క్ (అవెన్యూస్ & స్ట్రీట్స్), చండీగఢ్ (V1 నుండి V8 రోడ్లు) లాంటి గ్లోబల్ క్యాపిటల్ నగరాల్లో వాడిన అంతర్జాతీయ సూత్రాన్ని అమరావతికి ఆలోచించారు.
ఈ గ్రిడ్ నెట్వర్క్ డిజైన్ అమరావతి నివాసితులకు, సందర్శకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?
దారి తప్పే అవకాశమే లేదు.
ఇకపై గజి బిజి ల్యాండ్‌మార్క్‌లు, చెట్ల గుర్తులు చెప్పాల్సిన పనిలేదు. "బారుగా E4 రోడ్డు పై 2 కి.మీ వెళ్లి, N7 జంక్షన్ దగ్గర ఎడమకు తిరగండి" అని చెప్తే సరిపోతుంది. జీపీఎస్ లేకపోయినా చిన్న పిల్లాడైనా లొకేషన్ కనిపెట్టేయగలడు.
ట్రాఫిక్ జామ్‌లకు చెక్: ప్రత్యామ్నాయ మార్గాలు.
పాత నగరాల్లో ఒక ప్రధాన రోడ్డుపై ప్రమాదం జరిగినా చుట్టుపక్కల అన్ని దారులు బ్లాక్ అయిపోతాయి. కానీ అమరావతి చెస్ బోర్డ్ మోడల్ లో ప్రతి రోడ్డుకూ సమాంతరంగా పక్కనే మరో రోడ్డు అందుబాటులో ఉంటుంది. సెకన్లలో ప్రత్యామ్నాయ మార్గంలోకి మారిపోవచ్చు.
వర్షపు నీరు నిలవని "స్మార్ట్ డ్రైనేజీ" డిజైన్.
ముంబై, బెంగళూరు, చెన్నై లలో ప్రతి వానాకాలం నగరాలు చెరువులవుతాయి. కానీ అమరావతిలో ప్రతి E మరియు N రోడ్డు పక్కన గ్రీన్ బఫర్ జోన్లు మరియు భూగర్భ డ్రైనేజీ కారిడార్లు కేటాయించారు. వర్షపు నీరు వేగంగా బయటకు పోవడమే కాకుండా రిజర్వాయర్ వంటి నిల్వ ప్రాంతాలకు చేరుకుంటుంది. అక్కడి నుండి బ్లూ వాటర్ నెట్ వర్క్ ద్వారా ఆహ్లాద ప్రవాహాలుగా విహార యాత్రీకులకు కనువిందు చేస్తాయి.
అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్: కరెంట్ వైర్లు, గ్యాసు, ఏ.సీ, ఇంటర్నెట్ కేబుళ్లు, మంచినీటి పైపులు, వర్షపు నీటి కాల్వలు అన్నీ ముందే భూగర్భంలో నిర్మించి, ఆ తర్వాతే పైన రోడ్లు వేస్తున్నారు. కాబట్టి వర్షాకాలంలో లేదా మరమ్మతులకు రోడ్లు తవ్వే ప్రసక్తే ఉండదు.
ఎమర్జెన్సీ సర్వీసులు వేగంగా, నిత్యం ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్‌లలో ప్రాణాలు పోయే నగరాలు మనకు అలవాటైపోయాయి. కానీ ఇక్కడ అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లు ఇరుకైన సందుల్లో ఇరుక్కుపోకుండా నేరుగా, అత్యంత వేగంగా బాధితుల వద్దకు చేరుకోగలవు. ప్రాణాలు కాపాడటంలో మరియు జీవన ప్రమాణాలు పెంచడంలో ఇది అత్యంత కీలకం.
చదరంగం బోర్డు లాంటి ఈ రోడ్ల గ్రిడ్ డిజైన్ అమరావతిని కేవలం ఒక పరిపాలనా రాజధాని గానే కాక, వర్షాలు, వరదలను తట్టుకుని నిలబడే ఒక ఆధునిక, పర్యావరణహిత "ఫ్యూచర్ సిటీ"గా నిలబెడుతుంది.
@ramavithal@vegu_chukka శ్రీ రామ గారు, ఇది మరో సాక్షి చానల్ , వీళ్ళకు అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే వచ్చు.
కన్న కూతురిని కూడా “కడసారి చూపు” చూడనివ్వద్దని వ్రాసాడా అని కూడా చెబుతారు చూడండి.
వీళ్ళ వలన ఎన్ని దుర్మార్గాలు చూడాలో ముందు ముందు. 😔